Viral Video: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు.. | Mob Clashes With Police Throws Stones In UP Badaun Video Viral | Sakshi
Sakshi News home page

Viral Video: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..

Published Sat, Dec 10 2022 9:47 AM | Last Updated on Sat, Dec 10 2022 9:47 AM

Mob Clashes With Police Throws Stones In UP Badaun Video Viral - Sakshi

లఖ్‌నవూ: పోలీసులపై కొందరు స్థానికులు దాడికి దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ బదౌన్‌ జిల్లాలోని కక్రాల నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి బండిని పోలీసులు ఆపినందుకు.. కొందరు అల్లరి మూకలను పోగు చేసి దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వీడియ ఫుటేజ్‌ ఆధారంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. 

‘పోలీసు బృందం నడుచుకుంటూ నగరంలో పెట్రోలింగ్‌ చేస్తోంది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి వాహనం తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో వచ్చి రోడ్డుపై నిరసనకు బైఠాయించాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని పోలీసులు తెలపటంతో వారిపై రాళ్ల దాడి చేశారు’ అని జిల్లా ఎస్పీ ఓపీ సింగ్‌ తెలిపారు. 

రాళ్లదాడి జరిగిన క్రమంలో కాలనీలో స్థానికులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసే అవకాశం ఉందనే భయంతో ఇళ్లల్లోంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు.. బలగాలను తరలించి అల్లరి మూకను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement