stone thrown
-
వైరల్ వీడియో: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
-
Viral Video: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
లఖ్‌నవూ: పోలీసులపై కొందరు స్థానికులు దాడికి దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదౌన్ జిల్లాలోని కక్రాల నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి బండిని పోలీసులు ఆపినందుకు.. కొందరు అల్లరి మూకలను పోగు చేసి దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీడియ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ‘పోలీసు బృందం నడుచుకుంటూ నగరంలో పెట్రోలింగ్ చేస్తోంది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి వాహనం తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో వచ్చి రోడ్డుపై నిరసనకు బైఠాయించాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని పోలీసులు తెలపటంతో వారిపై రాళ్ల దాడి చేశారు’ అని జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. రాళ్లదాడి జరిగిన క్రమంలో కాలనీలో స్థానికులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసే అవకాశం ఉందనే భయంతో ఇళ్లల్లోంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు.. బలగాలను తరలించి అల్లరి మూకను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. Mob Clashes With Cops, Throws Stones In UP's #Badaun @budaunpolice pic.twitter.com/0PFaZT1bBu — Himanshu dixit 💙 (@HimanshuDixitt) December 9, 2022 Clash between police and local people in UP's #Badaun, protesters pelted stones at police. According to the police, the whole incident took place after a dispute during the vehicle checking drive. Some people have been detained: Dr. OP Singh, SP Badaun pic.twitter.com/6bGjESlh4z — Nikhil Choudhary (@NikhilCh_) December 9, 2022 ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
సీఎం వాహనంపై రాళ్ల దాడి
సిద్ధి(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివరాజ్‌సింగ్ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం సిద్ధి జిల్లాలోని చుర్హట్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై చుర్హట్ పోలీస్ అధికారి బాబు చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో శివరాజ్‌సింగ్‌కు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర విషయాలు వెల్లడించటానికి ఆయన ఆసక్తి కనబరచలేదు. శివరాజ్ సింగ్ వాహనంపై దాడి జరిగిన చుర్హట్ ప్రాంతం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ నియోజకవర్గంలో ఉందని మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాజ్నీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ దాడి కాంగ్రెస్ నేతలు చేసిందేనని ఆరోపించారు. తన బహిరంగ సభ అనంతరం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. అజయ్ సింగ్‌కు ధైర్యం ఉంటే బహిరంగంగా తలపడాలని సవాలు విసిరారు. తను శారీరకంగా బలహీనుడైనప్పటికీ.. రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడితో తనకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని అజయ్ సింగ్ తెలిపారు. తమ పార్టీ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడదని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కుట్ర ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. తనను, చుర్హట్ ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. -
కేజ్రీవాల్ పై దాడి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియన వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పూరా మాజ్రాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ ఎటువంటి గాయాలు కాలేదని ఆప్ వాలంటీరు ఒకరు తెలిపారు. దుండగులు విసిరిన కోడిగుడ్లు, రాళ్లు కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న వేదిక వద్ద పడడంతో ఆయనకు ఏం కాలేదన్నారు. సుల్తాన్ పూరా మాజ్రాలో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండోసారి.