stone pelting
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్
సాక్షి,హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడికి కారకులైన ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం(డిసెంబర్23) ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. వీరికి అప్పటికప్పుడే బెయిల్ మంజూరు అయ్యింది. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు.. ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. నిందితులు మీ పార్టీ వాళ్లంటే.. మీ పార్టీ వాళ్లంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్లు పరస్పర ఆరోపణలకు దిగాయి.కాగా, సంధ్య థియేటర్లో పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: పుష్ప అభిమాని అరెస్ట్ -
భీమ్ ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న వందే భారత్‌పై రాళ్ల దాడి
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కమల్పూర్లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు. -
అట్టుడికిన కామారెడ్డి
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్‌తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పీఈటీపై ఫిర్యాదు చేసినా... పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
కక్షసాధింపు ఆపకపోతే తిరగబడతారు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గుడివాడలో నాని బంధువును పలకరించడానికి వెళితే రాళ్లు రువ్వారని వైఎస్సార్సీపీ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ ఘటనపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం(సెప్టెంబర్1) అంబటి మీడియాతో మాట్లాడారు.పేర్నినానిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఎస్పీకి తమ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స ఫోన్ చేసినా ఎస్పీ ఫోన్ తీయలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు. అంబటి ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..మాజీ మంత్రిని తిరగటానికి వీళ్ళేదని అనటం సమంజసమాచట్టబద్దంగా వ్యవరిస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారుఇంటూరు రవి కిరణ్ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారుఅతన్ని న్యాయవాదుల సాయంతో పేర్ని నాని పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చారుఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటిపోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయి రాష్ట్రంలో అరాచకత్వం ప్రబలుతోందిపోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనావరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారాహోంమంత్రి సమాధానం చెప్పాలిఇది సరైన విధానం కాదుతప్పుడు కేసులు పెడుతూనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారుకక్ష సాధింపు చర్యలు మానుకో కుంటే మావాళ్ళు తిరగబడతారుపోలీసులపై కూడా కేసులు పెడతామంటున్నారుముంబై నటి కేసులో ముగ్గురు ఐపిఎస్ లపై కేసు పెడతామంటున్నారుప్రభుత్వాలు మారతాయి. కొత్త సాంప్రదాయాలకు అధికారులు తెర తీయవద్దుపోలీసుల్లో ఒక వర్గాన్ని గుర్తించి వారిని అణిచి వేయాలని సూచిస్తున్నారురెడ్ బుక్ లో రాసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతున్నారుగడ్లవల్లేరు కాలేజ్ చిన్న సంఘటన అంటూ లోకేష్ మాట్లాడుతున్నారుమీ ప్రభుత్వంలో జరిగితే చిన్న విషయమాచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదాప్రకాశం బ్యారేజి నుండి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందిదీంతో చంద్రబాబు ఇల్లు మునుగుతుందిసీఎం మచిలీపట్నం అతిధి గృహంలో ఉంటారంటున్నారుఅక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారని మీము మొదట నుండి చెబుతున్నాంనది గర్భంలో ఉన్న ఇంటిలో ఉంటే వరద వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి ఉంటుందిసాక్షాత్తు సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి పోతున్నారులోకేష్ పరిధిలోని విద్యాశాఖలోని ట్రిబుల్ ఐటీ కాలేజ్, గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలపై లోకేష్ విఫలమయ్యారు. -
మంత్రి జూపల్లి కాన్వాయ్ పై రాళ్ల దాడి..
-
చంపుతామని టీడీపీ.. ఊరొదిలి పెట్టమని పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రేయ్.. మాధవ్.. నిన్ను చంపుతాం అంటూ టీడీపీ నాయకులు, ఊరొదిలి వెళ్లిపోవాలంటూ పోలీసు అధికారులు నిన్నటి వరకు ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌పై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున అనంతపురం నగరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ‘రేయ్ మాధవ్ నిన్ను చంపుతాం’ అంటూ కేకలు వేస్తూ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికి వారం అవుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులపై అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా, నిన్నటి వరకు ఎంపీ అయిన మాధవ్‌నే ఊరొదిలి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే, ఇందుకు మాధవ్ ససేమిరా అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.ఆరోజు ఏమి జరిగిందంటే..ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో మాధవ్ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. ఇంటిపై భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.ఒక రాయి మాధవ్ కుడికాలి పాదం వద్ద బలంగా తాకడంతో గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లకు తలుపులు వేసుకున్నారు. మాధవ్ గన్మెన్లు నిలువరించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ‘రేయ్.. మా ప్రభుత్వం వస్తోంది. మాధవ్గాడిని చంపుతాం. నీకు ఎవరు దిక్కు వస్తారురా’ అంటూ కేకలు వేశారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ‘నిన్ను ఎప్పటికైనా హతమారుస్తాం’ అంటూ వెళ్లిపోయారు. ఎస్పీ గౌతమిశాలి స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అల్లరిమూకలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు.ఊరొదిలి పోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తనను ఊరు వదిలి పోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు సీఐలు తన నివాసానికి వచ్చి ఈ విషయం చెప్పారని తెలిపారు. అనంతపురం డీఎస్పీ కూడా ఇదే రకమైన ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోనని, తమ పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటానని స్పష్టంచేశారు. అవసరమైతే తనను అరెస్టు చేసుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుని వారికి మంచి చేయాలి కానీ ఇలా ఇళ్లపై దాడులు చేయడం హేయమని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కౌంటింగ్ రోజు నుంచే గ్రామాల్లో దాడులకు తెగబడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులకు తట్టుకోలేక చాలా మంది ఊళ్లు వదిలారని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత సూచనలతో త్వరలోనే బాధితులను కలిసి భరోసా ఇస్తామన్నారు. -
దాడి మీ కళ్లకు కనిపించలేదా?
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పైకి జనం మధ్య నుంచి రాయి విసరడం.. అది సీఎం కనుబొమ్మపై తగలడం.. కుట్లు పడటం.. కళ్లెదుటే కనిపిస్తున్నా, చంద్రబాబు, గురివింద రామోజీ మాత్రం తప్పును ఒప్పు చేయాలని పడరాని పాట్లు పడుతున్నారు. నిస్సిగ్గుగా దోషులను వెనకేసుకొస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేక దుష్ప్రచారానికి మరోమారు తెర లేపారు. 2018లో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన విషయంలో చంద్రబాబు, రామోజీలు వక్రీకరణే లక్ష్యంగా బరితెగించారు.సీఎం జగన్‌పైకి రాయి విసిరిన కేసులో నిందితుడు వేముల సతీశ్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు పలుకులు వల్లించి తాను టీడీపీ గూటి చిలుకనని చెప్పకనే చెప్పాడు. ఆ కట్టుకథను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచురించడం ద్వారా ఈ కుట్ర అంతా తమ పర్యవేక్షణలో సాగుతోందని రామోజీరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పక్కా పన్నాగంతో పదునైనా రాయితో దాడికి పాల్పడ్డారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిరూపించారు.వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా విశ్లేషించారు. కానీ పోలీసులు తనకు తుపాకీ గురిపెట్టి మరీ అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని సతీశ్ చెప్పడం పచ్చ నాటకంలో ఓ భాగం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో, పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. అయినా పచ్చ మీడియా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఇంతగా యత్నిస్తోందంటే.. ఈ హత్యాయత్నం వెనుక కుట్రదారుల పాత్రను మరుగున పరిచేందుకేనని స్పష్టమవుతోంది. పన్నాగం ప్రకారమే హత్యాయత్నంసీఎం జగన్‌ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోకి ప్రవేశించక ముందే సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని ఎంపిక చేసుకుని తన ప్యాంట్ జేబులో వేసుకుని మరీ వివేకానంద స్కూల్ వద్దకు వచ్చాడు. మరి కొంతమందితో కలసి అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్నారు.ఆ వెంటనే సతీష్ ఆ రాయిని బలంగా సీఎం వైఎస్ జగన్‌పైకి గురిచూసి విసిరారు. సీఎం తలలో సున్నిత భాగంపై దాడి చేయడం ద్వారా ఆయన్ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని అమలు చేసేందుకే సతీష్ ఆ దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ రాయి సీఎం జగన్ తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది. సాంకేతిక ఆధారాలతో నిర్ధారణముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2ల పాత్రను నిర్ధారించాయి.అనంతరం పోలీసులు ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలకు ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయమే..పదునైన కాంక్రీట్ రాయితో సీఎం జగన్ కణతపై దాడి చేయాలన్నదే నిందితుడు సతీశ్ లక్ష్యమన్నది స్పష్టమైంది. పదునైన రాయి కణతపై తగిలినా తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాపాయం సంభవించేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్స్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా డాక్టర్ కేవీఆర్ శాస్త్రితోపాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ఆ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.కణత భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. అది తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. తద్వారా కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసేది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయితో దాడి చేశారు. ఆ కాంక్రీట్ రాయి తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తు అది ఎడమ కనుబొమ్మపై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. కుట్రదారుల పాత్ర కప్పిపుచ్చేందుకే..సీఎం జగన్‌పై హత్యయత్నం కేసులో తెరవెనుక కుట్రదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెర వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకోసం మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేషించాల్సి ఉందన్నారు. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.దాంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవడంతో చంద్రబాబు హడలిపోతున్నారు. అందుకే పోలీసులపైనే తిరిగి అసత్య ఆరోపణలు చేసే కుట్రకు తెరతీశారు. తద్వారా పోలీసులు ఆత్మరక్షణలో పడి ఈ కేసులో కుట్రదారుల పాత్రపై దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయేలా చేయాలన్నది వారిద్దరి లక్ష్యం. అందుకే పోలీసులు తన తలకు తుపాకి గురిపెట్టి అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని, లేకపోతే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని నిందితుడు వేముల సతీశ్‌తో చెప్పించారు.తాము చెప్పినట్టు చెబితే రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పారన్నాడు. సతీష్.. తాము చెప్పినట్టు చెప్పడంతో రామోజీరావు తన పత్రికలో ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అసలు ప్రధాన నిందితుడు తాను హత్యాయత్నం చేశానని ఎప్పుడైనా అంగీకరిస్తాడా..!? ఏదో అబద్ధం చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించాలనే యత్నిస్తాడు. మరి ఆ మాత్రం తెలియకుండా ఈనాడు రామోజీరావు సతీశ్ చెప్పిన కట్టుకథను అంత ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరం. తద్వారా ఆ కట్టుకథ వెనుక తామే ఉన్నామని చెప్పకనే చెబుతోంది.న్యాయస్థానంలో ఆ రోజు ఎందుకు చెప్పలేదు?చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు నిందితుడు సతీశ్ న్యాయమూర్తి వద్ద ఆ విషయాలు ఎందుకు చెప్పలేదని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీసులు ఆ విధంగా బెదిరించి ఉంటే న్యాయమూర్తి ఎదుటే చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఉంది. కానీ ఆ రోజు చెప్పనే లేదు. బెయిల్‌పై విడుదలయ్యాక బయటకు వచ్చి టీడీపీ అనుకూల మీడియా ముందే ఆ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే పోలీసులు నిందితుడు సతీశ్‌ను ఆ విధంగా బెదిరించలేదన్నది సుస్పష్టం. అదంతా టీడీపీ పన్నాగమేనన్నది తేటతెల్లమవుతోంది.ఈసీ ఆధ్వర్యంలోనే పోలీసుల దర్యాప్తుటీడీపీ, ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన మరో అంశం... సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఈసీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో పోలీసులతో పాటు మొత్తం అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నారు. ఈసీ వ్యక్తం చేస్తున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సతీశ్ ద్వారా పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేయించడం అంటే ఈసీనే నిలదీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిందితుడు సతీశ్ ఈసీనే నిందించాలిగానీ పోలీసులను కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.2018లోనూ ఇదే దుష్ప్రచార కుట్రపాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం కేసును కూడా టీడీపీ, పచ్చ మీడియా ఇదే రీతిలో వక్రీకరించేందుకు యత్నించడం గమనార్హం. టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ రెసారెంట్‌లో పనిచేసే జనుపల్లి శ్రీనివాస్ అరచేతిలో పట్టేంత పదునైన కత్తితో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలోకి శ్రీనివాస్‌ను ప్రవేశపెట్టడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమైంది. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజే ఉన్నారు.దాంతో ఈ హత్యాయత్నం వెనుక తమ కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని భావించిన టీడీపీ వెంటనే ఆ ఉదంతాన్ని వక్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే వైఎస్ జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే ఆయన అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదే అసంబద్ధ వాదనను వినిపించడం విభ్రాంతికరం. కానీ టీడీపీ దుష్ప్రచారం బెడిసికొట్టింది. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే ఆ దాడికి పాల్పడ్డారన్నది తేటతెల్లమైంది. అయినా సరే చంద్రబాబు, రామోజీ తీరు మార్చుకోలేదు. నాడు, నేడు కూడా వక్రీకరణలు, కుట్రలే వారి రాజకీయంగా స్పష్టమవుతోంది. -
దాడులు.. లూటీలు.. విధ్వంసం
సాక్షి, నరసరావుపేట/వినుకొండ(నూజెండ్ల)/కారెంపూడి/పెదకూరపాడు/మాచవరం : పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో చేస్తున్న అరాచకపర్వం రెండో రోజూ కొనసాగింది. సోమవారం పోలింగ్ రోజు వైఎస్సార్సీపీకి ప్రజలు భారీ స్థాయిలో ఓటు వేస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం నుంచే దాడులు ప్రారంభించారు. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఓవైపు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కేంద్ర బలగాలు ఏవని ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామ శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీ గూండాలు సుమారు 70 మంది సోమవారం రాత్రి వారి ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావ బాదారు. ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు, బల్బులను పగులగొట్టారు. చిల్లర కొట్టునూ లూఠీ చేశారు. సామాన్లు, నగదును దోచుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి బిక్షంకు చెందిన బైక్‌ను, మక్కెన శేషుకు చెందిన బైక్‌ను మరో ఇద్దరి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో అందరూ ప్రాణభయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే చోట తల దాచుకున్నారు. ఏరా.. టీడీపీకి ఓటు వేయమంటే వేయకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారా.. నా కొడకల్లారా.. అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచకపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జూన్ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ‘ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్లు కర్రలతో కొట్టారు. ఇళ్లలోకి జొరబడి సామాన్లన్నీ చిందవందర చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. భయమేసింది. పిల్లలు పరారయ్యారు. ఎటూ పోలేని మమ్మల్ని చితకబాదారు. బూతులు తిట్టారు’ అంటూ గొర్ల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా చేయి విరగ్గొట్టారు. నేను పని చేస్తేనే పిల్లలను పోషించుకునేది. ఇప్పుడు ఎలా పని చేయాలి? ఇన్నాళ్లూ మా బాగోగులు పట్టించుకున్నారా.. కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా.. అలాంటి వారు మాపై దౌర్జన్యం ఏమిటి? మా లాంటి బీదోళ్లపై పడి కొట్టడం ఏమిటి? ఓటు వేయలేదని కొడతారా?’ అంటూ కప్పెర లక్ష్మి వాపోయింది. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు » సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసినప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి కొనసాగింది. తిరిగి మంగళవారం ఉదయం తొండపి గ్రామంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతి పరులు ఆడ, మగ బేధం లేకుండా మూకుమ్మడిగా చొరబడ్డారు.» మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంట్లోని సామగ్రి పగలకొట్టారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దాడికి పాల్పడుతున్న తరుణంలో ముస్లిం కుటుంబాల్లోని మగ వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు.» ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి మండలంలోని తొండపి, మాదల గ్రామాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ ముస్లిం వర్గీయులే వైఎస్సార్సీపీ మద్దతు దారులుగా ఉండగా, టీడీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం వర్గీయులంతా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లోను వైఎస్సార్సీపీ కి అండగా ఉంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారు. కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి » గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావు, చుండు రామారావు ఇళ్లపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నాయకులు రాళ్లు విసిరారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. » వైఎస్సార్సీపీ నేత చుండు రామారావు తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లచ్చమ్మతో పాటు మరో ఇద్దరిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. టీడీపీ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తంగెడ, ఇరికేపల్లి, దాచేపల్లి గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్సీలపై దాష్టీకం » చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 211లో ఉదయం 7.30 గంటలకు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓట్లు కొన్ని పోల్ కావాల్సినవి మిగిలి ఉన్నాయి. దీనికోసం సమయం పెంచాల్సిందిగా వైఎస్సార్సీపీ తరుఫున బూత్ ఏజెంటుగా ఉన్న నలమాల కాంతయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇది నచ్చని టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కాంతయ్యపై దాడి చేశారు. దీంతో ఇతను తల పగిలి పడిపోయాడు. » దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కట్టెం ఆనందరావు, మరి కొందరికి కూడా గాయాలయ్యాయి. కాంతయ్య, ఆనందరావులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కావూరులోని మంచినీటి ప్లాంట్ నుంచి ఎస్సీ వర్గీయులు మంగళవారం మంచి నీరు తీసుకువెళ్లకుండా కట్టడి చేసి వారి దాష్టీకాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. కంభంపాడులో పచ్చ మూకల విధ్వంస కాండ» పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య) సతీమణి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఆర్తిమళ్ల ఆంజమ్మ లక్ష్యంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. » పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన పచ్చమూకలు.. నాగేశ్వరరావు, అతని కుమారులు రాజశేఖర్, ప్రవీణ్, ఆర్తిమళ్ల తిరుపతిరావు, ఎస్సీ కాలనీకి చెందిన సురేష్, బీసీ కాలనీకి చెందిన బ్రహ్మం, పల్లపాటి కృష్ణవేణిలపై దాడులకు పాల్పడ్డారు. పలువురి తల, కాళ్లు, చేతులు, ఛాతీపై రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టీడీపీ గూండాలు పలు మార్లు ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. కారెంపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి» కారెంపూడిలో టీడీపీ గూండాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బీభత్సం సృష్టించారు. సుమారు 500 మంది రౌడీలు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ కరీంకు చెందిన వాచ్ షాపును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టిస్తూ గ్రామం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేశారు. » కారెంపూడి ఎంపీపీ బొమ్మిన సావిత్రికి చెందిన పాల కేంద్రాన్ని ధ్వంసం చేసి తగల బెట్టారు. తర్వాత మాచర్ల రోడ్డులో ఉన్న పోలిరెడ్డికి చెందిన టీస్టాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో లూధరన్ చర్చి వద్ద ఎస్సీ కాలనీలో బీభత్సం సష్టించారు. తర్వాత వైఎస్సార్సీపీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ నివాసంపై దాడి చేశారు. » స్టేట్ బ్యాంక్ సెంటర్లో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మావతి భర్త నిర్వహిస్తున్న ఆటో కన్సల్టెన్సీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 40 బైక్‌లకు నిప్పు పెట్టారు. బైక్‌లకు ఉన్న బ్యాటరీలు పేలడంతో దానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అపార్ట్మెంట్లో నిలిపి ఉంచిన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి కారును ధ్వంసం చేశారు. » టీడీపీ రౌడీ గ్యాంగ్ మరొకటి.. ఆర్య వైశ్య వీధి ముస్లిం ఏరియాలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. తర్వాత గ్రామ శివారులో ఉన్న ఆదినారాయణ కాలనీలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ నివాసానికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తలకు బలౖమెన గాయం అయింది. జెడ్పీ హైస్కూల్ వద్ద పార్క్ చేసి ఉన్న టీడీపీ నాయకుని స్కార్పియోను దుండగులు ధ్వంసం చేశారు. » మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేయగా, వైఎస్సార్సీపీ వర్గీయులు ప్రతిఘటించారు. ఓ దశలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడులలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్యనాయక్, మూఢావత్ కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావునాయక్ , మూఢావత్ నాగేశ్వరరావు నాయక్ గాయపడ్డారు. క్షతగాత్రులు గురజాల, పిడుగురాళ్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నూజెండ్లలో టీడీపీ మూకల దాడులు» వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మంగళవారం పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాన సెంటరులోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మహిళలను వెంటాడి దాడి చేశారు. గ్రామంలో అందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్నారనే అక్కసుతో టీడీపీ నాయకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కాజా ఆదిశేషమ్మ, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కిరెడ్డి గోవిందరెడ్డి, అమ్మిరెడ్డి సంజీవరెడ్డి, భవనం సంజీవరెడ్డి, మల్లంపాటి చెంచిరెడ్డి, నక్కా ఆదిలక్ష్మి, కాజా జయమ్మ, వంగూరి ప్రసాద్ సహా 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, గొడవను అదుపు చేయలేక పోవటం పలు విమర్శలకు తావిచ్చింది. క్షతగాత్రులను వినుకొండ ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. » బొల్లాపల్లి మండలం పేరూరుపాడులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్వల్ప వివాదంతో కావాలనే టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. -
తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
తాడిపత్రి/తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ నాడు మొదలైన పచ్చ ముఠా హింసాకాండ మంగళవారమూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొనసాగింది.. సోమవారం పోలింగ్ సందర్భంగా దాడులకు దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు.. మంగళవారమూ తాడిపత్రిలో రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులూ ప్రతిఘటనకు దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలూ పరస్పరం రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అడ్డొచ్చిన పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. బరి తెగించిన టీడీపీ కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోని గానుగవీధికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సంజీవ సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా 230వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఏజెంటుగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకుడు సూర్యముని తన వర్గీయులు భాను, కిరణ్, అశోక్, వేణు మరికొందరితో కలిసి సంజీవపై దాడి చేశారు. అతని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా అతని మిక్చర్ బండినీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సంజీవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద పెద్దఎత్తున గుమిగూడిన టీడీపీ అల్లరి మూకలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన టీడీపీ అల్లరి మూకలు పోలీసులపైనా రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తాడిపత్రి అర్బన్ సీఐ మురళీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ గూండాగిరి దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులను వెంటేసుకుని సీబీ రోడ్డులో భయానక వాతావరణం సృష్టిస్తూ వస్తుండగా..పోలీసు బలగాలు అడ్డుకున్నా, ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో పుట్లూరు రోడ్డు గుండా సంజీవనగర్ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో తన ఇంటి ముందున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్ధంగా ఉంచుకున్న ట్రాక్టర్లలోని రాళ్లతో టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలోని వారందరూ ఇళ్లకు తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఐదు వేల మందికి పైగా జేసీ అనుచరులు గుమిగూడి ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారు వినకుండా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, బీఎస్ఎఫ్ బలగాలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు సైతం పరుగెత్తాల్సివచ్చి0ది. చివరకు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. జేసీ అనుచరులు ఒక్కసారిగా నాగాలాండ్ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ బలగాలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ జవానుల్లో ఒకరి కంటికి తీవ్ర గాయమైంది. జేసీ అనుచరులు విచక్షణ కోల్పోయి దాడులకు దిగడంతో ఎస్పీ అమిత్‌బర్దర్, డీఎస్పీ గంగయ్య, పోలీసులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో ఆగని అల్లరి మూకలు మరింత రెచ్చిపోయి బాణా సంచాకు నిప్పు పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన ఎస్పీ పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముíÙతో పాటు కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, ట్రైనీ ఎస్పీలు తాడిపత్రికి చేరుకుని భద్రతను సమీక్షించారు. ఆయా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.పోలీసుల వైఫల్యమే కారణం రెండు రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు పోలీసుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. తాడిపత్రి అసలే సమస్యాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన బలగాలను మంగళవారం ఉదయమే పంపేశారు. దాడులు జరుగుతాయని ముందస్తుగా పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు బలగాలను పట్టణంలో అలాగే ఉంచి ఉంటే మంగళవారం ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ వర్గీయుల పట్ల పోలీసులు అవలంబిస్తున్న మెతకవైఖరే అందుకు కారణమన్న బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. -
సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం..
-
ఇప్పుడవి రాళ్లు విసిరే చేతులు కాదు
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి.ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్.ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు.యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమిప్రోఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ్రపోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలి ప్రోఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మాప్రాంంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మాప్రాంంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. -
ప్రజాహిత యాత్రపై రాళ్లదాడి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో బీజేపీ జాతీయ కా ర్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధమే ఇందుకు కారణమని అంటున్నారు. మంగళవారం ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బండి దిష్టి»ొమ్మను దహనం చేసేందుకు కొందరు కార్యకర్తలు యాత్రలోకి చొచ్చుకునిరాగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఓ కార్యకర్తను బీజేపీ నాయకులు చి తకబాదారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పో లీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పొన్నం సిద్ధమా: యాత్ర హుస్నాబాద్‌కు చేరుకు న్న సందర్భంగా బండి మాట్లాడుతూ.. కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి పొన్నం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యమని పొన్నం అన్న మాట నిజం కాదా అని అన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని, అక్కడే రామమందిరం ఉన్నట్లు కచ్చితంగా చెబుతామన్నారు. పొన్నంకు రాముడంటే కోపమంటూ.. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. సంచలనం కోసమే పొన్నం యాత్రను అడ్డుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. పొన్నం తన తల్లిని అడ్డుపెట్టుకొని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న పొన్నం తండ్రి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. పొన్నం తల్లి నిండు నూరేళ్లు బతకాలని కాంక్షించారు. ‘అందరు తల్లులు నా తల్లితో సమానం. ఆయన తల్లిని నేను అవమానించలేదు. వాళ్ల తల్లిని అవమానించడమంటే నా తల్లిని నేను అవమానించినట్లే’అని బండి చెప్పారు. -
రాజస్థాన్ ఎన్నికలు: ఫతేఫూర్‌లో రాళ్ల రాడి, భారీగా మోహరించిన పోలీసులు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హారా హోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా ఓటింగ్ నమోదుగా తాజా సమాచారం ప్రకారం 55.63శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు సికార్‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో కొంతమంది రాళ్ల దాడికి దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఫతేపూర్ షెకావతి నుంచి హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత సమయంలో జనం అదుపు తప్పి భారీగా రాళ్లు రువ్వారు. హింసాకాండతో కొంత సేపు ఓటింగ్ నిలిచిపోయింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై జనాన్ని అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, అధికారం తమదేనని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి పాలన అంతంకోసం జనం ఓటు వేస్తున్నారుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానిచారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదనీ కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాజస్థాన్‌లోని 200 నియోజకవర్గాల అసెంబ్లీలలో 199 అసెంబ్లీలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలక పోలింగ్‌కు కొనసాగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ పుమేష్‌మిశ్రా తెలిపారు. ఇదిబ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు. #WATCH | Rajasthan Assembly elections: Stone pelting reported near Bochiwal Bhawan, Fatehpur Shekhawati in Sikar. Heavy Police deployed. pic.twitter.com/AAXLlkp5pn — ANI (@ANI) November 25, 2023 -
బీఆర్ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత
నారాయణపేట: నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్ పేట గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఐదుగురు టీఆర్ఎస్ నాయకులు, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు కోస్గీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. మొదట వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాహనాలపై రాళ్లురువ్వడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే దాడిపై పోలీసులు చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కోస్గి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ పరిణామాల అనంతరం శినాజీ చౌరస్తాలో ఇరువర్గాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పరిస్థితి మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ పోటీ.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి -
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు...
ప్రయాణికులారా.. జాగ్రత్త, మార్గమధ్యలో ఎప్పుడైనా రాళ్ల దాడి జరిగే ప్రమాదం ఉంది.. అని ప్రకటన చేరిస్తే బాగుండుననే చలోక్తులు వ్యాప్తిలో ఉన్నాయి. అంతగా రాళ్ల దాడులు రైల్వేశాఖకు సమస్యగా మారాయి. ప్రయాణంలో ఆదమరిచి ఉన్నవారు.. దుండగులు రాళ్లు విసురుతున్నారని తెలిసి భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు పరిపాటిగా మారాయి. ఇలాంటి తరహా ఘటనలు రాష్ట్రంలోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు మాత్రమే కాకుండా మిగతా రైళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే శాఖకు ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. వందేభారత్‌పై గురి ఇటీవల బెంగళూరు–ధార్వాడ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అయింది. ప్రారంభం అయిన 15 రోజుల్లోనే సుమారు మూడు సార్లు వందేభారత్ రైలు రాళ్ల దాడికి గురయింది. రాళ్లు తగిలి రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ రాళ్లు తగలకపోవడంతో హాని జరగలేదు. కానీ రాళ్ల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని నైరుతి రైల్వే, దక్షిణ రైల్వే, కొంకణ్ రైల్వే జోన్లలో రాళ్లు విసరడం మామూలుగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు చెన్నై–మైసూరు, బెంగళూరు–ధార్వాడ మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు 24 సార్లు రాళ్ల దాడులకు గురయ్యాయి. ఇతర రైళ్లు కూడా 190కి పైగా రాళ్ల దాడులకు గురయ్యాయి. పట్టుబడితే కఠినచర్యలు గడిచిన ఏడు నెలల్లో నైరుతి రైల్వేజోన్ పరిధిలో 65కు పైగా సాధారణ రైళ్లపై దాడి జరిగింది. రెండుసార్లు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో కలబురిగిలో ప్యాసింజర్ రైలుపై కూడా దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఆశా కార్యకర్త ఒకరు గాయపడ్డారు. మరోవైపు రైల్వే చట్టం 152, 153 సెక్షన్ల ప్రకారం రాళ్ల దాడి శిక్షార్హమైన నేరం. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని నైరుతి రైల్వే హెచ్చరిస్తోంది. ఇటీవల దావణగెరెలో దాడికి పాల్పడిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 200కు పైగా ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి. సుమారు 49 మంది నిందితులను అరెస్టు కూడా చేశారు. పనీపాట లేని ఆకతాయిలు, మద్యం, గంజాయి వ్యసనపరులు పొంచి ఉండి రాళ్ల దాడులు చేస్తున్నట్లు, ప్రజలకు హాని చేయాలనే ఉన్మాద మనస్తత్వం ఉన్నవారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అంచనా. రైల్వే పోలీసులు గస్తీ ముమ్మరం చేయాల్సి ఉంది. -
‘సాధారణ రైళ్లకు వందే భారత్‌గా పేరు మార్చి లూటీ!’
కోల్‌కతా: వందేభారత్ రైలుపై పశ్చిమ బెంగాల్లో రాళ్ల దాడి జరగటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా. రైలు టికెట్ ధరలు అధికంగా ఉండటమే రాళ్ల దాడికి కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, వందేభారత్ రైళ్లపై విమర్శలు గుప్పించారు. సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి తిప్పుతున్నారు. హైస్పీడ్ ట్రైన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అది హైస్పీడ్ ట్రైన్ అయితే హౌరా నుంచి న్యూజల్పాయిగురికి చేరుకునేందుకు ఎనిమిది గంటల సమయం ఎందుకు పట్టింది? సాధారణ రైళ్లకు వందేభారత్‌గా రంగులు వేసేందుకు ప్రజల సొమ్మును వినియోగించవద్దు. తొలుత వారు వందేభారత్ సాధరణ రైలుగా పేరు పెట్టారు. ఆ తర్వాత బోగీలకు రంగులు వేసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటమే దాడులకు కారణమవుతోంది.’ అని కేంద్రపై విమర్శలు గుప్పించారు మంత్రి ఉదయన్ గుహా. హౌరా నుంచి న్యూజల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును డిసెంబర్ 30, 2022న ప్రవేశపెట్టింది కేంద్రం. ప్రధాని మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. అయితే, దానిపై కొందరు రాళ్లదాడి చేశారు. ఆ దాడిపై మాట్లాడుతూ పాత రైలుతో పోలిస్తే కొత్త వందేభారత్‌లో ఎలాంటి తేడా లేదని, అందుకే ప్రజలు ఆగ్రహానికి గురైనట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో తొలి వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ.. -
వైరల్ వీడియో: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
-
Viral Video: బండి ఆపారని పోలీసులపై రాళ్ల దాడి చేయించాడు..
లఖ్‌నవూ: పోలీసులపై కొందరు స్థానికులు దాడికి దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదౌన్ జిల్లాలోని కక్రాల నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి బండిని పోలీసులు ఆపినందుకు.. కొందరు అల్లరి మూకలను పోగు చేసి దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీడియ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ‘పోలీసు బృందం నడుచుకుంటూ నగరంలో పెట్రోలింగ్ చేస్తోంది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి వాహనం తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో వచ్చి రోడ్డుపై నిరసనకు బైఠాయించాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని పోలీసులు తెలపటంతో వారిపై రాళ్ల దాడి చేశారు’ అని జిల్లా ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. రాళ్లదాడి జరిగిన క్రమంలో కాలనీలో స్థానికులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసే అవకాశం ఉందనే భయంతో ఇళ్లల్లోంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు.. బలగాలను తరలించి అల్లరి మూకను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. Mob Clashes With Cops, Throws Stones In UP's #Badaun @budaunpolice pic.twitter.com/0PFaZT1bBu — Himanshu dixit 💙 (@HimanshuDixitt) December 9, 2022 Clash between police and local people in UP's #Badaun, protesters pelted stones at police. According to the police, the whole incident took place after a dispute during the vehicle checking drive. Some people have been detained: Dr. OP Singh, SP Badaun pic.twitter.com/6bGjESlh4z — Nikhil Choudhary (@NikhilCh_) December 9, 2022 ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్‌కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్‌పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య
posani krishna murali House Attack: సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని, ఆయన భార్యను పచ్చి బూతులు తిడుతూ ఆయన ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని ఆ ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ భార్య శోభ మీడియాకు తెలిపారు. బుధవారం అర్థ రాత్రి పోసాని కృష్ణ మురళి నివాసంపై రాళ్లతో దాడికి దిగారు. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్లతో దాడికి దిగారని తమకు అనుమానం ఉందని ఆయన ఇంటి వాచ్మెన్ భార్య శోభ చెప్పారు. ఇద్దరి వ్యక్తుల మాటలు విన్పించినట్టుగా ఆమె తెలిపారు.దాదాపుగా 8 నెలలుగా పోసాని కృష్ణ మురళి దంపతులు ఈ నివాసంలో ఉండడం లేదని ఆమె చెప్పారు. (చదవండి: పవన్ కల్యాణ్ ఊసరవెళ్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే తప్పా : పోసాని) తమకే ఇంటిని అప్పగించి వెళ్లారని ఆమె చెప్పారు. దీంతో రాత్రి పూట తాము ఈ ఇంటి వద్దే నిద్రిస్తామని తెలిపారు. రెండు రోజులుగా పోసాని కృష్ణ మురళిని దూషిస్తూ కొందరు తిరుగుతున్నారని ఆమె చెప్పారు. బుధవారం రాత్రి పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారని, భయంతో తాము ఇంట్లోనుంచి బయటకు రాలేదన్నారు. చివరకు పురుషోత్తం అనే వ్యక్తి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆమె తెలిపారు. కాగా, గతకొన్ని రోజులుగా పవన్, పోసాని మధ్య మాటల యుద్ద జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడ పోసాని కృష్ణ మురళి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశం పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆయనపై దాడికి ప్రయత్నించారు. -
రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్‌పై రాళ్లదాడి
లక్నో: టాలీవుడ్ మీద ఫోకస్ తగ్గించి బాలీవుడ్లో బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హీరో జాన్ అబ్రహాంతో కలిసి 'అటాక్' సినిమా చేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్ బ్లాస్టింగ్ జరిపారు. దీనికి తగు ముందు జాగ్రత్తలు సైతం పాటించారు. అయితే షూటింగ్ గురించి తెలుసుకున్న గ్రామస్తులు సెట్స్ వద్దకు చేరుకుని నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు దాడికి దిగారు. సెట్స్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయాలపాలయ్యారు. హీరోహీరోయిన్లకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా అటాక్ సినిమా విషయానికి వస్తే...లక్ష్యరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆగస్టు 13న విడుదల కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ కనిపించనుంది. కామెడీ డ్రామా డాక్టర్ జీలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. చదవండి: బాలీవుడ్‌కు రకుల్ మకాం.. మరో సినిమాకు సై అప్పటి న్యూస్‌రీడర్ ఇప్పటి బాలీవుడ్ నటి! -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల రాళ్ల దాడి
సాక్షి, టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్ననారాయణపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలు పెట్టబోతున్నామని.. అప్పటికే ఉన్న వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ స్థానిక టీడీపీ నాయకులు గొడవకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో.. ఆ ఫ్లెక్సీల ముందు అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇప్పిలి సంతోష్ తన కల్లంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా టీడీపీ వర్గీయులు అడ్డుకొని.. రాళ్లతో దాడి చేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇప్పిలి దేవేంద్రరావు, మన్యాల కిషోర్, ఇప్పిలి సంతోష్, ఇప్పిలి కృష్ణ, ఇప్పిలి శంకరరావు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇప్పిలి దేవేంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్ఐ–2 గోపాల్‌రావు టీడీపీకి చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం: వైఎస్సార్సీపీ నేత మృతి)