package
-
రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్మెంట్ రికార్డ్
క్యాంపస్ ప్లేస్మెంట్లలో (Campus Placement) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ ఏడాది అత్యధిక వార్షిక వేతనం (Salary Package) రూ. 2.20 కోట్లుగా నమోదైంది. మునుపటి రికార్డు 2021 సంవత్సరంలో రూ. 2.15 కోట్లు ఉండేది. ఇప్పుడు నమోదైన అత్యధిక వేతనంతో గత పదేళ్లలో ఐఐటీ బీహెచ్‌యూ సాధించిన అత్యుత్తమ పనితీరు ఇదేనని భావిస్తున్నారు.దీంతో పాటు 1128 మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు. మరో 424 మంది ఇంటర్న్‌షిప్‌లను పొందారు. ఈసారి సగటు ప్యాకేజీ కూడా పెరిగింది. ఈ సంవత్సరం సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.80 లక్షలకు చేరుకుంది. తమ విద్యార్థుల ప్రతిభ, విద్యా, పరిశోధనా నైపుణ్యం పట్ల సంస్థ నిబద్ధత అగ్రశ్రేణి రిక్రూటర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయని ఐఐటీ బీహెచ్‌యూ డైరెక్టర్ పేర్కొన్నారు.క్యాంపస్‌లో జరిగిన నియామకాల్లో పరిశ్రమ దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ హాజరై విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా స్టీల్, అమెజాన్, డేటా బ్రిక్స్, ఐటీసీ, శామ్సంగ్, ఒరాకిల్, వాల్‌మార్ట్, క్వాల్‌కామ్‌తో సహా దాదాపు 350 కంపెనీలు 2024 ప్లేస్మెంట్ డ్రైవ్‌ను కవర్ చేశాయి.రికార్డు ప్యాకేజీలుఐఐటీ బీహెచ్‌యూలో ఏటా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు రికార్డుస్థాయిలో అత్యధిక వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2024-25లో అత్యధిక వేతనం రూ.2.20 కోట్లు కాగా, 2023-24లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ.1,20 కోట్లు, 2021-22లో రూ.2.15 కోట్ల ప్యాకేజీలు అత్యధిక వేతనాలుగా రికార్డు సృష్టించాయి. 11 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ను పొందారు. -
అప్పటిదాకా బాబు, పవన్‌లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది... శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. -
అమెరికా కీలక నిర్ణయం.. టార్గెట్ రష్యా..!
వాషింగ్టన్: కొన్నిరోజుల్లో అధ్యక్ష పదవీకాలం ముగియనుందనగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి ప్రాధాన్యమున్న పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు రూ.6వేల కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు,యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్‌కు సమకూర్చనుంది.భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో హుటాహుటిన ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా దాడులను అడ్డుకొని,ఉక్రెయిన్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీ ఇస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. -
డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ
ఇంజనీరింగ్ చదివి గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒక కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి డ్రీమ్ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్ పాట్ కొట్టేశాడు. గూగుల్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్. తన డ్రీమ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్ తరువాత 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి చదివి గూగుల్‌లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు.అభిషేక్ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూలకోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప సవాలే. ఎట్టకేలకు అభిషేక్ పట్టుదల కృషి ఫలించింది. "నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చా.. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే, ఇపుడిక నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను." అన్నాడు సంతోషంగా.అంతేకాదు “అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్. -
అమెజాన్‌లో ఆర్డర్.. పార్శిల్ నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము
బెంగళూరు : ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్‌ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని సర్జాపూర్‌కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్‌బాక్స్‌ను అమెజాన్ కంపెనీ యాప్‌లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్‌కి గురి చేస్తూ పార్శిల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు. అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్‌లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు. స్పందించిన అమెజాన్కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. -
రూ.14 వేలకే 'దివ్య దక్షిణ్ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!
దక్షిణాది పుణ్య క్షేత్రాలు దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. తక్కువ ధరలోనే దక్షిణది పుణ్యక్షేత్రాలను దర్మించుకునేలా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. అందుకోసం సికింద్రబాద్ నుంచి మరో భారత గౌరవ్ టూరిస్ట్ రైలుని తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్ గౌరవ్ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ గౌరవ్ రైలుని విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.జర్నీ ఎలా సాగుతుందంటే..సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్‌కు చేరుకుంటారు.ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం కుదల్‌నగర్‌కు పయనమవుతారు.మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్లో బస చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శిస్తారు రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కన్యాకుమారికి పయనమవుతారు. ఐదో రోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్లో బస చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.ఆరో రోజు కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి..రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్‌ని సందర్శిస్తారు. ఇక తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్లో రైలు ఎక్కుతారు.ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకుతంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు.ఎనిమిదో రోజు మొత్తం రైలు జర్నీయే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.ఛార్జీలు: ఎకానమీలో ఒక్కరికి రూ. 14,250, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 13,250 చెల్లించాలి.స్టాండర్ట్‌లో ఒక్కరికిరూ.21,900; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.20,700 చెల్లించాలి.కంఫర్ట్‌లో ఒక్కరికిరూ.28,450; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.ఫుడ్ ఐఆర్టీసీదే..రైలులో టీ, టిఫిన్, భోజనంన్ని ఐరా్టీసీనే ఏ ర్పాటు చేస్తుందియాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించువాల్సి ఉంటుంది.పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.దక్షిణ భారత్‌లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్టీసీ టూరిజం లింక్‌పై క్లిక్ చేయండి.(చదవండి: తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!) -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఏ రంగంలో తెలుసా..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు. ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెప్పింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు. -
పవన్ ప్యాకేజీ రూ.1,400 కోట్లు పైనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఇంతవరకు వివిధ రూపాల్లో రూ.1,400 కోట్లకు పైగానే ప్యాకేజీ అందిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నారని.. ఈ మొత్తాన్ని ఇప్పటికే హవాలా ద్వారా పవన్ బినామీలకు చేరిందన్నారు. కాకినాడలో శనివారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకుని పెద్దఎత్తున సొమ్ములు తీసుకున్నారని తాను చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడే ఉంటానన్నారు. అలా వచ్చిన రూ.1,400 కోట్లను రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలించేశారన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని పవన్ పదేపదే చెబుతుండటం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్నే పవన్ రాజకీయంగా ఓటమి చెందినట్లు భావిస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం, ఆ తరువాత టీడీపీ శాశ్వతంగా మూతపడడం రెండూ ఒకేసారి జరుగుతాయని ద్వారంపూడి చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరని.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ లోకేశ్ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరం వంటి నేతలను కలవడం, నిన్నమొన్నటి వరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో సంబంధాలు.. వెంకయ్యనాయుడు వంటి వ్యక్తులతో సాగించిన చీకటి రాజకీయాలు ప్రజలకు తెలియనివి కావన్నారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులు కలిసి రాకపోవడంలేదనే అక్కసుతోనే లోకేశ్ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. బాబుకు ఇక అధికారం దక్కదు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి టౌన్: చంద్రబాబు తన జీవితకాలంలో మళ్లీ అధికారంలోకి రాలేరని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మండలంలోని మార్టూరు గ్రామంలో ‘ఏపీకి జగన్ కావాలి’ కార్యక్రమ సన్నాహక సమావేశం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద ఆధ్వర్యంలో శనివారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం చేకూర్చలేదన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలుచేశారన్నారు. చంద్రబాబు వివిధ నేరాల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లాడని, ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా నమ్ముతోంది కాబట్టే ఆయనకు బెయిల్ ఇవ్వటంలేదన్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌కు పార్టీ నడిపే దమ్ములేదని, ఒంటరిగా పోటీచేసే సత్తాలేదని అందుకే టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. ప్రజలనే అవినీతిపరులంటావా? పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ కార్వేటినగరం(చిత్తూరు జిల్లా): స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుపాలైన చంద్రబాబు అవినీతిపరుడు కాదని, అమాయకులైన ప్రజలే అవినీతిపరులంటున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాకోర్టులో పరాజయం తప్పదని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. శనివారం ఆర్కేవీబీపేటలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని, ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన్ను అరెస్ట్ చేస్తే దత్తపుత్రుడు రోడ్లపై దొర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు, కాంగ్రెస్‌లో ఉన్న రేణుకాచౌదరికి సంబంధమేంటని ప్రశ్నించారు. తన తండ్రి ఎన్టీఆర్ మృతికి చంద్రబాబే కారణమన్న పురందేశ్వరి.. నేడు చంద్రబాబు అరెస్ట్‌తో మరిదిపై ప్రేమ వలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, తన భర్త వేంకటేశ్వరరావులు తెలుగుదేశాన్ని వదిలి బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. తప్పు చేస్తే.. చట్టం ఎవరినీ వదలదు మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తప్పు చేస్తే చట్టం ఎవరినీ వదలదని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల విచారణలోనే ముందుగా చంద్రబాబు బాగోతం బట్టబయలయిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. బాబుపై అక్రమంగా కేసు నమోదు చేశామని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుందని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే బాబు అవినీతిపరుడని తేల్చాయన్నారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో శనివారం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. చంద్రబాబు కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. అవినీతిలో ముఖ్యపాత్ర పోషించిన చంద్రబాబు, లోకేశ్ పీఏలు ఇద్దరూ అమెరికాకు పారిపోయారని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎంలు జయలలిత, లాలూ ప్రసాద్‌యాదవ్ తదితరులంతా కోర్టుల ముందు నిలబడినవారేనని, బాబు ఏమైనా పైనుంచి దిగొచ్చారా.. అని ప్రశ్నించార‡ు. -
సింగపూర్, మలేషియాలకు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తాజాగా సింగపూర్, మలేషియా టూర్‌ను ప్రకటించింది. భారతదేశంలోని వారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న పర్యాటకులు మలేషియా, సింగపూర్లను సందర్శించాలని అనుకుంటారు. అయితే బడ్జెట్ కారణంగా ముందడుగు వేయలేకపోతారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐఆర్సీటీసీ సింపుల్ బడ్జెట్ ప్యాకేజీలో సింగపూర్, మలేషియాలలో పర్యటించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆహారం పానీయాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఇంగ్లీష్ గైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో పర్యాటకులను ముందుగా భారతదేశం నుండి విమానంలో సింగపూర్‌కు తీసుకువెళతారు. తరువాత అక్కడ టాక్సీ ఏర్పాటు చేస్తారు. విలాసవంతమైన హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీకి ఎన్చాంటింగ్ సింగపూర్ అండ్ మలేషియా అని పేరు పెట్టింది. ఇది ఫ్లైట్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ 2023 నవంబర్ 20న, అలాగే 2023, డిసెంబర్ 4న ప్రయాణించేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటాయి. ప్యాకేజీలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి. భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఐఆర్సీటీసీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు కౌలాలంపూర్‌లోని బటు గుహలు, పుత్రజయ సిటీ టూర్, కౌలాలంపూర్ సిటీ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సింగపూర్‌లో మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్, సెంటోసా ఐలాండ్ వంటి పలు ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా కూడా ఉంది. ఇక టిక్కెట్ ఛార్జీల విషయానికొస్తే ఒక్కొక్కరు రూ.1,63,700 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తుల ప్యాకేజీని బుక్ చేస్తే రూ. 1,34,950 చెల్లించాలి. రూ. 1,18,950తో ముగ్గురు వ్యక్తులు ఈ టూర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
‘మమ్మల్ని గోకితే రిజల్ట్ ఇలానే ఉంటుంది’
సాక్షి, కృష్ణా: సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. విజయవాడలో బుధవారం ఆయన సాక్షిటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు, హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. పనిలోపనిగా పవన్‌కు ఆయన చురకలు అంటించారు. ‘‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. దానకర్ణుడు, సమాజశ్రేయస్సు కోరే వ్యక్తి అని చెప్పే పవన్ ఎందుకు వాస్తవాలు దాస్తున్నాడు. తన నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్.. కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో చెప్పాల్సిన అవసరం పవన్‌కు కచ్చితంగా ఉంది అని అంబటి డిమాండ్ చేశారు. బ్రో సినిమానే ఒక స్కాం నూటికి నూరు శాతం బ్రో విషయంలో చాలా పెద్ద వ్యవహారం ఉంది. చంద్రబాబు ప్యాకేజ్ విశ్వప్రసాద్ ద్వారా అందింది. ఒక స్కామ్ మాదిరిగా ఈ ప్యాకేజ్ వ్యవహారం జరుగుతోంది. ఇదంతా వాళ్లు ఆడే గేమ్ ప్లాన్. అంకెలు చెబితే దొరికిపోతామని భయపడుతున్నారు. అందుకే చెప్పడం లేదు అని అంబటి ఆరోపించారు. మమ్మల్ని గోకితే ఇలాగే ఉంటుంది సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు?. మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన. ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు. -
ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే..
జనం ఈ రోజుల్లో అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్పైననే ఆధారపడుతున్నారు. ఇందుకోసం ఒక్కోసారి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటారు. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని కూడా వినియోగించుకుంటుంటారు. అయితే వర్జీనియాకు చెందిన ఒక మహిళకు వింత అనుభవం ఎదురయ్యింది. ఆ మహిళకు షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ నుంచి లెక్కకు మించిన పార్సిళ్లు అందాయి. ఆమె ఎటువంటి ఆర్డర్ చేయకుండానే చాలా సామానులు ఆమె ఇంటికి చేరాయి. ఇలా 100కు పైగా ప్యాకేజీలు ఆమె ఇంటికి వచ్చాయి. వర్జీనియాకు చెందిన మహిళ సిండీ స్మిత్ తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ..ఈ ప్యాకేజీలు ఇటీవల ప్రిన్స్ విలియం కౌంటీలోని ఇంటికి వచ్చాయన్నారు. వాటిలో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూగన్లు, పాతికకుపైగా భూతద్దాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు తాను వీటిని కారులో పెట్టుకుని తిరుగుతున్నానని,ఆ పేరుగలవారు ఎవరైనా కనిపిస్తే వారికి ఇచ్చేస్తానని తెలిపారు. ప్యాకేజీలపై స్మిత్ చిరునామా ఉన్నప్పటికీ పేరు లిక్సియావో జాంగ్ అని ఉందని తెలిపారు. తాను ఈ పేరును గతంలో ఎన్నడూ వినలేదని అన్నారు. మొదట్లో దీనిని స్కామ్ అనుకున్నానని, అయితే ఇది తనకు ఎదురైన తొలి అనుభవం కాదన్నారు. గతంలో తాను వాషింగ్టన్ డీసీలోని లిజ్ గోల్ట్మెన్లో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందన్నారు. అప్పట్లో తాను ఆర్డర్ చేయకుండానే లెక్కకు పైగా చిన్నపిల్లల దుప్పట్లు వచ్చాయన్నారు. ఇదేవిధంగా తనకు కాలిఫోర్నియాలోనూ ఇటువంటి అనుభవమే ఎదురయ్యిందన్నారు. నాడు తాను ఆర్డర్ చేయకుండానే 100 స్పేస్ హీటర్లు వచ్చాయన్నారు. ఈ ఉదంతం గురించి అమెజాన్ అధికారులు మాట్లాడుతూ ఆమెకు వస్తున్న ఆర్డర్లను పరిశీలిస్తే స్మిత్, గెల్ట్‌మాన్ పేరుతో ఉన్న ప్యాకేజీలు రెండూ అమ్మకందారులు అమెజాన్ కేంద్రాల నుండి యాదృచ్ఛిక చిరునామాలకు ప్యాకేజీలను పంపిన ఫలితంగా ఇలా జరిగిందన్నారు. న్యూయార్క్‌కు చెందిన న్యాయవాది సీజే రోసెన్‌బామ్ మాట్లాడుతూ విక్రేతలు యాదృచ్ఛిక చిరునామాలను ఎంచుకుని, అమెజాన్ గిడ్డంగులలోని తమ అమ్ముడుపోని ఉత్పత్తులను పంపిస్తున్నారని అన్నారు. తమ స్టోరేజీని తగ్గించుకునేందుకు వారు ఇలా చేస్తుంటార్ననారు. అయితే ఇలా వ్యవహించే అమ్మకందారుల అకౌంట్‌ను అమెజాన్ బంద్ చేసిందని తెలిపారు. ఇది కూడా చదవండి: వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
అండమాన్ లేదా దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం ఈజీ?
భారతదేశానికి చెందినవారు విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా దుబాయ్ లేదా అండమాన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అటు అండమాన్ లేదా ఇటు దుబాయ్ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడికైనా ప్రయాణమవుదామనుకుంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అయితే అండమన్ చూసివద్దామనే ఆలోచనను ప్రస్తావించగానే.. చాలామంది అక్కడకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో చక్కగా దుబాయ్ వెళ్లివచ్చేయవచ్చని చెబుతారు. మరికొందరు మాత్రం దుబాయ్ వెళ్లడం చాలా చౌక అని కూడా అంటుంటారు. దీంతో ఈ మాటలు విన్నవారు కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అండమాన్ వెళ్లాలో లేక దుబాయ్ వెళ్లాలో తెలియక తికమకపడతారు. ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ మీ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబయ్ లేదా అండమాన్‌కు సంబంధించిన టూర్ ప్యాకేజీకి ఎంతఖర్చవుతుందో బేరీజు వేసేందుకు మేక్ మైక్ ట్రిప్‌లో సమాచారం ఇలా ఉంది. దుబాయ్ వెళ్లేందుకు ఒక వ్యక్తికి సుమారు రూ. 31 వేలు అవుతుంది. ఈ ప్యాకేజీలో ఆరు రోజుల ప్లాన్ ఉంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, మరినా యాచ్ టూర్ మొదలైనవి కలిసే ఉన్నాయి. 6 రోజుల అనంతరం ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు వరకూ అయ్యే ఖర్చు దీనిలో కలిపే ఉంటుంది. హోటల్ అద్దె కూడా దీనిలో భాగమయ్యే ఉంటుంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్లు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతాయి. అంటే రెండు వైపుల ఫ్లయిట్ ప్రయాణ ఖర్చులు చూసుకుంటే మొత్తంగా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతాయి. అంటే ప్యాకేజీ, ప్రయాణ ఖర్చులు కలుపుకుని చూసుకుంటే ఒక్కో వ్యక్తి దుబాయ్ వెళ్లి రావడానికి రూ. 60 వేలు అవుతుంది. అండమాన్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబాయ్ గురించిన సమాచారం తెలుసుకున్న తరువాత ఇప్పుడు అండమాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకుందాం. రాబోయే ఆగస్టులో అండమాన్ వెళ్లాలనుకుంటే ఒక్కో వ్యక్తికి రూ. 42 వేలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హెవ్లాక్, నీల్ ఐల్యాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు చొప్పున బస చేయవచ్చు. ఈ ట్రిప్ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, ఫెరీ మొదలైన ఛార్జీలు కలిపే ఉంటాయి. అయితే అండమాన్ వెళ్లేందుకు ఫ్లయిట్ ఛార్జీ విడిగా ఉంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రూ. 30 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అండమమాన్ వెళ్లి వచ్చేందుకు రూ. 75 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కంపేరిజన్ను అనుసరించి చూస్తే.. అండమాన్ వెళ్లడం అనేది దుబాయ్ వెళ్లేందుకన్నా ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఇది సీజన్‌తో పాటు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అక్కడ ఉపయోగించుకునే లగ్జరీ సదుపాయాలు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
మెటాలో తొలగింపులు! వారికి జుకర్‌బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా?
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్‌ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి. ఈ మేరకు కొంతమంది మెటా ఉద్యోగులు లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తమ తొలగింపు గురించి తెలియజేశారు. ఈ రౌండ్ లేఆఫ్స్‌లో కంపెనీ యాడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే? గతంలో 11,000 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు మెటా కంపెనీ వారికి సీవెరెన్స్ ప్యాకేజీని వాగ్దానం చేసింది. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే ఉద్యోగులను తొలగించినప్పుడు కంపెనీ వారికి చెల్లించే మొత్తానికి సంబంధించిన ప్యాకేజీ. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద 16 వారాల మూల వేతనం చెల్లిస్తారు. అదనంగా ఉద్యోగుల అనుభవాన్ని బట్టి వారు పనిచేసిన ఒక్కో సంవత్సరానికి రెండు వారాల మూల వేతనం చొప్పున తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. అలాగే ఈ ప్యాకేజీ కింద ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలలపాటు వైద్య ఖర్చులను కంపెనీనే భరిస్తుంది. 2022 నవంబర్‌లో 11,000 మందికిపైగా ఉద్యోగులను మెటా తొలగించింది. తర్వాత ఈ ఏడాది మార్చిలో మళ్లీ 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సారి తొలగిస్తున్న ఉద్యోగాలతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2021 ఏడాది మధ్య నాటికి ఉన్న స్థాయికి పడిపోయింది. 2020 తర్వాత మెటా నియామకాలను రెట్టింపు చేస్తూ వచ్చింది. మొత్తంగా లేఆఫ్స్ ప్రభావం ఈ సారి నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగులపై పడింది. అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీతో ఇంజనీర్లు, నాన్ ఇంజనీరింగ్ ఉద్యోగుల మధ్య సమతూకం పాటించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత మార్చిలో హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
రిజైన్ పెట్టు..ప్యాకేజీ పట్టు..
-
ఏపీకీ ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి? అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా జమ్ము కశ్మీర్ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిలో ఒక అంశం. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశమని చెప్పారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, కశ్మీర్ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తాయని మిగిలిన రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 60:40గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. పూర్తి స్థాయిలో ప్రస్టేషన్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎలాగొలా తాము కలిసి ఉన్నామన్న సంకేతం పంపడం ద్వారా అయినా తమ విజయావకాశాలు పెంచుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. అందువల్లే రాజకీయ విలువలతో నిమిత్తం లేకుండా వీరిద్దరూ భేటీ అవుతున్నారు. నేరుగా తెలుగుదేశంతో ఇంతవరకు జనసేన పొత్తు పెట్టుకోలేదు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన నిత్యం టీడీపీతో కలిసి తిరుగుతోంది. గతంలో టీడీపీ వారు తనను ఎంతో అవమానించారని పవన్ వాపోయినా, ఇప్పుడు అవన్ని మర్చిపోయి, కనీసం తనైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న తాపత్రయంతో చంద్రబాబుతో పొత్తు కోసం తహతహ లాడుతున్నారు. చంద్రబాబు ఏమో పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపు సామాజికవర్గ ఓట్లను లాగి అధికారం సాధించాలని ప్లాన్ వేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఘోర పరాభవాలను మర్చిపోలేని భారతీయ జనతా పార్టీవారు తాము టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమి అవుతుందో కాని, ఇప్పటికైతే టీడీపీ, జనసేన దాదాపు ఒక అవగాహనకు వచ్చేసినట్లే ఉన్నాయి. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో సహజంగానే అది పెద్ద రాజకీయ వార్త అవుతుంది. బీజేపీతో కాపురం, టీడీపీతో సహజీవనం చేస్తున్న పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఒకటి అవడానికి యత్నిస్తున్నారు. నిజానికి వీరు ఇద్దరూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. అఫ్ కోర్స్ .. ఇంకా ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేయాలి? ఎన్ని రకాలైన అబద్దపు కుట్రలు పన్నాలి అన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు. మీడియా సమావేశం తర్వాత వీరిద్దరూ చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ అభిప్రాయం కలుగుతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే కొత్త ఎజెండాను ప్రకటించవచ్చు. విమానాశ్రయాలలో ఏ పార్టీ వారు అయినా పూలకుండీలు పగులకొట్టి, విధ్వంసం చేయవచ్చని వీరు హామీ ఇవ్వవచ్చు. ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ కారు టాప్‌పై తన ఇష్టం వచ్చినట్లు కూర్చున్నట్లుగా ఏపీలో ప్రజలు ఎవరైనా, కారుపై గాలితనంగా కూర్చోవచ్చనే హామీ ఇవ్వవచ్చు. రోడ్డుపై ఎవరు పడితే వారు తమ ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవచ్చు. అయినా పోలీసులు ఏమైనా చర్య తీసుకుంటే వారిని టెర్రరిస్టులుగా ప్రకటించి తమ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వీరిద్దరూ ఎన్నికల హామీగా ఇవ్వవచ్చు. రోడ్డుపై సభలు పెట్టి తొక్కిసలాటలు జరిగినా కేసులు ఉండవు. కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకుంటాం. తొక్కిసలాటలలో మరణిస్తే వారి ఖర్మే తప్ప, సంబంధిత పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పవచ్చు. తెలుగుదేశం, జనసేన సభలకు భారీ ఎత్తున జనసమీకరణకు కానుకలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించవచ్చు. ఈ కొత్త ఎజెండాతో వీరు ఎన్నికలకు వెళితే ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుందని వారు ఆశిస్తున్నారేమో తెలియదు. కందుకూరులో ఎనిమిది మంది తొక్కిసలాటలో మరణిస్తే పవన్ కల్యాణ్ వారిని ఎందుకు పరామర్శించలేకపోయారు? టీడీపీ వారి బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? గుంటూరులో కానుకల పేరుతో చంద్రబాబు సభకు జనాన్ని పోగుచేసి తొక్కిసలాటకు కారణమైన వారిని ఒక్క మాట అనని పవన్ కల్యాణ్, ప్రభుత్వం రోడ్లపై సభలు వద్దన్న జీఓతో ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయినట్లు చంద్రబాబుతో కలిసి మాట్లాడడం అంటే వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుప్పంలో నిబంధనలు పాటించాలని కోరితే చంద్రబాబు పోలీసులను, ముఖ్యమంత్రి జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషించి అదే ప్రజాస్వామ్యం అని అంటుంటే పవన్ అవునవును అంటున్నారు. బ్రిటిష్ కాలపు నాటి చట్టం అని చంద్రబాబు అంటుంటే అవును కదా అని తాన అంటే తందానా అంటున్నారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలలో రోడ్లపై నిరసన తెలిపినా కఠిన శిక్షలు ఉంటాయి. జరిమానాలు ఉంటాయి. కాని ఏపీలో మాత్రం రోడ్లు రాజకీయ పార్టీల వికృత క్రీడలకు వేదికలు అవుతున్నాయి. రోడ్డు మీద సభ పెడితే జన సమీకరణకు మరీ ఎక్కువ కష్టపడనవసరం లేదు. చుట్టు పక్కల ఉన్నవారంతా సభకు వచ్చినట్లే ప్రచారం చేసుకోవచ్చు. ఎటూ డ్రోన్ల ద్వారా ఉన్నవి, లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపించవచ్చు. బహిరంగ సభకు జనం రాకపోతే పరువు పోతుందన్న భయం ఉండవచ్చు. ఈ జీఓకి వ్యతిరేకంగా ఏమి చేసేది చంద్రబాబు, పవన్‌లు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. మరి వీరు ఏమి చర్చించి ఉంటారు? కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తు ఎలా పెట్టుకోవాలి? బీజేపీని తమ గూటిలోకి ఎలా లాక్కురావాలి? ఒక వేళ వారు రాకపోతే, వీరిద్దరూ ఎలాంటి పొత్తు పెట్టుకోవాలి? మొదలైన విషయాలను చర్చకు వచ్చి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పనే చెప్పేశారు. రాజకీయాలలో పొత్తులు ఉంటాయని, గతంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి చెప్పి ఉండాలి. కావాలనే ఆయన ఆ పాయింట్ చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతకీ ముఖ్యమంత్రి పదవిని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారా? లేదా? కోరుకుంటే ఆ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారా?. తాము గెలిస్తే తనకు కాకుండా పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఇస్తామని ఆయన చెప్పగలరా?. గతంలో ఎప్పుడూ తామే త్యాగం చేయాలా అని బాధపడ్డ పవన్ కల్యాణ్ దీనిపై పట్టుబట్టే శక్తి కలిగి ఉన్నారా? లేక చంద్రబాబు చెప్పే మాటలకు బుట్టలో పడిపోతారా? లేక తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పెద్ద పదవి అని సరిపెట్టుకుంటారా? ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు పలు విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ సంక్రాంతి కానుక అందుకోవడానికి తనను దత్తత తీసుకున్న తండ్రి వద్దకు వెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సీఎం పదవితో నిమిత్తం లేకుండా పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏదో ప్యాకేజీ డీల్‌కు అమ్ముడు పోయారన్న విమర్శలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చదవండి: జీ హుజుర్.. చంద్రబాబుతో పవన్ భేటీ అందుకే.. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించే అవకాశం లేదు. అందుకే ఆయా పార్టీలను కలుపుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో జగన్ ఎంత బలవంతుడుగా ఉన్నది చెప్పకనే చెబుతున్నారనుకోవచ్చు. ఏది ఏమైనా ఏదో ఒక పేరుతో చంద్రబాబు, పవన్‌లు తరచుగా భేటీ అవుతూ టీడీపీ, జనసేన క్యాడర్‌కు ఒక సంకేతం పంపడానికి తంటాలు పడుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాలలో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య చాలా అంతరం ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడని రాజకీయ వాతావరణం ఉంటుంది. దానిని తగ్గించడానికి వీరు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారని గమనించవలసి ఉంటుంది. బీజేపీని వదలిపెట్టి అయినా చంద్రబాబు వేలు పట్టుకుని నడవడానికి పవన్ కల్యాణ్ సిద్దపడుతున్నారన్న విషయం ఈ భేటీలతో బోధపడుతుంది. ఎజెండాతో నిమిత్తం లేకుండా ఇలా అనైతిక పొత్తులను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా? అన్నదే అసలు సమస్య. -హితైషి -
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
మెక్సికో విమానాశ్రయంలో యునైటెడ్స్టేట్స్కు వెళ్లే ప్యాకేజీలో మానవ పుర్రెలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ మేరకు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కార్డ్బోర్డ్ పెట్టేలో అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన పుర్రెలు కనుగొన్నారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ప్యాకేజిని అధికారులు గుర్తించారు. దేశంలో అత్యంత హింసాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామకు వెళ్లనుందని తెలిపారు. ఆ మానవ అవశేషాలు ఏ వయసు వారివి? ఎవరివీ? అనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి మానవ అవశేషాలను పంపించాలంటే హెల్త్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఐతే ఈ ప్యాకేజి ఆ అనుమతిని పొందలేదని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇలానే కెన్యా నుంచి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) తన నివేదికలో పేర్కొంది. (చదవండి: చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్.. షాక్‌లో బీజింగ్) -
జో బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. -
Twitter layoffs: ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్ శనివారం ట్వీట్ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. ట్విట్టర్‌ను మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్ స్లిప్పులు అందుతున్నాయి. భారత్‌లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో లేఆఫ్‌లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
హైదరాబాద్ విద్యార్థికి వెల్స్‌స్లీ వర్సిటీ రూ. 2 కోట్ల స్కాలర్షిప్
మల్కాజిగిరి: లక్ష్య సాధనకు సంకల్ప బలం దండిగా ఉండాలి. విజయం దిశగా పయనించేందుకు అకుంఠిత శ్రమ తోడవ్వాలి. ఆ కోవకు చెందిన యువతియే మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన లక్కప్రగడ నీలిమ కుమార్తె శ్రేయా సాయి. అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్లీ కాలేజీలో 2022– 26 వరకు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోసం రూ.2.7 కోట్ల (ఇండియన్ కరెన్సీ) స్కాలర్షిప్ ప్యాకేజీని సదరు యూనివర్సిటీ నుంచి ఆమె పొందడం గమనార్హం. శ్రేయా సాయి సైనిక్‌పురిలోని భవన్స్‌లో పదో తరగతి, నల్లకుంటలోని డెల్టా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వెల్స్‌స్లీ కాలేజీని ఎంపిక చేసుకొని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. శ్రేయా సాయి ప్రతిభను గుర్తించిన మసాచుసెట్స్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్, సైకాలజీలో యూజీ చేయడానికి రూ.2.7 కోట్లు మంజూరు చేస్తూ మార్చి నెలలో సంబంధించిన పత్రాలను అందజేశారు. కాలేజీ ఫౌండర్ శ్రీకాంత్ మల్లప్ప, అకాడమీ డైరెక్టర్ భాస్కర్ గరిమెళ్లతో పాటు పాటా్నకు చెందిన గ్లోబల్ సంస్థ సీఈఓ శరత్ సహకారంతో వెల్స్లీ కళాశాలలో సీటు సాధించినట్లు శ్రేయా సాయి తెలిపింది. వచ్చే నెలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్నట్లు పేర్కొంది. అమ్మ తోడ్పాటుతోనే.. s పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొనే దాన్ని. స్వచ్ఛ భారత్ నిర్వహణకు తోటి విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేశాను. కేబినెట్ మెంబర్‌గా ఉండేదాన్ని. అమ్మ నీలిమతో పాటు అమ్మమ్మ జానకీదేవి సహకారం ఎంతో ఉంది. ప్రత్యేక కార్యాచరణతో ఆన్లైన్ అసైన్‌మెంట్స్‌తో పాటు, సెమినార్స్‌లో పాల్గొనేదాన్ని. నా పట్టుదలే లక్ష్యాన్ని దరిజేరేలా చేసింది. – శ్రేయాసాయి (చదవండి: బాత్రూంలోనే నివాసం) -
రైతు బిడ్డకు రూ. 1.8 కోట్ల భారీ ప్యాకేజీతో జాబ్
కోల్‌కతా: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డ.. తండ్రి కష్టం చూసి కష్టపడి చదివాడు. ఆ కష్టం ఇప్పుడు ఫలించింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. అదీ ఫేస్బుక్లో. తమ బిడ్డ సాధించిన ఘనతకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతున్న బిశాక్ మోండాల్‌కు.. హయ్యెస్ట్పే ప్యాకేజీతో జాబ్ దక్కింది. అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్భూమ్లోని రామ్‌పూర్‌హట్‌లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్వాడీ వర్కర్. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. బిశాఖ్ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్బుక్లో జాయిన్ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్. అయితే ఫేస్బుక్ కంటే ముందు అతనికి గూగుల్, అమెజాన్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్బుక్ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు. గతంలో కోటి కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా.. ఆ అందరిలోకెల్లా హయ్యెస్ట్ ప్యాకేజీ దక్కించుకుంది మాత్రం బిశాఖ్ కావడం గమనార్హం. -
Wanaparthy: రూ.1.20కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్కుమార్రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. అనీష్‌కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో, ఇంటర్ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ (సీఎస్) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్‌ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. చదవండి: (సర్కారు వారి పాట) -
4,800 కోట్ల డాలర్లతో జపాన్ అత్యవసర ప్యాకేజీ
టోక్యో: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న చమురు, తిండి గింజల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు 4,800 కోట్ల డాలర్ల అత్యవసర ప్యాకేజీని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీతో చమురు సబ్సిడీలు, చిన్న వ్యాపారాలకు, అల్పాదాయ కుటుంబాలకు ఊతం అందిస్తామని ప్రధాని తెలిపారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలకు గట్టిగా సమాధానం చెబుతోంది. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది. చదవండి: (పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?) -
జాక్‌పాట్ కొట్టాడు! ఏకంగా 15వేల కోట్ల రూపాయల ప్యాకేజీ
Quantumscape CEO Jagdeep Singh: సాధారణంగా కంపెనీల సీఈవోలు తమ సేవలకు నెలవారీ లేదంటే ఏడాదికి ప్యాకేజీ జీతాలను అందుకోవడం కామన్. కానీ, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మాత్రం వెరైటీగా ‘జీరో శాలరీ’తో షేర్ల ద్వారా తన బిలియన్ డాలర్ల దాహం తీర్చుకుంటున్నాడు. అయితే ఈ లిస్ట్‌లో ఇప్పుడు భారీ ప్యాకేజీ అందుకునేందుకు భారత సంతతికి చెందిన ఓ సీఈవో సిద్ధంగా ఉన్నాడు. అమెరికన్ స్టార్టప్ క్వాంటమ్‌స్కేప్ కార్పొరేషన్.. కార్లలో ఉపయోగించే లిథియమ్ మెటల్ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే కంపెనీ. 2010లో కాలిఫోర్నియా, శాన్ జోన్స్ బేస్డ్గా ఇది కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, వోగ్స్వాగన్ లాంటి కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ కంపెనీకి వ్యవస్థాపకుడు(మరో ఇద్దరితో కలిసి), సీఈవోగా ఉంది భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు విపరీతమైన లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి కూడా. కిందటి ఏడాది బ్లాంక్ చెక్‌తో ఐపీవోకి వెళ్లిన క్వాంటమ్‌స్కేప్.. 50 బిలియన్ల విలువతో మల్టీబిలియన్ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఒప్పందం ప్రకారం.. సీఈవో జగ్దీప్ సింగ్‌కు ఏకంగా 2.3 బిలియన్ డాలర్లు విలువ చేసే(మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) షేర్లను కట్టబెట్టాలని నిర్ణయించుకుంది క్వాంటమ్‌స్కేప్ బోర్డు. కానీ, నిర్ణీత సమయంలో లక్క్ష్యం అందుకోవడం, కొన్ని మైళ్లు రాళ్లను దాటడం పూర్తి చేస్తేనే ఆయనకి ఈ విలువైన షేర్లు దక్కనున్నాయట. బుధవారం జరిగిన షేర్‌హోల్డర్ సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు అడ్వైజరీ కంపెనీ గ్లాస్ లూయిస్ చెప్తోంది. తొలుత ఈ ప్రతిపాదనకు వాటాదారులు ఒప్పుకోనప్పటికీ.. జగ్దీప్ సింగ్‌పై పూర్తి నమ్మకం కంపెనీ ప్రదర్శించడంతో షేర్హోల్డర్స్కు అంగీకరించారని, చివరకు డీల్ కుదిరిందనేది గ్లాస్ లూయిస్ సారాంశం. అదే జరిగితే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తర్వాత కేవలం వాటాల ద్వారానే అంతేసి లాభాలు అందుకునే రెండో సీఈవోగా జగ్దీప్ సింగ్ పేరు కార్పొరేట్ రంగంలో నిలిచిపోవడం ఖాయం. చదవండి: మరో సంచలనానికి సిద్దమైన ఎలన్ మస్క్..! -
జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..
Reliance Jio Becomes the First Operator to Offer a Rs 1 Prepaid Plan with 100 MB Data Valid for 30 Days: దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. మంగళవారం గప్‌చుప్‌గా ఈ ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ జియో. 100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట. ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్ ప్యాకెట్ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్ ద్వారా 10రూ.తోనే వన్ జీబీ పొందే వీలు ఉంటుంది. ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్ డేటాప్లాన్.. అన్నేసి రోజుల వాలిడిటీతో ఏ టెలికామ్ ప్రొవైడర్ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది. నేరుగా మైజియో యాప్ ద్వారా ఈ రీచార్జ్ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్ జియో. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్ -
ఉబర్‌లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
బుల్ జోరుకు బ్రేక్..
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల నమోదు తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం బుల్ జోరుకు బ్రేక్ పడింది. సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52,736 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయి 15,814 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడేళ్లు గరిష్టానికి చేరుకోవడం కూడా మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం ప్రకటించిన రూ.1.1 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఐటీ, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు ఒక శాతం క్షీణించి సూచీల ఆరంభ లాభాల్ని హరించి వేశాయి. అయితే ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. ప్రైవేటీకరణ వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు మరోసారి డిమాండ్ నెలకొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1659 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1277 కోట్ల షేర్లను కొన్నారు. రికార్డు లాభాలు మాయం... దేశీయ మార్కెట్ ఉదయం సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 53,127 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,916 వద్ద మొదలయ్యాయి. ఈ ప్రారంభ స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. ఆసియాలో పలు దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో కదలాడటం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సూచీలు ఆల్‌టైం హైని తాకిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. మిడ్ సెషన్ తర్వాత యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారం భం, ఆర్థిక మంత్రి ఉద్దీపన చర్యలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఉధృతి మరింత పెరిగింది. చదవండి: పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. -
Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే మూడు కోట్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహదారు కేవీ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటిస్తున్న ప్యాకేజీలకు అదనంగా ఈ మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ఉండాలన్నారు. మౌలిక రంగంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సంభాషణలో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వ్యాఖ్యలు కేవీ సుబ్రమణియన్ చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా విడుదల చేసే నిధుల్లో అధిక భాగం మౌలిక రంగంలో ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతను దేశం నష్టపోయిందంటూ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. చదవండి : 2021లో ఇండియాలో టాప్ కంపెనీలు ఇవేనంట -
1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పలు వర్గాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.1,250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తక్షణమే అర్హులకు ఆర్థికసాయం అందిస్తామని సీఎంయడియూరప్ప తెలిపారు. పండ్లు, కూరగాయల రైతులకు ప్రతి హెక్టార్‌కు రూ.10 వేలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3 వేలు, నిర్మాణ కార్మికులకు రూ.3 వేలు, చర్మకారులు, అసంఘటిత కార్మికులకు తలా రూ.2 వేలు, వీధి వ్యాపారులకు రూ.2 వేలు, కళాకారులు, కళా బృందానికి రూ.3 వేలు చొప్పున అందజేస్తామని సీఎం తెలిపారు. రుణ వాయిదాల చెల్లింపులకు మూడునెలలు విరామమిచ్చారు. ఈ మూడునెలల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రెండు నెలలు ఉచిత రేషన్ అందజేస్తామని చెప్పారు. -
లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!
టెక్సాస్: సాధారణంగా దొంగలు మెడలోని బంగారం.. చేతిలోని ఫోన్లు.. ఖరీదైన వస్తువులను చోరీ చేస్తుండంటాన్ని మనం చూసుంటాం. కానీ, మహిళలు దొంగతనం చేయటం చాలా అరుదు. అలాంటిది పట్టపగలు ఓ ఇంటి ముందు దొంగతనం చేయటం.. దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పని చేసుకుపోవటం సాధారణ విషయం కాదు. అమెరికాకు చెందిన ఓ మహిళ గుమ్మం ముందు పెట్టిన ఒక పార్శిల్‌ను చోరీ చేసి, దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తింది. వివరాలు.. కొద్దిరోజుల కిత్రం టెక్సాస్‌లో ఇంటి ముందు పార్శిల్ పెట్టి పెట్టి వెళ్లిపోయాడు పార్శిల్ సర్వీస్ అతను. ఆ పార్శిల్‌ను ఓ చోరీ చేయాలనుకొంది. పార్శిల్‌ను చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చి రెప్పపాటులో దాన్ని తీసుకొని పారిపోయింది. ఈ క్రమంలో ఆమె వేసుకున్న టీషర్ట్ జారీపోయింది. అయితే, ఆ లేడీ దొంగ ఇదేమి పట్టించుకోలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. దీనిలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తొంది. తొందరలోనే ఆ మహిళను పట్టుకుంటామని కౌంటీ ప్రెసింట్ కానిస్టేబుల్ అలన్ రాసెన్ తెలిపారు. దీనిపై పెద్దగా శిక్షలుండవని, కేవలం ఆ వస్తువు విలువను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఘరానా దొంగ’, ‘లేడి డాన్’, ‘దొంగతనం కూడా ఆర్ట్ ’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు! -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు సోమవారం ఊపందు కున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభంనుంచి బైటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని అమెరికా పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తరువాత ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారీ ప్యాకేజీ మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న అంచనాలతో డాలర్ క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేసింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.68 శాతం లేదా 310 రూపాయలు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ .46,046 వద్ద ఉంది.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం లేదా 778 రూపాయలు పెరిగి కిలో 69,562 రూపాయలకుచేరింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 46,970 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు ధర 1,748 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పెరిగి 26.71 డాలర్లకు చేరింది. అమెరికా ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు. కాగా శుక్రవారం స్పాట్ మార్కెట్లో, బంగారం ధరలు 10 గ్రాములకు 342 రూపాయలు తగ్గి 45,599 రూపాయల వద్ద ఎనిమిది నెలల కనిష్టానికి చేరాయి. అలాగే 2 వేల రూపాయలకు పైగా క్షీణించిన వెండి కిలోకు రూ .67,419 కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
‘నేనేం పిల్లిని కాను’: జూమ్ యాప్‌లో ఫన్నీ ఘటన
అమెరికాలో కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఓ ప్యాకేజీ ప్రకటిద్దామని అధికారులు నిర్ణయం తీసుకుని దానిపై చర్చించేందుకు జూమ్ యాప్‌ను ఉపయోగించారు. జూమ్ యాప్‌లో మాట్లాడుతున్న సమయంలో జరిగిన ఓ చిన్న సంఘటన వైరల్‌గా మారింది. తలకిందులుగా ప్రసారమవడంతో ఓ కాంగ్రెస్ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. ‘తానేం పిల్లిని కాను’ అని తలకిందులుగా వచ్చిన ఫొటోను స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు పలువిధాలుగా కామంట్స్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుపై చర్చా సమావేశం జూమ్ యాప్‌లో నిర్వహించింది. సభ్యులు, అధికారులతో కలిసి ఆన్లైన్ జూమ్ యాప్ కేంద్రంగా సమావేశం నిర్వహించగా ఈ సమయంలో చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు టామ్ ఎమ్మర్ మాట్లాడుతుండగా వీడియో తలకిందులుగా ప్రసారమైంది. దీంతో టామ్ ఎమ్మర్ కూడా తలకిందులుగా కనిపించాడు. దీన్ని చూసిన అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు మీరు బాగానే ఉన్నారు కదా..? అని ప్రశ్నించారు. ‘ఇలా ఎందుకు వస్తుందో తనకు తెలియదని, దీనిని ఒకసారి ఆపివేసి, తిరిగి మళ్లీ ప్రారంభిస్తా’ అని చెప్పారు. దీనిపై ఆయన అసహనానికి గురయ్యాడు. వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకుని దాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. ‘తాను తలకిందులుగా వేలాడడానికి పిల్లిని కాదు’ అని ట్వీట్ చేశాడు. I am not a cat. pic.twitter.com/d4lhQd0sJ4 — Tom Emmer (@RepTomEmmer) February 10, 2021 -
ఊరట : త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించేందుకు కసరత్తు చేపడుతోంది. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతితో పాటు చిన్న వ్యాపారులను ఆదుకోవడంపై ఈసారి ప్రభుత్వం దృష్టిసారించింది. రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలోనే ఆశించవచ్చని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణియన్ ఇటీవల పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సంకేతాలను ఆయన ప్రకటన స్పష్టం చేసింది. లాక్డౌన్ ముగియడంతో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు, సేవలు అందుబాటులోకి రావడంతో తాజా ప్యాకేజ్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అత్యున్నత భేటీలను నిర్వహించడం కూడా రాబోయే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు పెంచుతోంది. మరోవైపు ఇటీవల వెల్లడైన జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజాన్ని వెల్లడించడంతో తదుపరి ప్యాకేజ్‌ను ప్రకటించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ 23.9 శాతం తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కోవిడ్-19తో అత్యధిక ప్రభావానికి గురైన దేశంగా భారత్ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన క్వార్టర్లలోనూ ఇవే సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. చదవండి : చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం పండుగల సీజన్ రాబోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిమాండ్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి చర్యలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వ అధికారులు తరచూ కార్పొరేట్ నేతలతో సమావేశమవుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నారు. డిమాండ్ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి విస్పష్టంగా సూచిస్తున్నాయి. చిరు వ్యాపారులు, మధ్యతరగతికి ఊరట తాజా ప్యాకేజ్‌లో చిన్న వ్యాపారాలను కాపాడటం, మధ్యతరగతికి మేలు చేసే చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్యాకేజ్ పరిమాణం, ఏ సమయంలో ప్రకటించాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. మధ్యతరగతి వర్గంతో పాటు చిన్నవ్యాపారాలకు ఊతమివ్వాలని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. రాబోయే ఉద్దీపన ప్యాకేజ్ ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని రీతిలో సమస్యలను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యక్షంగా ఆర్థిక ఊతమిచ్చే చర్యలు తక్షణం చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు కోరుతున్నారు. -
మత్స్యకారుల వలసలను నివారిస్తాం: అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: మత్స్య శాఖ అభివృద్ధిపై మంత్రి డా.సిదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3వందల నుంచి 350 మిలియన్ టన్నుల ఎగుమతులే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, రామయపట్నం పోర్టుల అభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అనే పేరు వినబడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు భావనపాడు పోర్టుని పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్పెషల్ పరపస్ వెహికల్‌ను ఏర్పాటు చేసి, ల్యాండ్ లార్డ్ మోడల్లో నిర్మాణం చేపడతాం అని తెలిపారు. మొదటి దశ 5 వందల ఎకరాల్లో బల్క్ కార్గో పోర్ట్ నిర్మాణం జరుగుతందని, మలి దశలో 2217 ఎకరాల్లో భావనపాడు పోర్ట్ నిర్మాణం జరగుతుందని పేర్కొన్నారు. కాగా భావనపాడు, దేవునల్తాడ గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద నష్టపరిహారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. మంచినీళ్ల పేట, బుడగట్ల పాలెం వద్ద జెట్టీ నిర్మాణం చేపడతామని, మత్స్యకారుల వలసలను రాబోయే రోజుల్లో నివారిస్తామని తెలిపారు. ఇళ్లు కోల్పోయేవారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం, ఇళ్లస్థలం లేదా ఇళ్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు కేటాయిస్తామని తెలిపారు. ఇల్లు వద్దనుకునేవారికి వన్ టైం సెటిల్మెంట్ క్రింద పరిహారం ఇస్తామని, రవాణా చార్జీలతో సహా గౌరవప్రదమైన పరిహారం ఇవ్వబడుతుందని సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు -
ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బ్యాంకుల కన్సార్షియం మునుపటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాలి. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు మాల్యా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనేదానిపై స్పష్టత లేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (మాల్యా అప్పగింతపై సందేహాలు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. మరోవైపు శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్ ప్రభుత్వాన్ని మాల్యా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
పరిశ్రమల పునరుజ్జీవం కోసమే రీస్టార్ట్
తిరుపతి అన్నమయ్య సర్కిల్: కష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రంగాన్ని పునర్ నిర్మించేందుకు రీస్టార్ట్ ప్యాకేజ్ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.827కోట్ల ప్రోత్సాహక బకాయిలతో పాటు కొత్తగా రూ.1,168కోట్ల రీస్టార్ట్ ప్యాకేజ్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా రూ.512.35కోట్లు సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, జీఎండీ ప్రతాప్‌రెడ్డితో కలసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూతపడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే విడతలవారీగా నిధులు విడుదల చేస్తోందని తెలిపా రు. గత ప్రభుత్వంలో ఈ తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. జిల్లా వ్యాప్తంగా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మొదటి విడతలో 944 ఎంఎస్ఎంఈలకు రూ.68 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడతలో 854 ఎంఎస్ఎంఈలకు రూ.49.87 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇంత మొత్తంలో సాయం చేసిన సీఎంకు రాష్ట్ర వ్యాప్తంగా పారి శ్రామికవేత్తలు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయమన్నారు. మూతపడిన పరిశ్రమలను ఆదుకున్నారు మూతపడిన పరిశ్రమలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ముఖ్యమంత్రి సాయం అందించారు. పరిశ్రమలకు కార్పస్ ఫండ్, మార్కెట్ సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రాణం పోశారు. మేము 2018లో పరిశ్రమలు స్థాపించేటప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇబ్బందులుపడ్డాం. ఇప్పుడు కరోనాతో సంక్షోభంలో పడ్డాం. దేవుడిలా ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. – సురేష్, చక్రి ఇండస్ట్రీస్ అధినేత, పెనుమూరు ఆక్సిజన్ ఇచ్చారు ప్రస్తుతం పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితి. గత ప్రభుత్వ బకాయిలను కూడా ప్రస్తుతం విడుదల చేయడం వల్ల ఆక్సిజన్ ఇచ్చినట్లు ఉంది. మా గ్రానైట్ పరిశ్రమపరంగా పెట్టుబడి, విద్యుత్, అమ్మకపు పన్నులు, వడ్డీ అన్ని కలిపి పెండింగ్ ఉన్న రూ.30 లక్షలు విడుదలైంది. – జె.రాధిక, గ్రానైట్ పరిశ్రమ యజమాని గంగాధరనెల్లూరు -
తుది ప్యాకేజీ ప్రకటించవచ్చు : ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్బీఐ డైరెక్టర్ గురుమూర్తి అంచనా వేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబరులో తుది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న (మంగళవారం) భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబ్‌నార్‌లో గురుమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మధ్యంతర చర్యగా మాత్రమే భావించ వచ్చని గురుమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 అనంతర ఎరాలో చివరి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని చెప్పారు. అమెరికా, యూరోపియన్ దేశాలు నగదును ముద్రించుకుంటూ వస్తున్నాయి, కానీ భారతదేశంలో ఈ అవకాశం చాలా తక్కువే అన్నారు. అలాగే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గురుమూర్తి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15 వరకు ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో 16 వేల కోట్ల రూపాయలను జమ చేయగా, ఆశ్చర్యకరంగా చాలా స్వల్పంగా కొద్దిమంది మాత్రమే ఈ నగదును ఉపసంహరించు కున్నారని గురుమూర్తి పేర్కొన్నారు. సంక్షోభం తీవ్ర స్థాయిలో లేదనడానికి ఇదే సంకేతమన్నారు. ప్రస్తుతం దేశం భిన్న సమస్యలను ఎదుర్కొంటోందని గురుమూర్తి వెల్లడించారు. కరోనా అనంతరం ప్రపంచం బహుళ ఒప్పందాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా కోలుకుంటుందని ఆయన తెలిపారు. -
ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక సూచన చేశారు. ఆర్బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన తమ కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. తమ డ్యూటీ చేసుకోమని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం) మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నా, జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వం ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్ఎస్ఎస్ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ ఆందోళనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్ జోన్లోకి జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో రెపో రేటును 4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. Governor @DasShaktikanta says demand has collapsed, growth in 2020-21 headed toward negative territory. Why is he then infusing more liquidity? He should bluntly tell the government ‘Do your duty, take fiscal measures’. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2020 -
స్వావలంబన అంటే ఇదేనా?
నేటి కోవిడ్ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను విస్తారంగా ముద్రించి (‘ద్రవ్యలోటు’ భావనను పట్టించుకోకుండా) తద్వారా ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌నూ పెంచటం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి మోదీ వెనుకాడుతున్నారు. నిజానికి, నేటి సంక్షోభ కాలంలో, ప్రపంచంలోని అనేక దేశాలు, భారీగా తమ తమ కరెన్సీల ముద్రణ ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిరంతరం ‘స్వదేశీ’ మంత్రాన్ని జపిస్తోన్న మన పాలకులు మాత్రం విదేశీ రేటింగ్ సంస్థలకు వెరుస్తూ, షేర్ మార్కెట్లో విదేశీ మదుపుదారుల ప్రయోజనాలను కాపాడుతూ, అంతర్జాతీయరుణ సంస్థల షరతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మనది ఒక సార్వభౌమాధికార దేశమని, మన కరెన్సీ రూపాయిపై, దాని ముద్రణపై పెత్తనం,అధికారం మనదేననే విషయాన్ని మరచిపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మూల సిద్ధాంతమైన స్వదేశీని బూజుదులిపి స్వావలంబన రూపంలో బయటకు తీసింది. మే 5వ తేదీన మన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారు దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించుకునే ఆలోచన చేస్తున్నామని, (దానికి అనుగుణంగా) విదేశాల నుంచి వచ్చే దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసేందుకు సాంకేతికంగా ఆధునీకరించుకోవాలని భారత పారిశ్రామిక రంగానికి పిలుపును కూడా ఇచ్చారు. అలాగే, మే 12వ తేదీన 20 లక్షల కోట్ల ఉద్దీపన పేరిట ఒక విధాన, ఆర్థిక ‘‘పథకాన్ని’’ ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ కూడా స్వావలంబనను ఈ విధానం తాలూకు కేంద్ర బిందువుగా సెలవిచ్చారు. కానీ, ఈ స్వదేశీ విధానం దిశగా సాగే చిత్తశుద్ధి, సాహసం బీజేపీ నాయకత్వానికి ఉందా ? జవాబులు చూద్దాం. గతంలో వాజ్‌పేయి హయాం నుండి కూడా బీజేపీ మూల సిద్ధాంతాలుగా వున్న రెండు అంశాలు : 1. హిందూత్వ 2. స్వదేశీ. కాగా, ఇక్కడ మనం గమనించాల్సింది ఒక రాజకీయ పక్షంగా బీజేపీ తాలూకు సైద్ధాంతిక విజయం ప్రధానంగా స్వదేశీ తాలూకు వాగ్దానాల పునాదిపైనే ప్రాథమికంగా ఆధారపడి ఉంది. అంటే స్వదేశీ రూపంలో దేశ ప్రజల కనీస ఆర్థిక అవసరాలను పరిపూర్తి చేసిన తర్వాతే ఆ స్థిరమైన పునాదిపై బీజేపీ తన నినాదమైన హిందూత్వను సంపూర్ణంగా విజయవంతం చేసుకోగలదు. తొలినుంచీ కార్పొరేట్ అనుకూలతే! కాగా, 1996లో 13 రోజుల బీజేపీ ప్రభుత్వంలో అమెరికాకు చెందిన అవినీతి పుట్ట ఎన్రాన్ ప్రాజెక్టుకు వాజ్‌పేయి హయాంలో కౌంటర్ గ్యారంటీలు ఇవ్వడంతోనే బీజేపీ తాలూకు స్వదేశీకి మొదటి చావు దెబ్బ తగిలింది. అలాగే, నేటి ఎన్డీఏ 2 హయాంలో కూడా బీజేపీ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించిన స్థాయిలో విదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. అనేక సందర్భాలలో దేశీయ ఎగుమతులను పెంచుకోవడం, ఉపాధి కల్పనల వంటి అంశాలకు విరుద్ధంగా అమెరికాతో అంటకాగడం, ఆ దేశ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడమే చేశారు. ఈ క్రమంలోనే అమెరికాతో మనకి ఉన్న వాణిజ్య సమతుల్యత (ఎగుమతి దిగుమతుల సమతుల్యత) అమెరికాకు అనుకూలంగా మారింది. ఆ దేశంతో మనకు వున్న వాణిజ్య మిగులు స్థాయి పడిపోయింది. అలాగే బిలియన్ల కొద్దీ డాలర్ల ఆయుధాల దిగుమతులు గత కొన్నేళ్లలో అమెరికా నుంచి జరిగాయి. అలానే రష్యా నుంచి మనం కొనుగోలు చేయదల్చిన ఎస్400 మిసైల్ రక్షణ వ్యవస్థకు అమెరికా మోకాలడ్డినా మనం మారు మాట్లాడలేని దుస్థితిలోకి పోతున్నట్లు కనబడుతోంది. ఇక, మన చిరకాల మిత్రదేశం ఇరాన్ నుంచి, చమురు దిగుమతులను నిలిపివేయమని అమెరికా ఆదేశాలు జారీచేస్తే తలవంచి శిరసావహించాం. నిన్నగాక మొన్న, భారత్ తమకు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఔషధాన్ని ఎగుమతి చేయకుంటే సహించేదిలేదని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే ఔషధంపై విధించిన నిషేధాన్ని పక్కన పెట్టి మరీ మనం అమెరికాకు జోహుకుం చేశాం. ఇక, చివరగా నేడు కరోనా విషాద కాలంలో ఆర్థికంగా చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో నిర్ణయాలు చేయలేకపోయాం. మీనమేషాలు లెక్కించి మొదటి దఫా వాపు తప్ప బలంలేని 1.70 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పథకాన్ని ప్రకటించుకున్నాం. ఇక, చాలాకాలం వృధా చేశాక ప్రతిపక్షాలూ, ఏ రాజకీయాలులేని అభిజిత్ బెనర్జీ, రçఘురామ్ రాజన్ వంటి పలువురు ఆర్థికవేత్తలూ, కడకు స్టాండర్డ్ అండ్‌పూర్ వంటి పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలూ కూడా విమర్శలూ, సూచనలూ చేశాక, మే 12వ తేదీన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఒక ఉద్దీపనను ప్రకటించారు. కేంద్ర ఖజానాలో అదనంగా ఖర్చు 2 శాతమే ఈ ప్యాకేజీ స్వరూపం సూక్ష్మంగా: 1. ఇప్పటికే అప్పులపాలై, ఆర్థిక పటుత్వాన్ని కోల్పోయిన–– సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ, రైతులకూ, ఇతర బాధిత వర్గాలకూ రుణాలు ఇస్తాం తీసుకోండి అని ప్రతిపాదించడం. 2. 2020–21 బడ్జెట్‌ను కాస్తంత రీప్లే చేయడం. 3. సులభతర వాణిజ్యం పేరిట వివిధ కీలకరంగాల్లో భారీ స్థాయి ప్రైవేటీకరణలు.. అది చాలదన్నట్లు రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునేందుకు ఉన్న ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 5 శాతానికి పెంచే పేరిట ఈ వెసులుబాటును ఉపయోగించేందుకు రాష్ట్రాలు కూడా ప్రైవేటీకరణలు, యూజర్ చార్జీల మోతలూ మోగించాలని షరతు పెట్టడం. మొత్తంగా ఈ సోకాల్డ్ ప్యాకేజీలో కేంద్ర ఖజానా నుంచి అదనంగా ఖర్చుపెట్టింది కేవలం 2 శాతం లోపే. అంటే మాటలు కోటలు దాటినా, చేతలు గడపదాటడం లేదు. అంతిమంగా ఈ ప్యాకేజీలో లేనిదీ.. నేటి కోవిడ్ సంక్షోభ కాలంలో జనసామాన్యం అడుగుతున్న ఆ ఒక్కటే.. అదే హెలికాప్టర్ మనీ.. లేదా బాధిత వర్గాలకు వారి అకౌంట్లలోకి సరాసరి నగదును బదిలీ చేసి ఈ విపత్కాలంలో వారిని తక్షణం ఆదుకోవడం. ఈవిధంగా తమ దగ్గర డబ్బు లేదంటూ, నిరంతరంగా ద్రవ్య లోటును దాటలేమని సెలవిచ్చే మన పాలకులు దేశ సార్వభౌమాధికారానికీ, స్వతంత్ర నిర్ణయాధికారాలకూ తిలోదకాలు ఇస్తున్నారు. రేటింగ్ సంస్థలను సంతృప్తిపరుస్తూ, షేర్ మార్కెట్ సూచీలనే దేశ పురోగతికి కొలబద్దలుగా చూసుకుంటూ, విదేశీ ఋణదాతల షరతులకు తల ఒగ్గుతున్న నేటి ప్రభుత్వ నేతల తాలూకు ‘స్వదేశీ’ నినాదం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అంతే నిజం! బహుశా ఈ కారణం చేతనే నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ భారత ప్రభుత్వం నేటి కోవిడ్ సంక్షోభ కాలంలో ద్రవ్య లోటును పట్టించుకోకుండా భారీగా కరెన్సీని ముద్రించి అయినా, దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునే సాహసాన్ని చేయాలన్నారు. కాగా, తన ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ పెట్టి, ద్రవ్యలోటును పెంచుకుంటే (మరిన్ని కరెన్సీ నోట్ల ముద్రణ వంటి మార్గాల ద్వారా) దాని వలన ద్రవ్యోల్బణం పెరిగి అది రూపాయి విలువ పతనానికి దారి తీస్తుందనేదే మన ప్రభుత్వం తాలూకు ఆందోళనగా వుంది. నిజానికి, ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలా, రూపాయి దిగజారుడు గురించిన ఆందోళన అది దేశ ప్రజలకు చెరుపు చేస్తుందని కాదు. దీని వెనుకన ఉన్నది దేశీయ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపుదారుల ప్రయోజనాలు మాత్రమే. అంటే ఈ మదుపుదారులు మన షేర్ మార్కెట్లలో పెట్టుబడులను రూపాయి కరెన్సీలోనే పెట్టగలరు. కాబట్టి, ఇక్కడ రూపాయి విలువ తగ్గితే ఈ మదుపుదారుల పెట్టుబడులూ, లాభాల విలువ కూడా తగ్గిపోతుంది. అదీ కథ. ప్రపంచ దేశాలను ఈ విషయంలో అనుసరించరా? నేటి కోవిడ్ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను విస్తారంగా ముద్రించి (‘ద్రవ్యలోటు’ భావనను పట్టించుకోకుండా) తద్వారా ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌నూ పెంచడం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి మోదీ వెనుకాడుతున్నారు. నిజానికి, నేటి సంక్షోభ కాలంలో, ప్రపంచంలోని అనేక దేశాలు, భారీగా తమ తమ కరెన్సీల ముద్రణ ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. చివరకు, ఆర్థికంగా మనను పోలిన టర్కీ, ఇండోనేసియా దేశాలు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. కానీ, నిరంతరం ‘స్వదేశీ’ మంత్రాన్ని జపిస్తోన్న మన పాలకులు మాత్రం విదేశీ రేటింగ్ సంస్థలకు వెరుస్తూ, షేర్ మార్కెట్లో విదేశీ మదుపుదారుల ప్రయోజనాలను కాపాడుతూ, అంతర్జాతీయ ఋణ సంస్థల షరతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మనది ఒక సార్వభౌమాధికార దేశమని, మన కరెన్సీ రూపాయిపై, దాని ముద్రణపై పెత్తనం, అధికారం మనదేననే విషయాన్ని మరచిపోతున్నారు. వ్యాసకర్త : డి. పాపారావు ,ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
‘అధోగతి’ రాష్ట్రాలకు అధ్వాన్నపు ప్యాకేజీ
మనకు ఇప్పుడు మూడు రకాల చెప్పులు, చెప్పుళ్లు. ఒకటి నెత్తుట తడిసిన వలస కూలీ కాలు సొంతూరివైపు వేసిన అరిగిన చెప్పు. రెండోది విలేకరుల సమావేశంలో ఖాళీ నినాదాల చెప్పుడు. మూడోది దివాళా కోరు ఆర్థిక విధానాలకు మూర్ఖ జనం ఇంకా చూపని చెప్పు. మన ఖజానాలు ఖాళీ, నినాదాలు కూడా ఖాళీ. జాన్ హైతో జహాన్ హై తొలి నినాదం. తరవాత జాన్ భీ జహాన్ భీ. పైపైకి జాన్ భీ అన్నారు గాని, ప్రాణం పోతే పోయింది డబ్బు ముఖ్యం అని అసలు అర్థం. లాక్ డౌన్ నీరుగార్చి డబ్బు కరువు తీర్చడానికి మద్యం కట్టలు తెంచారు. కీలకమైన శాఖలలో సమర్థులను నియమించాలనే శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు. ప్రధానమైన పదవులకు ఎంచుకున్న వ్యక్తులను పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం పట్ల ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. అయినా మూర్ఖశిఖామణులకు అర్థం కావడం లేదు. కరోనా వైరస్ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బోలెడు లక్షల కోట్ల ప్రాజెక్టులు మొదలుపెట్టి అప్పులు తెచ్చుకుని చేతులెత్తేసే దుస్థితి. చెప్పుచేతల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్‌ను బతిమాలి బామాలి, వినకపోతే రాష్ట్ర గవర్నర్‌ను తీసేసినట్టు ఆర్బీఐ గవర్నర్‌ను తీసేశారు. ప్రపంచం అంతటా నిపుణులైన ఆర్థికవేత్తలను కేంద్ర బ్యాంకులకు గవర్నర్లుగా నియమిస్తే, భారత దేశం మాత్రం చెప్పిన మాట చేతులు కట్టుకుని వినే అనుయాయిని గవర్నర్ చేసేసింది. రాష్ట్ర పన్నులన్నీ పీకి, జీఎస్టీ పన్ను విధించింది. సంస్కరణ అంటే పన్నులు పెంచడం అనే కొత్త నిఘంటు అర్థం. రాష్ట్రాలు గోల చేస్తే రాష్ట్ర జీఎస్టీ అన్నారు. పన్నుల సంఖ్య తగ్గిస్తాం ఒకే దేశం ఒకే పన్ను అని ఇంకో ఖాళీ నినాదం. మనకు వినపడని నినాదం– పన్నుపన్నుకో పన్ను. కట్టకపోతే తన్ను. అన్నన్ని పన్నులు విధించి కేంద్రం, రాష్ట్రం మునిసిపాలిటీలు పళ్లూడగొట్టి వసూలు చేస్తున్నాయి. పన్నుల్లో ఎక్కువ శాతం కేంద్రం ఒళ్లో వచ్చి పడుతుంది. రాష్ట్రాల వాటాలు ఎప్పుడు బకాయిల్లోనే ఉంటూ ఉంటాయి. మాకు వసూళ్లు కావడం లేదు కనుక ఇవ్వం అంటున్నది కేంద్రం. ఉదా.. మహారాష్ట్ర రెవెన్యూ వ్యయానికి ఒక్క శాతం సాయం చేయాలన్నా 33 వేల 500 కోట్లు ఇవ్వాలి. కానీ, విపత్తు నిధికింద వారికి ఇచ్చింది కేవలం 4,300 కోట్లు. ఆదాయపరంగా అగ్రస్థాయిలో ఉన్న మహారాష్ట్ర గతే అదయితే మిగిలిన రాష్ట్రాలది అధోగతే. ఫైనాన్సియల్ రిస్క్ బిజినెస్ మేనేజ్మెంట్ చట్టాన్ని తీసేసి 2017లో కొత్త చట్టం తెచ్చారు. ఈ ‘సంస్కరణ’ ఏమంటే– ఆర్థిక సంక్షోభం వస్తే కేంద్రానికి గండం గడిచే మార్గాలు ఉన్నాయి కాని రాష్ట్రాలకు లేవు. వీటిని తప్పించుకునే మార్గాలు అంటారు. అంటే లక్ష్యంనుంచి దారి మళ్లే సదుపాయం. కేంద్రానికి జాస్తి, రాష్ట్రాలకు నాస్తి. అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వం. బకాయిలు ఇవ్వం. పన్నులు, అధికారాలు, చట్టపరమైన శక్తులు అన్నీ కేంద్రీ కృతం చేస్తాం. అధికారాలన్నీ మా కింద ఉన్న కేంద్ర అధికారుల చేతిలో పెడతాం. ముఖ్యమంత్రులంతా దేబిరిస్తూ ఉండాలని కేంద్రం అంటే దాన్ని ఫెడరలిజం అనీ ఆ పాలనను ప్రజాస్వామ్యం అనీ ఎవరూ అనుకోరు. కేరళ పదిహేను సంవత్సరాలకోసం 9 శాతం వడ్డీతో ఆరు వేల కోట్లరూపాయలు కాపిటల్ మార్కెట్ నుంచి అప్పుతీసుకున్నది. రాష్ట్ర జీడీపీ నిష్పత్తిని బట్టి ఇప్పటికే మన రాష్ట్రాల అప్పులు 27.7 శాతం పెరిగాయి. ఇంకా అప్పులు కావాలంటే ఎక్కువ వడ్డీరేటుతో తీసుకోవాలి. పేరుకుపోయిన ఈ అప్పుల భారాన్ని, తరువాత వచ్చే ప్రభుత్వాలు సంబాళించుకోవడం కష్టం. కరోనా సహాయ బాండులనుకొనే అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మరికొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. లేకపోతే పన్నులు పెంచుకుంటూ పోవడంతప్ప వారికి మరో దారి లేదు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచండి అప్పులు తీసు కుంటా మని రాష్ట్రాలు కోరితే కేంద్రం తన అధికారాలను విపరీతంగా పెంచే బిల్లులను ఆమోదించాలనే షరతు పెట్టింది. భారీనిధులు ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి షరతులు పెట్టరు. విద్యుచ్ఛక్తి సంస్కరణల పేరుతో రాష్ట్రాల అధికారాలన్నీ తుడి చిపెట్టి కేంద్రం గుప్పిట్లో పెట్టుకుంటే రేపు కరెంటు వాటా కోరినప్పుడు కూడా చెత్త షరతులు విధిస్తుంది. ఇదే దుర్మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విమర్శించారు. రుణపరిమితిని రెండు శాతం పెంచితే 20 వేలకోట్లు వనరులు అందుతాయి. ప్రతి రూపాయి వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించాలి. కేంద్రం మెహర్బానీ ఏమీ లేదు. రాష్ట్రాలను మరింత దిగజార్చే విద్యుచ్ఛక్తి చట్టం మార్పులు ఒప్పుకుని, జనం మీద పన్నుల పెంపు మోత మోగిస్తేనే మరో 2500 కోట్లకు ఇస్తామనడం రాష్ట్రాల పాలనా స్వాతంత్య్రాన్ని దెబ్బ తీయడమే అవుతుంది. రాష్ట్రాల ఖాళీ చిప్పల్లో కేంద్రం ఖాళీ ప్యాకేజీ. కరోనాబూచి చూపి నియంతృత్వాన్ని వ్యవస్థాపితం చేయాలనుకుంటే ఒప్పుకోకుండా విద్యుచ్ఛక్తి కేంద్రీకరణతో సహా కేంద్రం ప్రతిపాదించిన కొత్త షరతులన్నీ ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలు పట్టుబట్టాల్సిందే. తమను మతం పిచ్చిలో మందు మత్తులో ముంచి గెలిచే ఏ పార్టీ కూడా దేశం గురించి ఆలోచించదని జనం తెలుసుకోవాలి. పాలకుల కన్నా ముందు జనం తమ మత మత్తును, మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మరో ప్యాకేజీ ఆశలు : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన కీలక సూచీలు బుధవారం ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన పటిష్టంగా ముగిసాయి. ఫార్మా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ రానుందనే అంచనాలతో సెన్సెక్స్ నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకోవడంతో మిడ్ సెషన్ తరువాత లాభాల జోరందుకున్న సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసి 30818 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 9066 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 30500 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 9050కి ఎగువన ముగిసాయి. అరవిందో, గ్లెన్‌మార్క్, ఎస్కార్ట్స్ లాంటి ఫార్మ షేర్లు ప్రదానంగా లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ, డా. రెడ్డీస్ 6 శాతం ఎగిసి టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇంకా కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, బజాన్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జోరుగా ట్రేడ్ అయింది. మరోవైపు అదానీ పవర్, మైండ్ ట్రీ స్వల్పంగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి నష్టాలతో ముగిసింది. డాలరు బలం, ఆసియన్ కరెన్సీల బలహీనత నేపథ్యంలో 75.86 స్థాయిని టచ్ చేసింది. అయితే ఈక్విటీ మార్కెట్లో లాభాలతో చివర్లో తేరుకుని 75.79 వద్ద ముగిసింది. చదవండి : కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన -
‘విమానయాన రంగంలో భారీ సంస్కరణలు’
సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో భారీ సంస్కరణలు తీసుకునాబోతున్నట్లు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె విమానయాన రంగం గురించి మాట్లాడుతూ.. దేశంలో ఆరు ఎయిర్‌పోర్టులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరో 12 ఎయిర్‌పోర్టులలో ప్రైవేట్ పెట్టుబడుల వాటాను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.13వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోనున్నట్టు తెలిపారు. (చదవండి : ప్యాకేజీ 4.0: నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం) రూ.1000కోట్లతో ఎఫిషియెంట్ ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘భారత్‌లో 60 శాతం ఎయిర్ స్పేస్ మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన ఎయిర్ స్పేస్ వివిధ కారణలతో ప్రభుత్వ నియంత్రణలో ఉంది. దీని వల్ల విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. విమానాల ప్రయాణ కాలాన్ని తగ్గించుందకు ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎంఆర్వో ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. విమానాల నిర్వహణలో డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. దీనివల్ల కంపెనీలకు సివిల్ ఏవియేషన్ నిర్వహణ భారం తగ్గనుందని నిర్మల తెలిపారు. ఎయిర్ పోర్టులతో పాటు.. అంతరిక్ష పరిశోధన రంగాల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులు అనుమతి కల్పిస్తున్నామన్నారు. అంతరిక్ష పరిశోధనలలో ఇస్రోతో పాటు ఇతర ప్రైవేటు రంగానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
మనల్ని మనం తయారు చేసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. తీవ్ర పోటీని ఎదుర్కొనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ( అనుబంధ వ్యవ‘సాయా’నికి! ) తమ ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీకి మోక్షం లభించిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ప్రధానంగా నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని, పెట్టుబడులను వేగవంతం చేసేందుకు విధానపరమైన సంస్కరణలు చేపట్టామన్నారు. పారిశ్రామిక రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ బ్యాంకుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక క్లస్టర్ల గుర్తించామన్నారు. 5 లక్షల హెక్టార్లలో 3376 ఇండస్ట్రియల్ పార్కుల గుర్తింపు, బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు.. 50 బొగ్గు బ్లాకులలో వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు అవకాశం. నిర్ణీత గడువులో బొగ్గు ఉత్పత్తిని పూర్తి చేసిన కంపెనీలకు ప్రోత్సహాకాలు. ఖనిజాల తవ్వకాల కోసం 500 బ్లాకుల్లో వేలం పాట ద్వారా అందరికి అవకాశం. ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట. బొగ్గు గనులకు సంబంధించి పునరావాసం కోసం 50వేల కోట్లు కేటాయింపు. ఖనిజాల రవాణాను సులభతరం చేసేందుకు 18వేల కోట్లతో రైల్వే లైన్ల ఏర్పాటు. రక్షణరంగాన్ని బలోపేతం చేసేందుకు ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని రకాల ఆయుధాలను దేశీయంగా తయారుచేసుకుంటాం. కొన్ని రకాల రక్షణ ఉత్పత్తులను మనం తయారు చేసుకోగలిగినప్పటికీ... వాటిని చాలాకాలంగా దిగుమతి చేసుకుంటున్నాం. రక్షణ రంగానికి ఆయుధాలను సరఫరా చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని మరింత బలోపేతం చేస్తాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుల పనితీరును మెరుగుపరిచేందుకు వాటిని కార్పోరేట్ స్థాయికి తీసుకువెళ్తాం... అయితే వాటిని ప్రైవేటీకరించము. రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74శాతానికి పెంపు. -
ఆర్థిక ప్యాకేజీ : సీతారామన్ మూడో ప్రెస్‌మీట్
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజీపై మూడో విడత వివరాలను అందించ నున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో ఈ ప్యాకేజీకి సంబంధించి ఆమె ముచ్చటగా మూడోసారి ప్రసంగించ నున్నారు. (రైతులకు 2 లక్షల కోట్లు) కరోనా వైరస్, సంక్షోభం లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఉపశమన చర్యలపై వరుసగా మీడియా సమావేశాల వివరిస్తున్న ఆర్థికమంత్రి సీతారామన్ బుధవారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ) బ్యాంకింగ్ రహిత ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) రుణసదుపాయాలను కల్పించారు.. గురువారం (మే 14) ప్యాకేజీకి సంబంధించి రెండవ దశ చర్యలను ప్రకటించారు. ఇందులో వలస కార్మికులు, వీధి విక్రేతలు, చిన్న వ్యాపారులు, చిన్న రైతుల ప్రయోజనాలపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. -
నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ : నేడు వ్యవ‘సాయం’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ , లాక్డౌన్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియాకు వివరించ నున్నారు. నిర్మలా సీతారామన్ గురువారం తన రెండవ మీడియా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అలాగే సప్లయ్ చెయిన్, అంతరాయాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలను ఆర్థిమంత్రి సూచించనున్నారని భావిస్తున్నారు. (భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్) బుధవారం నాటి ప్రెస్మీట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ అనేక ఉపశమన చర్యల్ని ప్రకటించారు. ఎంఎస్ఎంఈ, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీ, ఎంఎఫ్ఐ లాంటి ఫైనాన్సింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?) Finance Minister Smt.@nsitharaman to address a press conference today, 14th May, at 4PM in New Delhi. Watch LIVE here👇 ➡️YouTube - https://t.co/b78LXIfEht Follow for LIVE updates 👇 ➡️Twitter - https://t.co/XaIRg3fn5f ➡️Facebook - https://t.co/06oEmkxGpI pic.twitter.com/BLpAJZGexx — Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 14, 2020 -
మిగిలిన రూ.16.4 లక్షల కోట్లు ఎక్కడున్నాయి?
సాక్షి, అమరాతి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మండిపడ్డారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందని విమర్శించారు. ఆ రోజు ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని బాధాకరమని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయిందని చిదంబరం అన్నారు.( చదవండి : ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు) ‘ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఇప్పటి వరకు కేంద్రం 3.6 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగిలిన 16.4 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ అలా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎక్కువ రుణాలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకోవాడానికి, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి అనుమతించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు’ అని చిదంబరం విమర్శించారు. (చదవండి : ఆర్థిక ప్యాకేజీ: చిదంబరం స్పందన) -
ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు
న్యూఢిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కాగా కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ విధివిధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి... వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.(రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ) తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్‌కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు... ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు జూన్, జూలై, ఆగస్టు నెలెల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు గానూ రూ. 2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దాదాపు 70 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్, టీసీఎన్ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. మే 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు.. భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం- ముఖ్యాంశాలు లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు ఈపీఎఫ్: ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది ఇందుకోసం రూ. 2500 కోట్లు కేటాయింపు ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తాం కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు కరోనాతో వాయిదాపడిన రియల్ ఎస్టేట్ నిర్మాణాల కాలపరిమితి 6 నెలల పాటు పొడిగింపు పనిని బట్టి కాంట్రాకట్లర్లకు డబ్బులు చెల్లింపు ఇక పన్నుల విషయానికొస్తే.. రేపటి నుంచి మార్చి 2021నాటికి చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం తగ్గింపు తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోనే ట్యాక్స్ రిటర్న్స్ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ సూక్ష్మపరిశ్రమగా గుర్తింపు 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తింపు రూ.200 కోట్ల విలువ వరకు గ్లోబల్ టెండరింగ్ అవసరం లేదు. -
ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మరోవైపు ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహాగానాలు భారీగా నెలకొన్నాయి. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయించేదీ వివరించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి. (మెగా ప్యాకేజీ : భారీ లాభాలు) మరోవైపు మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ట్విటర్ లో స్పందించిన నిర్మలా సీతారామన్ ఇది కేవలం ఆర్థిక ప్యాకేజీ మాత్రమే కాదని, సంస్కరణ ఉద్దీపన, తమ పాలనలో నిబద్థతకు నిదర్శమని ట్వీట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వివిధ కోణాలలో బలాన్ని పొందింది. ఇక ఇపుడు ప్రపంచంతో నమ్మకంగా మమేకం కావచ్చు. కేవలం ఇంక్రిమెంటల్ మార్పులు మాత్రమే కాదు, మొత్త పరివర్తననే లక్ష్యంగా పెట్టుకున్నాం. మహమ్మారి విసిరిన సవాలును అవకాశంగా మార్చుకున్నాం. ఐసోలేషన్ కాదు ఆత్మ నిర్భర్ భారత్ మనల్ని ఏకీకృతం చేస్తుందంటూ ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆర్థికమంత్రి ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి సవివరమైన సమాచారం ఇస్తారని మోదీ చెప్పిన నేపథ్యంలో ప్యాకేజీ వివరాలన్నీ ఇపుడే ప్రకటిస్తారా లేదా విడతల వారీగా ఉపశమనాన్ని ప్రకటిస్తారా అనేది స్పష్టత లేదు. మొత్తం వివరాలను ఒకేసారి ప్రకటించకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మొత్తం ప్యాకేజీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించే అవకాశం లేదనీ, ఇది బహుశా కొన్ని సంవత్సరాలు అంటే 2022 వరకు లేదా అంతకు మించి వ్యవధిలో వుంటుందని అంచనా. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న భూమి, కార్మికులు, చట్టం లాంటి అంశాల్లో సంస్కరణ చర్యల ప్రభావం దీర్ఘకాలికంగా దాదాపు 3-5 సంవత్సరాలు వుండొచ్చని పేర్కొంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా దేశ జీడీపీలో 10శాతం ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ, ఎంఎస్ఎంఇలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు, భారతీయ పరిశ్రమలు లాంటి వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్యాకేజీ రూపొందించినట్టు మోదీ వెల్లడించారు. చదవండి : కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం Finance Minister Smt. @nsitharaman will address a Press Conference today, 13th May 2020, at 4 PM in New Delhi.#EconomicPackage#AatmanirbharBharat #AatmaNirbharBharatAbhiyan #IndiaFightsCorona pic.twitter.com/FmKcItA23C — Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 13, 2020 -
లాక్డౌన్ 4.0: భారీ ఆర్థిక ప్యాకేజీ
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా (చట్టం).. వీటిపై ప్రధానంగా ఈ ప్యాకేజీలో దృష్టి పెడతామన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజ్ పూర్తి వివరాలను రానున్న రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడిస్తారని చెప్పారాయన. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలను భారత్ అనేక ప్రపంచదేశాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వయం సమృద్ధి సాధించడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా రూపొందడానికి భారత్‌కు కరోనా సంక్షోభం ద్వారా అవకాశం లభించిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా వైరస్ కారణంగా మునుపెన్నడూ చూడనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 2.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ► కరోనా సమస్య చుట్టూనే తిరుగుతూ ఇతర కీలక కార్యక్రమాలను విస్మరించలేం. స్వయం సమృద్ధి నేటి నినాదం ► స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకం. స్వయం సమృద్ధ భారత్ ఇప్పుడు అత్యంత అవసరం. అంతర్జాతీయంగా స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు అర్థం మారింది. భారత సంస్కృతి, సంప్రదాయం చెప్పేది ‘వసుధైక కుటుంబం’ అనే అర్థంలోనే. ► విశ్వమానవాళి సంక్షేమమే భారత స్వయం సమృద్ధికి విస్తృతార్థం. ► బహిరంగ మల విసర్జన, పోలియో, పౌష్టికాహార లోపంపై.. ఇలా భారత్ సాధించిన ప్రతీ విజయం ప్రపంచంపై ప్రభావం చూపింది. గ్లోబల్ వార్మింగ్‌పై పోరులో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి. భారత్ ఇప్పుడు ఏదైనా సాధించగలదు అని ప్రపంచం నమ్ముతోంది. ► ఇప్పుడు మన వద్ద వనరులున్నాయి. శక్తి, సామర్థ్యాలున్నాయి. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి. మన సప్లై చెయిన్‌ను ఆధునీకరించుకోవాలి. ఇవి మనం చేయగలం. చేస్తాం. దేశీయానికి ప్రచారం: హా మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు. వాటికి ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం.. మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్లాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలి. ► మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అవి బ్రాండ్ల స్థాయికి వెళ్లాయి. ► 1999లో వై2కే సమస్య వచ్చింది. అంతర్జాతీయంగా భయభ్రాంతులను సృష్టించింది. అయితే, భారతీయ సాంకేతిక నిపుణులు ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించారు. ► కచ్ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ అంతా మృత్యువనే దుప్పటి కప్పుకుందా? అనేలా కనిపించింది. మళ్లీ సాధారణ స్థితి సాధ్యమా? అని అంతా అనుమానించారు. కానీ కచ్ మళ్లీ నిలబడింది. త్వరలోనే సగర్వంగా సాధారణ స్థితికి చేరుకుంది. అదే భారత్ ప్రత్యేకత. లాక్డౌన్ 4.0 లాక్‌డౌన్‌ను మే 17 తరువాత కూడా పొడిగించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. అయితే, ఈ నాలుగో దశ గత మూడు దశల తీరులో ఉండబోదని, మారిన నిబంధనలతో కొత్త తరహాలో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్ 4.0 కు సంబంధించిన పూర్తి నిబంధనలు, ఇతర వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామన్నారు. కరోనాతో మరి కొన్నాళ్లు కలిసి జీవించక తప్పని పరిస్థితుల్లో.. ఒకవైపు, ఆ మహమ్మారితో పోరాడుతూనే, అభివృద్ధి దిశగా ముందడుగు వేయాల్సి ఉందని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీ: బీజేపీ ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్దదని బీజేపీ పేర్కొంది. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతంతో సమానమని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశం స్వావలంబన సాధించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. వలస జీవుల కష్టాలను ప్రధాని పట్టించుకోలేదు: కాంగ్రెస్ వలస కార్మికుల కష్టాలు తీరుస్తారని భావించిన దేశ ప్రజలు ప్రధాని మోదీ ప్రసంగంతో నిరుత్సాహానికి గురయ్యారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘వేలాది మంది వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం అతిపెద్ద మానవ విషాదం. వారి పట్ల కనీస సానుభూతి, కనికరం చూపలేకపోయారు. దీనిపై దేశ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు’ అని కాంగ్రెస్ పేర్కొంది. (కోయంబేడు కొంపముంచిందా?) -
వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం కీలక అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మహమ్మారి కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు చేరాలంటే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వుందని బెనర్జీ సూచించారు. నిరుపేదలకు నగదు బదిలీ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని బెనర్జీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభుత్వాల ముందు పెద్ద సవాలు విసిరిందని, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చన్న రాహుల్ వ్యాఖ్యాలను అంగీకరించిన ఆయన ఈ సూచన చేశారు. అంతేకాదు వీలైనంత తొందరగా లాక్డౌన్ నుంచి బయటపడాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి స్వభావం గురించి తెలుసుకోవాలి తప్ప లాక్డౌన్ పొడగింపు సహాయపడదని పేర్కొన్నారు. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఆహార కొరత సమస్యపై స్పందించిన ఆయన తాను ఇంతకుముందే ప్రభుత్వానికి సూచించినట్టుగా కనీసం మూడు నెలలు చెల్లుబాటయ్యేలా ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులివ్వాలని బెనర్జీ చెప్పారు. వీటి సాయంతో ఒక్కరికి ప్రస్తుతం బియ్యం, పప్పుధాన్యాలు, గోధుమలు, చక్కెర లాంటి వాటిని ఉచితంగా అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ కాలంలో కేంద్రం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రాష్ట్రాలు డైరెక్ట్ బెనిఫిట్ ఫథకాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ఉదాహరణను బెనర్జీ ఉదహరించారు. (లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల) కరోనావైరస్ అనంతరం ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బెనర్జీ మాట్లాడుతూ, లాక్డౌన్ ద్వారా దెబ్బతింటున్న చిన్న, మధ్య వ్యాపారాలు, ఉపాధి మార్గాలపై స్పందించిన ఆయన చిన్న వ్యాపారాల రుణాలను కేంద్రం రైట్ ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. తద్వారా వారిని నిలబెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలను కూడా బెనర్జీ ప్రశంసించారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అనుభవం గురించి రాహుల్ బెనర్జీని అడిగినపుడు దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పడం విశేషం. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) కాగా ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్‌తో గత వారం ప్రారంభమైన రాహుల్ చర్చా సిరీస్‌లో ఇది రెండో భాగం. లాక్‌డౌన్‌తో బాధపడుతున్న పేదలకు సహాయం అందించేందుకు రూ.65వేల కోట్లు అవసరమని రాజన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. (270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్) -
ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్ ప్యాకేజీ సిద్ధపడుతోందా? వరుస సమావేశాలతో, సమీక్షలతో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికమంత్రి, హోం మంత్రులతో తాజా భేటీ ఈ అంచనాలకు బలాన్నిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి నెలవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకాల విడుదలను ఆర్థికమంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ స్థితి, స్టిములస్ ప్యాకేజీ అంశాలపై ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ను కూడా ప్రధాని ఇవ్వనున్నారని సమాచారం. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) ఆర్థిక ప్రతిష్టంభనకు ప్రభావితమైన రంగాలకు ఊతమిచ్చేందుకు రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతోపాటు ఇతర ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులతో కూడా ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) వంటి కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. (లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట) మరోవైపు ఇప్పటికే పౌర విమానయాన, కార్మిక, విద్యుత్తు సహా వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రధాని శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశంలో చిన్న వ్యాపారాల పునరుజ్జీవనంపై దృష్టి సారించి ప్రధాని మోదీ వాణిజ్య , ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖలతో గురువారం వివరణాత్మక చర్చలు నిర్వహించారు. ఈ సమావేశాలలకు హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇద్దరూ హాజరు కావడం గమనార్హం. కాగా ప్రభుత్వం మార్చి చివరిలో 1.7 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. కొన్ని మినహాయింపులు, సడలింపులతో దేశవ్యాప్తంగా మే 4వ తేదీనుంచి మే 17 వరకు మూడవ దశ లాక్డౌన్ అమలు కానున్న సంగతి తెలిసిందే. (హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట) (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) -
కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్ధలను పటిష్టం చేసేందుకు కేంద్ర నిధులతో ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజ్ కింద రాష్ట్రాలకు కేంద్రం రూ 15,000 కోట్లు సమకూరుస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి 2024 మార్చి వరకూ మూడు దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వందన గుర్నానీ వెల్లడించారు. ఎమర్జెనీ కోవిడ్-19 రెస్పాన్స్ నిధులతో వ్యాధి నివారణ, సన్నద్ధతలను పరిపుష్టం చేయడం, అత్యవసర వైద్య పరికరాల సేకరణ, మందుల సేకరణ, లేబొరేటరీల ఏర్పాటు, బయో సెక్యూరిటీ సన్నద్ధత వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఓ ప్రకటనలో గుర్నానీ పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్‌లో తొలి దశ అమలు జూన్ వరకూ కొనసాగుతుందని అన్ని రాష్ట్రాల వైద్య శాఖ సంచాలకులు, కమిషనర్లను ఉద్దేశించి పంపిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. చదవండి : ‘చచ్చిబతికాను.. వాళ్లే హీరోలు’ -
స్టాక్మార్కెట్లో ప్యాకేజ్ జోష్..
ముంబై : కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చూపే పెను ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన క్రమంలో స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ప్యాకేజ్‌పై అంచనాలతో ఓ దశలో ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు ఆ తర్వాత ఉద్దీపన ప్యాకేజ్ కొంత నిరుత్సాహపరచడంతో ఆరంభ లాభాలను కోల్పోయాయి. తొలుత బ్యాంకింగ్ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్లు దాటి పరుగులు పెట్టింది. ఉపశమన ప్యాకేజ్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆరంభ లాభాలు కొంతమేర ఆవిరైనా సెషన్ చివరి వరకూ కొనుగోళ్ల జోరు కనిపించింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 1410 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8641 పాయింట్ల వద్ద క్లోజయింది. చదవండి : స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ -
ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే
లవ్లీ ప్రొపెషనల్ యునివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన తాన్యా అరోరా అనే విద్యార్థినికి ఏడాదికి రూ. 5.04 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాన్యా అరోరాకు ఉద్యోగం వచ్చిన విషయం వాస్తమే అయినప్పటికీ ఆమె వార్షిక వేతనం ఏడాదికి రూ. 42 లక్షలు మాత్రమే. ఏటా రూ. 5.04 కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా తేలింది. ఇదే విషయంపై ఎల్పీయూ ట్విటర్ వేదికగా స్పందించింది. తాన్యా అరోరా ఎల్పీయూలో బీటెక్(సీఎస్ఈ) చదువుతోందని, ఈ మధ్యే మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి రూ.42 లక్షల వేతనంతో ఆమె ఉద్యోగం సాధించిందని ఎల్పీయూ తెలిపింది. ఏడాదికి రూ. 42 లక్షలు కాగా, దానిని నెలవారి వేతనంగా భావించి పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని ఎల్పీయూ ట్వీట్ చేసింది. దీంతో ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టమైంది. -
ఐఆర్సీటీసీ వింటర్ టూర్స్
సాక్షి, సిటీబ్యూరో: భారత్ దర్శన్ వంటి ఆధ్యాత్మిక పర్యటనలు, స్కూల్ టూర్స్‌తో వినోద, విజ్ఞాన పర్యటనలు, హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానయాన పర్యటనల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్న ఐఆర్సీటీసీ నగరవాసుల కోసం వింటర్ టూర్స్‌ను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి మేఘాలయ, చిరపుంజి, మాలినాంగ్, ఖజిరంగా– గౌహతి తదితర టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. అన్ని రకాల రవాణా, వసతి సదుపాయాలతో వీటిని రూపొందించినట్లు ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి సంజీవయ్య తెలిపారు. ఆహ్లాదం, కనువిందు చేసే ఎన్నో దర్శనీయ స్థలాలను ఈ పర్యటనలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. మ్యాజికల్ మేఘాలయ.. ఈ పర్యటన నవంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 7న తేదీ ఉదయం 9.20 గంటలకు ఫ్లైట్ (6ఈ 186)లో బయలుదేరి ఉదయం 11.45 గంటలకు గౌహతి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లైట్ (6ఈ 187)లో బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ♦ ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు గౌహతి నుంచి షిల్లాంగ్ చేరుకుంటారు. వార్డ్స్లేక్, పోలీస్బజార్ వంటి స్థలాలను సందర్శిస్తారు. రెండో రోజు చిరపుంజి పర్యటన ఉంటుంది. నొఖాలికై జలపాతం, మౌసమి గుహలు, ఎలిఫెంటా ఫాల్స్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ♦ ఆసియాలోనే అతి పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మాలినాంగ్ను మూడోరోజు సందర్శిస్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జి, డాకీలేక్ తదితర ప్రాంతాలు ఈ పర్యటనలో ఉంటాయి. సాయంత్రం షిల్లాంగ్ చేరుకుంటారు. ♦ పర్యటనలో నాలుగో రోజు ఖజిరంగా నేషనల్ పార్కు సందర్శన ఉంటుంది. డాన్‌బొస్కో మ్యూజియం, ఉమియుమ్ లేక్ సందర్శిస్తారు. 5వ రోజు పర్యటనలో భాగంగా జీప్ సఫారీ, బాలాజీ టెంపుల్, కామాఖ్య దేవాలయం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. 6వ రోజు గౌహతి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. చార్జీలు ఇలా.. విమానచార్జీలు, రవాణా, హోటల్ తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ ఇద్దరికి కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.33,325 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ.30,397 చొప్పున ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.26,373 చార్జీ ఉంటుంది. జైసల్మేర్టుఉదయ్పూర్.. రానున్న శీతాకాలంలో మరో ఆకర్షణీయమైన పర్యటన రాజస్థాన్. నవంబర్ 12 నుంచి 17 వరకు ఉంటుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12న ఉదయం 5.05 గంటలకు ఫ్లైట్ (6ఈ 995)లో బయలుదేరి 7.05 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మరో ఫ్లైట్ (2టీ 703)లో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు జైసల్మేర్ చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు ఫ్లైట్ (6ఈ 484)లో బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ♦ ఈ పర్యటనలో జైసల్మేర్ పోర్ట్, పట్వాన్ హవేలీ, గడిసార్ లేక్ తదితర ప్రాంతాలను మొదటి రోజు సందర్శిస్తారు. ♦ రెండోరోజు ఎడారి క్యాంప్, జీప్రైడ్ వంటివి ఉంటాయి. మరుసటి రోజు జైసల్మేర్ నుంచి బయలుదేరి జోధ్‌పూర్ చేరుకుంటారు. ఆక్కడ మెహ్రంగార్త్ ఫోర్ట్, జశ్వంత్ తాడ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. 4వ రోజు జోద్పూర్ నుంచి ఉదయ్‌పూర్ చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఉదయ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి టూర్లో 6వ రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. చార్జీలు ఇలా.. అన్ని సదుపాయాలతో కలిపి ఒక్కరికి రూ.35,950. ఇద్దరికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ.27,700 చొప్పున చార్జీలు ఉంటాయి. ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ.26,000 చొప్పున చార్జీ ఉంటుంది. పిల్లలకు రూ.23,450 చొప్పున ఉంటుంది. రన్ఆఫ్ కచ్.. నవంబర్ 16 నుంచి 18 వరకు కొనసాగే ఈ పర్యటనలో రన్ ఆఫ్ కచ్ వేడుకలను వీక్షించవచ్చు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 16న ఉదయం 8.35 గంటలకు ఫ్లైట్ (జీ8–551)లో బయలుదేరి 10.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ (2టీ711)లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు కాండ్లా చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో 18న సాయంత్రం 4.05 గంటలకు ఫ్లైట్ (2టీ717)లో కాండ్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్ (జీ8–552)లో రాత్రి 8.35 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. చార్జీలు ఇలా.. ఈ పర్యటన చార్జీ ఇద్దరికి కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.29,000 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ. 27,563 చొప్పున ఉంటుంది. -
మార్కెట్‌కు ప్యాకేజీ జోష్..
మందగమనంలో ఉన్న వృద్ధికి జోష్‌నివ్వడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య తాజాగా చర్చలు ప్రారంభం కానున్నాయన్న వార్తలు మధ్యాహ్నం తర్వాత వెలువడ్డాయి. దీంతో కొనుగోళ్లు మరింత జోరుగా సాగాయి. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్లపైకి ఎగబాకాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 11,058 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పెరగడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు 3 శాతం మేర పతనమైనా, మన స్టాక్ సూచీలు 2 శాతం మేర లాభపడటం విశేషం. భారీ లాభాలతో బోణి... మందగమనం నుంచి మరింత వృద్ధి దిశకు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ చర్యలే కాకుండా సరైన సమయంలో మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆమె అభయం ఇచ్చారు. ఇక అమెరికా–చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్న నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా, ప్యాకేజీ జోష్‌తో మన మార్కెట్ మాత్రం భారీ లాభాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వెంటనే సెన్సెక్స్ 843 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్ల లాభాలను తాకాయి. కానీ ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా ఈ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 208 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయన్న వార్తలతో స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్1,051 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోగా, యూరప్ మార్కె ట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.... ► యస్ బ్యాంక్ షేర్ 6.3 శాతం పెరిగి రూ.63 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. బాటా ఇండియా, ఫోర్స్ మోటార్స్, జీఎస్కే కన్సూమర్ ఈ జాబితాలో ఉన్నాయి. మరో వైపు అలోక్ ఇండస్ట్రీస్, అబన్ ఆఫ్‌షోర్, డీబీ రియల్టీ, సీజీ పవర్, ఈక్లర్క్స్ సర్వీసెస్, ఖదిమ్ ఇండియా వంటి 180కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్, హెచ్ఎఫ్సీ షేర్ల జోరు మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదుకోవడానికి తాజాగా రూ.70,000 కోట్ల మూలధన నిధులందించగలమని కేంద్రం ఆభయం ఇవ్వడంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. ఈ నిధుల కారణంగా రూ.5 లక్షల కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఫలితంగా మరిన్ని రుణాలు అందుబాటులోకి వచ్చి, వ్యవస్థలో లిక్విడిటీ సమస్య ఒకింత తీరగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, అలహాబాద్ బ్యాంక్ 8 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.6 శాతం, ఎస్బీఐ 3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3..4 శాతం, కెనరా బ్యాంక్ 3.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్ షేర్లతో పాటు హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. హెచ్ఎఫ్సీలకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) రూ.20,000 కోట్ల మేర నిధులు అందజేయనున్నది. ఈ నిర్ణయం కారణంగా హెచ్ఎఫ్సీలు లాభపడ్డాయి. ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5 శాతం, హెచ్డీఎఫ్సీ 4 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్3 శాతం మేర ఎగిశాయి. లాభాలు ఎందుకంటే... ► ఎట్టకేలకు ఉద్దీపన ప్యాకేజీ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధించిన సూపర్ రిచ్ సర్‌చార్జీని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. అంతేకాకుండా వాహన రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలను, బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధుల అందించడం, తదితర నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► మళ్లీ అమెరికా–చైనాల చర్చలు.... అమెరికా–చైనాలు తాజాగా పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం మళ్లీ చర్చలు ఆరంభం కాగలవని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేయడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► చల్లబడ్డ చమురు ధరలు... చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్, నైమెక్స్ ముడి చమురు ధరలు దాదాపు 1 శాతం మేర తగ్గాయి. ► ఆర్బీఐ బోర్డ్ సమావేశం... ఆర్బీఐ మిగులు నిధులపై అధ్యయనం చేసిన బిమల్ జలాన్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించడానికి సోమవారం ఆర్బీఐ బోర్డ్ సమావేశమైంది. మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినప్పటికీ, సానుకూల నిర్ణయం ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌కు కలసివచ్చాయి. ► పెరిగిన రేటింగ్ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, నొముర.. భారత్ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంపవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో భారత్ రేటింగ్‌ను నొముర అప్‌గ్రేడ్ చేసింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 40,500 పాయింట్లకు చేరగలదని మరో బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా వెల్లడించడం కూడా సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్న నేపథ్యంలో సానుకూల ప్యాకేజీ కారణంగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని నిపుణులంటున్నారు. ఆ మూడు షేర్ల వల్లే భారీ లాభాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మూడు షేర్లు 4–5 శాతం రేంజ్లో లాభపడ్డాయి. సెన్సెక్స్ మొత్తం లాభంలో ఈ మూడు షేర్ల వాటాయే 61 శాతంగా ఉండటం విశేషం. మొత్తం 793 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో హెచ్డీఎఫ్సీ వాటా 195 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 180 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 102 పాయింట్లుగా ఉన్నాయి. వెరసి ఈ 3 షేర్ల వాటా 477 పాయింట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల సంపద 2.41 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.41 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.41 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,33,462 కోట్లకు పెరిగింది. -
ప్యాకేజీ ఆశలు ఆవిరి
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో విధించిన పన్నును తగ్గించవచ్చని... మందగమన ప్రభావంతో కునారిల్లిన రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తారనే ఆశలతో కొద్దిరోజులుగా పెరుగుతున్న మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా వెల్లడించడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం దీనికి తోడయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 36,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ప్రధానంగా బ్యాంక్, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,473 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే కనిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పతనానికి ప్రధాన కారణాలు.... ప్యాకేజీ ఆశలు హుళక్కి డిమాండ్ తగ్గి కుదేలైన రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగలదన్న ఆశలతో ఇటీవల స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతూ వచ్చాయి. కానీ ప్యాకేజీ ఇవ్వడం అనైతికం అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించడంతో ప్యాకేజీ ఆశలు అడుగంటాయి. దీంతో బ్లూచిప్‌లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. జోష్‌నివ్వని సెబీ నిర్ణయాలు... ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెబీ సరళతరం చేసింది. అయితే సూపర్ రిచ్ సర్ చార్జీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశపరిచింది. బడ్జెట్లో ఈ సర్‌చార్జీ ప్రతిపాదన వెలువడినప్పటినుంచి కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు సెబీ నిర్ణయం ఎలాంటి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఎఫ్‌పీఐలు జూలైలో రూ.17,000 కోట్లు, ఈ నెలలో రూ.10,000 కోట్ల మేర నిధులను వెనక్కి తీసుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు రేట్ల కోత విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆ సంస్థ తాజా మినట్స్ వెల్లడించాయి. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ, జపాన్ నికాయ్ సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కె ట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. రూపాయి... దిగువ పయనం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, స్టాక్ మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు తగ్గి 71.96ను తాకింది. ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. మరోవైపు ముడి చమురు ధరలు 0.65 శాతం మేర పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. సాంకేతిక కారణాలు కీలక మద్దతు స్థాయిలు... 10,906, 10,800, 10,750 పాయింట్లను నిఫ్టీ సూచీ కోల్పోయింది. దీంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ తదుపరి మద్దతు 10,580–19,455 పాయింట్ల వద్ద ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 11,120 పాయింట్లపైన స్థిరపడగలిగితేనే నిఫ్టీ బలం పుంజుకుంటుందని వారంటున్నారు. మరోవైపు నిఫ్టీ 10,782 పాయింట్ల దిగువకు దిగి వచ్చిందని, ఇలియట్ వేవ్ థియరీలో ఐదో లెగ్ పతనాన్ని ఇది నిర్ధారిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. 14 శాతం నష్టంతో రూ.56.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆర్థిక అవకతవకలు జరిగిన సీజీ కన్సూమర్ కంపెనీలో ఈ బ్యాంక్‌కు కూడా వాటా ఉండటంతో ఈ షేర్ పతనమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 27 శాతం నష్టపోయింది. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌సీఎల్ టెక్– ఈ నాలుగు షేర్లు మాత్రమే పెరిగాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇక నిఫ్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 –2 శాతం మేర లాభపడగా, మిగిలిన 44 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ► డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలు తమ రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 13 శాతం నష్టంతో రూ.39.70 వద్ద ముగిసింది. ► రుణ భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోటర్లు్ల చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుండటంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం లాభం తో రూ.76.40 వద్ద ముగిసింది. గత నాలు గు రోజుల్లో ఈ షేర్ 21 శాతం ఎగసింది. ► మార్కెట్ భారీగా పతనమైనా, హిందుస్తాన్ యూని లివర్ (హెచ్‌యూఎల్) ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,879ను తాకింది. నెల కాలంలో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► టాటా మోటార్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా కాఫీ, సెయిల్ వంటి దిగ్గజ షేర్లు ఐదేళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించాయి. వీటితో పాటు మరో 140 షేర్లు ఈ స్థాయికి చేరాయి. డీఎల్ఎఫ్, టాటా స్టీల్, ఐటీసీ, రేమండ్ వంటి 270 షేర్లు రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. మరో 400 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, అవంతి ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐషర్ మోటార్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు డెన్ నెట్వర్క్స్, నెస్లే ఇండియాలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ప్యాకేజీ ఇవ్వడం అనైతికం.. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి పన్ను చెల్లింపుదార్ల సొమ్ములను ఉపయోగించడం అనైతికమని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య ఆర్థిక వ్యవస్థకు శాపం లాంటిదన్నారు. మరోవైపు తక్కువ వడ్డీరేట్లు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత... ఈ రెండూ ప్యాకేజీ కంటే ఉత్తమమైనవని విద్యుత్తు శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలూ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వవచ్చన్న ఆశలను అడియాసలు చేశాయి. మరోవైపు ఈ క్యూ1లో జీడీపీ వృద్ధి మరింతగా తగ్గగలదని (5.5 శాతానికి )గత నెల వరకూ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ పేర్కొనడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. 697 రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ప్యాకేజీ ఆశలు ఆడియాసలు కావడం, రూపాయి క్షీణించడం తదితర కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 669 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 697 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 201 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయింది. దెబ్బతిన్న సెంటిమెంట్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఏడాది కనిష్టానికి పడిపోవడం... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడానికి ఒక కారణమని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జణి పేర్కొన్నారు. డిమాండ్ లేక కుదేలైన రంగాలను ఆదుకునే విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్యాకేజీ ప్రకటనలు రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందని తెలియజేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు ప్యాకేజీ అవసరం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. -
భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పానీయాల ప్యాకేజింగ్‌కు అల్యూమినియం క్యాన్లను వాడటం పెరుగుతోందని అల్యూమినియం బెవరేజెస్ క్యాన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏబీసీఏఐ) స్పష్టంచేసింది. కల్తీకి ఆస్కారం లేకపోవడం, పానీయాల జీవిత కాలం ఎక్కువ ఉండడం, ప్లాస్టిక్ పట్ల విముఖత ఇందుకు కారణమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా అల్యూమినియంతో తయారైన 200 కోట్ల పానీయాల క్యాన్లు విక్రయం అవుతున్నాయని బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ ఇండియా ఎండీ అమిత్ లహోటి తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సూ్యమర్ ఇన్సైట్స్, బ్రాండ్ డెవలప్మెంట్ గ్రూప్ హెడ్ ప్రకాశ్ నెడుంగడితో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఏటా అల్యూమినియం క్యాన్ల వినియోగం వృద్ధి రేటు 9–10% ఉంటోంది. ఈ క్యాన్లలో 50–60% బీర్ల ప్యాకేజింగ్‌కు, మిగిలినవి ఇతర పానీయాల కోసం వాడుతున్నారు. గ్లాస్ ప్యాకేజింగ్ నుం చి పరిశ్రమ ఎక్కువగా అల్యూమినియం వైపు మళ్లుతోంది’ అని వివరించారు. బాల్ బెవరేజ్‌కు మహారాష్ట్రలోని తలోజ, ఏపీలోని శ్రీసిటీలో తయారీ కేంద్రాలున్నాయి. భవిష్యత్‌లో డిమాండ్ పెరిగితే హైదరాబాద్‌లో క్యాన్ల తయారీ ప్లాంటు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని అమిత్ వెల్లడించారు. 1880లో ప్రారంభమైన బాల్ కార్పొరేషన్ ఏటా 10,000 కోట్ల క్యాన్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. -
చక్కెర రంగానికి రూ.5,538 కోట్లు
న్యూఢిల్లీ: చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం, ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. మిగులు చక్కెర నిల్వల సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో చక్కెర పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన మూడో సాయం ఇది. ఇప్పటికే షుగర్‌కేన్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు అధిక ధరలు నిర్ణయించడంతోపాటు, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యల్ని కేంద్రం గతంలో ప్రకటించింది. అతి త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధిక ఉత్పత్తికి పరిష్కారం ‘‘గతేడాది, ఈ సంవత్సరం కూడా చక్కెర తయారీ అధికంగా ఉంది. వచ్చే ఏడాది కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా. దీంతో అధిక ఉత్పత్తి సమస్యను పరిష్కరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఓ సమగ్ర విధానానికి ఆమోదం తెలిపింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. చెరకు ఉత్పత్తి, ఎగుమతి వ్యయాల తగ్గింపునకు మొత్తం రూ.5,538 కోట్ల రూపాయిల సాయం అందించనున్నట్టు చెప్పారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో దేశీయ మార్కెట్ స్థిరపడడంతోపాటు చెరకు రైతులకు మిల్లులు చెల్లింపులు చేయగలవని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ప్యాకేజీలోని అంశాలు... 2018–19 మార్కెటింగ్ సంవత్సరానికి క్వింటాల్ చెరకు క్రషింగ్‌కు గాను ప్రభుత్వం రూ.13.88 సాయం అందిస్తుంది. 2017–18 మార్కెటింగ్ సంవత్సరానికి ఈ సాయం రూ.5.50గానే ఉంది. ఈ ఒక్క సాయానికే రూ.4,163 కోట్ల మేర కేంద్రంపై భారం పడుతుంది. 2018–19 మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబర్–సెప్టెంబర్)లో 5 మిలియన్ టన్నుల ఎగుమతులకు గాను అంతర్గత రవాణా, నిర్వహణ చార్జీల రూపంలో మిల్లులకు పరిహారం లభించనుంది. పోర్ట్‌లకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మిల్లులు, అవి ఎగుమతి కోసం చేసే రవాణా వ్యయాలపై ప్రతీ టన్నుకు రూ.1,000 సబ్సిడీగా అందుతుంది. 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటే టన్నుకు సబ్సిడీ రూ.2,500 లభిస్తుంది. తీర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు టన్నుపై రూ.3,000 లేదా వాస్తవంగా అయిన వ్యయం... ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంతమేర సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.1,375 కోట్ల భారం పడుతుంది. అయితే, ఈ రెండు ప్రయోజనాలను మిల్లులకు నేరుగా ఇవ్వకుండా, అవి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు తీర్చేందుకు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. చక్కెర కర్మాగారాలు రైతులకు రూ.13,567 కోట్ల బకాయిలు (యూపీలోని మిల్లులకే రూ.9,817 కోట్లు) చెల్లించాల్సి ఉంది. అవి తీర్చడంతోపాటు, ఎగుమతులు పెంపునకు కేంద్రం చర్యలు వీలు కల్పించనున్నాయి. నూతన టెలికం పాలసీకి పచ్చజెండా నూతన టెలికం విధానం ‘నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) 2018’కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు అంతర్జాతీయంగా చాలా వేగంగా మారుతున్నాయని... ముఖ్యంగా 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్ విభాగాల్లో ఈ పరిస్థితి ఉందని కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. జీడీపీలో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఆరు శాతంగా ఉంటే, అది ఎనిమిది శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలివస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. సమాచార సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, 5జీ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందరికీ అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులో ఉంచడం, 40 లక్షల ఉద్యోగాల కల్పన, ఐసీటీ సూచీలో భారత ర్యాంకును 50కు తీసుకురావడం నూతన విధానం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. జీఎస్టీఎన్ ఇక పూర్తిగా ప్రభుత్వ సంస్థ జీఎస్టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)ను నూరు శాతం ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అనుమతి తెలిపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీఎన్ను పునర్వ్యవస్థీకరించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యాజమాన్యాన్ని సమంగా వేరు విభజించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జీఎస్టీఎన్లో కేంద్రం, రాష్ట్రాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఉంది. ఐటీడీసీ హోటళ్ల విక్రయాలు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా జమ్మూ కశ్మీర్, బిహార్ రాష్ట్రాల్లో ఐటీడీసీకి ఉన్న రెండు హోటళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయించింది. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
మోగని పెళ్లి బాజాలు
పోలవరం : ప్రభుత్వ నిబంధనలు, అధికారుల నిర్లక్ష్యం పోలవరం ముంపు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారాయి. పోలవరం పునరావాస చట్టంలో లేని కొన్ని నిబంధనలను ఓ ఉన్నతాధికారి అమలు చేయడం, దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడంతో ముంపు గ్రామాల్లో యువతుల వివాహాలు నిలిచిపోయాయి. ఏడాదిగా ముంపు గ్రామాల్లో పెళ్లిబాజాలు మోగడం లేదు. ఎప్పటివరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక, యువతుల వివాహ వయస్సు దాటిపోతుండటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆందోళన ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 89 గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 60 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేసేందుకు పోలవరం మండలంలోని ముంపు గ్రామాల్లో అధికారులు 2017 జూన్ 30వ తేదీని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. గతంలో చేసిన సోషియో ఎకనమిక్ సర్వే(ఎస్ఈఎస్ డేటా)లో పేర్లు ఉన్నప్పటికీ, కట్ ఆఫ్ డేట్ నాటికి 18 ఏళ్లు నిండిన, వివాహం కాని యువతులకు మాత్రమే పునరావాస ప్యాకేజ్ అందిస్తామని అధికారులు గ్రామసభలో వెల్లడించారు. ముందుగా డేటాలో పేరు ఉంటే వివాహమైనా ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన అధికారులు గ్రామసభలో మాట మర్చారు. వివాహమైనా ప్యాకేజ్ వస్తుందని ముందు చెప్పడంతో అప్పట్లో యువతుల వివాహాలు చేశారు. ఆతరువాత మాటమార్చిన అధికారులు డేటాలో ఉన్న వివాహమైన దాదాపు 500 మంది యువతుల పేర్లను తొలగించారు. వివాహమైతే ప్యాకేజీ రాదన్న నిబంధనతో దాదాపు 450 మంది యువతుల వివాహాలు ఏడాదిగా నిలిచిపోయాయి. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇదిలా ఉంటే ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేయిస్తారో, ఎప్పుడు ప్యాకేజ్ అమలు చేస్తారో తెలియక, ప్యాకేజ్ వదులుకుని వివాహాలు చేయలేక యువతుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 2016 జూన్‌లో సోషియో ఎకనమిక్ సర్వే చేశారు. అప్పటికి 18 ఏళ్లు నిండిన యువతులకు మాత్రమే ప్యాకేజ్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటికే వివాహమైన వారికి గాని, కట్ ఆఫ్ డేట్ తరువాత 18 ఏళ్లు నిండిన వారికి గాని ప్యాకేజ్ వర్తించదని స్పష్టం చేశారు. ఈవిధంగా దాదాపు 2 వేల మంది యువతులకు ప్యాకేజీ వర్తించే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయకుండా, గ్రామాలు ఖాళీ చేయించకుండా కట్ ఆఫ్ డేట్ నిర్ణయించటంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయోమయంలో ఉన్నాం నాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద అమ్మాయి వయసు 24 ఏళ్లు. వివాహం అయితే పునరా వాస ప్యాకేజ్ రాదని చెప్పడంతో చేయలేదు. ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారో, వివాహం ఎప్పుడు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాం. – జలగం కన్నయ్య, తల్లవరం నాకు ముగ్గురు కుమార్తెలు నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త లేరు. పెద్దమ్మాయి వయస్సు 25 ఏళ్లు. వివాహమైతే ప్యాకేజ్ రాదని చెప్పారు. దీంతో ఇంకా వివాహం చేయలేదు. ఎప్పుడు ప్యాకేజ్ ఇస్తారో తెలియడం లేదు. – మాడే అక్కమ్మ, తల్లవరం పేరు తొలగించారు నాకు ఇద్దరు అమ్మాయిలు. గతంలో చేసిన డేటాలో పేరు ఉందని పెద్దమ్మాయి వివాహం చేశాను. ఇప్పుడు డేటా నుంచి పేరు తొలగించి ప్యాకేజీ రాదని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం. – మడకం సింగారమ్మ, ములగలగూడెం వివాహం ఆపేశాం నాకు ఒక అమ్మాయి. వయస్సు 20 ఏళ్లు. పెళ్లి సంబంధం కుదిరింది. వివా హమైతే ప్యాకేజ్ ఇవ్వనంటున్నారు. దాంతో వివాహం ఆపేశాం. ప్యాకేజ్ వస్తుందని లాంఛనాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు. – మడకం నాగమణి, గాజులగొంది -
మరోసారి టీడీపీ లాలూచీ రాజకీయాలు
-
‘ఇంకా ప్యాకేజీపై మాట్లాడటం సిగ్గుచేటు’
ఢిల్లీ: టీడీపీ నేతలు ఇంకా ప్యాకేజీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అంతర్గతంగా ఎన్డీయే ప్రభుత్వంలోనే ఉందని ఆరోపించారు. టీడీపీ అవిశ్వాసం అంతా డ్రామా అని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు పైకి హోదా అంటూ ప్యాకేజీ, పోలవరం నిధుల కోసం పైరవీ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి తెలియకుండా తాము బీజేపీ నేతలను కలిశామని టీడీపీ నాయకులు చెప్పడం ఒట్టి డ్రామా అని కొట్టిపారేశారు. టీడీపీ నాయకులు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి ఇప్పటిదాకా తాము ప్రత్యేక హోదాపై నిలబడ్డామని, భవిష్యత్‌లో కూడా నిలబడతామని చెప్పారు. -
అది తిరునామం!
చంద్రబాబు ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాలపడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతున్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు. బాగా ఎల్తైనవి, చాలా లోతైనవి మామూలు దృష్టికి అంతుచిక్కవు. ఉదాహరణకి భూగోళం. అది గుండ్రంగా ఉంటుందని, నారింజపండు లాగానో, రుద్రాక్ష కాయలా గానో ఉంటుందనే సత్యం మామూలు కంటితో చూసి నిర్ధారించలేం. నిజం నిరూపించాలంటే చాలా ఎత్తుమీద నుంచైనా చూడాలి, లేదా అత్యాధునిక టెలిస్కోపునైనా వాడాలి. రాజకీయం తెలుసు కాబట్టి చక్రం తిప్పుతానని ఊరికే అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకూడదు. శాస్త్ర పురాణాలు క్షుణ్ణంగా కాకపోయినా పైపైన అయినా చదవాలి. దేవుడు పది అవతారాలెత్తాడు. కానీ ఏ రెండూ ఒక దాన్ని పోలి ఒకటి లేవు. చేపకి, తాబేలుకి, నరసింహానికి సాపత్యం ఏవన్నా ఉందీ? లేదని భావం. వామనావతారం మరో చమత్కారం. భూమికి జానెడు ఎత్తున వటువుగా నడిచి వచ్చి మూడు వేళ్లు చూపించి మూడడుగుల దానం ఇమ్మన్నాడు. బలి చక్రవర్తికి తెలిసి చావలా– అవి మూడేళ్లు కావు తిరునామం. ఆంతర్యం అంతుపట్టక తీసుకో, కొలుచుకో అన్నాడు. అంతే! వామన పురాణంగా వాసికెక్కింది. ఒకే ఒక డాట్‌ని విశదపరిస్తే కేంద్ర బడ్జెట్ సవివరంగా వచ్చినట్టు– వామనుడు త్రివిక్రముడి డిజిటలైజ్ వెర్షన్. చంద్రబాబు కూడా ఇక్కడే పప్పులో కాలేశాడు. మోదీని ముందు ధరించి పసుపు పచ్చ జెండా ఊపుకుంటూ ముందుకు కూతలు వేసుకుంటూ సాగి పోవచ్చనుకున్నాడు. ఇప్పుడు పట్టాల దారి కనిపించడంలేదు. ‘నేనున్నానని’ అభయ మిస్తూ కనిపించిన వెంకయ్యనాయుడుని సమున్నతమైన కొండ గుహలో కూర్చోపె ట్టారు. ఇది కూడా మోదీ పుణ్యమే! చంద్రబాబు అందరూ చెబుతున్నా విన కుండా ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాల పడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతు న్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు. ఇప్పుడు మళ్లీ తూచ్ అనేసి ప్రత్యేక హోదాయే ముద్దు, అది అయిదుకోట్ల చిల్లర తెలుగువారి హక్కు అని గర్జిస్తున్నారు. ‘ప్యాకేజీ’ చాలా చాలా లాభమన్నారు మొన్నటిదాకా. నిన్నట్నించి గళం మార్చి స్వరం మార్చి ప్రసంగిస్తున్నారు. ఎన్నడూ లేనిది, మోదీని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన ‘దేశముదురండీ’ అని నాలుగేళ్ల నాడే ఒక సంఘ్ పెద్ద అన్నారు– ఏ భావంతో అన్నారో గానీ. అరటితోటలో ఆంజనేయస్వామి కొలువై ఉంటాడని పుస్తకంలో ఉందని తోట లన్నీ గాలిస్తే దొరుకుతాడా? దొరకడని భావం. త్రేతాయుగంలో ఆంజనేయస్వామి రామబంటుగా రామాయణం నిండా కొలువు తీరాడు. ద్వాపరం వచ్చే సరికి జెండా మీద బొమ్మై, జెండాపై కపిరాజుగా గాలిలో రెపరెపలాడాడు. కలియుగం వచ్చే సరికి కిరసనాయిల్ డబ్బాల మీద, ట్రాన్స్పోర్ట్ లారీలపైన ట్రేడ్‌మార్క్ గుర్తుగా స్వామి సేవలందిస్తున్నాడు. సంఘ్‌లో పుట్టి సంఘ్‌లో పెరిగిన సంఘీయుడు మోదీ. ఆయన నాయకత్వంలో అయోధ్య బృహత్తర రామమందిరం ప్రస్తుతం రైలు స్టేషన్‌గా అవతరించబోతోంది. మన కల నెరవేరబోతోంది. అందుకని చంద్ర బాబు మనుషుల్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఆట్టే వ్యవధి కూడా లేదు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్ ఉత్తమమేనా?
మనం స్వతహాగా టూర్ ప్లాన్ చేసుకొని తిరిగి రావడానికి, ట్రావెల్స్ వారు ప్రకటించే ప్యాకేజ్‌లను ఎంచుకొని కొత్త ప్రదేశాలు చూసి రావడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్‌లో మనకు ఖర్చు తక్కువవుతుంది. ప్యాకేజ్ టూర్లో ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తారు. అంటే ఉదాహరణకు క్యాబ్‌ను షేర్ చేసుకుంటే తక్కువ చార్జ్ అవుతుంది. అదే ఒక్కరే వెళితే ఎక్కువ చార్జ్ చెల్లించాలి. ఇదే సూత్రాన్ని ప్యాకేజ్ టూర్‌కి కూడా అన్వయించుకోవాలి. అలాగే ప్యాకేజ్ టూర్ డీల్‌లో టూర్‌ను ఆఫర్ చేసే సంస్థ సందర్శించనున్న ప్రాంతాల్లోని చాలా కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఆయా కంపెనీలు అందించే రాయితీలను టూర్ నిర్వహించే సంస్థ టూరిస్ట్‌లకు బదిలీ చేస్తుంది. అప్పుడు టూరిస్ట్‌లకు ఖర్చు తగ్గుతుంది. కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీ పది రోజుల యూరప్ టూర్ ప్యాకేజ్‌ను ప్రకటించిందనుకుందాం. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, యూకే ప్రాంతాల సందర్శన కూడా ఇందులో భాగమే అనుకోండి. ఈ ప్యాకేజ్ విలువ ఒక వ్యక్తికి రూ.1.57 లక్షలుగా ఉందనుకోండి. మనం ఈ టూర్ ప్యాకేజ్‌ను ఎంచుకోకుండా సొంతంగా అదే ప్రాంతాలకు వెళితే రూ.2 లక్షలకు పైనే ఖర్చవుతుంది. అందుకే ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్ చాలా మందికి అనువుగా ఉంటాయి. అయితే ఇక్కడ టూర్ ఆపరేటర్ నిర్దేశించిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. -
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం
కేంద్ర మంత్రి వెంకయ్య పునరుద్ఘాటన సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి కేంద్రం నిధులందిస్తుందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లా డుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఎంత మేరకు నిధులు వచ్చేవో చెప్పడం కష్టమేనన్నారు. మిగిలిన రాష్ట్రాలకు వెళ్తున్న నిధుల ఆధారంగా ఏపీకి నిధులు అందించేందుకు కేంద్రం ప్రణాళిక వేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కేంద్రమే భరిస్తుందన్నారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం భరించాలని, లేకుంటే ఉత్పత్తయ్యే విద్యుత్‌లో జాతీయ గ్రిడ్‌కు వాటా ఇవ్వాల్సుంటుందని వెంకయ్య అన్నారు. ఏపీకి రైల్వే జోన్ వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. జైట్లీ, వెంకయ్యలకు ధన్యవాదాలు: టీడీపీ ఎంపీలు ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని ఆమోదించడంలో కృషి చేసినందుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులకు టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో గురువారం పార్లమెంటులో ఎంపీలు కొనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్, నిమ్మల కిష్టప్ప, కేశినేని నాని కేంద్ర మంత్రులను కలసి అభినందనలు తెలిపారు. -
స్వప్రయోజనాల కోసమే ప్యాకేజీ
ఏలూరు (సెంట్రల్) : సీఎం చంద్రబాబు రాజకీయ, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్యాకేజీలకు ఆహ్వానం పలుకుతున్నారని, ప్యాకేజీలకు చట్టబద్ధత ఉందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నిం చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి ఏలూరు చేరుకుంది. సోమవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో రామకృష్ణ విలేకరులతో మా ట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగి పోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా హోదా కోసం పోరాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. త్వరలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై ఇద్దరు మోసగాళ్లు అనే సినిమా వస్తుందని హేళన చేశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 9 నుంచి విశాఖలో నిరాహార దీక్ష చేయనున్నట్టు రామకృష్ణ ప్రకటించారు. ఇది కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వమని రామకృష్ణ అన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారని, కొందరు రౌడీల్లా ప్రవర్తిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలు, గిరిజనులకు స్థానం కల్పించిన తర్వాతే లోకేష్‌కు స్థానం కల్పించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటే అవినీతి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. చివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. నాయకులు జేవీ సత్యనారాయణ, జి.ఓబులెస్, డేగా ప్రభాకర్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
– బూత్ కమిటీల నిర్మాణానికి పాటుపడాలి – పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అనా్నరు. హోదా కంటే ఎక్కువగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెపా్పరు. మంగళవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తనీష్ కన్వెన్షన్ సమావేశ హాలులో ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముందుగా పండిత దీన్‌దయాళ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ పెద్ద నోట్లర ద్దుతో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దేశ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదం, నకిలీ కరెన్సీ తగ్గుముఖం పట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90 శాతం నిధులు కేటాయించిందన్నారు. అలాగే వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఏడాదికి రూ. 50కోట్ల చొప్పున నిధులు ఇస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం కొంత మంది చేసే హోదా ఉద్యమాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్ బాబు, పార్టీ కేంద్ర కమిటీ సంఘటన కార్యదర్శి సతీష్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, కంతెటి సత్యనారాయణ, మాజీ మంత్రులు పురందేశ్వరీ, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్, రంగస్వామి, యోగనంద్చౌదరి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాజంపేట: గండికోట ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే గ్రామాలకు పునరావాసం ప్యాకేజి సరిదిద్ధి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముంపుబాధితులకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన గళం విప్పారు. గ్రామాల్లోకి నీళ్లు రావడంతోఊర్లు వదలుతున్నా ఇంతవరకూ పరిహారం చెల్లించలేదన్నారు. ప్రాజెక్టు కింద 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. అందులో మొదటగా చౌటుపల్లె, గండ్లూరు, ఓబన్నపేట, కె.బొమ్మెపల్లె గ్రామాల్లో ఇప్పటి నీటి నిల్వ ఉందన్నారు. పండుగ రోజులు వారికి ముంపుకష్టాలు తప్పలేదన్నారు. సతీష్‌రెడ్డి గడ్డం గీయించుకోవడం కోసం ముంపు గ్రామాలను ప్రజలను ముంచేసి, తన పట్టుదల నెరవేర్చేందుకు ప్రయత్నించడమే తప్ప ముంపుబాధితులకు పరిహారం ఇచ్చి ఖాళీ చేయిస్తామనే ఆలోచన ఎక్కడకాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీష్‌రెడ్డిపై గడ్డం ఉన్న ప్రేమ, ముంపువాసులపై మాత్రంలేకపోవడం శోచనీయమన్నారు. గత దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరెడ్డి హయాంలో గండికోట ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయిందని, ఇప్పుడు గేట్లు ఎత్తడం గొప్పగా సీఎం చెప్పుకుంటున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు గండికోట ప్రాజెక్టుకు రెండు సార్లు శిలాఫలకం వేసినా ఏరోజు కూడా గండికోట ప్రాజెక్టు ఆలోచనరాలేదన్నారు.2019లో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే యోచన జగన్మోహన్రెడ్డికి ఉందన్నారు. ప్రజలకు మేలుచేసే పాలకులు రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అభివృద్ధి, సంక్షేమం చూడకుండా ఎంపీటీసీలను బలవంతంగా చేర్చుకోవడం, వారు మళ్లీతిరిగి సొంతగూటికి చేరడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆకేపాటి రంగారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పా ఎల్లారెడ్డి, కాకతీయ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి పాల్గొన్నారు. -
నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టు లకు 12 కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య పథకాన్ని అమలు చేయడానికి 40 శాతం వరకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకూ త్వరలో ప్యాకేజీ పెంచాలని నిర్ణయించింది. ఆయా నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్‌లు ఇచ్చాక ప్యాకేజీ పెంపుపై నిర్ణయం తీసుకో వాలని నిర్ణయించింది. గ్రేడింగ్ కోసం ఉద్యో గులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజే హెచ్ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని నిర్ణయిం చింది. కమిటీలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌లు సభ్యులు గా ఉంటారు. ఆ కమిటీ 230 నెట్వర్క్ ఆస్పత్రులను అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఆస్పత్రులను ఎ, బి, సిలుగా వర్గీకరించి దాని ప్రకారం ప్యాకేజీ పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ ప్యాకేజీ ఆరోగ్యశ్రీలోని పేదరోగులకు ఇది వర్తించదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజీ సరిపోదని కార్పొరేట్ ఆస్పత్రులు రెండేళ్లుగా వైద్యసేవలు ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కార్పొ రేట్లకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకూ పెంచాలని నిర్ణయించింది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో వసతులు, స్పెషలిస్టు వైద్యులు, అందించే వైద్యసేవలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిని వర్గీకరించాక గ్రేడింగ్‌ల ప్రకారం వాటికి ప్యాకేజీ పెంచాలని నిర్ణయించారు. -
నట్టేట ముంచారు!
సాక్షి ప్రతినిధి, కడప: గండికోట ముంపువాసులు దశాబ్దాల తరబడి పరిహారం ప్యాకేజీ కోసం నీరీక్షిస్తున్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో అధికారపార్టీ నాయకులంతా చర్చించి ముంపువాసులకు ప్యాకేజీ నిర్ణయించారు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకున్న తరుణంలో పీటముడి పడింది. చర్చల్లో ఆర్భాటంగా వ్యవహారించిన టీడీపీ నాయకులు ముఖం చాటేశారు. నిర్వాసితులకు పెద్దదిక్కులాంటి కలెక్టర్ చేతులెత్తేయంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. పునరావాసం ఫ్యాకేజీ కోసం గండికోట ముంపువాసులు పోరాటం చేశారు. ఎట్టకేలకు గత అక్టోబర్ 8న కలెక్టరేట్లో కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 30 కటాఫ్డేట్గా పరిగణించి, అర్హులందరీకీ ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తామని స్పష్టం చేశారు. తర్వాతే గండికోటలో నీరు నిల్వ చేస్తామని చెప్పడంతో ముంపువాసులు ఆనందపడ్డారు. స్వయంగా కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారికి భరోసా దక్కినట్లైంది. రెండు నెలలు గడిచిపోయాక సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్యాకేజీ ఇవ్వకుండానే నీరు నింపే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సన్నద్ధమయ్యారు. మరోరెండు రోజుల్లో ముంపుగ్రామమైన చౌటపల్లెలోకి గండికోట నీళ్లు రానున్నాయి. 5 టీఎంసీలు నిల్వచేసేందుకు సన్నద్ధం గండికోట రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వచేయాలనే లక్ష్యంతో పాలకులున్నారు. నీరు నిల్వ చేయడం జిల్లాకు అవసరమే అయినప్పటికీ త్యాగధనులైనా ముంపువాసులకు ప్యాకేజీ ఇవ్వకుండానే నట్టేట ముంచాలనుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిర్ణయం అయిపోయాక తమను మానసిక క్షోభకు గురిచేయడం ఏ మేరకు సమంజసమని చౌటపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా 5 టీఎంసీలు నీరు నిల్వ చేసి పైడిపాళెం ప్రాజెక్టు లిఫ్ట్ చేయాలనే తలంపుతో ఉన్న యంత్రాంగం, అదే దృక్పథం ముంపువాసుల పట్ల కూడా ఉండాలి కదా! అని హక్కుల నేతలు నిలదీస్తున్నారు. పైడిపాళెంకు నీళ్లు లిఫ్ట్‌చేసి టీడీపీ నేత ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి గడ్డం గీయించాలనే ఆలోచన ఉన్నప్పుడు ముంపువాసులకు పునరావసం ప్యాకేజీ ఇవ్వడంలో తాత్సారం చేయడం ఎందుకనీ పలువురు ప్రశ్నిస్తున్నారు. ముంపులో ముంచిన ఆ ఇద్దరు! మాజీమంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముంపువాసులను నట్టేట ముంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సమావేశం నిర్వహించి తామే పరిహారం ప్యాకేజీలు ఇప్పించామని చెప్పుకునేందుకు మొత్తం టీడీపీ నాయకులంతా ఆశీనులయ్యారు. కలెక్టర్ చెంతన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డిలు ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు నిర్వహించారు. ప్యాకేజీకి ఒప్పించారు. ఎట్టకేలకు న్యాయం లభించిందని భావించగా రెండు నెలలు ఆ ఊసే ఎత్తకుండా ప్యాకేజీ విషయం ఆలోచించకుండా నీరు నిల్వ చేయడం ఆరంభించారు. తమ పరిస్థితి ఏమిటని ముంపువాసులు ప్రశ్నిస్తే ఎవ్వరికి వారు చేతులెత్తేస్తున్నారు. అండగా ఉండాల్సిన జమ్మలమడుగు నేతలు ముఖం చాటేశారు. కలెక్టర్ సైతం రాజకీయ నాయకుల వలే మాటలు చెప్పడం ఆరంభించారు. ప్యాకేజీ ఇచ్చేంత వరకూ నీరు నిల్వ చేయమని స్వయంగా కలెక్టర్ హామీ ఇచ్చి తాజాగా తానేమీ చేయలేనని చేతులెత్తేయడాన్ని నిర్వాసితులు తప్పుబడుతున్నారు. 2016 సెప్టెంబర్ 30 కట్ఆఫ్డేట్ ప్రకారం అదనంగా 3,325 యూనిట్లకు ప్యాకేజీ వర్తిస్తుంది. వారందరికీ తక్షణమే నగదు చెల్లించకపోయిన కనీసం ప్రభుత్వ ఉత్తర్వులైనా జారీ చేయాలి కదా... అని పలువురు నిలదీస్తున్నారు. అవేవి పట్టించుకోకుండా మీచావు మీరు చావండి...అన్నట్లుగా ఆ ఇద్దరు నాయకులు ఉండిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి వెంట నడిచిన నేరానికి ఆ ఇద్దరు నిర్వాసితులను నట్టేట ముంచుతున్నారని ముంపువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హోదాను తాకట్టు పెట్టిన బాబు
- ప్యాకేజి పేరిట మోసం - ప్రత్యేక హోదాతోనే భవిష్యత్ - 25 కర్నూలులో యువభేరి - వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. హోదా ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై యువకులు, విద్యార్థులు.. ప్రజలను చైతన్య వంతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే కర్నూలులో ఈనెల 25న గుత్తి జాతీయ రహదారిలో వీజేఆర్ కన్వెషన్ సెంటర్లో యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీలకు అతీతంగా పాల్గొని యువభేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువభేరి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జీలు హఫీజ్ ఖాన్, చెరుకులపాడు నారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, దొడ్డిపాడు మాబ్బాష తదితరులు పాల్గొన్నారు. అదేం కోరిక నెల్లూరు జిల్లాలో పుట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చిత్తూరు జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..అమెరికాలో పుట్టింటే బాగుండునని కోరుకుంటూ ఇటీవల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని పీఏసీ ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీన్నిబట్టి వారికి ఇక్కడి అభివృద్ధి గురించి చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హోదాను విస్మరించి.. ప్యాకేజీతో పార్టీని పటిష్టం చేసుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుకు ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. హోదా అంశాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరమేలేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా ప్రాధాన్యతను గ్రామగ్రామాన చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రత్యేక హోదా నినాదంతో మొదట్నుంచీ వైఎస్ఆర్సీపీ పోరాడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, పీడీయాక్టు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు. కర్నూలులో 25న జరిగే యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హోదా వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు: సలాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రానికి హోదా వస్తేనే విద్యార్థులు, యువకుల భవిష్యత్తు బాగు పడుతుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హోదా తేలేకపోగా, ప్యాకేజీకి సీఎం చంద్రబాబు వెంపర్లాడుతుండటం మోసపూరితమన్నారు. హోదా సాధనలో విద్యార్థులదే కీలకపాత్ర అన్నారు. కర్నూలులో యువభేరిని విద్యార్థులు విజయవంతం చేయాలన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా యువభేరి పోస్టర్ విడుదల చేశారు. -
ప్యాకేజీ కోసం టీడీపీ రాజీ
నెల్లూరు సిటీ: చిల్లర ప్యాకేజీల కోసం కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ రాజీపడిందని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మండిపడ్డారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హోదా కాదు, ప్యాకేజీ చాలని టీడీపీ చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో 600 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ, వాటిని అమలు చేయడంలో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను అమలు చేస్తూ, ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధించేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అక్టోబర్ 14వ తేదీన నెల్లూరు నగరంలో టీడీపీ 600 హామీలు, ప్రత్యేక హోదాపై బ్యాలెట్‌ను నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో బ్యాలెట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీవీ శేషారెడ్డి, దేవకుమార్‌రెడ్డి, భవానీ నాగేంద్రప్రసాద్, చెంచలబాబుయాదవ్, పత్తి సీతారామ్‌బాబు, ఫయాజ్, ఆసిఫ్ బాషా, బాలసుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
నేతల జేబులు నింపుకొనేందుకే ప్యాకేజీ
సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ కృష్ణలంక : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎంపీలు తమ జేబులు నింపుకొనేందుకే ప్యాకేజీల పాట పాడుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై సీపీఐ ఆధ్వర్యాన కృష్ణలంక చలసానినగర్ సిద్దెం కృష్ణారెడ్డి భవన్ వద్ద గురువారం ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నాసర్‌వలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు, 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పడు హోదా అవసరం లేదని కల్లబొల్లి మాటలు చెప్పడం వారి ఊసరవెల్లి రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీపీఐ నగర కార్యకవర్గ సభ్యులు సంగుల పేరయ్య, బొక్క ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ రాయ రంగమ్య తదితరులు పాల్గొన్నారు. గుణదలలో... గుణదల : సీపీఐ నగర సమతి చేపట్టిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమం గురువారం గుణదల సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. ప్రత్యేక హోదా వల్లే సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు ఎల్.దుర్గారావు, 2వ డివిజన్ కార్యదర్శి ఆనందరావు, నాలుగో డివిజన్ కార్యదర్శి ఎన్వీ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ మార్పులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటి పారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లకు సంబంధించి కొత్త డిజైన్లు, ప్రాథమ్యాలకు తగినట్లుగా మార్పులకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ మార్పులతో రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. పాలమూరు ప్రాజెక్టులోని ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను తొలుత భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించారు. అయితే దీని నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండడంతో.. అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ప్రాజెక్టు నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉండడంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని భావించారు. నిర్మాణ స్థలం మార్పు, పెరిగే వ్యయం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. పంప్‌హౌజ్‌ను అదే స్థలంలో భూగర్భంలో నిర్మించాలని.. దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య తప్పుతుందని పేర్కొంటూ ఆ కమిటీ తమ నివేదిక సమర్పించింది. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం)తో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఎన్ఐఆర్ఎం కూడా కూడా ఓకే చెప్పడంతో భూగర్భ పంప్‌హౌజ్ నిర్మించేందుకు నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి కమిటీ మొగ్గు చూపింది. ఈ మార్పు కారణంగా ప్రాజెక్టుపై రూ.50 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశముంది. ప్యాకేజీ-16 లోనూ..: ఇక రూ.3,250 కోట్ల అంచనాతో చేపట్టిన ప్యాకేజీ-16లో తొలుత ఓపెన్ చానల్, టన్నెల్లను ప్రతిపాదిస్తూ కాల్వల నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. ఇందులో భూసేకరణ, రైల్వే క్రాసింగులు వంటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో డిజైన్ మార్చాలని నిర్ణయించి అధ్యయనం చేయించారు. ఈ మేరకు ఓపెన్ చానల్ కాకుండా మొత్తంగా టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పులతో ప్రభుత్వంపై రూ.80 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. -
మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ
న్యూఢిల్లీ : నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మూతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, ఉద్యోగుల వేతనాలకు బుధవారం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మూత నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, రిటైర్మెంట్ పథకాలకు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునేందుకు అవసరమైన రూ.4,777.05 కోట్ల ప్యాకేజీని కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్సీఎల్ను మూసేందుకు ఆమోదించారు. కంపెనీల చట్టం 1956/2013, పరిశ్రమల వివాదాల చట్టం 1947, ఇతర చట్టాల కింద దీన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ఓ ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్/వీఎస్ఎస్ ప్యాకేజ్ కింద 2007వ పే స్కేల్‌ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ ప్యాకేజీని నగదు కింద రూ.1,309.90 కోట్లు, నగదురహిత కింద రూ.3,467.15 కోట్లను కంపెనీలోకి ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్‌ను తయారుచేసే సంస్థగా హెచ్‌సీఎల్ ఉండేంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్‌సీఎల్ మూసివేత స్థితికి చేరింది. 1952లో ఏర్పాటైన ఈ సంస్థ, నాలుగు తయారీ యూనిట్లు రుప్నరైన్ పూర్, నరేంద్రపూర్ (పశ్చిమ బెంగాల్), హైదరాబాద్ (తెలంగాణ),నాని (ఉత్తరప్రదేశ్)లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 ఫిబ్రవరిలోనే కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది.అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. -
‘ప్రత్యేక ప్యాకేజీతో ఏం ఒరగదు’
కావలి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ ఏం ఒరగదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.చెంచలబాబు యాదవ్ అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాన్ వల్ల జరిగిన నష్టానికి రూ.1500 కోట్లు ఇస్తామన్న కేంద్రం రూ.650 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొందని గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రులను మోసం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు దానిని స్వాగతించడం దారుణమన్నారు. హాదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు శివశేఖర్ రెడ్డి, అనుమాలశెట్టి వాసు, ఇంటూరి శ్రీహరి పాల్గొన్నారు. -
ఏ తరహా పరిశ్రమలు నిర్మిస్తారో చెప్పండి
మాజీ మంత్రి వడ్డే మచిలీపట్నం : భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉన్న సమయంలోనే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో భూసమీకరణను ప్రభుత్వం తెరపైకి తేవడం రైతులను మోసగించడమేనన్నారు. భూసమీకరణను తెరపైకి తెచ్చి కొందరు మంత్రులు తమ అనుచరులతో మచిలీపట్నంలో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం రైతాంగ వ్యతిరేఖ చర్యేనన్నారు. రైతులను ముంచి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనమా?.. సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తారా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు.. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులను సైతం అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ప్రభుత్వంపై రైతులు చేసే పోరాటానికి అండగా ఉంటానని చెప్పారు. పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదందాపై ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అందజేసి వారిని చైతన్యవంతం చేస్తామన్నారు.