తమిళసినిమా: ఆశకు అంతం ఉండదంటారు. అదే విధంగా చేసే పనిలో సంతృప్తి పడిపోతే ముందుకు సాగలేం అన్నది ఆర్యోక్తి. నటి కాజల్ ఈ రెండో కోవకు చెందన వ్యక్తి అని ఆమె మాటల్లో వ్యక్తం అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో ప్రముఖ కథానాయకులందరితోనూ నటించిన కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం అవకాశాల విషయంలో కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో చేతిలో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే.అయినా అగ్రనటీమణుల పట్టికలోనే కొనసాగుతున్న కాజల్‌అగర్వాల్ ఇంకా ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే వచ్చిన అవకాశాల్లో నచ్చినవి ఎంపిక చేసుకుని నటిస్తున్నానని చెప్పింది.
అయితే యాక్షన్, కామెడీ కథా పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందంది. తాను ఇప్పటి వరకూ యాక్షన్ కథా పాత్రల్లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని పేర్కొంది. వ్యక్తిగతంగా తనకు మంచి భావోద్రేక కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలంటేనే ఇష్టం అని చెప్పింది. అదే విధంగా భాషా భేదం లేకుండా అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలన్నది తన నిర్ణయం అని తెలిపింది. నటన వరకూ భాష అడ్డు కాకూడదన్నదే తన అభిప్రాయం అని అంది. నటన అనేది కథా పాత్రను బట్టి ఉంటుందని, అందుకే ఏ భాషా చిత్రం అయినా కథ నచ్చితే నటిస్తానని చెప్పింది. అది అంతర్జాతీయ భాషా చిత్రం అయిన నటించడానికి రెడీ అంటూ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లకు మించి తన హాలీవుడ్ ఆశను చెప్పకనే చెప్పేసింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోనే పెద్దగా సక్సెస్ కాలేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment