జ్యోతిక, రేవతిల జాక్‌పాట్‌ | Jyotika, Revathy Starrer Jackpot Telugu Trailer | Sakshi
Sakshi News home page

జ్యోతిక, రేవతిల జాక్‌పాట్‌

Published Sat, Jul 27 2019 12:42 PM | Last Updated on Sat, Jul 27 2019 12:42 PM

Jyotika, Revathy Starrer Jackpot Telugu Trailer - Sakshi

తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా జ్యోతి సుపరిచితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లాడిన తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జాక్‌పాట్. సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‍ట్రైలర్‌లో జ్యోతిక, రేవతి రకరకాల వేశాల్లో ప్రజలను మోసం చేసే పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాదు జ్యోతిక ఈ సినిమాటో యాక్షన్‌ సీన్స్‌కు ఇరగదీశారు.

2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణ్ దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement