బాలీవుడ్ మోస్ట్ ఫేమ్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. వీరిద్దరికీ ఓ కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం ఉన్నారు. ఇవాళ కుమారుడు యుగ్ తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజయ్, కాజోల్ కుమారుడికి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో దిగన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీనికి సంబంధింటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతుంటారు ఈ జంట. తమ పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే అజయ్ దేవగణ్ ఈ ఏడాది ప్రారంభంలో మైదాన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సింగం ఏగైన్, దే దే ప్యార్ దే-2 చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు కాజోల్ ప్రభుదేవా సరసన మహారాగ్ని అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కాగా..కాజోల్, అజయ్ 1994లోనే డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment