రాష్ట్ర విభజనపై ముందూ వెనకా చూసుకోకుండా ప్రకటన చేసి పారేసిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఆయన కారుపై రాళ్ల దాడి జరిగింది. శుక్రవారం నాడు దిగ్విజయ్ సింగ్తో పాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు అజయ్ సింగ్ ఓ కారులో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనలో కారు కొద్దిగా ధ్వంసమైనా, నాయకులిద్దరూ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోగలిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తాము భోపాల్ వెళ్తున్నామని, పోలీసులకు ఈ దాడి విషయం ముందుగానే తెలిసినా.. వాళ్లు మాత్రం ఏమీ చేయకుండా ఊరుకుండిపోయారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కావాలనుకుంటే వాళ్లు ఈ దాడిని ఆపగలిగేవారన్నారు. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. దాడులతో తాము భయపడిపోతామనుకుంటే మాత్రం పొరబడినట్లేనన్నారు.
దిగ్విజయ్ సింగ్ కారుపై రాళ్ల దాడి
Published Fri, Aug 30 2013 10:40 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement