బండి సంజయ్ యాత్రలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత
కరీంనగర్‌లో ఓడిపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..
కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పొన్నం దానికి సిద్ధమా అంటూ సవాల్
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో బీజేపీ జాతీయ కా ర్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధమే ఇందుకు కారణమని అంటున్నారు. మంగళవారం ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
బండి దిష్టి»ొమ్మను దహనం చేసేందుకు కొందరు కార్యకర్తలు యాత్రలోకి చొచ్చుకునిరాగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఓ కార్యకర్తను బీజేపీ నాయకులు చి తకబాదారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పో లీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
పొన్నం సిద్ధమా: యాత్ర హుస్నాబాద్‌కు చేరుకు న్న సందర్భంగా బండి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి పొన్నం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యమని పొన్నం అన్న మాట నిజం కాదా అని అన్నారు.
రాముడు అయోధ్యలోనే పుట్టాడని, అక్కడే రామమందిరం ఉన్నట్లు కచ్చితంగా చెబుతామన్నారు. పొన్నంకు రాముడంటే కోపమంటూ.. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. సంచలనం కోసమే పొన్నం యాత్రను అడ్డుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు.
పొన్నం తన తల్లిని అడ్డుపెట్టుకొని..
మంత్రి పొన్నం ప్రభాకర్ తన తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న పొన్నం తండ్రి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. పొన్నం తల్లి నిండు నూరేళ్లు బతకాలని కాంక్షించారు. ‘అందరు తల్లులు నా తల్లితో సమానం. ఆయన తల్లిని నేను అవమానించలేదు. వాళ్ల తల్లిని అవమానించడమంటే నా తల్లిని నేను అవమానించినట్లే’అని బండి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment