destroy
-
ఎస్సీ, ఎస్టీల ఇళ్ల పునాదులు ధ్వంసం
పుంగనూరు: అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై టీడీపీ నేతల అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు వేసుకున్న పునాదులను టీడీపీ నాయకులు జేసీబీలతో పెకిలించారు. దీంతో బాధితులు మల్లీశ్వరి, ఈశ్వరమ్మ, లలిత తదితరులు మంగళవారం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 2010లో అప్పటి ప్రభుత్వం పేదలకు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కానీ సదరు స్థలం తమదంటూ భాస్కర్ అనే వ్యక్తి గొడవలు చేయడం మొదలుపెట్టాడు. భాస్కర్, ఇస్మాయిల్, సర్దార్ అనే ముగ్గురు కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. దీనిపై పట్టాదారులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఇదిలా కొనసాగుతుండగా.. టీడీపీ నాయకులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి పోలీసుల సాయంతో సోమవారం జేసీబీలను ఉపయోగించి ఆ పునాదులను పూర్తిగా పెకిలించేశారు. బాధిత కుటుంబాలు అడ్డుకునేందుకు ప్రయత్ని0చగా.. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై బాధితులు కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని.. తమ స్థలాలు తమకు ఇప్పించాలని కోరారు. లేకపోతే ఆత్మహత్య తప్ప తమకు మరో దిక్కు లేదంటూ విలపించారు. -
సౌండ్ వస్తే నుజ్జు నుజ్జే..
-
కోల్‌కతా ఉదంతం: క్రైమ్ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ ఘటనను విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని కోల్‌కతా పోలీసులు అంటున్నారు.ఆర్జీ కర్ హాస్పిటల్ ముందు నిన్న (బుధవారం) ‘స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్రం కోసం’ పేరుతో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపుగా కొంతమంది ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే తాజాగా.. ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యాచార జరిగిన స్థలం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదని వెల్లడించారు."Crime Scene not disturbed," says Kolkata Police after vandalism at RG Kar Medical CollegeRead @ANI Story | https://t.co/EiRtFIht5H #RGKarMedicalcollege #doctor #murder #rape #KolkataPolice pic.twitter.com/cYUsPKJrcq— ANI Digital (@ani_digital) August 15, 2024 ‘‘నిరసనల ముసుగులో దాదాపు 40-50 మంది గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.#WATCH | Aftermath of vandalism by mob in Emergency Department of RG Kar Medical College and Hospital in Kolkata last night pic.twitter.com/d7HI8crQ4l— ANI (@ANI) August 15, 2024 ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ అధికారం ఘటనను, దాడిచేసిన మరికొందరి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో చొరబడి ఇటువంటి దారుణమైన ధ్వంసానికి పాల్పడటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఈ) అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడింది. డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగుల గుంపు దాడి చేసిందని ఐఎంఈ పేర్కొంది.జూనియర్ డాక్టర్ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం గురువారం బాధితురాలి నివాసానికి చేరుకుంది. ఆస్పత్రిలో సీజ్ చేసిన ఘటనాస్థలం విధ్వంసంపై తనిఖీ చేయడానికి దర్యాప్తు సంస్థ అర్జీ కర్ ఆసుపత్రిని కూడా సందర్శించనుంది. మరోవైపు.. ఆస్పత్రిలో దుండగుల గుంపు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా నర్సులు గురువారం ఉదయం నిరసన తెలిపారు. నేరం జరిగిన సెమినార్ గదిలోకి దుండగులు చొరబడాలని ప్రయత్నించారని నర్సుల్లో ఒకరు తెలిపారు.#WATCH | West Bengal | Visuals of the aftermath from RG Kar Medical College and Hospital campus in Kolkata. A scuffle broke out when a mob entered the campus last night and damaged the property. pic.twitter.com/qf0rO5eVm2— ANI (@ANI) August 15, 2024ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ సీఎం మమత ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం టీఎంసీ గూండాలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణుల చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ప్రచారం: బాధితురాలి ఒంట్లో ముగ్గురి వీర్యం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతుండడం.. దాని ఆధారంగా మీడియా, సోషల్ మీడియా కథనాలుశవపరీక్షలో అలాంటి విషయం తేలేది లేదని కోల్‌కతా పోలీసుల స్పష్టీకరణప్రచారం: కాలర్(మెడ) బోన్, పొత్తి కడుపు కింది భాగంలో ఎముక విరిగిపోయిందన్న ప్రచారంఅలాంటిదేం జరగలేదన్న పోలీసులుప్రచారం: బాధితురాలి తండ్రికి ఓ పోలీస్ అధికారి డబ్బును ఆశ చూపించి.. కేసును చల్లబర్చే ప్రయత్నం చేశారనే ప్రచారంఅంతా ఉత్తదేనన్న కోల్‌కతా పోలీసులుప్రచారం: బాధిత కుటుంబానికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కోల్‌కతా పోలీసులు చెప్పారనే ప్రచారం.. అలాంటిదేం జరగలేదని, అసలు కోల్‌కతా పోలీసుల నుంచి అలాంటి కాల్ రాలేని స్వయంగా బాధిత కుటుంబం ద్వారా వివరణ ఇప్పించిన కోల్‌కతా పోలీసులు -
టీడీపీ మద్యం ధ్వంసం
-
కన్నా!.. యుద్ధమేనా నీకు జోలపాట?
కన్నా! యుద్ధమేనా నీకు జోలపాట? అమ్మ లేదు, నాన్న కనపడడు. ఆకాశంలో వెలుతురు కక్కుతూ కనిపించేది నక్షత్రం కాదు. చెవులు చిల్లులు పడే మోత బడిగంట కాదు.గాలిలో గంధకం వాసన...శిథిలాలలో చిక్కుకున్నఇష్టమైన ఆటబొమ్మ. ఏడుపు ఊరికూరికే వస్తుంది. ఎవరూ నవ్వరు, ముద్దు చేయరు. శోకం పాటలానే ఉంటుంది కానీ అది అమ్మ జోలపాటలా ఉండదు. ఏం జరుగుతోంది? ఈ పెద్దవాళ్లు ఆడుకోవడానికి ఆటబొమ్మలే లేవా? మాతోనే ఆడుకోవాలా? 'ప్రతి యుద్ధం పిల్లలకు వ్యతిరేకమైనదే'. కులం తెలియదు. మతం తెలియదు. జాతి తెలియదు. దేశం తెలియదు. సరిహద్దు తెలియదు. ఆయుధాలూ తెలియవు. మబ్బును చూస్తే నవ్వుతారు. పిట్టను చూస్తే గెంతుతారు. తూనీగతో కబుర్లు చెబుతారు. అఆలు రాయడానికి ఆపసోపాలు పడతారు. పాలబువ్వ తింటూ తింటూండగానే కునుకు తీస్తారు. మట్టితో జత కడతారు. బుజ్జి ఆశలకు మారాము చేస్తారు. బెదిరితే అమ్మ వెనుక దాక్కుంటారు. తమను చూసే ప్రకృతి ఈ పెద్దవాళ్ల ముఖాన నాలుగు చినుకులను చిలకరించి, నాలుగు గింజలు పండించి, నాలుగు నదులను పారిస్తుందని తెలియకనే బుల్లి బుల్లి నడకలతో చిన్నారి దేవతలై తిరుగాడుతారు. ఇటువంటి దేవదూతల కళ్లల్లో రక్తం చిమ్మించే, వీరి ఊపిరి తీయాలని చూసే, యుద్ధం చేసే నేతలను ఏం చేయాలి? శత్రువును ద్వేషించే దాని కన్నా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే యుద్ధాలే ఉండవు కొట్టుకోవడం మనుషుల స్వభావంలో ఉన్న అల్ప లక్షణం. మానవచరిత్ర పొడవునా గుంపులుగా కొట్టుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా కూడి కొట్టుకున్నారు. దేశాలుగా ఎదిగి కొట్టుకున్నారు. ఇంత నాగరికులం అయ్యామని విర్రవీగుతూ కూడా కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సుశిక్షితమైన సైన్యాలు లేవు. అశ్వికదళం అంటూ ఒకటి అడుగుపెట్టింది కూడా మూడువేల సంవత్సరాల క్రితం ఇనపయుగంలోనే. యుద్ధాల చరిత్రతోపాటు ఆయుధాల పరిణామక్రమం చూస్తే.. రాతి గదల నుంచి విల్లమ్ములు, తుపాకులు, శతఘ్నులు, యుద్ధశకటాలు, నిప్పులు కురిపించే విమానాలు, చివరికి అణ్వస్త్రాల వరకు ఆయుధపాటవం అంచెలంచెలుగా పెరిగి.. యుద్ధాన్ని విద్యగానూ, కళగానూ, వ్యూహనైపుణ్యానికి గీటురాయిగానూ మార్చివేయడం కనిపిస్తుంది. దేశం ఎదగడం అంటే గొప్ప సైనిక శక్తిగా ఎదగడమే. అందుకే ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక మూలన యుద్ధ సైరన్‌ను మోగిస్తూనే ఉంటోంది. "పిల్లలు యుద్ధాన్ని మొదలెట్టరు. కాని ఏ యుద్ధంలో అయినా వారే ఎక్కువగా నష్టపోతారు" యుద్ధం రెండు దేశాల మధ్య, ఆ దేశాలకు చెందిన సైన్యాల మధ్య.. సాధారణ జనానికి సుదూరంగా ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని అనుకుంటాం కానీ యుద్ధమనేది యుద్ధక్షేత్రాన్ని దాటి ఎప్పుడో జనజీవనక్షేత్రంలోకి వచ్చేసింది. ఏ క్షణంలోనైనా శత్రు విమానాలు నేరుగా పౌరుల నెత్తి మీదే బాంబులు కురిపించవచ్చు. బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా ఎవరైనా యుద్ధాగ్నిలో సమిధలు కావచ్చు. ఆసుపత్రులు, స్కూళ్లు వేటినీ వదలరు. ఆధునిక కాలానికి వస్తున్నకొద్దీ పౌర మరణాల దామాషాలో బాలలు కడతేరడమూ పెరిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 20 శతాబ్దపు తొలినాటికి యుద్ధ మృతులలో సగం మంది పౌరులైతే, 1980నాటికి అది 90 శాతానికి పెరిగింది. వీరిలో బాలలది ప్రధాన భాగం. గత రెండు దశాబ్దాల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో ఇరవై లక్షలమంది బాలలు చనిపోయారనీ, నలభై నుంచి యాభై లక్షలమంది క్షతగాత్రులయ్యారనీ, కోటీ ఇరవై లక్షలమంది నిరాశ్రయులయ్యారనీ, పది లక్షల మంది అనాథలయ్యారనీ ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ చెబుతోంది. యుద్ధమనేది ఒక్కసారిగా అలా భగ్గుమని, కొన్ని రోజులపాటు కొనసాగి ఆ తర్వాత చల్లారే ఒక విడి ఘటనగా భావిస్తాం. కానీ దాని ప్రభావం బాలలు, స్త్రీలు, క్షతగాత్రులు సహా ఆ తర్వాత అనేకమందికి జీవితకాలమంతటికీ వ్యాపించి సంపూర్ణ జీవనవిధ్వంసంగా మారుతుంది. ఆ విధంగా ఒకే ఘటన అనేక గొలుసుకట్టు ఘటనల కూర్పుగా పరిణమిస్తుంది. యుద్ధం ఒక తాత్కాలిక అవాంతరమనీ, అది తొలగిపోగానే యథాప్రకారం శాంతి నెలకొని స్థిరంగా కొనసాగుతుందనే భ్రమలో కూడా మనం ఉంటాం. కానీ యుద్ధాల చరిత్రను తిరగేస్తే, యుద్ధపరిస్థితే స్థిరంగా ఉంటుందనీ.. శాంతి మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అతిథి మాత్రమేననే చేదునిజం మన ఊహల్ని చరచి చెబుతుంది. "యుద్ధాలు జరుగుతున్నంత సేపు పిల్లలను ఆకాశంలో దాచి పెట్టేయాలి " – ఒక కవి మనం శాంతికాముకులమా? నిజమేనా? మనం ఇప్పటికీ యుద్ధాన్ని ప్రేమిస్తూ వీరత్వాన్ని ఆరాధిస్తాం. మతాల గాథలలో శౌర్యాన్ని దండిగా నింపుకుంటాం. ప్రతి వాఙ్మయంలోనూ వీరుల చుట్టూ స్తుతిగేయాలే! వీరుడంటే? యుద్ధం చేసేవాడు. శత్రువును చంపడం, వీర మరణాన్ని పొందడం దేశభక్తి. యుద్ధం పవిత్రమైన యజ్ఞంగా రూపుకట్టింది. రోగమొచ్చి చావడం కన్నా, యుద్ధంలో చావడం కీర్తికీ, జీవనసార్థక్యానికీ సంకేతమైంది. బాల్యం నుంచి వీరరసాన్ని ఉగ్గుపాలలో రంగరించి పోయడం పరిపాటి అయింది. యుద్ధంలో నీతి, అవినీతులు.. ధర్మాధర్మాలు.. అన్నీ తలకిందులవుతాయి. నిరాయుధులు, యుద్ధరంగంలో లేనివారు అయిన బాలలను, స్త్రీలను, వృద్ధులను వధించరాదన్న నీతికి పౌరాణిక, చారిత్రకకాలంలోనే కాలదోషం పట్టింది. శత్రురాజ్యాన్ని జయించడంతో ఊరుకోకుండా, శత్రునగరాన్ని దగ్ధంచేసి బూడిద కుప్పగా మార్చడం ఇప్పుడు యుద్ధనీతి. రెండువైపులా జరిగిన సైనికనష్టం, ధననష్టం గురించిన ఆరా తప్ప ఆ మంటల్లో పడి మాడి మసైన బాల్యాల లెక్కలూ, తల్లుల కడుపుకోతల కటికశోకాల సమాచారమూ చిట్టాలకెక్కవు. బతికి బయటపడినా బతుకు అస్తవ్యస్తమై జీవితాంతమూ పెనుభారమైన విషాదకథనాలు వెలుగులోకి రావు. యుద్ధం బాల్యాన్ని చిదిమేసి శేషజీవితాన్ని శవప్రాయంగా మార్చుతుంది. యుద్ధాలలో జీవన్మృతుల సంఖ్యే మృతుల సంఖ్యను ఎన్నో రెట్లు మించి ఉంటుంది. 'యుద్ధంలో గెలిచిన సంపద మొత్తం పసిపిల్లల బోసినవ్వుకు సరిసాటి కాదు' కురుక్షేత్రంలో ఎంత ప్రాణనష్టం జరిగినా అభిమన్యుడు మరణించినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే అభిమన్యుడు ఇంకా పసివాడు. ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వాడు. కురుక్షేత్ర యుద్ధం పెట్టిన కడుపుచిచ్చు కన్నతల్లుల వేడికన్నీరుగా ఉబికి ధారకట్టిన వైనాన్ని మహాభారతంలోని స్త్రీపర్వం కడు దయనీయంగా చిత్రించింది. యుద్ధకారకులు ఎవరూ తల్లుల శాపం నుంచి తప్పించుకోలేకపోయారు. అయినా మనిషి గుణపాఠం నేర్చుకోలేదు. రాజ్యాల మధ్య, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే, విజేతలను ఆకాశానికెత్తి, విజితుల భంగపాటును ఎత్తిచూపడమే తప్ప యుద్ధాలు చిదిమేసిన పసిమొగ్గల గురించి, మృతుల కుటుంబాలు ఎదుర్కొన్న కల్లోలం గురించి, విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం సహా సమస్తరంగాలనూ.. అంగాలనూ యుద్ధం ఛిద్రం చేసి సమాజాన్ని వెనుకదారి పట్టించడం గురించి చెప్పిన వాఙ్మయాలు అంతగా కనిపించవు. రెండో ప్రపంచయుద్ధాన్నే తీసుకుంటే మృత్యువు తన కర్కశరూపాన్ని ప్రదర్శించిన ఇలాంటి యుద్ధసందర్భం అంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదంటారు. 1940నాటి ప్రపంచ జనాభా 230 కోట్లు అయితే, రెండో ప్రపంచయుద్ధంలో ఏడుకోట్ల నుంచి ఎనిమిదిన్నర కోట్లమంది నాశనమయ్యారు. సైనికులు, పౌరులు సహా నేరుగా యుద్ధంలో అయిదు నుంచి అయిదున్నర కోట్లమంది మరణించారు. యుద్ధకారణంగా వ్యాపించిన రోగాలవల్ల, కరవుకాటకాల వల్ల మరణించిన పౌరుల సంఖ్య అయిదు నుంచి అయిదున్నర కోట్లకు పెరిగి మరణించిన సైనికుల సంఖ్యతో సమానమైంది. బాలల విషయానికే వస్తే, ఈ యుద్ధంలో అంతకుముందు మరే యుద్ధంలోనూ లేనంత పెద్దసంఖ్యలో మృతులవడమో, అనాథలుగా మిగలడమో జరిగింది. నాజీ జర్మన్ నరహంతకులు కోటీ యాభై లక్షలమంది యూదు బాలల ఉసురు తీశారు. వేల సంఖ్యలో రొమానీ (జీప్సీ) బాలలను అంతమొందించారు. అయిదువేల నుంచి ఏడువేల మంది జర్మన్ బాలలు శారీరక, మానసిక వైకల్యాలతో ఆవాసకేంద్రాలకు చేరి ఆహ్లాదకర, ఆశావహ బాల్యాన్ని కోల్పోయి అకాల వృద్ధులుగా గడిపారు. ఏన్ మేరీ ఫ్రాంక్ అనే యూదు బాలిక రాసిన డైరీ బాలల జీవితంలో యుద్ధం కలిగించే కల్లోలానికి అక్షరరూపమిచ్చి చిరస్థాయిగా మిగిలింది. అయినా కనువిప్పు కలగలేదు. యుద్ధాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. బాల్యాలు బేలవై బిక్కచూపులు చూస్తూనే ఉన్నాయి. 'రష్యా పిల్లలైనా, ఉక్రెయిన్ పసికందులైనా, ఇజ్రాయిల్ శిశువులైనా, గాజా చిన్నారులైనా అమ్మ పాలే తాగుతారు' వర్తమానానికి వస్తే.. అటు రష్యా– ఉక్రెయిన్ల నుంచి ఇటు ఇజ్రాయిల్–పాలస్తీనాల వరకు యుద్ధక్షేత్రాలు వ్యాపించి కన్నీటితో చావుపంటలు నిరవధికంగా పండిస్తూనే ఉన్నాయి. శాంతి, సామరస్యాల స్థాపనకు నెలకొల్పిన అంతర్జాతీయ సంస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఉక్రెయిన్ పట్ల రష్యా సాగిస్తున్న మారణకాండ దరిమిలా, గత ఏడాది కాలంగా బాలలు హింసావిలయంలో, భయబీభత్సాల వలయంలో జీవిస్తున్నారు. యుద్ధం ప్రభావితం చేయని వారి జీవనపార్శ్వం ఒక్కటీ లేదు. ఈ యుద్ధం ఇంతవరకు పొట్టన పెట్టుకున్న వెయ్యి మంది పౌరులలో మరణించిన, గాయపడిన బాలలూ అధికసంఖ్యలో ఉన్నారు. మరోవైపు పదిహేను లక్షలమంది బాలలు ఇంటికి, భద్రతకు, చదువుకు, ఆటపాటలకు దూరమై మానసిక, శారీరక అనారోగ్యాలతో ఆందోళనతో నిరాశానిస్పృహల మధ్య గడుపుతున్నారు. తల్లిదండ్రుల వెచ్చని ప్రేమాదరాల కింద గడపాల్సిన పచ్చని బాల్యాన్ని, బంగారుభవితను యుద్ధరాకాసి గుటుక్కున మింగి తేన్చింది. రష్యా–ఉక్రెయిన్ల మధ్య చూస్తున్నది, రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోనే అతిపెద్ద మారణహోమంగా చెబుతున్నారు. అయితే, నేడు ఇజ్రాయిల్ –పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం దానిని మించిపోయి వర్తమాన యుద్ధచరిత్రను తిరగరాస్తున్నట్టు కనిపిస్తోంది. 2017 నుంచి జరిగిన ఏ ఘర్షణలతో పోల్చి చూసినా గాజా భూఖండంలో జరిగిన పౌరమరణాలు అసాధారణాలూ, కనీవినీ ఎరుగనివీ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరోస్ అంటున్నారు. తాజా ఘర్షణల్లో అటూ ఇటూ కూడా వేలాదిమంది అసువులు వీడారు. వీరిలో బాలలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయిల్ వైపు పౌరులతో సహా 1300 మంది బాలలు హతమారితే.. పాలస్తీనావైపు 6వేల మంది బాలలుచ 4 వేల మంది మహిళలతో సహా 15వేల మంది నిహతులయ్యారు. నాజీ జర్మనీ రూపంలోని జాతి ఉన్మాదపు కాలసర్పం కాటు తిని, చిత్రహింసా శిబిరాలలో నలిగి నుజ్జయి ప్రపంచం సానుభూతిని చూరగొన్నవారే పాలస్తీనావారిపై అంతకుమించిన హింసకు, ప్రతిహింసకు పాల్పడుతున్నారు. ఆసుపత్రులను సైతం దాడులకు లక్ష్యం చేసుకుని పసిపిల్లలను, రోగులను హతమార్చడం నాజీ అమానుషాలను తలదన్నేదే కానీ తీసిపోయేది కాదు. అప్పుడే పుట్టిన శిశువులను కూడా బాలింతలు అరచేతుల్లో ఉంచుకుని సురక్షితప్రాంతాలకు పరుగుదీయాల్సిన పరిస్థితిని కల్పించడం వెనుక యుగయుగాలుగా ప్రోది చేసుకుంటూ వచ్చిన మంచినీ, మానవత్వాన్నీ కాలరాసే క్రౌర్యమూ కుత్సితమూ ఉన్నాయి. ఆహారంతో సహా అన్ని రకాల నిత్యావసరాల సరఫరానూ అటకాయించే దిగ్బంధమే పది యుద్ధాల పెట్టు. ఒక్కసారిగా కాకుండా అనునిత్యం ఎదుర్కొనే అనేకానేక చావులకు సమానం. 2006 నుంచీ గాజాపౌరులపైన ఇజ్రాయిల్ అలాంటి దిగ్బంధాన్ని అమలు చేస్తోంది. దాంతో గాజా ఆర్థికత దారుణంగా అడుగంటిపోయింది. స్థూలజాతీయోత్పత్తి 30 శాతం పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 81శాతం జనం దారిద్య్రరేఖకు దిగువున జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. వైద్యం కోసం కూడా రోగుల్ని బయటకు వెళ్లనివ్వకుండా దిగ్బంధాన్ని అమలు చేయడం జరుగుతోంది. దిగ్బంధమంటే ఒక ప్రాంతాన్నే విశాలమైన చెరసాలగా మార్చి అసంఖ్యాక జనాన్ని బందీలుగా ఉంచడమే! ఆ చెరలో బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా అందరూ బందీలవుతారు. అది బాల్యానికి చెర. వారి చదువుసంధ్యలకు, వారి భవిష్యత్తుకు, వారి శారీరక, మానసిక వికాసానికి ఉరి. ఎదిగే లేతమొక్క లాంటి వారి జీవితాలపై బండ. యుద్ధోన్మాదులందరూ ఒకే జాతి, ఒకే మతం. అందులో జయాపజయాలు, బలాబలాల తేడాలు తప్ప ఇతరేతర భేదాలు ఉండవు. దాని ఫలితమే రెండువైపులా దాడులు, విచక్షణారహితమైన ఊచకోతలు, బాలల బతుకుల్ని బుగ్గి చేసే నొసటి రాతలు. 'ఈ భూమి మోసే అన్ని భారాల్లోకెల్లా అత్యధిక భారం ఏమిటో తెలుసా? పసిపిల్లల శవపేటిక' విజ్ఞత, వివేకం, విచక్షణ సహా అన్నింటినీ మింగేసే అనకొండ యుద్ధం. మనిషి నడవడికి దిక్సూచులుగా నిఘంటువులకెక్కిన ప్రతి ఒక్క మంచిమాటనూ తన రక్తపు వేళ్ళతో చెరిపేసి తన పేరు రాసుకునే మాటే యుద్ధం. పసి చేతులకు ఆయుధాలు అందించి మసి చేయడానికి అది వెనుకాడే ప్రశ్న లేదు. పద్దెనిమిదేళ్ళ లోపు బాలలను యుద్ధాల బరిలోకి లాగడం మధ్యయుగాల నుంచీ, అలనాటి ఫ్రెంచి సైనికశాసకుడు నెపోలియన్ కాలం నుంచీ ఉందని చరిత్రకారులు అంటారు. అమెరికా అంతర్యుద్ధంలో కూడా బాలలు పాల్గొనడం కనిపిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో బాలలు పాల్గొనడమే కాదు.. నాజీ జర్మనీలో ‘హిట్లర్ యువత’ పేరుతో ‘యుద్ధసేవలు’ అందించారు. నేటి కాలానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలోని యుద్ధక్షేత్రాలలో దాదాపు పాతిక కోట్లమంది బాలలు ఉండగా, వారిలో మూడులక్షలమంది సైనికవిధులు నిర్వహిస్తున్నట్టు, వారిలో నలభైశాతం మంది బాలికలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మంట మిడతలదండును ఆకర్షించినట్టుగా యుద్ధం వయోభేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. యుద్ధవాదులు దానిని అలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. యుద్ధానికీ, శాంతికీ మధ్య విభజనరేఖ చెరిగిపోయి.. అటు నుంచి ఇటూ.. ఇటు నుంచి అటూ నిరంతర చంక్రమణం చేసే పరిస్థితిని లియో తొల్స్తాయ్ ‘యుద్ధం – శాంతి’ నవలలో అనితరసాధ్యంగా చిత్రిస్తాడు. జీవించడమూ, సంపూర్ణంగా జీవితాన్ని ఆనందించి ఆస్వాదించడమే ప్రతి ప్రాణికి ప్రకృతి కల్పించిన సహజాతం. అలాంటిది, యుద్ధపరిస్థితిలో చావే జీవితంగా ఎలా మారిపోతుందో తొల్స్తోయ్ కళ్ళకు కట్టిస్తాడు. రేపటి జీవితం గురించి కమ్మని కలలు కంటూ కంటూనే యువకులు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టి చావుతోనూ, చావు పరిస్థితులతోనూ ఎలా సహజీవనం చేస్తారో రూపు కడతాడు. ఫ్రెంచి సేనల ముట్టడిలో మాస్కో నగరం దగ్ధమవుతున్నప్పుడు మంటలను తప్పించుకుని ప్రాణాలు దక్కించుకోడానికి తట్టాబుట్టతో వీథిన పడ్డ కుటుంబాల గురించి, సైనికులు చేసిన నిలువుదోపిడీల గురించి, మంటల్లో చిక్కుకున్న తన పసిబిడ్డ కోసం తల్లి పెడుతున్న శోకాలకు కరిగి పియర్ అనే యువకుడు మంటల్లోకి దూకి ఆ పసిపాపను రక్షించడం గురించి రాస్తాడు. పేత్యా అనే పదిహేడేళ్ళ యువకుడు ఉరకలేసే ఉత్సాహంతో యుద్ధంలోకి దూకి కోరి కోరి మృత్యువును కావిలించుకున్నప్పుడు తల్లి కంట వరద కట్టిన దుఃఖాన్ని అక్షరాలకెత్తుతాడు. 'మంచి యూనిఫామ్, తినదగ్గ చాక్లెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు.. పిల్లలకు యుద్ధం లేని నేలను ఇవ్వండి' యుద్ధం బాలల బతుకుపై కలిగించే దుష్ప్రభావాల గురించి అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. యుద్ధప్రభావం పెద్దలపై కన్నా బాలలపై అనేక రెట్లు ఉంటుందన్న సంగతి సాధారణంగా మన ఊహకెక్కదు. యుద్ధ దుష్పరిణామాలతో పెద్దలకన్నా బాలలు ఎక్కువ కాలం జీవించవలసివస్తుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలవుతారు, ప్రేమాదరాల చలవపందిరి కింద గడపవలసిన వయసులో అనా«థాశ్రమాలకు చేరి లేత వయసులోనే పది జీవితాల పెనుభారం కింద అణగిపోతారు. శేషజీవితం వారి ముందు కత్తులబాటలా మారి సుదీర్ఘంగా పరచుకుంటూనే ఉంటుంది. యుద్ధగాయాలు, రోగాలు, మానసిక వైకల్యాలు జీవితాంతమూ వారిని వెంటాడుతూనే ఉంటాయి. జీవితం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వయసులో ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడులను, ఆందోళనలను, భయబీభత్సాలను ఇంకొకరితో పంచుకోలేని మూగలవుతారు. నిర్బంధశ్రమకు గురవడమే కాదు.. బాలికలు మానభంగాలకు ఎరవుతారు. ఒక తరం మొత్తం విద్యా, విజ్ఞానాలకు, గౌరవప్రదమైన జీవితానికి దూరమైనప్పుడు దాని ప్రభావం ఎన్ని తరాలపై పడుతుందో ఊహించుకోగలం. అయినా మనలో వివేకం మేలుకోవడం లేదు. యుద్ధదేవతకు ఎంత విధ్వంసాన్ని, ఎన్ని ప్రాణాలను, భావిజీవితం చుట్టూ పేర్చుకునే ఎన్నెన్ని అందమైన కలల ఛిద్రాలను నైవేద్యం చేస్తున్నామన్న ఎరుక లేదు. ఎన్ని పసిదనాలు వసివాడిపోయి రేపటి ప్రపంచమనే పూదోట మన కళ్ళముందే ఎలా వల్లకాడుగా మారిపోతోందోనన్న విజ్ఞత లేదు. సకల రకాల యుద్ధాలకూ వ్యతిరేకంగా మానవాళి ఇప్పటికీ ఒక్కపెట్టున గళం ఎత్తడంలేదు. యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఈ నిర్విరామ యుద్ధంలో శాంతి గెలిచేదెప్పుడు? బాలల జీవితాలు వేయి రేకుల కలువల్లా విప్పారి కాంతులను నింపేదెప్పుడు? కె.భాస్కరం (చదవండి: ఎన్నికల సీన్ ఎక్కడైనా సేమ్ టు సేమ్! ఆకాశాన్ని తాకే వాగ్దానాలు.. తారలతో తోరణాలు..) -
RIPTwitter: సర్వనాశనం చేస్తున్నాడే!
ఈ భూమ్మీ ఏం జరిగినా.. పరిణామం ఎలాంటిదైనా సరే జెట్ స్పీడ్‌తో వైరల్ అయ్యే ప్లాట్‌ఫారమ్ అది. అంతేకాదు.. ట్రెండింగ్ పేరిట విషయాలన్నింటిని మామూలు యూజర్లకు కూడా అర్థం అయ్యే రీతిలో చెప్పే మాధ్యమం. అలాంటి వేదిక ఇప్పుడు సర్వనాశనం అవుతోందని.. అందుకు ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ కారణం అయ్యాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రిప్ ట్విటర్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. #RIPTwitter.. అదే ట్విటర్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. అదీ అలా ఇలా కాదు.. వెల్లువలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. సంస్థను వీడుతున్న ట్విటర్ ఉద్యోగులే ఈ ట్రెండ్‌ను తీసుకొచ్చారు. ట్విటర్ కొత్త బాస్ తీరు.. పని షరతులు, కొత్త పరిస్థితులను భరించలేక ఉద్యోగులు సంస్థకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రెండ్ తెరపైకి వచ్చింది. Twitter 2.0కు సంసిద్ధం కావాలని మస్క్ ఇచ్చిన పిలుపునకు స్పందన.. రాజీనామాల రూపంలో వస్తోంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. #LoveWhereYouWorked, #ElonIsDestroyingTwitter అంటూ ట్యాగ్‌తో తమ నిరసన తెలియజేస్తున్నారు ఉద్యోగులు(మాజీలు). Ex-Twitter employees pitching investors next week. #RIPTwitter pic.twitter.com/aQe1Zpl2GT — Pete Haas (@dimeford) November 18, 2022 It’s been a pleasure tweeting with y’all for the past 13 years. #RIPTwitter pic.twitter.com/XsLuMNi59A — toby is the scranton strangler (@OhHELLNawl) November 18, 2022 ప్రముఖుల దగ్గరి నుంచి సామాన్య యూజర్ల దాకా డిగ్నిటీ ప్లాట్‌ఫామ్‌గా ట్విటర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. ఎప్పుడైతే ట్విటర్పిట్ట ఎలన్ మస్క్ చేత చిక్కిందో.. అప్పటి నుంచి దాని అంతం మొదలయ్యిందనే చర్చ జోరందుకుంది. ఆర్థిక నష్టం తప్పించుకునేందుకు సంస్కరణల పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల కోత, అదనపు ఆదాయం పెంచుకునే కొన్ని నిర్ణయాలు.. ఇలా ప్రతీదానిపైనా చర్చ(ప్రతికూల) జోరందుకుంది. ఫేక్ అకౌంట్ల కట్టడి.. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడం కోసమే తాను కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని మస్క్ చేస్తున్న ప్రకటనలను.. యూజర్లు, ట్విటర్లో పని చేస్తున్న ఉద్యోగులు అంగీకరించని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో చాలామంది యూజర్లు ట్విటర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండడం కొసమెరుపు. మరోవైపు ఈపాటికే సగం మందిని తప్పించిన ఎలన్ మస్క్.. ఈ రాజీనామాలతో మరో పాతిక శాతం ఉద్యోగుల భారాన్ని వదిలించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్విటర్లో మిగిలిన 25 శాతం మంది ఉద్యోగ వీసాలపై ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త ఉపాధిని కనుగొనడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Ugh, end of an era. #RIPTwitter pic.twitter.com/aL3AQuoexO — Ju✨ (@_psiloveju) November 18, 2022 Every Twitter user right now after Elon Musk (predictively) ruined the site... Incase this is the end, goodbye Twitter... #RIPTwitter pic.twitter.com/HP1bxf68Ri — SpectreSaunders (@SpectreSaunders) November 18, 2022 Lets put this into perspective — at the beginning of this month, Twitter had 7,400 employees. Barely half way through the month, if 75% do actually stick to their decision today, the company will have shrunk by a whopping ~88%. — Kylie Robison (@kyliebytes) November 18, 2022 Twitter offices rn #RIPTwitter pic.twitter.com/ATEhUbPNmL — Alex (@alexculee) November 18, 2022 NGL I love twitter employees 😭😭😭 they roasting this fool #RIPTwitter pic.twitter.com/nOEuSxtHcv — 𝒮𝒸🅾☯️ter🐐 (@IanScottie4) November 18, 2022 #RIPTwitter, #GoodbyeTwitter ట్రెండింగ్‌లో భాగంగా.. కొందరి భయాందోళనలు, మరికొందరి గందరగోళం, ఇంకొందరి హాస్యం.. ఇలా రకరకాల భావాలు ట్విట్టర్‌ను తాకుతున్నాయి. ఈ ట్రెండ్‌కు ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సైతం స్పందించడం గమనార్హం. ‘అది మునిగిపోనివ్వండి…’ అంటూనే.. ట్విట్టర్ వినియోగంలో మరో ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించినట్లు ట్వీట్ చేశాడు. ఈ విషయంలో తాను మొండిగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. pic.twitter.com/rbwbsLA1ZG — Elon Musk (@elonmusk) November 18, 2022 -
రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్
రెస్టారెంట్లు, హోటళ్లలో కొంతమంది కస్టమర్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు అడిగింది లేదన్నా లేదా తిరస్కరించిన ఇక అంతే సంగతులు. రెస్లారెంట్లోని వస్తువులను నాశనం చేయడం లేదా సిబ్బంది పై దాడి చేయడం వంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ముగ్గుర మహిళలు చిన్న విషయానికి రెస్టారెంట్‌లోని వస్తువులను చిందరవందరగా పడేసి సిబ్బింది పై దాడి చేశారు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....న్యూయార్క్‌లోని ముగ్గురు మహిళలు ఒక రెస్టరెంట్‌ని దారుణంగా ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. ఐతే వాళ్లు ఆ రెస్టారెంట్లో కావల్సిన ఫుడ్‌ని ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఫ్రై తినడానికి మరికొంత సాస్ వడ్డించమని అడిగారు. సదరు రెస్టారెంట్ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు మహిళలు రెస్టారెంట్‌లోని వస్తువులను నాశనం చేసి...కౌంటర్లోకి దూసుకెళ్లి సిబ్బంది పై కూడా దాడి చేశారు. వాస్తవానికి వారు వడ్డించమన్న సాస్ సుమారు రూ. 10 వేలు ధర పలుకుతుందని సిబ్బంది చెబుతున్నారు. అందువల్ల అదనంగా వడ్డించడం కుదరదని చెబుతున్నాడు సదరు రెస్టారెంట్ ఉద్యోగి. ఆర్డర్ చేసిన ఫుడ్ మేరకే ఆ సాస్ వడ్డించడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఐతే ఆ మహిళలు సృష్టించిన వీరంగానికి సిబ్బంది తిరిగి విధుల్లోకి రావడానికి భయపడుతున్నారని రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు. ఐతే న్యూయార్క్ పోలీసులు ఆ ముగ్గుర మహిళలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగవైరల్ అవుతోంది. Just another typical day in NYC pic.twitter.com/vcnz2YQnp0 — Libs of TikTok (@libsoftiktok) July 6, 2022 (చదవండి: రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు
-
ఉక్రెయిన్ విధ్వంసం... ఆవిరైపోతున్న రష్యా ఆశ: వీడియో వైరల్
Wagner Group Involved In Assisting Russia's War: 2014 నుంచి రష్యా ఆక్రమిత లుహాన్స్క్ మాస్కోకి సహకరిస్తున్న వాగ్నర్ గ్రూప్ స్థావరాన్ని ఉక్రెయిన్ బలగాలు ధ్యంసం చేశాయి. ఈ దాడిలో సుమారు 22 మంది చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. తూర్పు ఉక్రెయిన్‌లో బీకరమైన దాడులు జరిగినట్లు లుహాన్స్క్ గవర్నర్ సెర్హే హేడే తెలిపారు. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ఉక్రేనియన్ నియంత్రణలో ఉన్న సెవెరోడోనెట్స్క్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందన్నారు. రష్యా డోనెట్స్ నదికి సమీపంలోని ఉన్న జంట పారిశ్రామిక నగరాలైన సెవెరోడోనెట్స్క్, లైసిచాన్స్క్లను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులను తెగబడింది. ఐతే ఉక్రెయిన్ మాస్కో సైనిక ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేట్ కంపెనీ వాగ్నర్ గ్రూప్ పై దృష్టిసారించి ధ్వసం చేయడమే కాకుండా రష్యా ఆశల పై నీళ్లు జల్లింది. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #Wagner base in occupied #Luhansk region was destroyed, only one racist survived. The enemy base is located at the local stadium in #Kadiivka, which the russians brazenly occupied in 2014 #UkraineRussiaWar pic.twitter.com/cWsIHIzXXd — Serhiy Hayday (@serhey_hayday) June 10, 2022 (చదవండి: రష్యా దాష్టీకం!... దాదాపు 287 మందికి పైగా ఉక్రెయిన్ చిన్నారులు..) -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా!
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చైనాతో ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌ను నాశనం చేసేందుకు ప్లాన్ గీసుకుంది. ఈ మేరకు చైనా నుంచే అధికారిక సంకేతాలు వెలువడడం గమనార్హం. ఇప్పటికే రష్యా స్పేస్ ఏజెన్సీ.. ఉక్రెయిన్ సాయం విషయంలో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే స్టార్‌లింక్ శాటిలైట్లను కూల్చేయాలని చైనా భావిస్తోంది. ప్రపంచంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో అత్యంత చౌకైన సర్వీస్‌లు అందిస్తోంది ఎలన్ మస్క్ స్టార్‌లింక్. ఒకవేళ తమ జాతీయ భద్రతకు గనుక హాని కలిగించేవిగా పరిణమిస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్లను ముందువెనకా ఆలోచించకుండా కూల్చేస్తామని చైనా మిలిటరీ ప్రకటించింది. ఈ మేరకు అధ్యయనంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్‌పై నిఘా ఉంచాలని, నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉందని చైనా సైంటిస్టుల అభిప్రాయాలను సైతం ప్రచురించింది. ఈ అధ్యయనానికి బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రీసెర్చర్ రెన్ యువాన్‌జెన్ నేతృత్వం వహించారు. స్టార్‌లింక్ సేవలు.. అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్ డేటా ట్రాన్స్‌మిషన్‌ను వేగాన్ని(దాదాపు వంద రెట్ల వేగం) పెంచుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నాడు. లో-ఎర్త్ ఆర్బిట్‌లో చిన్న చిన్న శాటిలైట్లను ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ భూమ్మీద బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది స్టార్‌లింక్. స్టార్‌లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలతో కూడి ఉంది. ఒకవేళ ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటన్నింటినీ నాశనం చేయాలనేది చైనా ప్రణాళిక. క్షిపణులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. కాబట్టి, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి లేజర్లు, మైక్రోవేవ్ టెక్నాలజీ లేదంటే చిన్న ఉపగ్రహాలను, స్టార్‌లింక్ శాటిలైట్ కట్టడికి కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనిపై మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!. చదవండి: మస్క్ నాతో నీచంగా ప్రవర్తించాడు! -
చైనా బొగ్గు గని ప్రమాదంలో 14 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో బొగ్గు గని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది మరణించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న పై కప్పు కూలిపోవడంతో అక్కడే పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సహాయ సిబ్బందిని రంగంలోకి దించారు. వారం రోజులు సహాయ కార్యక్రమాలు నిర్వహించాక 14 మంది మృతదేహాలు బయటపడ్డాయి. చైనాలో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో మరణాల సంఖ్య తగ్గాయి. (చదవండి: ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం) -
కొండ చరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయి 14 మంది మృతి
Mudslide In Western Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురదనీరు చేరడంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చరియాలు విరిగిపడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండచరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అయ్యో జగదీశ్ ! చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావే!!) -
పామును చూస్తే నోరూరుతుంది అతనికి!... పచ్చిగానే లాగించేస్తాడు!
పుట్లూరు: పామును చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఆ వృద్ధుడికి మాత్రం నోరూరుతుంది. కాకపోతే అతను పామును చంపడు. ఎవరైనా చంపి పడేస్తే దాన్ని ఇష్టంగా ఆరగిస్తాడు. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న అనే వృద్ధుడు ఆదివారం పామును ఆరగించాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్‌గా మారింది. ఇతనికి కొంత కాలంగా పాములను తినే అలవాటు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది..
వేప చెట్టులో వెయ్యి జబ్బులను నయం చేసే గుణాలున్నాయంటారు. ఆయుర్వేదంలో ఇది లేని మందు లేదు. ఇక వేప నూనె, వేప కషాయాలను చీడపీడల నివారణకూ ఉపయోగిస్తారు. నాలుగైదు లేత వేపాకులు తింటే రక్తం శుద్ధి అవుతుందంటారు. చిన్నారులకు చెంచాడు వేప కషాయం తాపితే దగ్గు తదితర సమస్యలు బలాదూర్ అనాల్సిందే. అపర సంజీవినిగా పరిగణించే ఈ వేప చెట్లకే ఇప్పుడు ఆపదొచ్చింది. ఉన్నట్టుండి ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే వేలకొలది చెట్లు మోడు బారుతుండటతంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్ అధికారులు కానీ ముందుకు రావడం లేదు. – కర్నూలు అగ్రికల్చర్/ఆత్మకూరు రూరల్ చిగురుటాకు వద్ద మొదలై.. వేప చెట్టు చిగురుటాకులు ఎండిపోతున్నాయి. క్రమంగా చెట్టుకు ఉన్న మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తోంది. చివరికి చెట్టు మొత్తానికి పాకి మోడుగా కళావిహీనంగా తయారవుతుంది. ఈ తెగులు కర్ణాటకలో మొదలై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకూ విస్తరించినట్లు సమాచారం. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా వేప చెట్టు ఎండిపోయి కనిపిస్తుండటంతో భవిష్యత్‌లో వేప ఉత్పత్తులు కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) తెగులుపై భిన్నాభిప్రాయం.. వేపచెట్లు ఎండిపోతుండటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డై బ్యాక్ డిసీజ్ వల్లే వేప చెట్ల చిగుర్లు ఎండిపోయి చనిపోతున్నాయని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాదుకాదు ఫోమోప్సిన్ అజాడిరిక్టేట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే చెట్లు ఎండిపోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ విజృంభిస్తుందంటున్నారు. గోరింటాకు రసాన్ని వేప చెట్లపై పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించ వచ్చని చెబుతున్నారు. ఈ ఫంగస్ వ్యాప్తి చెందిన చెట్లపై ఎండిపోయిన ఆకులు, కొమ్మల్లో టీ మస్కిటో బగ్ అనే క్రిమి స్థిర నివాసం ఏర్పరుచుకుని వేప చెట్టు నిర్జీవమయ్యేలా చేస్తోందని వృక్ష శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వయస్సు ఉన్న వేప చెట్లు ఈ తెగులు నుంచి త్వరగా కోలుకుంటుండగా కాస్త వయసైన చెట్లు ఎండిపోతున్నాయంటున్నారు. కానీ అధికారికంగా ఎవరూ ఫలానా తెగులు వల్లే చెట్లు ఎండిపోతున్నాయని కానీ, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కానీ ప్రకటించకపోతుండటంతో వేప చెట్టు మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. -
సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ మెషన్ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు -
విజయనగరం జిల్లాలో ఏనుగుల విధ్వంసం
-
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
గూగుల్‌లో వెతికి మరి చంపాడు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో పోలిసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శైలజ ద్వివేదిని హత్య చేసని నిఖిల్ హండా ప్రస్తుతం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే నేపంతో నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ముందు ఈ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్ హండా గూగుల్ సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి’ వంటి పలు అంశాల గురించి నిఖిల్ గూగుల్‌లో సర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిఖిల్ ఫోన్ కాల్ డేటాను, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ విషయం గురించి పోలీసులు ‘శైలజ, నిఖిల్ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేశి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పొనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హరిద్వార్ నుంచి మీరత్ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు. కానీ నిఖిల్ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్ ఆధారంగానే నిఖిల్‌ను అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ఫోరెన్సిక్ లాబ్‌కి పంపించారు. నివేదికల కోసం ఎదురు చూస్తున్నామ’ని తెలిపారు. -
శ్రీకాకుళం ఏజెన్సీలో ఏనుగుల బెడద
-
శిథిలమైన బడి భవనాన్ని కూల్చేయండి
వరంగల్ రూరల్: ఆత్మకూరు మండలం దామెరలో మంగళవారం ఉదయం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణంలో శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. కొత్త తరగతి గదుల నిర్మాణానికి నిధులిస్తామని కడియం హామీనిచ్చారు. దామెర ప్రభుత్వ స్కూల్‌కు ఆరు నెలల్లో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దేశంలోనే రికార్డు స్థాయిలో రెండేళ్లలోనే 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. శిక్షణ పొందిన అర్హులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని అన్నారు.. -
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం.
-
దసరా పందిరిలో యువకుల బీభత్సం
* పూజ సామాగ్రి ధ్వంసం * పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహంపై రాళ్లు రువ్విన వైనం * పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు నడికుడి (దాచేపల్లి): నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం పందిరిలో స్థానిక యువకులు కొందరు మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో బీభత్సం సృష్టించారు. విగ్రహ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని పొందుగల వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్లిన తర్వాత 25 మందికి పైగా స్థానిక యువకులు ఆటోలో డీజే సౌండ్ సిస్టం పెట్టుకుని డ్యాన్స్‌లు చేసుకుంటూ పందిరి వద్దకు వచ్చారు. డీజేలో వస్తున్న పాటలకు కేరింతలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న అమ్మవారి పందిరిలోకి వెళ్లారు. విగ్రహానికి పూజలు చేసేందుకు పందిరిలో ఉంచిన పూజ సామాగ్రిని చెల్లాచెదురుగా పడవేసి అమ్మవారి గాజులను పగులగొట్టారు. పందిరిలో ఉన్న పూలదండలను చింపి మురికికాలువలో పడవేశారు. అంతటితో ఆగకుండా పందిరి పైకి ఎక్కి ఈలలు వేసుకుంటూ గోల చేశారు. పక్కనే ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంపై యువకులు రాళ్లు రువ్వడంతో విగ్రహం పలు చోట్ల దెబ్బతింది. పందిరి పక్కనే ఉన్న కిరాణా దుకాణంపైకి కూడా ఎక్కి బీభత్సం సృష్టించారు. yీ జే సౌండ్ సిస్టం నిర్వాహకుడిపై కూడా యువకులు దాడి చేసి ఆటో అద్దాలను పగులగొట్టారు. ఇంతలో చుట్టుపక్కల వారు, కమిటీసభ్యులు అక్కడకు చేరుకోవడంతో వారిని చూసి యువకులు పరారయ్యారు. వారిలో ముగ్గురిని కమిటీ సభ్యులు పట్టుకున్నారు. జరిగిన సంఘటన గురించి సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్, కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కట్టా ఆనంద్ ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.. అమ్మవారి పందిరిలోని పూజ సామాగ్రిని ధ్వంసం చేసి వైఎస్సార్ విగ్రహంపై రాళ్లు రువ్విన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమిటీసభ్యులు పల్లె వెంకటేశ్వరరెడ్డి, మైలా ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆళహరి శ్రీనివాస్, ఎస్ఐ ఆనంద్‌లను బుధవారం కలిసి షేక్ హిదాయతుల్లా, షేక్ జానీ, షేక్ రఫీ, షేక్ గౌస్, షేక్ సుభానీలతో పాటుగా మరో 13 మందిపై ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. -
నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు. -
విగ్రహాల ధ్వంసం నీతిమాలినచర్య
* దుండగులను కఠినంగా శిక్షించాలి * మర్రి, బొల్లా డిమాండ్ వినుకొండ టౌన్: దివంగత ముఖ్యమంత్రి, పేదల సంక్షేమం కోసం పోరాడిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చెయ్యి విరగ్గొట్టడం దుర్మార్గపు చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని ఆశా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మహానేత రాజన్న విగ్రహ ఎడమ చెయ్యిని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు వెంట కదలిరాగా బొల్లా, మర్రి రాజశేఖర్‌లు రాజన్న విగ్రహం వద్దకు చేరుకుని ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డ దుండగులను శిక్షించాలంటూ కర్నూలు– గుంటూరు రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారం అండ చూసుకుని విద్రోహ చర్యలకు దిగటం, మహా నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటం నీతిమాలిన చర్యని విమర్శించారు. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అధికార పార్టీకి చెందినవారు.. ప్రతిపక్షానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం చెయ్యిని విరగ్గొట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తోందని చెప్పారు. పట్టణంలో మాఫియా గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోయాయన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటాం... వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆషా థియేటర్ సెంటర్లో రెండు గంటల పాటు కొనసాగిన ధర్నాతో రాష్ట్ర రహదారిపై వాహనాలు బారులుతీరాయి. రూరల్ సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎసై ్సలు నారాయణ, శివాంజనేయులు పార్టీ నాయకులకు నచ్చజెప్పి నిందితులను అరెస్ట్ చేస్తామని హామి ఇచ్చి ధర్నా విరమింపజేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడు రాజన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన సమాచారం తెలుసుకున్న డీసీసీ మక్కెన అక్కడికి చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. -
ఇళ్లు నిర్మించారో.. కూల్చివేతే!
* సీతానగరంలో ప్రత్యేక బృందం సిద్ధం * మునిసిపల్ సిబ్బంది నిరంతర నిఘా సీతానగరం (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మునిసిపాలిటిలో కొత్తగా ఎవరు ఇళ్లు నిర్మించినా దాన్ని కూల్చేందుకు మునిసిపల్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే మహానాడు, సుందరయ్య నగర్, సీతానగరం మీదుగా ప్రధాన రహదార్లు నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకోసమే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేసింది. అనుమతులు లేకుండా ఎవరైనా చిన్న గుడిసె వేసినా కూల్చేసేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. సెటిలర్స్‌కు కేటాయించి.. 1950 సంవత్సరానికి పూర్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడేవారి కోసం సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఓ జైలు ఏర్పాటు చేసి, సుమారు 200 ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి వారిని తీసుకువచ్చి ఇక్కడి జైలులో ఉంచేవారు. అప్పట్లో వారందరినీ పోషించడం ప్రభుత్వానికి కష్టంగా మారడంతో దాదాపుగా 100 కుటుంబాలుగా ఏర్పాటు చేసి, వారికి(సెటిలర్స్) ఆ భూములను కేటాయించారు. ఇప్పటికీ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న సెటిలర్స్ కుటుంబాలు చాలా ఉన్నాయి. దీంట్లో 173 ఎకరాలు కాలక్రమేణా పంట పొలాల నుంచి పాట్లుగా రూపొందాయి. ఈ ప్రాంతం విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరగా ఉండడం, స్థలాల రేట్లు తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొంచెమో గొప్పో డబ్బు కలిగిన వారు ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ప్రభుత్వం సూపర్ టాక్స్ పేరుతో రెట్టింపు ఇంటి పన్నులు వసూలు చేసింది. దీన్ని కూడా రద్దు చేస్తూ తాజాగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2015 తరువాత ఎవరు ఇళ్లు నిర్మిచుకున్నా, దాన్ని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నెల్లూరులో ఎదురుదెబ్బ... మొదట ఈ ప్రాంతంలో ప్రారంభిస్తే ఎక్కడ వ్యతిరేక వస్తుందోనని మునిసిపల్ మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరు మునిసిపాలిటిలో ఈ ప్రక్రియ చేపట్టారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతోనే తాడేపల్లి మునిసిపాలిటిలో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి కోసం వెళితే, తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభ్యం కావు. ఒకవేళ కాదు కూడదని ఎవరైనా చిన్న గుడిసె వేసినా, దాన్ని కూల్చేందుకు ప్రత్యేక అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని నిమిత్తమే రెగ్యులేషన్ చేస్తామంటూ తాడేపల్లి మునిసిపాలిటిలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. సుమారు 7 వేల మంది యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు చేశారు. దీని ఆధారంగానే కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
వాహనం ఆచూకీ.. ప్చ్!!
* పోలీస్ వాహనాన్ని ఢీకొని పరారీ * నుజ్జునుజ్జయిన వాహనం * నాలుగు రోజులుగా అన్వేషణ * పని చేయని సీసీ కెమెరాలు * తలలు పట్టుకుంటున్న పోలీసులు కుంచనపల్లి (తాడేపల్లిరూరల్): తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి బకింగ్‌హామ్ కెనాల్‌పై గత నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. నలుగురు ప్రయాణికులు మరణించడంతోపాటు ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతోపాటు పోలీసు వాహనం కూడా పూర్తిగా ధ్వంసమవడంతో ఆ గుర్తు తెలియని వాహనం గుర్తించేందుకు పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గత నాలుగు రోజుల నుండి కాజ టోల్ గేటు నుండి విజయవాడ చట్టుపక్కల ప్రాంతాలలో సీసీ కెమారా ఫుటేజిలను గమనించే పనిలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్ఐలు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 500 వాహనాలను పరిశీలించినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో పోలీసుల ఆశలు నిరాశలయ్యాయి. పనిచేయని నిఘా నేత్రాలు.. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు పోవడంతో కనకదుర్గ వారధి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పని చేయలేదు. మంగళగిరి నుండి హైవే ప్రాంతం వరకు పుష్కరాల నిమిత్తం ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేయవడంతో ఇంటర్నల్ మొమరీ లేకపోవడంతో పోలీసులకు పని భారం పెరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి కనకదుర్గ వారధి వరకు ప్రై వేటు వ్యక్తుల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి సర్వీసు రోడ్డును మాత్రమే చూపించడం, ఆ సీసీ కెమెరాలు వద్ద జాతీయ రహదారి ఎత్తులో ఉండడంతో వాహనం ఆచూకీ దొరకలేదు. దీంతో కనకదుర్గ వారధి నుండి ప్రధాన రహదారుల అన్నింటిలోనూ సీసీ కెమారాలు ఎక్కడ ఉన్నాయని అధికారులు అన్వేషణ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంగతి అలా ఉంచితే, సహాయం చేయడానికి వెళ్లిన ఇద్దరు పోలీసులకు గాయాలు కావడం, పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
విగ్రహ తొలగింపుపై రాస్తారోకో
రావిపాడు రోడ్డులో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన నరసరావుపేట రూరల్ : ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డులోని ఆలయం ఎదుట శుక్రవారం రాస్తారోకో చేశారు. రావిపాడు రోడ్డులోని కమ్మ హాస్టల్ సమీపంలో ఆంజనేయస్వామి వారి చిన్న ఆలయాన్ని నిర్మించి కొన్నేళ్ళుగా పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ విగ్రహాన్ని రెండు ముక్కలుగా చేసి మురుగు కాల్వలో పడేశారు. అలాగే, రెండు నెలల క్రితం కూడా పట్టణంలోని రెడ్డి కళాశాల ఎదుట ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. వరసగా విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతుండటంతో వీహెచ్‌పీ ఆందోళనకు దిగింది. విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ, భజరంగ్‌దళ్, హిందూ సేన తదితర సంస్థల ఆధ్వర్యంలో దాదాపు గంటపాటు రాస్తోరోకో చేశారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి చలవాది రాధాకృష్ణమూర్తి, హిందూసేన నాయకులు కోట ప్రసాద్, భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ ప్రహ్లాదగుప్తా, బీజేపీ నాయకులు వల్లెపు కృపారావు, కాకుమాను కోటేశ్వరరావు, సీహెచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
పల్నాటి వీరుల గుడిలో ఘటన కారంపూడి : కారంపూడి (కార్యమపూడి)లోని పల్నాటి వీరుల గుడిలో గుప్త నిధుల కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీ.శ.1182లో ప్రసిద్ధ పల్నాటి యుద్ధంలో వీరులు వాడిన ఆయుధాలున్న గుడిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం ఏడు గంటలకు పూజారి పూజల పెదనరసింహ గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 9 గంటలకు గుడికి వచ్చిన ఆయనకు గేటు తాళాలు పగుల గొట్టి కనిపించాయి. గర్భగుడిలో బండలు తొలగించి గుంత తవ్వి, మళ్లీ మట్టిపూడ్చి బండలు పెట్టినట్లుగా సంఘటన స్థలం ఉంది. ఈ ఘటనపై పీఠాధిపతి పడిగు తరుణ్ చెన్నకేశవ పూజారులు ఏఎస్సై ఫైయింబర్కు ఫిర్యాదు చేశారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన గ్యాంగ్ ఈ సంఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసు, ఇంటెలిజñ న్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. శివాలయంలోనూ తవ్వకాలు.. చింతపల్లి గ్రామ పొలాల్లో ఉన్న పల్నాటి చరిత్ర కాలం నాటి శివాలయంలో కూడా గురువారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో శివాలయం పరిసరాల్లో బంగారు నాణేలు దొరికాయని స్థానికులు చెబుతారు. ఈ సంఘటనల నేపథ్యంలో పథకం ప్రకారం గుప్తనిధుల త్వకాల బ్యాచ్ ఈ సంఘటనలకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘటన స్థలానికి చేరుకున్న ప్రకాశం జిల్లా ఆచారవంతుడు నరేంద్ర తదితరులు డిమాండ్ చేశారు. రక్షిత కట్టడానికి రక్షణ ఇదేనా? పురావస్తు శాఖ 2011లో వీరుల గుడిని రక్షిత కట్టడంగా గుర్తించి రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. వీరుల గుడి నిర్వహణ పీఠాధిపతి ఆధ్వర్యంలోని పూజారులైన ఎర్రగొల్లల ఆధ్వర్యంలో ఉంది. బ్రహ్మనాయుడు చాపకూడు భవనం తదితరాలు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన వాచ్మెన్ల పర్యవేక్షణలో ఉన్నాయి. వాచ్మెన్లు సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతారు. దీంతో రాత్రి వేళల్లో రక్షణ కరువై ఈ సంఘటనకు కారణమైంది. గతంలోనూ వీరుల ఆయుధాలను కొనడం.. అమ్మడం లాంటి రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే గుప్తనిధుల కోసం అన్వేషణ జరగడం ఇదే ప్రథమం. ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఆదేశాలతో ఆ శాఖ ఏడీఏ బి.దీపక్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుప్త నిధులుంటాయనే ఊహతో జరిగిన విద్రోహ చర్యని, గుప్త నిధులున్నాయా? లేదా? అని చెప్పడం సాధ్యం కాదని దీపక్ తెలిపారు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటి వరకు గుడి అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, రక్షణ లోపంపై డైరెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. -
ఎన్ని ఉన్నా.. కూల్చేయాల్సిందే..
► అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న శిథిలావస్థలోని భవనాలను వెంటనే కూల్చివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు స్వయంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఎడతెగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అంశంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శిథిల భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా వారికి నచ్చజెప్పాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు పదిశాతం, జోనల్ కమిషనర్లు ఐదు శాతం శిథిలావస్థలోని ఇళ్లను తనిఖీ చేయాలని, ఏసీపీలు నూరు శాతం ఇళ్లు తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ఆశ్రయం లేని వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటి గురించి వివరించి వారిని ఒప్పించాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్స్ తదితరమైన వాటికి సంబంధించి వచ్చేవారం నుంచి బిల్డర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. -
ముక్కలైన రష్యా హెలికాప్టర్లు.. ట్రక్కులు
సిరియా: రష్యాపై ఆగ్రహాన్ని మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చూపించారు. తమపై సిరియా దేశ ప్రభుత్వ బలగాల అండతో దాడులకు దిగుతున్న రష్యా బలగాలు ఉపయోగించుకుంటున్న సిరియా వ్యూహాత్మక ప్రాంతంపై పదేపదే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడింది. తియాస్ వద్ద ఉన్న ఎయిర్ బేస్‌ను దాదాపు ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బీబీసీ సాధించి బయటపెట్టింది. గత కొద్ది రోజులుగా సిరియాలోని ఉగ్రవాదులను నిలువరించేందుకు రష్యా ఆ దేశంలోని తియాస్ ఎయిర్ బేస్‌ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా యుద్ధ హెలికాప్టర్లు.. 20 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. -
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
డెమాస్కస్: చెప్పిన మాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటిపై కునుకులేకుండా చేస్తుంది. తమ దేశానికి చెందిన వైమానిక దళాన్ని రంగంలోకి దించి ఎక్కడికక్కడ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసిన రష్యా రాత్రిపూట కూడా దాడులు చేస్తోంది. రాత్రిపూట ప్రయోగించి నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించి సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలను కూల్చిపడేసింది. సిరియాలోని మూడు కీలక ఉగ్రవాద స్థావరాలపై భారీ మిసైల్స్‌తో రష్యా రాత్రి దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీని, ఆయుధ నిల్ల ప్రాంతాలను, ఇంధన స్టోరేజిలను, శిక్షణ ఇచ్చే క్యాంపులను ధ్వంసం చేసి పారేసిందని, దీంతో ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఒకప్పుడు ఘనమైన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లిన సిరియాలో నేడు ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కూడా భయాందోళనలతో తమ మాతృభూమిని వదిలి వివిధ యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో ప్రపంచంలోని శక్తిమంతమన దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు సిరియాలోని ఉగ్రవాదులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి. -
చైనా తీరాన్ని ముంచెత్తిన సూపర్ టైఫూన్
బీజింగ్: సూపర్ టైఫూన్ దుజువాన్ చైనా తీరాన్ని ముంచెత్తింది. తీర ప్రాంతాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జిజియాంగ్, ఫుజియాన్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఒకే ఏడాదిలో ఇది 21వ టైఫూన్. దీనివల్ల ప్రాణనష్టం తక్కువగానే(ఇద్దరు దుర్మరణం) జరిగినా గాయపడిన వారు మాత్రం అధికంగానే (324మంది) ఉన్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది. తమ స్వస్థలాలను దాదాపు 4,30, 200 మంది ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రత్యక్షంగా 2.4 బిలియన్ యువాన్ల నష్టం సంభవించిందని, 400 నివాసాలు ధ్వంసం అయ్యాయి. 31వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకుంది. అయితే, గురువారం నాటికి కొంత మేరకు వర్షాలు తగ్గిపోయి వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. -
నాటుసారా నిల్వలు ధ్వంసం
బెజ్జూరు (ఆదిలాబాద్) : భారీ మొత్తంలో దాచిన నాటుసారా నిల్వలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మరిపెడ తండాలో భారీమొత్తంలో సారా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేసి 10 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మరో 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేశారు. -
3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం
వైఎస్సార్ (పులివెందుల) : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ముద్దనూర్లలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం చేశారు. అలాగే 65 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి తొమ్మిది కేసులు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
1000 లీటర్ల సారా ధ్వంసం
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : ఎక్సైజ్, పోలీసు అధికారులు వెయ్యి లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని సుండుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండ్రరాజుపల్లి, నాయినివారిపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఏక కాలంలో దాడులు చేసి 1000 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. -
'అనంత'లో భారీ వర్షం
రాయలసీమలో కరువు ప్రాంతమైన అనంతపురంలో జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జిల్లా పరిధిలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, ధర్మవరం, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో విపరీతమైన వరణుడు విజృంభించాడు. ఇన్నిరోజులు కరుణించని వరణుడు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జనాన్ని బెంబేలిత్తించాడు. ఈదురుగాలులతో విరుచుకుపడ్డాడు. దెబ్బకు ఎన్నో చెట్లు నేలవాలాయి. పలు ట్రాన్స్ ఫార్మర్లలో విద్యుత్ నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. నదుల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ఈ అకాల వర్షానికి ఉరుములు, మెరుపులకు భయపడి పెవరలిలో రామక్క (65) అనే వృద్ధురాలు మరణించింది. అదే విధంగా నక్కలదొడ్డిలో లక్ష రూపాయల విలువ చేసే గడ్డివాములు పిడుగుపాటు కారణంగా దగ్ధమయ్యాయి. కరెంటు లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదిలా ఉండగా శుక్రవారం సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలిత్తించాదు. జిల్లాలోని తాడిమర్రిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దెబ్బతిన్న నర్సరీలు: రూ.కోటి నష్టం కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులకు భారీ నష్టం సంభవించింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటా, మిరప, వంగ నార్లు పెంచుతున్న నర్సరీలు గాలి తీవ్రతకు ధ్వంసమయ్యాయి. నాలుగు నర్సరీలు పూర్తిగాను, మరో 13 వరకు పాక్షికంగానూ దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.కోటి మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు. -
జింకల దాడితో.. పంటలు నాశనం
వల్లూరు: రబీలో సాగు చేసిన పంటలపై జింకలు దాడులు చేసి నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు చేసిన పంట మొలకెత్తక ముందే జింకలు తిని వేస్తుండటం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుచేసిన పంటలు తమ కళ్లెదుటే నాశనమవుతుంటే ఏమి చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలను సాగు చేయలేక పోయిన రైతులు రబీలో నవంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ధనియాలు, బుడ్డ శనగ , నూగు , పెసర తదితర పంటలను సాగు చేశారు. మూడు మండలాల్లో తీవ్ర ఇబ్బందులు వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన ఈ పంటలపై జింకలు మందలు మందలుగా దాడులు చేసి తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. మొలకెత్తిన వెంటనే పంటను తిని వేస్తుండటంతో పలువురు రైతులు తిరిగి విత్తనం పూడుస్తున్నారు. ఆరేడేళ్లుగా జింకల సమస్య ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది. ఆ ఆశ అడియాసే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మూడు మండలాల సరిహద్దుల్లో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న విమానాశ్రయం ఆవరణలో సైతం జింకల మందలు తిరుగుతుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని అధికారులు గుర్తించారు. రన్‌వేపై జింకలు తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు జింకలను అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించారు. దీంతోనైనా తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశపడ్డారు. అయితే విమానాశ్రయం ప్రారంభానికి నోచుకోక పోవడంతో ఆ ఆశలు కూడా అడియాశలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జింకలను అటవీ ప్రాంతాలలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏనుగులు దాడి.. పంటలు ధ్వంసం
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. కుప్పం మండలంలోని మోట్లచేను, కూసూయ, డోళ్లగుట్టు గ్రామాల పరిధిలో పొలాలపై దాడి చేశాయి. అరటి, బీన్స్, టమోటా తదితర పంటలను నాశనం చేశాయి. -
వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!
టీవీక్షణం: వినాశనం అన్న మాట వింటే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎన్ని యేళ్లయినా మర్చిపోలేనంత దారుణమైన వినాశనాలు, ఉత్పాతాలు చాలానే సంభవించాయి ప్రపంచంలో. ప్రపంచాన్ని కంగారు పెట్టిన అలాంటి ఘోర దుర్ఘటనలు, వినాశనాలను చూపించే కార్యక్రమమే ‘డిస్ట్రాయిడ్ ఇన్ సెకెండ్స్’. క్షణాల్లోనే పెద్ద నష్టాన్ని కలిగించిన సంఘటనలను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది డిస్కవరీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం. చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండె దడదడలాడుతుంది. నిజానికి ఈ కార్యక్రమం వల్ల ఉపయోగమేమీ లేదు. ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది, అలా జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలి వంటి విషయాలేమీ మనకు చెప్పరు. కాబట్టి ఆసక్తి ఉంటే చూడొచ్చు. భయమేస్తే టీవీ కట్టేయొచ్చు. గుండె బలహీనంగా ఉండేవాళ్లు చూడకపోవడమే బెటర్. -
గజ రాజుల బీభత్సం, వణుకుతున్న గిరిజనులు
హిర : శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిర మండలం బొందిగూడలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇళ్లు, పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగులు రెచ్చిపోతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారు. అడవిలో ఉండాల్సిన ఏనుగులు ఆవాసాలలోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. పొలాలకు వెళితే ఎటువైపు నుంచి తమపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు గిరిజనులను గ్రామం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. గత వారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. -
రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్‌కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్‌కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు.