భర్తను హతమార్చిన భార్య
రోకలిబండతో మోదడంతో మృతి
వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితురాలు వెల్లడి
శ్రీకాళహస్తి : అగ్ని సాక్షిగా పెళ్లాడిన వ్యక్తి నిత్యం అనుమానాలతో వేధిస్తుండడంతో విసిగి వేసారిపోరుుంది. ఏళ్లకాలంగా వేధింపులు భరించలేక రోకలిబండతో మోది భర్తను మట్టుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి అనంతరం శ్రీకాళహస్తిలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు..పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో కాపురముంటున్న ఢిల్లీబాబు(37)కు రేవతితో 14ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పూజ(11), పవన్(9) సంతానం. ఢిల్లీబాబుతోపాటు ఆయన సోదరుడు నాగరాజు, తల్లి వసంతమ్మ కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తారు. ఈ క్రమంలో ఢిల్లీబాబు దుర్వ్యసనాలకు బానిసై తరచూ ఏదో ఒక వంకతో భార్యతో తగవులాడేవాడు. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి మద్యం సేవించి ఢిల్లీబాబు 10గంటలకు ఇంటికి చేరుకున్నాడు. భార్యతో గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. మళ్లీ కొట్టబోయేసరికి ప్రతిఘటించింది. వంటరూములోని రోకలిబండ తీసుకుని ఎదురుదాడికి దిగింది. తలపై బలంగా కొట్టడంతో ఢిల్లీబాబు తీవ్రగాయంతో కుప్పకూలాడు. సమాచారం తెలుసుకున్న సీఐ చిన్నగోవిందు అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అరుుతే అప్పటికే ఢిల్లీబాబు మృతిచెందినట్లు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
నిందితురాలిని విచారణ
శ్రీకాళహస్తి డీఎస్పీ, సీఐ నిందితురాలు రేవతిని అదుపులోకి తీసుకుని ఆమెతో పాటు స్థానికులనూ విచారణ చేశారు. ఘటన ప్రత్యక్ష సాక్షి అరుున హతుని కుమార్తె పూజ నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.
ఆ ఇంట మరణ మృదంగమే..
మృతుని సోదరుడు నాగరాజు కూడా ఓ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇలాగే తరచూ వేధిస్తుండటంతో ఏడాది కిందట బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హతుని తల్లి కూడా ఏడాది క్రితం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. తొలి నుంచీ కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం, తన భర్త పెడుతున్న వేధింపుల వలనే ఇలా చేయవలసి వచ్చిందని రేవతి పోలీసుల ఎదుట వాపోరుునట్లు తెలిసింది. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.