ఇమ్రాన్‌ఖాన్
లాహోర్: మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మూకహింసపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. మైనారిటీలకు హక్కులన్నీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా దార్శనికత కూడా ఇదేనన్నారు. çశనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇమ్రాన్ అన్నారు. పోలీసు హత్య కన్నా ఆవు చనిపోతేనే ప్రాధాన్యమిస్తున్నారని బులంద్‌షహర్ హింసను ఉద్దేశించిన షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment