పామును చూస్తే నోరూరుతుంది అతనికి!... పచ్చిగానే లాగించేస్తాడు! | An Old Man Who Likes To Eat A Snake But Not Destroy Snakes | Sakshi
Sakshi News home page

పామును చూస్తే నోరూరుతుంది అతనికి!... పచ్చిగానే లాగించేస్తాడు!

Published Mon, Feb 7 2022 8:25 AM | Last Updated on Mon, Feb 7 2022 9:42 AM

An Old Man Who Likes To Eat A Snake But Not Destroy Snakes - Sakshi

పుట్లూరు:  పామును చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఆ వృద్ధుడికి మాత్రం నోరూరుతుంది. కాకపోతే అతను పామును చంపడు. ఎవరైనా చంపి పడేస్తే దాన్ని ఇష్టంగా ఆరగిస్తాడు. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న అనే వృద్ధుడు ఆదివారం పామును ఆరగించాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అది వైరల్‌గా మారింది. ఇతనికి కొంత కాలంగా పాములను తినే అలవాటు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement