లవ్‌ ఈజ్‌ ఇన్‌ద ఎయర్‌ : లవ్‌ ప్రపోజల్‌ వీడియో వైరల్‌ | Woman Proposing To Boyfriend Mid-Air On IndiGo Flight Melts Hearts | Sakshi
Sakshi News home page

లవ్‌ ఈజ్‌ ఇన్‌ద ఎయర్‌ : లవ్‌ ప్రపోజల్‌ వీడియో వైరల్‌

Published Wed, Aug 28 2024 12:54 PM | Last Updated on Wed, Aug 28 2024 1:04 PM

Woman Proposing To Boyfriend Mid-Air On IndiGo Flight Melts Hearts

తాజ్‌మహల్‌ ముందే లవ్‌ ప్రపోజ్‌ చేయాలా ఏంటి?  ఈఫిల్‌ టవర్‌ముందు నిలబడే ఐ లవ్‌ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు.  అందుకే  ఇండిగో  విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. 

"నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.  ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.

బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది.  దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే  చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్‌ హాఫ్‌ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్‌ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్‌ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు  చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ  ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు.  సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్‌. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement