![Mob Attacks Delhi Cops After 3 Nigerians Detained Overstaying - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/8/Delhi.jpg.webp?itok=YbEqIFcN)
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు.
దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు.
పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్‌సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స‍్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు.
Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L
— NDTV (@ndtv) January 8, 2023
ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ
Comments
Please login to add a commentAdd a comment