శిథిలమైన బడి భవనాన్ని కూల్చేయండి
వరంగల్ రూరల్: ఆత్మకూరు మండలం దామెరలో మంగళవారం ఉదయం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణంలో శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. కొత్త తరగతి గదుల నిర్మాణానికి నిధులిస్తామని కడియం హామీనిచ్చారు. దామెర ప్రభుత్వ స్కూల్‌కు ఆరు నెలల్లో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దేశంలోనే రికార్డు స్థాయిలో రెండేళ్లలోనే 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. శిక్షణ పొందిన అర్హులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని అన్నారు..