మతి స్థిమితం లేని యువకుడిపై దాడి చేసి సెల్ఫీలు తీసుకుంటున్న యువకులు
సాక్షి, తిరువనంతపురం : కేరళలో మానవత్వం మంటగలిసింది. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని దొంగతనానికి పాల్పడ్డాడనే కారణంతో దారుణంగా కొట్టారు. అలా కొడుతుంటే సాటి మనుషులుగా ఆపాల్సింది పోయి దాడి జరిగే సమయంలో సెల్ఫీలకోసం పోటీ పడ్డారు. వీరిలో అధికంగా యువకులే ఉన్నారు. ఓపక్క వారిని నిలువరించకుండా పైగా దెబ్బలతో సతమతమవుతున్న ఆ వ్యక్తితో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, తీవ్రంగా గాయాలపైన ఆ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలుకోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 27 ఏళ్ల యువకుడు మతిస్థిమితం లేని వాడు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల అత్తపాడి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. అయితే, అతడు ఆ గ్రామంలోని దుకాణాల్లో తినుబండారాలు దొంగిలించి జీవనం సాగిస్తున్నాడని నలుగురు చెబుతుండటంతో అతడిని ప్రత్యేకంగా పట్టుకున్నారు. కట్టేసి కొన్ని గంటలపాటు టార్చర్ పెట్టారు. మధ్యాహ్నం వేళ జాలి చూపిన ఓ వ్యక్తి పోలీసులకు కబురు చేయడంతో వారు వచ్చి అతడిని విడిపించారు. అప్పటికే అతడు వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు. ఐదుగంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment