
ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి
పాట్నా: బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీకి స్వతంత్ర దినోత్సవం రోజు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. వైశాలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా సుశీల్‌కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.