రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్' | Revathy to direct Tamil, Telugu remake of 'Queen' | Sakshi
Sakshi News home page

రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్'

Published Tue, Feb 2 2016 10:38 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్' - Sakshi

రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్'

2013లో బాలీవుడ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన కామెడీ డ్రామా.. క్వీన్. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కి 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, నటిగా కంగనా రనౌత్కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటినుంచే ఈ సినిమా సౌత్ రీమేక్పై వార్తలు వినిపిస్తున్నా సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవటంతో పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం ఈ సినిమాను సీనియర్ నటి, దర్శకురాలు రేవతి డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్ నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నటి సుహాసిని రచనా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్కు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement