రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమవారం నాడు ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వెళ్తున్న ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సమీపంలో కొంతమంది దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. దాంతో కొన్ని బోగీల అద్దాలు పగిలిపోయాయి.
చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఈ రైలునే లక్ష్యంగా కొంతమంది దుండగులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. కేవలం సమైక్య నినాదాలతోనే తాము వెళ్తున్నామని, తమను తాము రక్షించుకోడానికి కూడా ఎలాంటి అవకాశం లేదని శ్రీనివాస్ అనే ప్రత్యక్ష సాక్షి ఫోన్ ద్వారా తెలిపారు.
చలో ఢిల్లీ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి
Published Sat, Feb 15 2014 8:21 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement