
బాపూ అంత్యక్రియలు పూర్తి
ప్రఖ్యాత చిత్రకారుడు,సినిమా దర్శకుడు బాపూ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో బాపూ అంత్యక్రియలు నిర్వహించారు.
చెన్నై : ప్రఖ్యాత చిత్రకారుడు,సినిమా దర్శకుడు బాపూ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో బాపూ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు బాపూ నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశాన వాటిక వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బోనీకపూర్, అనీల్ కపూర్, సినీరంగ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.