కక్షసాధింపు ఆపకపోతే తిరగబడతారు: అంబటి రాంబాబు | Former Minister Ambati Rambabu Pressmeet On Perni Nani Incident | Sakshi
Sakshi News home page

కక్షసాధింపు ఆపకపోతే మావాళ్లు తిరగబడతారు: అంబటి రాంబాబు

Published Sun, Sep 1 2024 8:27 PM | Last Updated on Mon, Sep 2 2024 11:18 AM

Former Minister Ambati Rambabu Pressmeet On Perni Nani Incident

సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గుడివాడలో నాని బంధువును పలకరించడానికి వెళితే రాళ్లు రువ్వారని వైఎస్సార్‌సీపీ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ ఘటనపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం(సెప్టెంబర్‌1) అంబటి మీడియాతో మాట్లాడారు.

పేర్నినానిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఎస్పీకి తమ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స ఫోన్ చేసినా ఎస్పీ ఫోన్ తీయలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు. 

అంబటి ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు..

  • మాజీ మంత్రిని తిరగటానికి వీళ్ళేదని అనటం సమంజసమా

  • చట్టబద్దంగా వ్యవరిస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు

  • ఇంటూరు రవి కిరణ్ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • అతన్ని న్యాయవాదుల సాయంతో పేర్ని నాని పీఎస్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు

  • ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి

  • పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయి రాష్ట్రంలో అరాచకత్వం ప్రబలుతోంది

  • పోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనా

  • వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా

  • హోంమంత్రి సమాధానం చెప్పాలి

  • ఇది సరైన విధానం కాదు

  • తప్పుడు కేసులు పెడుతూనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు

  • కక్ష సాధింపు చర్యలు మానుకో కుంటే మావాళ్ళు తిరగబడతారు

  • పోలీసులపై కూడా కేసులు పెడతామంటున్నారు

  • ముంబై నటి కేసులో ముగ్గురు ఐపిఎస్ లపై కేసు పెడతామంటున్నారు

  • ప్రభుత్వాలు మారతాయి. కొత్త సాంప్రదాయాలకు అధికారులు తెర తీయవద్దు

  • పోలీసుల్లో ఒక వర్గాన్ని గుర్తించి వారిని అణిచి వేయాలని సూచిస్తున్నారు

  • రెడ్ బుక్ లో రాసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతున్నారు

  • గడ్లవల్లేరు కాలేజ్ చిన్న సంఘటన అంటూ లోకేష్ మాట్లాడుతున్నారు

  • మీ ప్రభుత్వంలో జరిగితే చిన్న విషయమా

  • చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా

  • ప్రకాశం బ్యారేజి నుండి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది

  • దీంతో చంద్రబాబు ఇల్లు మునుగుతుంది

  • సీఎం మచిలీపట్నం అతిధి గృహంలో ఉంటారంటున్నారు

  • అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారని మీము మొదట నుండి చెబుతున్నాం

  • నది గర్భంలో ఉన్న ఇంటిలో ఉంటే వరద వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి ఉంటుంది

  • సాక్షాత్తు సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి పోతున్నారు

  • లోకేష్ పరిధిలోని విద్యాశాఖలోని ట్రిబుల్ ఐటీ కాలేజ్, గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలపై లోకేష్ విఫలమయ్యారు.

వరద నీటిలో చంద్రబాబు ఇల్లు ?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement