airbase
-
#AeroIndia2025 : ఆకాశంలో అద్భుతాలు చేసిన యుద్ధ విమానాలు (ఫోటోలు)
-
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
లద్దాఖ్ దగ్గరలో చైనా కొత్త ఎయిర్‌బేస్
న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారకముందే చైనా మరో దుశ్చర్యకు దిగుతోంది. లద్దాఖ్‌లోని షాక్చే వద్ద చైనా నూతనంగా ఎయిర్‌బేస్‌ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని భారతీయ ఏజెన్సీలు గమనించాయి. ఇది పూర్తయితే లైన్ఆఫ్ కంట్రోల్ పొడుగునా చైనాకు వైమానిక మద్దతు పెరగనుంది. షాక్చేలోని ఎయిర్‌బేస్‌ను పూర్తిస్థాయి మిలటరీ బేస్‌గా చైనా రూపుదిద్దుతోందని, ఫైటర్ ఆపరేషన్స్‌కు అనుకూలంగా దీన్ని మారుస్తోందని భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఓసీ వద్ద గతేడాదిగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత ఎగదోస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. యుద్దమే వస్తే తమ కన్నా వేగంగా భారతీయ వైమానిక దళం ఎల్ఓసీ వద్దకు చేరుకుంటుందని చైనా ఎప్పుడో గమనించింది. ఇందుకు సమాధానంగానే షాక్చే వద్ద మిలటరీ ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖష్గర్, హోగాన్ మధ్యలో ఒక కొత్త బేస్‌ను కూడా చైనా నిర్మిస్తోంది. గతేడాది నుంచి సరిహద్దుకు దగ్గరలోని 7 చైనా ఎయిర్‌బేస్‌లపై భారతీయ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. ఇటీవల కాలంలో ఈ బేస్‌లను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు గమనించాయి. -
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
గుజరాత్ సరిహద్దులో పాక్ ఎయిర్ బేస్ కలకలం
న్యూఢిల్లీ : గుజరాత్ సరిహద్దు వెంబడి సింధ్ ప్రోవిన్స్‌లో భోలారి ప్రాంతంలో పాకిస్తాన్ ఆధునిక ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్‌బేస్‌లో పాకిస్తాన్ తన చైనా జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌బేస్ గత కొద్దికాలంగా పనిచేస్తున్నా యుద్ధ విమానాల విన్యాసాలు ఈ స్థాయిలో జరగడంఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత వాయుసేనకు దీటుగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ పెద్దసంఖ్యలో చైనా నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఇదే ఎయిర్‌బేస్‌కు చేరువలోనే పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (నేవీ) కమాండోలను సైతం రంగంలోకి దింపింది. సముద్ర మార్గం గుండా భారత్‌లో దాడులకు లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఎయిర్‌బేస్‌ను వాడతారే ప్రచారం సాగుతున్న క్రమంలో కమాండోలను ఇక్కడికి రప్పించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సన్నాహాలకు దీటుగా గుజరాత్ బోర్డర్లోని దీసా వద్ద యుద్ధ ఎయిర్‌బేస్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ రన్‌వే ఏర్పాటు, యుద్ధ విమానాల తరలింపు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
చైనా చేష్టలకు భారత కౌంటర్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టును భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తమ ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడి నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలతో గస్తీని నిర్వహణకు సిద్ధమైపోయింది. ‘రెండు సుఖోయ్(సు-30 ఎంకేఐ) విమానాలు ఫిబ్రవరి 19వ తేదీ ఉదయాన్నే బయలుదేరుతాయి. రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి 20వ తేదీ సాయంత్రం తిరిగి ఎయిర్ బేస్‌కు చేరుకుంటాయి. సినో(చైనా)-భారత్ సరిహద్దు వెంబడి ఇవి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాయి. కొన్ని రోజులకు దీనిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మాములు చర్యే అని ప్రకటించుకున్నప్పటికీ.. దీనివెనుక ముందు చూపు ఉన్నట్లు స్పష్టమౌతోంది. రెండు దేశాల మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. భవిష్యత్తులో చైనా సరిహద్దు(గగనతలం గుండా) ఉల్లంఘనకు పాల్పడితే అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్ ప్రాంతాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో భారత సరిహద్దుల దాకా చైనా యుద్ధ విమానాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన అయినా దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ధాటిగా సమాధానం ఇచ్చేందుకే భారత సైన్యం ఈ ఎయిర్ బేస్‌ను నెలకొల్పినట్లు అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
దొంగదెబ్బ కొడుతున్న చైనా
న్యూఢిల్లీ : పాకిస్తాన్-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ పాక్‌కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. తాజాగా పొరుగుదేశానికి అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కమ్యూనిస్ట్ కంట్రీ అందిస్తోంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది. కీలకమైన రాజస్తాన్ సరిహద్దు వద్ద ఎయిర్ బేస్‌ను ఆధునీకరించడంతో పాటు, 350 స్టోన్ బంకర్లను డ్రాగన్ దేశం నిర్మించింది. అంతేకాక బోర్డర్ అవుట్ పోస్ట్‌లను కలుపుతూ.. రోడ్నెర్క్ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే.. సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్‌తో పాటు కెనాల్స్‌కు చైనా ఏర్పాటు చేస్తోంది. భారత్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైరాపూర్ ఎయిర్‌బేస్‌లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్బేస్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. ఇదిలావుండగా.. పాక్‌కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది. -
పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ వద్ద హై అలర్ట్
-
ముక్కలైన రష్యా హెలికాప్టర్లు.. ట్రక్కులు
సిరియా: రష్యాపై ఆగ్రహాన్ని మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చూపించారు. తమపై సిరియా దేశ ప్రభుత్వ బలగాల అండతో దాడులకు దిగుతున్న రష్యా బలగాలు ఉపయోగించుకుంటున్న సిరియా వ్యూహాత్మక ప్రాంతంపై పదేపదే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడింది. తియాస్ వద్ద ఉన్న ఎయిర్ బేస్‌ను దాదాపు ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బీబీసీ సాధించి బయటపెట్టింది. గత కొద్ది రోజులుగా సిరియాలోని ఉగ్రవాదులను నిలువరించేందుకు రష్యా ఆ దేశంలోని తియాస్ ఎయిర్ బేస్‌ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా యుద్ధ హెలికాప్టర్లు.. 20 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. -
ఎన్ఎస్జీ, గరుడ కమాండోల మోహరింపు