Overstaying
-
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
ఇండియన్స్‌పై యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ కౌంటర్!
లండన్: వీసా పరిమితి ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉంటున్న వారిలో అధికంగా భారతీయులేనని యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్(ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సుయెల్లా పేర్కొనంటపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా యూకే వైపు నుంచి సైతం స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది. యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ప్రశ్నించగా.. పలు విషయాలను వెల్లడించింది లండన్‌లోని భారత హైకమిషన్. ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా వీసా పరిమితి ముగిసిన తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు యూకేతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించాం. ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా హామీలను నెరవేర్చేందుకు యూకే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో సరైన పురోగతి కోసం తాము వేచి చూస్తున్నాం.’ అని లండన్‌లోని భారత హైకమిషన్ బదులిచ్చింది. మరోవైపు.. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. భారత్‌తో ఎఫ్‌టీఏపై ఆందోళనలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై భారత హైకమిషన్ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి.’ అని పేర్కొంది. మరోవైపు.. యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్
పణజి: గోవాలో అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్తుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీసా గడువు తీరినా అతడు స్వదేశానికి వెళ్లకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సిరియా పౌరుడి అరెస్ట్ ను ఐజీ సునీల్ గార్గ్ ధ్రువీకరించారు. అతడిని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. 'కాసినో ప్రాంతంలో గతరాత్రి అతడిని అరెస్ట్ చేశాం. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాలోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమంగా ఉన్నందుకు అతడిపై కేసు నమోదు చేశాం' అని గార్గ్ తెలిపారు. అయితే అతడిని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో, లేవో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. సిరియా పౌరుడు అరెస్ట్ ను ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా ధ్రువీకరించారు. దర్యాప్తు సాగుతోందని చెప్పారు.