
ముక్కలైన రష్యా హెలికాప్టర్లు.. ట్రక్కులు
సిరియా: రష్యాపై ఆగ్రహాన్ని మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చూపించారు. తమపై సిరియా దేశ ప్రభుత్వ బలగాల అండతో దాడులకు దిగుతున్న రష్యా బలగాలు ఉపయోగించుకుంటున్న సిరియా వ్యూహాత్మక ప్రాంతంపై పదేపదే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడింది. తియాస్ వద్ద ఉన్న ఎయిర్ బేస్ను దాదాపు ధ్వంసం చేసింది.
దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బీబీసీ సాధించి బయటపెట్టింది. గత కొద్ది రోజులుగా సిరియాలోని ఉగ్రవాదులను నిలువరించేందుకు రష్యా ఆ దేశంలోని తియాస్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా యుద్ధ హెలికాప్టర్లు.. 20 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి.