
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యం వధ - ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్నారు. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న ‘సత్యం వధ - ధర్మం చెర’ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు. స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment