
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నివాసంపై మంగళవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రంజన్ నివాసంలోకి చొరబడి.. ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దుండగులు రంజన్ నివాసంలోని కొన్ని పత్రాలను ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో అధీర్ బయటకు వెళ్లగా.. ఆయన కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధీర్ వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment