హైకోర్టుకు వెళ్లండి | Polavaram occupants petition On Supreme Court | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు వెళ్లండి

Published Tue, Jun 9 2015 1:00 AM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM

హైకోర్టుకు వెళ్లండి - Sakshi

హైకోర్టుకు వెళ్లండి

పోలవరం నిర్వాసితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుబోధ్ మార్కండేయ, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపిస్తూ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేకపోయినా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని ధర్మాసనానికి విన్నవించారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇప్పించాలని కోరగా జస్టిస్ ఆర్.కె.అగర్‌వాల్ స్పందిస్తూ ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ‘పిటిషనర్ ఈ ప్రజాహిత వ్యాజ్యం ద్వారా హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌కు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉంది..’ అని ఆదేశాలు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement