దోచిపెట్టేందుకే బాబు ప్యాకేజీ జపం
తనతో పాటు అనుచరులకు దోచి పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ జపం చేస్తున్నారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
– పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్:
తనతో పాటు అనుచరులకు దోచి పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ జపం చేస్తున్నారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపులో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా డోన్‌లో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తర్వాత కూడా చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ బురద నుంచి బయటపడేందుకు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాడన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయన నేడు హోదా విషయంలోనూ తన అసలు స్వరూపం బయట పెట్టాడన్నారు. ఎన్నికలకు ముందు 15ఏళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేసిన బాబు.. ఇప్పుడు ఆ మాట విస్మరించి మాట్లాడటం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివద్ధి హోదాతోనే సాధ్యమనే విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.