Indigo Air Hostess Dance Video: Indigo Air Hostess Dances on Manike Mage Hithe Video Got 13 Million Views - Sakshi
Sakshi News home page

13 మిలియన్ల వ్యూస్‌: ఎయిర్‌హోస్టెస్‌ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Published Wed, Sep 8 2021 5:14 PM | Last Updated on Wed, Sep 8 2021 7:54 PM

IndiGo Air Hostess Dances On Manike Mage Hithe Video Got 13 Million Views - Sakshi

ముంబై: రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోవాలంటే కేవలం సోషల్‌ మీడియా వల్లనే సాధ్యం. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనలో కోకొల్లలు. తాజాగా బుల్లెట్‌ బండి పాట ఎంత హిట్‌ అయ్యిందో.. దానికి ఓ నవ వధువు డ్యాన్స్‌ వేసిన వీడియో కూడా అదే రేంజ్‌లో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే స్టార్‌డం సాంపాదించుకుంది సదరు పెళ్లి కుమార్తు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే కొన్ని రోజులుగా ‘మాణికే మాగే హితే’ అనే ఓ పాట ఇంటర్నెట్‌ని తెగ షేక్‌ చేస్తోంది. ఒరిజినల్‌గా ఈ పాట సింహళి భాషలో(శ్రీలంక)ఉంది. 

కానీ ఈ పాట పాడిన గాయని గొంతులోని మాధుర్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రసుత్తం ఇది పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యి.. ఇక్కడి జనాలను కూడా తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాట మీద రికార్డయిన ఇన్‌స్టా రీల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో తాజాగా మాణికే మాగే హితే పాటకు ఓ ఎయిర్‌హోస్టెస్‌ వేసిన క్యూట్‌ స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పాట ఎంత క్యూట్‌గా ఉందో మీ ఎక్స్‌ప్రేషన్స్‌ కూడా అంత అందంగా ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే ఈ వీడియో 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ పొందింది. ఆ వివరాలు.. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్‌ డ్యాన్స్‌.. భర్త ఫిదా)

ఇండిగోలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న ఆయాత్ ఉర్ఫ్ అఫ్రీన్ విమానం ఆగి ఉన్న సమయంలో మాణికే మాగే హితెకు పాటకు డ్యాన్స్‌ చేసింది. అది కూడా యూనిఫామ్‌లో. ఇక అఫ్రీన్‌ డ్యాన్స్‌ చేస్తుండగా.. ఆమె సహచరులలో ఒకరు వీడియోని రికార్డ్ చేశారు. అనంతరం దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ పాటకు అఫ్రీన్‌ వేసిన స్టెప్పులు ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండి నెటిజనులను ఫిదా చేస్తున్నాయి. (చదవండి: హుషారుగా డ్యాన్స్‌.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్‌ వీడియో)

ఈ వీడియో చూసిన వారంతా.. ఆ పాటకు మీ ఎక్స్‌ప్రెషన్స్‌ సరిగా సెట్‌ అయ్యాయి.. ఆ పాట.. మీ ఆట బాగా సింక్‌ అయ్యాయి.. చాలా క్యూట్‌గా డ్యాన్స్‌ చేశారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఈ పాటకు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఫిదా అయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

పాట చరిత్ర ఏంటంటే.. 
‘మాణికే మాగే హితే’ పాటను అలపించింది శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని డిసెల్వా. ఆమె కేవలం పాప్‌ సింగర్‌ మాత్రమే కాదు.. పాటల రచయిత, నిర్మాత, బిజినెస్‌ వుమెన్‌ కూడా. యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి. తల్లి ఎయిర్‌హోస్టస్‌. దీంతో యొహాని చిన్నతనంలోనే మలేసియా, బంగ్లాదేశ్‌ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి వాళ్లమ్మ.. ఎంతో ప్రోత్సాహం అందించారు. యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె.. ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌ వేదికగా ఇలా ఎన్నో పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే ‘రాప్‌ ప్రిన్సెస్‌’ అనే బిరుదు ఆమెను వరించింది. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న యొహాని 2021 మే నెలలో ‘మాణికే మాగే హితే’ పాట పాడి సోషల్‌మీడియాను షేక్‌ చేశారు. ఇప్పటివరకూ ఈ పాటను 9 కోట్ల మందికి పైగా వీక్షించారు.
చదవండి: బుల్లెటు బండి ! ఆ డుగ్‌ డుగ్‌ వెనుక కథ ఇదేనండి !!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement