Revathy
-
సీనియర్ నటుడిపై నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు
-
సీనియర్ నటి రేవతి డైరెక్షన్లో హీరోయిన్ కాజోల్
Kajol Begins Shooting For Revathy Salaam Venky Film: ‘సలామ్ వెంకీ’ అంటున్నారు నటి కాజోల్. నటి రేవతి ఈ సినిమాకు దర్శకురాలు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ‘‘అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు కాజోల్. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా చేయనున్నారు. వారే కాజోల్, రేవతి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజోల్. రేవతి దర్శకత్వంలో పని చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని నటి తెలిపింది. ఆ సినిమా పేరు ‘ది లాస్ట్ హుర్రే’. హృదయానికి హత్తుకునే ఆ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే నటి నుంచి దర్శకురాలిగా మారిన రేవతి ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఐదో మూవీని కాజోల్ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని బీలైవ్ ప్రోడక్షన్స్, టేక్ 23 స్టూడియోస్ ప్రోడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) pic.twitter.com/s1shrnknlK — Kajol (@itsKajolD) October 7, 2021 -
నా కొడుకును చంపిందెవరు? ఎందుకు చంపారు?
టైటిల్ : ఇట్లు అమ్మ నటీనటులు : రేవతి, పోసాని కృష్ణమురళి, రవి కాలే తదితరులు నిర్మాత : బొమ్మకు మురళి దర్శకత్వం : సీ. ఉమామహేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: ‘‘అంకురం’’ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన గొప్ప సందేశాత్మక చిత్రం "ఇట్లు అమ్మ". సోనీ ఓటీటీ ద్వారా ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. అనూహ్యంగా తనకు శాశ్వతంగా దూరమైన కొడుకు కోసం తల్లి పడే తపన... ఆరాటమే ‘ఇట్లు అమ్మ’ కథాంశం. ఒక మనిషిని ఇంకో మనిషి పట్టించుకోనితనాన్ని ప్రశ్నించిన వైనమే ఈ సినిమా. దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను కూడా స్వయంగా ఉమామహేశ్వరరావు తన నెత్తిన వేసుకొని హృద్యంగా రూపొందించారీ సినిమాను. వైయుక్తిక బాధను ప్రపంచం బాధతో మిళితం చేస్తూ.. సామాజికత్వాన్ని చాటిన ఆలోచనాత్మక మూవీ ఇట్లు అమ్మ. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా తను చెప్పదలచుకున్నఅంశం నుంచి ఎక్కడా డీవీయేట్ అవ్వకుండా చాలా పకడ్బందీగా కథను నడించారు. ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్న యువత ఆకలి కేకలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో అర్థం చేయించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయ్నతంలో జాతీయ, అంతర్జాతీయంగా పెచ్చరిల్లుతున్న హింసతోపాటు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు సత్యాన్నే వధిస్తున్న వైనాన్ని చాలా తీవ్రంగానే ప్రశ్నించారు. ఈ విషయంలో ఉమా మహేశ్వరరావు మరో మెట్టు ఎక్కినట్టే చెప్పవచ్చు. ఎడతెగని వర్షం, హోరు గాలితో మొదలైన సినిమా, ప్రేక్షకుడి హృదయాంతరాళాలలో సునామీ రేపి ముగిస్తుంది. ఇక "ఇట్లు అమ్మ" కథ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన స్త్రీగా, తన కొడుకే లోకంగా బతికే తల్లి బాల సరస్వతిగా (రేవతి) అద్భుత నటన ఈ సినిమాకు హైలైట్. అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి. ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాలను చాలా చక్కగా దృశ్యీకరించాడు దర్శకుడు. అయితే తన కొడుకును చంపిందెవరు.. ఎందుకు లాంటి విషయాలను తెలుసుకోగలిగిందా? హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. సీనియర్ నటి రేవతి తన పాత్రలో అద్భుతంగా నటించారు. మాతృహృదయ ఆవేదనను సంపూర్ణంగా ఆవిష్కరించారు. ఇంకా పోసాని కృష్ణమురళి తదితరులు తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హంతకుడుగా, అనాథగా నటించిన అబ్బాయి తన పాత్రలో లీనమై కన్నీళ్లు పెట్టిస్తాడు. ఎన్నో ప్రశ్నలతో అతని పాత్ర మన్నల్ని వెంటాడుతుంది. అలాగే కార్పొరేట్ మాయాజాలంపై ప్రజాగాయకుడు గోరటి వెంకన్న అప్పీరియన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. కామ్రేడ్లీ జంట కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. -
జ్యోతిక, రేవతిల జాక్‌పాట్
తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా జ్యోతి సుపరిచితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లాడిన తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జాక్‌పాట్. సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విటర్ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో జ్యోతిక, రేవతి రకరకాల వేశాల్లో ప్రజలను మోసం చేసే పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాదు జ్యోతిక ఈ సినిమాటో యాక్షన్ సీన్స్‌కు ఇరగదీశారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణ్ దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
నటి రేవతిపై ఫిర్యాదు
పెరంబూరు: నటి రేవతిపై ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కేరళ రాష్ట్రం, కొచ్చికి చెందిన సియాజ్ జమాస్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఎర్నాకులం క్రైం పోలీసులకు రేవతిపై ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని ఏళ్ల క్రితం షూటింగ్లో ఒక 17 ఏళ్ల బాలికపై ఎవరో అత్యాచారయత్నం చేసినట్లు నటి రేవతి చెప్పారన్నారు. అయితే ఆ బాధితు రాలు ఎవరన్నది రేవతి బయట పెట్టకుండా దాచారని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని, లైంగిక వేధింపులకు గురైన ఆ నటి ఎవరన్నది చెప్పకుండా దాచిపెట్టిన నటి రేవతిపైనా కేసు నమోదు చేయాలని పేర్కొన్నాడు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన నటి రేవతి 17 ఏళ్ల నటి అర్ధరాత్రి తాను బస చేసిన హోటల్ గది తలుపు తట్టి భయంతో కాపాడండి అంటూ కేకలు వేసింది నిజమేనన్నారు. అయితే ఆ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు తాను చెప్పలేదని అన్నారు. అర్ధరాత్రి ఎవరో తన గది తలుపులు తట్టడంతో ఆ బాలిక, బామ్మ భయంతో తన గదికి వచ్చారని ఆ రాత్రి తాము ముగ్గురం నిద్రలేకుండా గడిపినట్లు తెలిపారు. వృతి రీత్యా వచ్చిన మహిళలకు రక్షణ కల్పించాలనే తాను ఆ సంఘటన గురించి చెప్పానని నటి రేవతి వివరించారు. -
నటి కిడ్నాప్ కేసు; అతడిని సస్పెండ్ చేయాల్సిందే!
తిరువనంతపురం : నటుడు దిలీప్ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్న అంశమై తుది నిర్ణయాన్ని అక్టోబర్ 9లోగా చెప్పాలని నటి రేవతి అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు లేఖ రాశారు. ప్రముఖ వర్ధమాన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని అసోసియేషన్ నుంచి తొలగించాలంటూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ విషయమై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేవతి, పద్మప్రియ, పార్వతిలు అసోసియేషన్‌కు లేఖ రాశారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించే వరకు అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి : ‘మలయాళ వెండితెర’పై మరక!) ఈ క్రమంలో దిలీప్ విషయంలో కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టిన రేవతి.. గతంలో ఇలా క్రమశిక్షణలు ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దిలీప్ కేసు విషయమై నిర్ణయాన్ని తెలపాలంటూ ఇది వరకు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నటి కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను ‘అమ్మ’లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్‌కు చెందిన పలువురు బహిరంగంగానే విమర్శించారు. నటికి సాయం చేయాలన్నా, ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే దిలీప్‌ను అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని పలువురు సెలబ్రిటీలు కోరినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా రేవతి లేఖతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భర్తను హతమార్చిన భార్య
రోకలిబండతో మోదడంతో మృతి వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితురాలు వెల్లడి శ్రీకాళహస్తి : అగ్ని సాక్షిగా పెళ్లాడిన వ్యక్తి నిత్యం అనుమానాలతో వేధిస్తుండడంతో విసిగి వేసారిపోరుుంది. ఏళ్లకాలంగా వేధింపులు భరించలేక రోకలిబండతో మోది భర్తను మట్టుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి అనంతరం శ్రీకాళహస్తిలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు..పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో కాపురముంటున్న ఢిల్లీబాబు(37)కు రేవతితో 14ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పూజ(11), పవన్(9) సంతానం. ఢిల్లీబాబుతోపాటు ఆయన సోదరుడు నాగరాజు, తల్లి వసంతమ్మ కూరగాయల మార్కెట్లో పనిచేస్తారు. ఈ క్రమంలో ఢిల్లీబాబు దుర్వ్యసనాలకు బానిసై తరచూ ఏదో ఒక వంకతో భార్యతో తగవులాడేవాడు. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి మద్యం సేవించి ఢిల్లీబాబు 10గంటలకు ఇంటికి చేరుకున్నాడు. భార్యతో గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. మళ్లీ కొట్టబోయేసరికి ప్రతిఘటించింది. వంటరూములోని రోకలిబండ తీసుకుని ఎదురుదాడికి దిగింది. తలపై బలంగా కొట్టడంతో ఢిల్లీబాబు తీవ్రగాయంతో కుప్పకూలాడు. సమాచారం తెలుసుకున్న సీఐ చిన్నగోవిందు అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అరుుతే అప్పటికే ఢిల్లీబాబు మృతిచెందినట్లు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నిందితురాలిని విచారణ శ్రీకాళహస్తి డీఎస్పీ, సీఐ నిందితురాలు రేవతిని అదుపులోకి తీసుకుని ఆమెతో పాటు స్థానికులనూ విచారణ చేశారు. ఘటన ప్రత్యక్ష సాక్షి అరుున హతుని కుమార్తె పూజ నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇంట మరణ మృదంగమే.. మృతుని సోదరుడు నాగరాజు కూడా ఓ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇలాగే తరచూ వేధిస్తుండటంతో ఏడాది కిందట బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హతుని తల్లి కూడా ఏడాది క్రితం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. తొలి నుంచీ కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం, తన భర్త పెడుతున్న వేధింపుల వలనే ఇలా చేయవలసి వచ్చిందని రేవతి పోలీసుల ఎదుట వాపోరుునట్లు తెలిసింది. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్'
2013లో బాలీవుడ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన కామెడీ డ్రామా.. క్వీన్. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కి 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, నటిగా కంగనా రనౌత్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటినుంచే ఈ సినిమా సౌత్ రీమేక్‌పై వార్తలు వినిపిస్తున్నా సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవటంతో పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ సినిమాను సీనియర్ నటి, దర్శకురాలు రేవతి డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్ నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నటి సుహాసిని రచనా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మూడో సారి
రేవతి మంచి నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఆమెలో మంచి దర్శకురాలున్నారన్నది నిరూపణ అయ్యింది. హిందీలో ఫిర్ మిలేంగే, ముంబై కటింగ్ చిత్రాలను తెరకెక్కించిన రేవతి తాజాగా మూడవ చిత్రానికి సిద్ధం అయ్యారు. ఇది తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె అంటున్నారు. తన తాజా చిత్రం గురించి రేవతి తెలుపుతూ దర్శకుడు బాలీవుడ్ దర్శకుడు జోయ్ అక్బర్ తెరకెక్కించిన జిందగి నా మిలేగా దుబారా తరహా చిత్రం చేయాలని భావించానన్నారు. అందుకే తగిన కథను తయారుచేశానని తెలిపారు. హిందీభాషకే పరిమితం కాకుండా తమి ళం, మలయాళం భాషా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుందన్నారు. అందుకే చిత్రాన్ని ఈ మూడు భాషలలోను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ తర హా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా ప్రతిభ కావాలన్నారు. దాన్ని తాను పెంపొందించుకున్నానని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంకా పే రు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు రేవతి అన్నారు.