బెంగళూరు : ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్‌ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులోని సర్జాపూర్‌కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్‌బాక్స్‌ను అమెజాన్ కంపెనీ యాప్‌లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్‌కి గురి చేస్తూ పార్శిల్‌లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది.
ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్‌పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు.
అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్‌లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు.
స్పందించిన అమెజాన్
కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment