హీరోయిన్‌ని డైరెక్ట్‌ చేయనున్న నటి | Kajols Next Film The Last Hurrah Directed By Revathy | Sakshi
Sakshi News home page

Kajol: కాజోల్‌ని డైరెక్ట్‌ చేయనున్న నటి రేవతి

Published Sat, Oct 9 2021 1:46 PM | Last Updated on Sat, Oct 9 2021 2:47 PM

Kajols Next Film The Last Hurrah Directed By Revathy - Sakshi

ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా చేయనున్నారు. వారే కాజోల్‌, రేవతి.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది కాజోల్‌. రేవతి దర్శకత్వంలో పని చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని నటి తెలిపింది. ఆ సినిమా పేరు ‘ది లాస్ట్‌ హుర్రే’. హృదయానికి హత్తుకునే ఆ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే నటి నుంచి దర్శకురాలిగా మారిన రేవతి ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఐదో మూవీని కాజోల్‌ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని బీలైవ్‌ ప్రోడక‌్షన్స్‌, టేక్‌ 23 స్టూడియోస్‌ ప్రోడక‌్షన్స్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అమితాబ్‌ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement