Muslim Girl, Hindu Boy Out For Dinner Manhandled By Indore Mob - Sakshi
Sakshi News home page

Video: డిన్నర్‌కు వెళ్లిన జంటపై దాడి.. ‍ఆమె ఎంత వారించినా..

Published Sat, May 27 2023 8:56 AM | Last Updated on Sat, May 27 2023 9:34 AM

Muslim Girl And Hindu Boy Out For Dinner Manhandled By Indore Mob - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న యువతియువకుడిని అడ్డుకున్న కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువతి వారిని ఎంత వారించినా.. దుండగులు రెచ్చిపోయారు. ఆ జంటను రక్షించిన ఇద్దరిని ఆగంతకులు కత్తితో పొడిచారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఇండోర్‌లో యువతి, యువకుడు విందు కోసం హోటల్‌కు వచ్చారు. వారు డిన్నర్‌ చేసిన అనంతరం.. హోటల్‌ నుంచి బయటకు రాగానే వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. స్కూటీ మీద ఉన్న వారిద్దరిని ఓ గుంపు వెంబడించి వారిని చుట్టుముట్టింది. ఇంతలో కొందరు.. అతడితో ఎందుకు కలిసి తిరుగుతున్నావని ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ జంటను రక్షించేందుకు అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. దీంతో, మరింత రెచ్చిపోయిన దుండగుటు.. వారిద్దరినీ కత్తితో పొడిచారు. 

అయితే, దుండగుల దాడి అనంతరం డీసీపీ రాజేష్‌ రఘువంశీ మాట్లాడుతూ.. ఆమె తన పేరెంట్స్‌ అనుమతితోనే(వారికి సమాచారం ఇచ్చిన తర్వాతే) ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని చెప్పింది. వారిని అడ్డుకున్న దుండగులపై సదరు యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపులో నుంచి ఎవరో కత్తితో పొడిచారు. దీంతో, వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇది కూడా చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్‌ చంద్రశేఖర్‌.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement