30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమిళ హీరో బాబు సెప్టెంబర్ 19న కన్నుమూసిన సంగతి తెలిసిందే! ఆయన మరణంతో బాబు తల్లి ప్రేమ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నిద్రాహారాలు మానేసి చనిపోయిన కొడుకు గురించే కలవరించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
ఆ ఒక్క సీన్ వల్ల జీవితమే నాశనం..
కాగా బాబు 'ఎన్ ఉయిర్ తొళన్' అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో రంగప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని దర్శకదిగ్గజం భారతీరాజా తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాబుకు లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో బాబు దాదాపు 10 సినిమాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మనసారా వస్తుంగళెన్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాబు కొన్ని ఫైట్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించారు. ఈ క్రమంలో ఎత్తైన ప్రదేశం నుంచి ఆయన కిందకు దూకడంతో అతడికి తీవ్ర గాయాల్యాయి. వెన్నుముక విరిగిపోయి మంచానికి పరిమితమయ్యారు.
30 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంది
హీరోగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆయన కెరీర్‌నే కాదు జీవితాన్నే తలకిందులు చేసింది. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ అతడు నిటారుగా కూర్చోలేని పరిస్థితి! అప్పటినుంచి కొడుకుకు సపర్యలు చేస్తూ తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది అతడి తల్లి ప్రేమ. మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన బాబు ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కాగా గతంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన కె. రాజారం సోదరియే ప్రేమ.
Comments
Please login to add a commentAdd a comment