డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్‌ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది.
తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment