కాంబినేషన్‌ కుదిరింది | Kajol set to reunite with Prabhu Deva on screen after 27 years | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ కుదిరింది

Published Sat, May 25 2024 12:03 AM | Last Updated on Sat, May 25 2024 12:03 AM

Kajol set to reunite with Prabhu Deva on screen after 27 years

‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్‌ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్‌ గుప్తాఆదిత్య సీల్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ చిత్రీకరణ మొదలైంది.

‘‘మా సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్‌ తేజ్‌కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement