రోజుకొక ముఖ్య నేత పార్టీని వీడుతుండడంతో టీడీపీ అతలాకుతలమవుతోంది. పార్టీని వదిలి వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార మదంతో టీడీపీ వర్గాలు దాడులకు దిగుతున్నాయి. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.