మూడో సారి | Revathy to direct her first Malayalam feature film | Sakshi
Sakshi News home page

మూడో సారి

Published Thu, Apr 23 2015 2:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మూడో సారి - Sakshi

మూడో సారి

రేవతి మంచి నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఆమెలో మంచి దర్శకురాలున్నారన్నది నిరూపణ అయ్యింది. హిందీలో ఫిర్ మిలేంగే, ముంబై కటింగ్ చిత్రాలను తెరకెక్కించిన రేవతి తాజాగా మూడవ చిత్రానికి సిద్ధం అయ్యారు. ఇది తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె అంటున్నారు. తన తాజా చిత్రం గురించి రేవతి తెలుపుతూ దర్శకుడు బాలీవుడ్ దర్శకుడు జోయ్ అక్బర్ తెరకెక్కించిన జిందగి నా మిలేగా దుబారా తరహా చిత్రం చేయాలని భావించానన్నారు.
 
 అందుకే తగిన కథను తయారుచేశానని తెలిపారు. హిందీభాషకే పరిమితం కాకుండా తమి ళం, మలయాళం భాషా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుందన్నారు. అందుకే చిత్రాన్ని ఈ మూడు భాషలలోను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ తర హా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా ప్రతిభ కావాలన్నారు. దాన్ని తాను పెంపొందించుకున్నానని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంకా పే రు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు రేవతి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement