న్యూఢిల్లీ : గుజరాత్ సరిహద్దు వెంబడి సింధ్ ప్రోవిన్స్‌లో భోలారి ప్రాంతంలో పాకిస్తాన్ ఆధునిక ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్‌బేస్‌లో పాకిస్తాన్ తన చైనా జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌బేస్ గత కొద్దికాలంగా పనిచేస్తున్నా యుద్ధ విమానాల విన్యాసాలు ఈ స్థాయిలో జరగడంఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత వాయుసేనకు దీటుగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ పెద్దసంఖ్యలో చైనా నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది.
ఇదే ఎయిర్‌బేస్‌కు చేరువలోనే పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (నేవీ) కమాండోలను సైతం రంగంలోకి దింపింది. సముద్ర మార్గం గుండా భారత్‌లో దాడులకు లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఎయిర్‌బేస్‌ను వాడతారే ప్రచారం సాగుతున్న క్రమంలో కమాండోలను ఇక్కడికి రప్పించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
పాకిస్తాన్ సన్నాహాలకు దీటుగా గుజరాత్ బోర్డర్‌లోని దీసా వద్ద యుద్ధ ఎయిర్‌బేస్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ రన్‌వే ఏర్పాటు, యుద్ధ విమానాల తరలింపు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment