బాబు దిగిపోతేనే పోలీసు సెక్షన్లు పోతాయి | cpi dharna | Sakshi
Sakshi News home page

బాబు దిగిపోతేనే పోలీసు సెక్షన్లు పోతాయి

Published Wed, Jul 12 2017 11:33 PM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM

cpi dharna

కాకినాడ సిటీ :
జిల్లాను ఒక రోగం పట్టుకుని పీడిస్తోందని ఎప్పుడూ సెక్ష¯ŒS–30, సెక్ష¯ŒS–144లు అమలులో ఉంటాయని ఇవి పోవాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగిపోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరుబాటలో భాగంగా సీపీఐ జిల్లా కమిటి బుధవారం కాకినాడలో ప్రజాగర్జన నిర్వహించింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టరేట్‌ ఎదుట జరిగిన సభలో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే చేపట్టి మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నారని కాని ఈ జిల్లాలోని నాలుగు ముంపు మండలాల్లో సర్వే చేయడంలేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ప్యాకేజీ ప్రకటించకుంటే పోలవరంపై ఢిల్లీలో ధర్నా చేపడతామని ప్రకటించారు. మరోపక్క కనీస సౌకర్యాలు, తాగునీరు లేక, విష జ్వరాలతో గిరిజనులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏజన్సీలో మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి గడిచిన మూడేళ్లుగా అందరికీ ఇళ్లని చెబుతున్నారని, ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నా, ప్రభుత్వం వాటినే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఆందోళన అనంతరం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు ప్రజాసమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లా రామారావు, నాయకులు కె.సత్తిబాబు, డాక్టర్‌ సి.స్టాలిన్, తోకల ప్రసాద్, పెదిరెడ్డి సత్యనారాయణ, చెల్లుబోయిన కేశవశెట్టి పాల్గొన్నారు.
భారీ ర్యాలీ, వినూత్న ప్రదర్శనలు : జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టి శ్రేణులు, అభిమానులు సీపీఐ ప్రజాగర్జనలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆనందభారతి ఆవరణ నుంచి కల్ప నా సెంటర్, మెయి¯ŒSరోడ్డు, మసీద్‌ సెంటర్, దేవాలయంవీధి, బాలాజీ చెరువుసెంటర్, జెడ్పీసెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో చేపట్టిన వినూత్న ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. జీఎస్టీ మోత..ప్రజలకు వాత అంటూ ఎడ్లబండిని లాగుతూ ప్రదర్శించారు. గిరిజనులు విల్లంబులతోనూ, గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనగా ర్యాలీలో పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement