సమన్యాయమా... సమైక్యమా! | If can't do justice to both the regions, maintain United Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సమన్యాయమా... సమైక్యమా!

Published Tue, Aug 20 2013 2:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సమన్యాయమా... సమైక్యమా! - Sakshi

సమన్యాయమా... సమైక్యమా!

 విశ్లేషణ: సీమ సహజ సంపదను- వ్యవసాయ వనరులు, ఖనిజసంపద సమగ్రంగా అంచనా వేసి సమగ్రాభివృద్ధికి ప్యాకేజీ రూపొందించాలి. అందుకు నిపుణుల కమిటీ వేయాలి. సమన్యాయం జరగకపోతే, యథాస్థితి కొనసాగడం కంటే గత్యంతరం లేదు.
 
 సమన్యాయం చేయలేకపోతే, యథాస్థితి కొనసాగాలన్నదే సీమాంధ్రుల వైఖరి. అది న్యా యమైనది, సమంజసమైనది. సీమాంధ్రుల మనోగతం విచా రించకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన విభజన నిర్ణయం వారికి పిడుగుపాటుగా తాకింది. అందుకే ఆబాలగోపాలం విజృంభణ. సీమాంధ్రుల నుంచి పెల్లుబికిన ప్రతిస్పం దనను బట్టి తమ నిర్ణయాన్ని పునరాలోచించకుండా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గపుచర్య.
 
 2014 పార్లమెంటు ఎన్నికలో తిరిగి గద్దెనెక్కే ఉద్దేశం తోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు కాంగ్రెస్ అధిష్టానం తెర లేపింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే తలంపే ఈ తొందరపాటు చర్యకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పురికొల్పింది. ఈ విషయం సీమాంధ్ర లోని పండితులకే కాదు పామరులకు కూడా అర్థమై పోయింది. అందుకే వారంతా ఏకమై సోనియా మీద నిప్పులు చెరు గుతున్నారు. సోనియా రేటింగ్ అమాంతం పడిపోయిందంటే అందుకు కారణం అదే. కాంగ్రెస్ నాయ కులంతా సోనియా కింద గులాములుగా మారినందు వల్లనే దేశానికి ఈ దుర్గతి పట్టింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడమే మేలని ఒకటికి పదిసార్లు ఉద్ఘాటించినా సోనియా పెడచెవిన పెట్టింది. రాష్ట్రాన్ని విభజించి సమస్యలను తలకెత్తుకోవడమంటే ప్రజాకవి వేమన చెప్పినట్లు నేల మీది రాయి నెత్తికెత్తినట్లుగా ఉంటుంది.
 
 రాజధాని అందరిదీ...
 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 57 ఏళ్లలోనే ముఖ్యంగా సీమాం ధ్రులు తమ సర్వస్వాన్ని ధారపోయడం వల్లనే హైదరా బాద్ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెంది, దేశంలోనే అగ్ర శ్రేణి నగరంగా గుర్తింపునకు వచ్చింది. నైజాం కాలంలో తెలుగు భాషకు గౌరవం ఉండేది కాదు. తెలుగు మాట్లాడే వారిని ఎగతాళి చేసేవారు. తెలుగుభాషా వికాసం, విశా లాంధ్ర నిర్మాణం, తెలంగాణ సాయుధ పోరాట లక్ష్యా లుగా కూడా సాగింది ఎలా విస్మరిస్తాం? సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించిన తర్వాత వేలాది మంది సినీ ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బంది వల్ల తెలుగు భాష, సంస్కృతి పరిఢవిల్లాయి. సీమాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి తమ సొంత నగ రంగా ఇక్కడ జీవనాధారం ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్క ప్రభుత్వోద్యోగాల్లో తప్ప తక్కిన అన్ని రంగాల్లో ఎటువంటి వివక్ష ఉండరాదు. అందుకు కేంద్రం చట్టబద్ధ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సీమాంధ్ర ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వారి భార్యలు, పిల్లలు ఇక్కడ చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి తృప్తికరమైన రీతిలో పరిష్కారం కనుగొనాలి.
 
 తెలంగాణ నేతల నుండి కొన్ని అపశ్రుతులు వినబడు తున్నాయి. వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేసున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయంలో దాదాపు సగభాగం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తున్నట్లు గణాం కాలు తెలుపుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో సీమాంధ్రులు నెలకొల్పిన పరిశ్రమలు, 23 జిల్లాలకు రాజధానిగా ఉన్నందువల్ల కేంద్రం నుంచి వచ్చిన పరిశ్ర మలు ఈ ప్రాంతంలోనే వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 1956కు ముందు ఆదాయమెంత, ఇప్పుడు ఆదా యం ఎంత అన్నది తెలుసుకోవడం కష్టంకాదు. కాబట్టి, సీమాంధ్రలో ఆదాయం పెరిగేంతవరకు గ్రేటర్ హైదరా బాద్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదిక మీద పంపకం కోరడం న్యాయమైనదే. అందుకు కేంద్రం నిపుణుల కమిటీ వేసి పరిశీలించి నిర్ణయించాలి.
 
 విభజన అనివార్యమైతే ఇక మీదట కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రైవేట్ పారిశ్రామికాధిపతులు గానీ నెలకొల్పే పరి శ్రమలను, వాణిజ్య సంస్థలను సీమాంధ్రలోనే నెలకొల్పే టట్లు హామీ లభించాలి. మంచినీరు, విద్యుత్, రవాణా, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక వసతులు ఏర్పాటు కావాలి. సమన్యాయానికి నిర్దిష్ట రూపంలో హామీ లభించి, సీమాంధ్ర ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ వర్గాలకు, ప్రజాసంఘాలకు తృప్తికలిగిన తర్వాతనే విభ జన ప్రక్రియకు మలి అడుగులు వేయాలి తప్ప, అంత వరకు దానిని కోల్డ్ స్టోరేజీలో పెట్టాలి.

 నీటి లభ్యతకు హామీ
 నదీ జలాల లభ్యత దుర్భిక్ష ప్రాంతాలకు జీవన్మరణ సమ స్యగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజె క్టులన్నీ కృష్ణ మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నవే. రెండు, మూడు రాష్ట్రాలైతే నదీ జలాల వివాదాలు రావణ కాష్టంగా మారకతప్పదు. ఒకే రాష్ట్రం అయితే సమన్వ యంతో సర్దుబాట్లు జరుగుతాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని మాత్రమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెప్పి తతిమ్మా నీటి సమస్యలను మభ్యపెట్టింది. వైఎస్ మరణానంతరం పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పడకవేశాయి. వైఎస్ హయాంలో తవ్వించిన పోలవరం కాల్వలు పూడిపోతున్నాయి. గండికోట రిజర్వా యర్ పూర్తయినా దానికి నీళ్లు వచ్చే మార్గం పూర్తిగాక నిలిచిపోయింది. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయి ల్‌పాండ్ పథకం దుర్భిక్ష ప్రాంతాలకు కీలకమైన పథకం. విభజన జరిగితే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలి యదు. ఈ ఏడాది గోదావరి జలాలు సుమారు 3,000 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇందులో పది లేదా పదిహేను శాతం ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ డ్యాం ఎడమ వైపు ఆయకట్టుకు ఉపయోగిస్తే, దానివల్ల మిగిలే కృష్ణా జలాలు దుర్భిక్ష ప్రాంతాలకు ఉపయోగ పెట్టుకోవచ్చు. వైఎస్ ఈ దృష్టితోనే ఉభయతారకంగా జలయజ్ఞాన్ని రూపొందిం చాడు.
 
 సీమ భయాలు తొలగించాలి!
 1937లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణానదీ జలాలను వినియోగించడంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే షరతు కీలకమైనది. ఈ ఒప్పందం ప్రకారమే 1952లో కృష్ణా- పెన్నారు ప్రాజెక్టు, 1953లో కర్నూలులో ముఖ్య పట్టణం రూపుదిద్దుకున్నాయి. కృష్ణ-పెన్నారులోని సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులు రాయలసీమకు కీలకమైనవి. కృష్ణ- పెన్నారులో భాగమైన సోమశిల ద్వారా మద్రాసు రాష్ట్రా నికి కృష్ణ నీరు తరలించే కుట్ర అందులో ఇమిడి ఉన్నందు వల్ల, అన్ని ప్రాంతాల వారి ఆందోళన మూలంగా కృష్ణ- పెన్నారు రద్దయి, దాని స్థానంలో నాగార్జునసాగర్ వచ్చిం ది. కృష్ణ-పెన్నారుతోపాటు సిద్ధేశ్వరం, గండికోట కూడా రద్దయ్యాయి. ఇది సీమవాసులకు శాపంగా పరిణమిం చింది. కానీ, నాగార్జునసాగర్ వల్ల కోస్తా, తెలంగాణ లాభ పడ్డాయి. బచావత్ కేటాయింపుల్లో కూడా సీమ నష్టప డింది. నాగార్జునసాగర్‌వల్ల లాభపడిన కోస్తా, తెలం గాణవారు సీమ ప్రాజెక్టులకు కృష్ణ నికర జలాలు అందిం చడానికి ముందుకు రావాలి. ఇది వారి నైతిక బాధ్యత.
 
 బచావత్ తీర్పు ద్వారా మరోవిధంగా కూడా సీమ నష్టపోయింది. తుంగభద్ర ప్రాజెక్టు కట్టకముందు తుంగ భద్ర నీరు కేసీ కెనాల్‌కు పుష్కలంగా యథేచ్ఛగా పారేవి. ఈ కాలువ కింద కర్నూలు-కడప జిల్లాలలో ఉన్న 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు అందాలి. రాష్ట్రాల పునర్విభజన వల్ల రాయలసీమలో ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ కర్ణాటకలోకి వెళ్లిపోయింది. దీని వల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలనుద్దేశించిన తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల కింద ఆయకట్టు తరచు నీటి ఎద్దడికి గురవుతోంది. ఆ కాల్వలు కొంత దూరం కర్ణా టక ద్వారా రావలసి ఉన్నందువల్ల సీమకు ఉద్దేశించిన నీరు మార్గమధ్యంలో మళ్లింపునకు గురవుతున్నది. కేసీ కెనాల్‌కు అవసరమైన 40 టీఎంసీల నీటికి తుంగభద్ర రిజ ర్వాయర్‌లలో కేటాయింపు లేనందువల్ల, తుంగభద్ర దిగు వన పడే వర్షపు నీటిని మాత్రమే బచావత్ కేటాయించినం దువల్ల నిశ్చిత జలాధారంగా ఉన్న కేసీ కెనాల్ బచావత్ పుణ్యమా అని అనిశ్చిత జలాధారంగా మారింది.
 
 చంద్రబాబు హయాంలో కేసీ కెనాల్ ఎండిపోయిం ది. వైఎస్ వచ్చిన తర్వాత కేసీ కెనాల్‌కు నీటి ఎద్దడి ఎదురైనప్పుడు శ్రీశైలం నుంచి కృష్ణ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వదిలే ఏర్పాటు చేశాడు. శ్రీశైలం రిజర్వాయర్ హైడెల్ ప్రాజెక్టుకు ఉద్దేశించి కట్టినా, కాల క్రమంగా సాగునీటి అవసరం ఒత్తిడివల్ల అది బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపుదిద్దుకొంది. ప్రస్తుతం దాని ఆధారంగా తెలంగాణ, సీమాంధ్ర వైపు అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. విద్యుత్తును థర్మల్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చుగానీ, సాగునీరు లేకపోతే ఆ ప్రాంత మంతా ఎడారిగా మారుతుంది. విభజన గురించి ఆలో చించే వారు సాగునీటి సమస్య ఎంత ప్రాముఖ్యమైనదో ఒక క్షణం కూడా ఆలోచించిన పాపాన పోలేదు. సీమ ప్రాజెక్టులకు నికర జలాల లభ్యతకు హామీ ఇవ్వకుండా విభజన నిర్ణయం ముందుకు సాగరాదు.
 
 వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు
 రాజధాని, సాగునీరు తర్వాత సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలు అవసరమే. తెలంగాణ కంటే కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా ఉందని శ్రీకృష్ణ కమిటీ తెగేసి చెప్పింది. ఉత్తరాంధ్ర కూడా ఇంచుమించు సీమతో పాటు వెనుకబడిన ప్రాంతమే.

 

వైఎస్ సంకల్పించిన ఉత్తరాంధ్ర సుజలస్రవంతికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి పూర్తి చేయడం ఆ ప్యాకేజీలోని ముఖ్య భాగంగా ఉండాలి. జలయజ్ఞం పూర్తయిన తర్వాత కూడా సీమలోని అత్యధిక భాగం దుర్భిక్షప్రాంతంగానే ఉంటుంది. అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది.
 
  వైఎస్ ఇది గుర్తించే సీమలోని ప్రతి జిల్లాలోనూ ఉపాధికి అవకాశం కల్పిస్తూ ఒక భారీ పరిశ్రమకు పథకం వేశారు. సత్వర సమగ్ర పారిశ్రామికీకరణ ఒక్కటే వెనుక బాటుకు పరిష్కారం. వైఎస్ కడప-బెంగళూరు రైలు మార్గానికి బీజం వేశాడు. అది కూడా అటకెక్కినట్లుంది. సీమ సహజ సంపదను- వ్యవసాయ వనరులు, ఖనిజసం పద - సమగ్రంగా అంచనా వేసి సమగ్రాభివృద్ధికి ప్యాకేజీ రూపొందించాలి. అందుకు నిపుణుల కమిటీ వేయాలి. సమన్యాయం జరగకపోతే, యథాస్థితి కొనసాగడం కంటే గత్యంతరం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement