రెస్టారెంట్లు, హోటళ్లలో కొంతమంది కస్టమర్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు అడిగింది లేదన్నా లేదా తిరస్కరించిన ఇక అంతే సంగతులు. రెస్లారెంట్‌లోని వస్తువులను నాశనం చేయడం లేదా సిబ్బంది పై దాడి చేయడం వంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ముగ్గుర మహిళలు చిన్న విషయానికి రెస్టారెంట్‌లోని వస్తువులను చిందరవందరగా పడేసి సిబ్బింది పై దాడి చేశారు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే....న్యూయార్క్‌లోని ముగ్గురు మహిళలు ఒక రెస్టరెంట్‌ని దారుణంగా ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. ఐతే వాళ్లు ఆ రెస్టారెంట్‌లో కావల్సిన ఫుడ్‌ని ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఫ్రై తినడానికి మరికొంత సాస్ వడ్డించమని అడిగారు. సదరు రెస్టారెంట్ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు మహిళలు రెస్టారెంట్‌లోని వస్తువులను నాశనం చేసి...కౌంటర్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది పై కూడా దాడి చేశారు.
వాస్తవానికి వారు వడ్డించమన్న సాస్ సుమారు రూ. 10 వేలు ధర పలుకుతుందని సిబ్బంది చెబుతున్నారు. అందువల్ల అదనంగా వడ్డించడం కుదరదని చెబుతున్నాడు సదరు రెస్టారెంట్ ఉద్యోగి. ఆర్డర్ చేసిన ఫుడ్ మేరకే ఆ సాస్ వడ్డించడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఐతే ఆ మహిళలు సృష్టించిన వీరంగానికి సిబ్బంది తిరిగి విధుల్లోకి రావడానికి భయపడుతున్నారని రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు. ఐతే న్యూయార్క్ పోలీసులు ఆ ముగ్గుర మహిళలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగవైరల్ అవుతోంది.
Just another typical day in NYC pic.twitter.com/vcnz2YQnp0
— Libs of TikTok (@libsoftiktok) July 6, 2022
Comments
Please login to add a commentAdd a comment