Mineral resources
-
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానం అవినీతికి ఆలవాలంగా మారిందని.. అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక రవాణా, టీఎస్ఎండీసీ కార్యకలపాలపై విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూగర్భ గనులు, ఖనిజ వనరుల శాఖపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, ఆ శాఖ అధికారులతో రేవంత్ సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అవినీతి ఇసుక క్వారీయింగ్, రవాణాకు సంబంధించి అన్నిస్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలని అధికారులను సీఎం హెచ్చరించారు. 48 గంటల్లోగా అన్నిస్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. రెండు రోజుల తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపాలని.. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. అన్నిరూట్లలో ఉన్న టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటికి తీయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు, డంపులను తనిఖీ చేయాలని.. అక్రమాలకు పాల్పడినవారికి జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయించి..: ఇసుక రీచ్లన్నింటా సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న తాను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాదయాత్ర చేసినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లానని.. అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఈనెల 3న రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. అందులో 22 లారీలకు అనుమతి లేదని.. ఒకే పర్మిట్, ఒకే నంబర్‌తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తేలిందని స్పష్టం చేశారు. అంటే 25శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. అనుమతిలేని క్రషర్స్ సీజ్ చేయండి హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవన సముదాయాలు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సెల్లార్ల కోసం ఆరు మీటర్ల కంటే లోతుగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను ఆదేశించారు. అలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేప్పుడే.. వాటి వివరాలు ఖనిజ వనరుల శాఖకు చేరేలా సమీకృత ఆన్లైన్ విధానం అమలు చేయాలన్నారు. గ్రానైట్, ఖనిజ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ను వినియోగించాలని సూచించారు. గ్రానైట్‌తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేం ఉన్నాయి, ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి, వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా!
ఆదివాసీ జనాభా మెజార్టీ గా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని గనులు ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి.పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మోతలు ఎరుపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్ చేసుకునేఅవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బైలడిల్లా గనుల గత చరిత్రపై ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60 నుంచి 68 శాతం వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నియోలియం, టాంటాలమ్ వంటి ఖనిజాలూ ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికి తీస్తున్నారు. బస్తర్ రాజ్యాన్ని కలుపుకోవాలనుకున్న బ్రిటిషర్లు వరంగల్ కేంద్రంగా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్ బస్తర్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్దేవ్ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు. 1921 నవంబర్‌లో రుద్రప్రతాప్ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రపుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్ రాజ్యాన్ని తమలో కలిపేసుకోవాలని చూసినా భౌగోళిక అననుకూలత కారణంగా వెనుకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన భంజ్ రాజవంశానికి చెందిన ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌తో ప్రపుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రపుల్ల చంద్ర రాజయ్యాడు. అనారోగ్య కారణాలతో రాజును తప్పించి.. వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టి అంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్ రాజ్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. బైలడిల్లా గనులు విషయంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకోవాలంటూ ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రపుల్ల చంద్రను బ్రిటిష్ ప్రభుత్వం కోల్‌కతాకు పంపించడంతో బస్తర్ పాలనా పగ్గాలు ప్రపుల్లకుమారి చేతిలోకి వచ్చాయి. తదనంతర కాలంలో ప్రఫుల్ చంద్ర కన్నుమూశారు. అంతు చిక్కని రాణి మరణం బైలడిల్లా గనుల విషయంలో బస్తర్ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రపుల్లకుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రపుల్లకుమారి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్ అంతఃపుర వాసుల నమ్మకం ప్రభుత్వ దళాల దాడిలో ప్రపుల్లకుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ బస్తర్‌కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్సిలీ స్టేట్‌గా బస్తర్ ఉండేది. స్వాతం్రత్యానంతరం పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. బిలాస్పూర్, భిలాయ్‌ల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్ దేశాలతో పాటు జపాన్ సైతం ఆర్థిక సాయం అందించింది. ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాపకింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం – కిరండోల్ రైలు మార్గానికి జపాన్ భారీగా నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంతో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్ రాజు ప్రవీర్‌చంద్ర భంజ్దేవ్కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్‌లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీర్భంజ్దేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్ ప్రధాన పట్టణమైన జగదల్పూర్లో ఎన్ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది. గ్రీన్‌హంట్..సల్వా జుడుం 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్లింది. దండకారణ్యం లేదా అబూజ్‌మడ్‌గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమయ్యింది. మొత్తం మీద రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై ప్రారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్‌లో భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బైలడిల్లాకు సంబంధించి మరో అధ్యాయంమొదలవుతున్నట్టయ్యింది. -
ఇక చకచకా లీజులు
సాక్షి, అమరావతి: గ్రానైట్ లీజుల ఈ–వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 500కిపైగా గ్రానైట్ గనులకు ఈ–వేలం నిర్వహించనుంది. మైనింగ్ నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం ఇటీవల కొత్తగా పారదర్శక విధానాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్ వేలం (ఈ–ఆక్షన్) ద్వారా రాష్ట్రంలోని ఖనిజ వనరుల మైనింగ్ కోసం ఉత్సాహం ఉన్న ఎవరైనా లీజులు పొందే అవకాశం కల్పించింది. నూతన విధానం ద్వారా తొలి దశలో 234 ఖనిజాల లీజుకు గనుల శాఖ ప్రభుత్వం ఇంతకు ముందే జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్‌వే. కానీ ఈ–వేలం నిర్వహించవద్దని గ్రానైట్ అసోసియేషన్ హై కోర్టుకు వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గ్రానైట్ లీజుల వేలానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తొలి దశలో 200 గ్రానైట్ గనుల లీజుకు ఈ–వేలం నిర్వహించనున్నారు. 6 నెలల్లో వివిధ రకాల ఖనిజాలకు చెందిన వెయ్యి క్వారీల లీజులకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో గ్రానైట్‌వే సగం ఉన్నాయి. ఈ వెయ్యి లీజుల ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. గుత్తాధిపత్యానికి చెక్ గతంలో మైనింగ్ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. పలుకుబడి కలిగిన వ్యక్తులే క్వారీలను శాసించేవారు. కొత్తవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. 55 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి లీజులు కేటాయించేవారు. పైగా, లీజుకు తీసుకున్నప్పటికీ, వాటికి అనుమతులు తీసుకొనేవారు కాదు. లీజు దరఖాస్తుల నుంచి క్వారీయింగ్ ప్రారంభం వరకు అనేక అవకతవకలు జరిగేవి. పదేళ్లు, ఇరవై ఏళ్లకు కూడా తవ్వకాలు మొదలయ్యేవి కావు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది. గతంలో ఖనిజ వనరులను గుర్తించడం, వాటికి ఎన్వోసీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, తర్వాత లీజులు తెచ్చుకోవడం ఒక ప్రహసనంలా ఉండేది. అనుమతులకూ పారదర్శక విధానం లేకపోవడంతో ఇబ్బందులు నెలకొనేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి అక్రమాలకు, ఆలస్యానికి తావు లేకుండా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ముందుగా వచ్చిన వారికే లీజుల విధానాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో ఖనిజ వనరులను గనుల శాఖ ద్వారా గుర్తించి, వాటిలో క్వారీయింగ్ చేసే ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ–వేలం విధానాన్ని తెచ్చింది. దీనివల్ల ఎవరైనా సులువుగా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇప్పటికే గనుల లీజు పొంది క్వారీయింగ్ చేస్తున్న వారు, పట్టా భూముల్లో క్వారీయింగ్ చేస్తున్న వారు, అటవీ భూముల్లో లీజు పొందిన వారి ప్రయోజనాలను కూడా కాపాడుతూ కొత్త విధానాన్ని తెచ్చింది. ప్రస్తుతం క్వారీయింగ్ చేస్తున్న వారికి వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం కల్పించింది. లీజు గడువు ముగిసిన తరువాత ఆ ప్రాంతాల్లో రెవెన్యూ భూముల్లో ఖనిజాలకు వేలంలో ఎంత విలువ నిర్ధారణ అవుతుందో దానిని చెల్లిస్తే, వారికే లీజు అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అధికారులకు సూచించారు. ఏపీఎండీసీ(ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) పనితీరుపై మంగళవారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బెరైటీస్, బొగ్గు, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, బాల్ క్లే, సిలికా శాండ్, గ్రానైట్ తదితర ఖనిజాలకు సంబంధించిన ఆపరేషన్స్‌పై అధికారులతో ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. ఖనిజ ఆధారిత పరిశ్రమలకు తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కీలకమైన ఖనిజాల వెలికితీతలో ఏపీఎండీసీ చక్కటి ప్రగతి కనబరుస్తోందని, ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు గనులను దక్కించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని అభినందించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఏపీఎండీసీ రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల మైనింగ్‌లో ఇంకా చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మైనింగ్ కార్యక్రమాలను, లక్ష్యాలను సాధించేలా నిర్వహించాలని సూచించారు. ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలకు దీటుగా ఏపీఎండీసీ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ఏపీఎండీసీ ఎండీ వీజీ వెంకటరెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ సలహాదారు డీఎల్ఆర్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఖనిజాల కాణాచి కడప జిల్లా
అంగళ్ల రతనాలు అమ్మినారట... సాక్షి, కడప: రాయలసీమను రత్నగర్బగా పేర్కొంటారు. ఒకప్పుడు మన జిల్లాతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు లభించేవని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో నేటికీ వజ్రాలు లభిస్తున్నాయి. మన జిల్లాలో కూడా ఒకప్పుడు వజ్రాలు లభించేవన్నది చారిత్రక సత్యం. మాన్యువల్ ప్రకారం జిల్లాలోని గండికోట నాడు వజ్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. సీమ జిల్లాలలో లభించే వజ్రాలను గండికోటకు చేర్చి అక్కడి నుంచి హంపికి తరలించి అక్కడ విదేశీ వ్యాపారులకు బహిరంగంగా విక్రయించేవారని తెలుస్తోంది. మన జిల్లాలో పెన్నా పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, ఖాదరబాద్, చెన్నూరు, కొండపేట, కలసపాడు, సంజీవరాయునిపేట, కొండ సుంకేసుల ప్రాంతాలలో వజ్రాలు విరివిగా లభించేవి. పెన్నాతోపాటు కుందూ నది తీరాలలో కూడా వజ్రాలు లభించేవని సమాచారం. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్, గండికోటను ముట్టడించిన మీర్‌జుమ్లా వజ్రాల వ్యాపారం కోసం ఈ ప్రాంతానికి వచ్చిన వారే. చెన్నూరు కొండపేటల్లోని గనుల్లో నుంచి బ్రిటీషర్లు వజ్రాలను వెలికి తీసేవారని 1839లో ఓలంపల్లెలో ఒక జాతి వజ్రం లభించిందని మ్యానువల్ ద్వారా తెలుస్తోంది. అప్పట్లోనే దానిని రూ. 1450లకు విక్రయించారని సమాచారం. బెరైటీస్‌కు పుట్టినిల్లు బెరైటీస్ ఖనిజానికి పర్యాయపదం మన జిల్లా. ఇక్కడ గ్రే, వైట్ రెండు రకాల బెరైటీస్ లభిస్తోంది. ఓబులవారిపల్లె మండలం అనంతరాజుపేట, మంగంపేటలలో గ్రే బెరైటీస్ ఖనిజం సుమారు 74 మిలియన్ టన్నులు ఉన్నట్లు నిపుణుల అంచనా. అందులోని అధిక గురుత్వ శక్తి కారణంగా ఈ పౌడర్‌ను చమురు బావుల డ్రిల్లింగ్‌లో వాడతారు. ఇక్కడ లభించే గ్రే బెరైటీస్‌ను సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. ప్రపంచంలో లభించే ఖనిజాలలో 28 శాతం మన దేశంలోనే లభిస్తుండగా, అందులో 97 శాతం ఖనిజం మన జిల్లాలోనే నిక్షిప్తమై ఉందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వైట్ బెరైటీస్ జిల్లాలోని వేముల, కొత్తపల్లె, రాజుపాలెం, ఇప్పట్ల ప్రాంతాలలో విరివిగా లభిస్తోంది. జిల్లాలో ఈ రకం 0.7 మిలియన్ టన్నులు నిక్షిప్తమై ఉందని అంచనా. దీనిని పెయింట్లు, పేపరు, నూలు తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. లక్షల టన్నుల నిక్షేపాలు.. ఆస్బెస్టాస్ ఆస్బెస్టాస్..ఈ ఖనిజం రాళ్ల రూపంలో ఉంటుంది. వాటిని అరగదీస్తే మెత్తని దూది లాంటి, దారం లాంటి పదార్థం వస్తుంది. దీనికి ఉష్ణ నిరోధకశక్తి అధికం. పులివెందుల ప్రాంతంలోని బ్రాహ్మణపల్లె, లోపట్నూతల, లింగాల, రామనూతలపల్లె ప్రాంతాల్లో ఈ ఖనిజం విరివిగా లభిస్తోంది. బ్రాహ్మణపల్లెలో లభించే క్రోసోటైల్ రకం అస్బెస్టాస్ ఎంతో మేలైనదిగా చెబుతారు. జిల్లాలో సుమారు 2.50 లక్షల టన్నుల నిక్షేపాలు ఉన్నాయని నిపుణుల అంచనా. ఇళ్లు, షెడ్లు, కర్మాగారాలు, ఇతర భవనాలకు పైకప్పుగా వాడే సిమెంటు రేకుల తయారీలోనూ, యంత్రాల విడిభాగాలు, విద్యుత్ ఉష్ణ నిరోధక సాధనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. పులివెందుల బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి లోపటన్నూతల గ్రామం వరకు 15 కిలోమీటర్ల పొడవున ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 200 మీటర్ల లోతు వరకు ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని తెలుస్తోంది. సిరులు కురిపించే సున్నపురాయి సిమెంటు పరిశ్రమకు ప్రధానమైనది సున్నపురాయి. జిల్లాలోని ఎర్రగుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇది విరివిగా లభిస్తోంది. ఇందులో ఉన్నత శ్రేణి సున్నపురాయి నిక్షేపాలు ఉండడం విశేషం. జిల్లాలో దాదాపు 100 మిలియన్ టన్నుల సున్నపురాయి నిల్వలు ఉన్నట్లు అంచనా. మేలురకం సున్నపురాయిని పేపరు తయారీ, క్రిమిసంహారకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. సున్నపురాయి ఆధారంగానే జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం, మైలవరం ప్రాంతాల్లో సిమెంటు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వీటినే పెద్ద పరిశ్రమలుగా చెప్పవచ్చు. నిర్మాణ రంగంలో సిమెంటు ప్రధానం కావడంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. జిల్లాకు ఈ పరిశ్రమ ఆర్థిక బలాని్నచేకూరుస్తోంది. జిల్లాలో సిమెంటు పరిశ్రమలకు 200 సంవత్సరాలకు సరిపడ సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. దీన్ని ఆధారంగా ఎర్రగుంట్లలో జువారి, ఐసీఎల్ సిమెంటు ఫ్యాక్టరీలు ఉండగా, కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతీసిమెంట్స్, మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల వద్ద దాల్మియా సిమెంటు కర్మాగారం ఏర్పాటయ్యాయి. సిమెంటు ఫ్యాక్టరీల ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. –కడప కల్చరల్ -
ఖనిజం మాటున చేదు నిజం
సాక్షి, ఓబులవారిపల్లె/అమరావతి: మన దగ్గర ఒక వస్తువుంటే ఏం చేస్తాం... ఎంతో కొంత లాభానికి విక్రయిస్తాం. అమ్మకందారుడు ఎవరైనా సరే కొనుగోలుదారుల మధ్య పోటీని పెంచడం ద్వారా అధిక ఆదాయం పొందాలను కుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అందుకు మినహాయింపు. తన దగ్గరున్న విలువైన బెరైటీస్ ఖనిజం ధరను వీలైనంత తగ్గించేం దుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ ధరకు కొనుగోలుదారుకు అమ్మేందుకు తాపత్రయ పడుతోంది. బెరైటీస్ ధరలను తగ్గించడం, పోటీ లేకుండా సంస్థల మధ్య రాజీ కుదర్చడం ద్వారా కనీస ధరలకే ఖనిజాన్ని కట్టబెట్టేస్తోంది. తద్వారా కొనుగోలుదారుకు అధిక లాభాలు చేకూరేలా చేసి, అందులో భారీగా ముడుపులు అందుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పన్నాగానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లకోసం రాష్ట్ర ఖజానాకు రూ.400 కోట్లు నష్టం కలిగించడానికి సైతం వెనుకాడని ఏపీఎండీసీ వ్యవహారమిది. మూడుసార్లు తగ్గింపు... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్ జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ధరలు తగ్గించేందుకు ఏపీఎండీసీ కష్టపడుతోంది.ఇలా గత ఏడాది బెరైటీస్ ధరలు తగ్గించడం ద్వారా రూ. 150 కోట్లు సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బెరైటీస్ ఖనిజ తవ్వకం టెండర్లలో కాంట్రాక్టర్లను రింగుగా మార్చి అధిక ధరకు ‘చెన్నైకి చెందిన ‘త్రివేణి’కి కాంట్రాక్టు కట్టబెట్టారు. తద్వారా రూ. 531 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చినందుకు ప్రభుత్వ ముఖ్యనేత అందులో సింహభాగం వాటా పొందారని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా వాటా పొందేందుకు ముందస్తు రంగం సిద్ధం చేయించారు. ఆ మేరకు 22 లక్షల టన్నుల బెరైటీస్ అమ్మకానికి టెండర్లు ఆహ్వానిస్తూ ఏపీఎండీసీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో బెరైటీస్ ధరలకు అనుగుణంగా శాస్త్రీయ విధానంలో ధరలు ఖరారు చేయాలని, ఇందుకు అడ్డుగా ఉన్న (తెలుగుదేశం ప్రభుత్వం 2015 జనవరి 27వ తేదీన జారీ చేసిన) జీవో 22ను రద్దుచేయాలంటూ ఏపీఎండీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఏడాది జూలై నాలుగో తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి దాని సూచనలను పరిశీలించి ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ నిర్ణయా« ధికారాన్ని ఏపీఎండీసీ పాలకమండలికే అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జీవో నంబరు–262 జారీ చేసింది. దీంతో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థ నుంచి నివేదిక తెప్పించుకుని బెరైటీస్ ధరలను భారీగా తగ్గించి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీ ఖజానాకు జరిగే నష్టం రూ.400 కోట్ల పైమాటేనని అంచనా. ఇది చాలదన్నట్లుగా... టెండరును దక్కించుకున్న వారు కొనుగోలు చేసుకునేందుకు చేసుకున్న ఒప్పందంలోని ఖనిజం పరిమాణంలో 40 శాతం కొనుగోలు చేస్తే తాయిలంగా ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని అధికార వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు బెరైటీస్ కొనుగోలు చేసే, ఎగుమతి చేసే పెద్ద సంస్థల వారితో ఏపీఎండీసీ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ఇలా ధరలు తగ్గించాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక మర్మం ఏమిటని కొందరు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు టెండర్ కాలపరిమితి ముగియగా... మరోవైపు టెండర్ నిర్వహించేలోపు ఒక ప్రైవేటు సంస్థకు 70 వేల టన్నుల ఖనిజం డెలివరీ ఆర్డర్ ఇవ్వడాన్ని బట్టే గూడుపుఠాణి నడుస్తున్నట్లు స్పష్టమవుతోందని అధికారులు అంటున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు స్థానికంగా ఉన్న మిల్లుల యజమానులకు, వ్యాపారులకు ఆర్థిక పరమైన స్థోమత (అర్హత) లేకపోవడంతో కొంతమంది ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కైవసం చేసుకునేందుకే కనీస ధరను తగ్గించేలా చేశారని బహిరంగంగానే కిందిస్థాయి అధికారులు అంటున్నారు. ఒకవైపు ఖనిజ విక్రయ ధరలను తగ్గిస్తూ మరో వైపు బెరైటీస్ తవ్వకం రేటు పెంచుతూ పోవడం సంస్థ మనుగడకే ప్రమాదమని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల సంస్థ లాభాల నుంచి నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారు. రూ.400 కోట్లకు పైగా నష్టం ఇలా.. - టన్ను ‘ఎ’ గ్రేడ్ ఖనిజం కనీస ధర గతంలో రూ.6,750 ఉండగా దీనిని తాజా టెండరు నోటిఫికేషన్లో రూ.4,000కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.2,750. ఈ లెక్కన 8.5 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్ ఖనిజ విక్రయంవల్ల సంస్థకు కలిగేనష్టం. రూ.233 కోట్లు - టన్ను ‘బి’ గ్రేడ్ ఖనిజం కనీస ధర గతంలో రూ.5,360 ఉండగా రూ.3,000కు తగ్గించింది. టన్నుకు తగ్గిన ధర రూ.2,360 ప్రకారం 2.5 లక్షల టన్నుల అమ్మకంవల్ల సంస్థకు కలిగే నష్టం రూ.59 కోట్లు - టన్ను ‘సి’ ప్లస్ ‘డి’ ప్లస్ డబ్ల్యూ ఖనిజం గతంలో రూ.2,500 ఉండగా ప్రస్తుతం కనీస ధరను రూ.1,500కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.1000. మొత్తం 11 లక్షల టన్నులు విక్రయానికి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీకి కలిగే నష్టం. రూ.110 కోట్లు మొత్తం ఏ, బీ, సీ... గ్రేడ్లకు సంబంధించి 22 లక్షల టన్నుల ఖనిజానికి కనీస ధర తగ్గింపు వల్ల ఏడాదికి కలిగే నష్టం రూ.402 కోట్లు ఉంటుందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
సీనరేజి బకాయిలకు వన్‌టైం సెటిల్మెంట్
2,034 మంది బకాయిదారులు ఆరు నెలల గడువు మూడు కేటగిరీలుగా ఫీజు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సీనరేజి బకాయిల వసూలుకు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ప్రకటిం చింది. నిర్మాణ రంగానికి అవసరమైన భూగర్భ ఖనిజవనరుల అక్రమ వినియోగంపై భారీ జరిమానాలకు బదులుగా ఈ విధానం అమలు చేయనుంది. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఆరు నెలల పాటు అమల్లో ఉండే వన్ టైం సెటిల్మెంట్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఇసుక, మొరం, రాయి, కంకర, గ్రానైట్, సున్నపురాయి, బిల్డింగ్ స్టోన్.. ఖనిజ వనరుల తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తే జరిమానా తప్పదు. అదే నిబంధనల ప్రకారం అడ్డదారిలో వాటిని వినియోగించుకున్న బాధ్యులు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు.. వాటికి సంబంధించిన సీనరేజి ఫీజురశీదులు చూపించటం తప్పనిసరి. లేకుంటే సీనరేజితో పాటు.. అంతకు మించి అయిదు రెట్ల వరకు జరిమానా విధిస్తారు. చాలాచోట్ల కాంట్రాక్టర్లు నిర్మించిన భవనాలున్నాయి.. కానీ, అసలు యజమానుల వద్ద సీనరేజి చెల్లించినట్లు ఆధారాలేమీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ వింగ్ తనిఖీల్లో ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు బిల్డర్లు, కాంట్రాక్టర్లకు సంబంధించి విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ విభాగం పరిధిలో ఇటువంటివి 2034 కేసులు నమోదయ్యాయి. కేవలం 546 కేసులు కోర్టుల దాకా వెళ్లటంతో అప్పీళ్ల స్థాయిలో ఉన్నాయి. మిగతా పెండింగ్ కేసులు ఏకంగా రెవిన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయి. మధ్యేమార్గంగా ఈ కేసులన్నింటికీ వన్ టైం సెటిల్మెంట్ అవకాశం కల్పిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో సొంత గృహ నిర్మాణాలు, రెండో కేటగిరీలో చిన్న వ్యాపార వాణిజ్య సముదాయాలు (5000 చదరపు అడుగుల లోపు), అంతకు మించిన విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య సముదాయాలను మూడో కేటగిరీలో చేర్చారు. వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం మొదటి కేటగిరీకి చెందిన బకాయిదారులు సీనరే జి ఫీజు చెల్లించాలి. రెండో కేటగిరీలో సీనరేజితో పాటు అంతే మొత్తం జరిమానా, మూడో కేటగిరీకి చెందిన వారైతే సీనరేజిపై రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకుంటే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. -
సహజ సంపద సీమాంధ్ర వశం
- ఆంధ్రలోకి వెళ్లిన విలువైన ఖనిజ నిక్షేపాలు - కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయిన తెలంగాణ - పోలవరం ముంపు మండలాల విలీన ప్రభావం వేలేరుపాడు : జిల్లాలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో వీలినం చేయడం వల్ల తెలంగాణలోని విలువైన ఖనిజ నిక్షేపాలు సీమాంధ్ర ప్రభుత్వ వశం కానున్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం ముంపులో లేనప్పటికీ, ఆయా మండలాల భూభాగమంతా ఆంధ్రలో కలపడంతో తెలంగాణకు కాకుండా పోనున్నాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఆంధ్రలో విలీనం చేసినప్పటికీ మునగని ప్రాంతం తెలంగాణలో ఉంచితే ఈ ఖనిజ నిక్షేపాలు తెలంగాణకే దక్కుతాయి. ముంపు మండలాలైన భద్రాచలం, వేలేరుపాడు, కుక్కునూరు, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ఎంతో విలువైనఅబ్రకం (మైకా), క్వార్జ్, ఇనుప ఖనిజం, కొరండ, ఆల్‌క్లైన్ రాక్స్ తదితర ఖనిజ సంపద నిల్వలు అపారంగా ఉన్నాయి. కానీ.. ఏజెన్సీ వాసుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు రూపొందించిన కొన్ని ప్రత్యేక చట్టాలు వీటి వెలికితీతకు ఆవరోధంగా మారాయి. దీంతో ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద భూగర్భంలోనే మగ్గుతోంది. ఈ ప్రాంతంలో లభించే అబ్రకం(మైకా), క్వార్జ్, కొరండ, ఆల్‌క్లైన్ రాక్స్ తదితర విలువైన సంపద కొంత మేరకు పట్టా భూముల్లోనూ మరికొంత అటవీ భూముల్లోనూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అమల్లో ఉన్న చట్టాలు ప్రభుత్వ నిబంధనలు వీటి వెలికి తీతకు అవరోధంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీలో అమల్లో ఉన్న ప్రత్యేక చట్టాలు పరిస్థితి ఏర్పర్చాయని చెప్పొచ్చు. ఈ చట్టాల ప్రకారం ఏజెన్సీలోని భూములు క్రయంగా పొందడం గానీ, లీజుకు తీసుకోవడం గానీ నిషేధం. దీంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు ప్రవేశించే అవకాశం లేదు. అయితే ఇక్కడి భూములపై పట్టా హక్కులు ఉన్న రైతులంతా గిరిజనులు కావడంతో వాటి వెలికితీతకు అవసరమయ్యో వ్యయాన్ని భరించే స్థితిలో లేకపోవడం మరో కారణం. దీంతో ఆ సంపదకు విముక్తి లభించడం లేదు. వీటి వెలికితీతకు మార్గం సుగమనమైతే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం రాయిల్టీ రూపంలో వచ్చే అవకాశముంది. కానీ.. ప్రభుత్వం సైతం ఈ సంపద వెలికితీతకు అనువైన అంశాలను పరిశీలించడం లేదు. అయితే.. నిబంధనలను పట్టుకొని అధికారులు వేళ్లాడుతుంటే కొందరు అక్రమ రవాణాదారులు ఇదే అదునుగా భావించి ఈ సంపదను గుట్టుచప్పుడు కాకుండా కొల్లగొట్టుకు పోతున్నారు. నిబంధనలలోని లోసుగులను ఆధారంగా చేసుకోవడం ద్వారా అయితేనేమీ అక్రమంగా తరలించడం ద్వారా అయితేనేమీ మొత్తం మీద ఇక్కడ ఖనిజ సంపద వల్ల ప్రభుత్వానికి పైసా ఆదాయం సమకూర్చకుండానే పక్కదారి పట్టిన దాఖలాలు కోకొల్లలు. ప్రధానంగా అబ్రకం(మైకా), క్వార్జ్, ఇనుప ఖనిజం వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోనూ, కోరండ చింతూరు, ఆల్‌క్లైన్ రాక్స్ వేలేరుపాడు, కుక్కునూరు, వీఆర్పురంలోనూ క్వార్జ్ భద్రాచలం మండలంలోనూ విరివిగా ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ సంపద ఎక్కువ శాతం గిరిజనుల భూములలో ఉండటంతో వాటి వెలికితీతకు గిరిజనులకు మాత్రమే హక్కు ఉంది. అయితే ఈ సంపదపై గిరిజనులకు అంతగా అవగాహన లేకపోవడం, వాటి రవాణా, దానికి గల డిమాండ్ తదితర అంశాలపై అనుభవం లేకపోవడంతో గిరిజనులు వాటిపై శ్రద్ధ చూపడం లేదు. మరికొన్ని నిల్వలు అటవీ భూములల్లో ఉండటంతో ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. నిబంధనల ప్రకారం అటవీ భూమి లీజుకు పొందాలంటే అంతే విస్తీర్ణం గల స్థలాన్ని అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంది. ఇది ప్రభుత్వ పరంగానే సాధ్యమవుతుంది. దీంతో పారిశ్రామికవేత్తలెవ్వరూ ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ఖనిజ సంపద అధికారికంగా వెలికితీతకు నోచుకోవడం లేదు. ఇది కొందరు అక్రమ రవాణాదారులకు మంచి అవకాశంగా మారింది. చింతూరు మండలంలో కోరండం రాళ్ల అక్రమ రవాణా భారీస్థాయిలో జరగడం, దానిపై అటవీ అధికారులు విసృ్తతంగా దాడులు చేయడం లాంటి సంఘటనలు ఉన్నాయి. వేలేరుపాడు మండలానికి 27 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుళ్లమడుగు గిరిజన గ్రామ పరిధిలో అబ్రకం గనులు విరివిరిగా ఉన్నాయి. అయితే ఆ గ్రామంలో ఓ గిరిజనేతరుడు ఇక్కడి గిరిజనుల భూములను తన భార్య (గిరిజన) పేరు మీద లీజుకు తీసుకొని కొంతకాలం ఈ అక్రమ వ్యాపారం సాగించాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. భద్రాచలం మండలంలోని రంగాపురం గ్రామంలో బినామీ పేర్లతో క్వార్జ్ (తెల్లరాయి)ని తరలిస్తున్నారు. అలాగే కుక్కునూరు మండలం కివ్వాకలో కొంతకాలం అక్రమంగా రవాణా కొనసాగింది. ఆ తర్వాత అధికారులు నిలిపివేశారు. ఇదే మండలంలో ఇటీవల ఎంతో విలువైన ఇనుప రాయి ఖనిజం బయటపడింది. మండలంలోని రెడ్డిగుడెం గుట్టల్లో విరివిగా ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని కల్పక్కంలోని ఇందిరాగాంధీ అణువిద్యుత్ కేంద్రం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. న్యూక్లాయర్ రియాక్టర్ నిర్మాణంలో ఈ ఖనిజం కీలకమని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో లభించే ఇనుప ఖనిజం కన్నా 4,5 రెట్లు శక్తి కలిగి ఉందని తేలింది. ఈ విధంగా ఇక్కడ ఉన్న అపార ఖనిజ సంపద ప్రభుత్వానికి పైసా ఆదాయం సమకూర్చలేక పోతోంది. నిబంధనలను సడలించి, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా ఈ ప్రాంత గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. -
భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: భూగర్భం... అపారమైన ఖనిజ సంపద, ముడి చమురు, సహజ వాయువు, జల వనరులకు నిలయం. భూగర్భ సంపద మెండుగా ఉన్న దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అనతికాలంలోనే సంపన్న దేశాలుగా అవతరించాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఊహించనంతగా పెరిగాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి భూగర్భ సంపదకు ఉంది. అలాంటి సంపదను అన్వేషించి, వెలికితీసేవారే జియాలజిస్ట్‌లు. ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్న కెరీర్.. జియాలజిస్ట్. భూగర్భాన్వేషణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. దీంతో జియాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ రంగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో జియాలజీ కోర్సులను అభ్యసించిన నిపుణుల కొరత కంపెనీలను వేధిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చమురు, గ్యాస్ వెలికితీత ఊపందుకుంటోంది. మైనింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. జియాలజిస్ట్‌లకు అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. జియాలజీలో ఎంఎస్సీ పూర్తిచేయగానే ఉద్యోగం సిద్ధంగా ఉంటోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో, మైనింగ్ శాఖల్లో అవకాశాలు సులువుగా దక్కుతున్నాయి. రిలయన్స్, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. కాలేజీలు/యూనివర్సిటీల్లోనూ ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ సేవలందించొచ్చు. అర్హతలు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ కూడా చేస్తే ఉద్యోగావకాశాలు సులభంగా పొందొచ్చు. వేతనాలు ఎంఎస్సీ డిగ్రీ ఉన్న జియాలజిస్ట్కు రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. పరిజ్ఞానం, పనితీరును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు సగటున రూ.25 వేల దాకా వేతనం అందుకోవచ్చు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో చేరితే నెలకు రూ.లక్షన్నర దాకా పొందొచ్చు. జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ - ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ - నాగార్జునా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.nagarjunauniversity.ac.in/ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ వెబ్సైట్: http://www.ismdhanbad.ac.in/ - సెంటర్ ఫర్ ఎర్త్ సెన్సైస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.ceas.iisc.ernet.in/ అన్వేషణతో అద్భుత ఫలం ‘‘భూ అంతరాల్లో దాగిన ఖనిజాల అన్వేషణలో జియాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి. ఇటీవలి కాలంలో జియాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. జియాలజిస్ట్‌లకు అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ సంస్థలు గనుల తవ్వకాలకు, ఖనిజాల వెలికితీతకు నిపుణులను నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. శ్రమించగల తత్వం, ఓర్పు ఉన్న వారికి ఇది బెస్ట్ కెరీర్’’ - డాక్టర్ ఎం.మురళీధర్, జియాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
మయన్మార్ మాఫియా రాజ్
చైనా నేటి ఆసియా అద్భుతమైతే రేపు ఆ ఖ్యాతి మయన్మార్‌దే. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు... సైనిక నియంత థాన్ ష్వేకు ప్రజాస్వామ్య అధ్యక్షుని కిరీటం తగిలించాయి. నేడు బహుళజాతి కంపెనీలు మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నాయి. విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతో స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది. ప్రపంచంలోకెల్లా అంధత్వం అతి ఎక్కువగా ఉన్న దేశాల్లో మయన్మార్ అగ్రశ్రేణిలో ఉంది. అర్థ శతాబ్దిగా అక్కడ సాగుతున్న సైనిక జుంటా నిరంకుశ, జాత్యహం కార పాలనపట్ల ప్రపంచశక్తులు ప్రదర్శిస్తున్న అంధత్వం అంతకంటే చాలా ఎక్కువ. అందుకేనో ఏమో అక్టోబర్ 11-17 మధ్య దేశవ్యాప్తంగా 13 చోట్ల సంభవించిన బాం బు పేలుళ్ల ప్రత్యేక తను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది కరెన్ నేషనలిస్టు యూనియన్ (కేఎన్‌యూ) మిలి టెంట్ల దుశ్చర్యగా లెక్కగట్టేసారు. కానీ కరెన్ జాతీయవాదులకు ఆ పేలుళ్ళకు సంబంధంలేదని మయన్మార్ పోలీసులే చెబుతున్నారు. ప్రత్యేక భాషా సంస్కృతిగలిగిన కరెన్లు (జనాభాలో 7 శాతం) తూర్పు రాష్ట్రం కాయిన్‌లోనే ప్రధానంగా నివశిస్తున్నారు. జాతుల ప్రదర్శన శాలగా చెప్పుకోదగిన మైన్మార్‌లో 135 గుర్తింపు పొందిన జాతుల ప్రజలున్నారు. ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ మయన్మార్ సైనిక జుంటా బర్మీ జాతీయతను (68 శాతం) అందరిపై రుద్దాలని ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ జాత్యహంకా రం బౌద్ధమతోన్మాదం ముసుగు తొడిగింది. దీంతో తరచుగా వార్తలకెక్కుతున్న రోహింగియా లు సహా ఇతర జాతులపై జరుగుతున్న దాడులన్నిటినీ మత సంఘర్షణలుగా లెక్కగట్టేస్తున్నారు. అక్టోబర్ పేలుళ్లు మయన్మార్ జాతుల అణచివేత సమస్యను నగ్నంగా ప్రదర్శిస్తున్నాయి. కచిన్లలో 65 శాతం బౌద్ధులే. ఇస్లాం వారి లో వ్యాప్తి చెందలేదు. జాతి అణచివేతకు వ్యతిరేకంగా, స్వయం నిర్ణయాధికారం కోరుతూ వారు 1949 నుంచి సాయుధంగా పోరాడుతున్నారు. పర్వతవాసులైన కరెన్లతోపాటూ, షాన్, కచిన్, కయన్ తదితర జాతులు కూడా ఆయుధాలు పట్టాయి. 2007 నాటికి సైనిక జుంటాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న జాతుల సంస్థలే పది హేడు! నేటికీ కరెన్, షాన్, కచిన్ జాతుల పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకూ అక్టోబర్ దాడులకు పాల్పడినది ఎవరు? బడా వ్యాపారులు! కచెన్ల ప్రాంతంలోని బర్మీ బడా వ్యాపార వర్గాలే ఈ పేలుళ్లకు సూత్రధారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇటీవలి మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ ఫలితంగా చాప కింది నీరులా వ్యాపిస్తున్న సరి కొత్త సంఘర్షణను ఇది సూచిస్తోంది. జపాన్ నిన్నటి ఆసియా అద్భుతమైతే నేడు ఆ ఖ్యాతి చైనాది. మరి రేపు ఆ ఖ్యాతి ఎవ రికి దక్కనుంది? మయన్మార్కేనని ‘ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’ తాజా అంచనా. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. అందుకోసం చైనా, జపాన్, భారత్లతోపాటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ పోటీపడుతున్నాయి. సైనిక నియంతృత్వ మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు ప్రజాస్వామ్యం ‘మడి’ అడ్డురాకుండా... సైనిక నియంత థాన్ ష్వే చేత పౌర దుస్తులు తొడిగించి, ప్రజాస్వామ్య ప్రభుత్వ అధ్యక్షుని కిరీటం తగిలించారు. ప్రతిగా బతికుండగానే పీక్కుతినే బహుళజాతి రాబందుల దం డుకు మయన్మార్ తలుపులు తెరిచారు. ఆ రాబందులన్నీ మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నా యి. బొగ్గు, చమురు, సహజవాయు నిక్షేపాలు బర్మీ ప్రాం తాల్లో ఉండగా నికెల్, రాగి, బంగారం, బాక్సైట్, మణిమాణిక్యాలువంటి ఖనిజాలలో అధికభాగం అక్కడే ఉన్నాయి. జాతుల అణచివేతలో భాగంగా సైనిక జుంటా ఉద్దేశపూర్వకంగానే వారి ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసింది. ఇప్పుడా ప్రాంతాల్లోకి విదేశీ పెట్టుబడులు జోరుగా ప్రవేశిస్తున్నాయి. కరెన్ల ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతోనే స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది. అలా అని సైనిక జుంటాకు వ్యాపారవర్గాలకు ఏ సం బంధాలూ లేవనీకాదు. మైన్మార్లోకెల్లా అత్యంత సంపన్నుడు, అతిపెద్ద వ్యాపారవేత్త తే జా, థాన్ ష్వేలు కుటుం బ మిత్రులు. బడా వ్యాపారవేత్త జయగ్బా ఖిన్ ష్వే మాజీ ప్రధాని జనరల్ ఖిన్ న్యంట్కు సన్నిహిత మిత్రుడు. దేశంలోని అతిపెద్ద టీవీ నెట్వర్క్ ‘స్కైనెట్’లో ప్రధాన వాటాదారు థేన్ ష్వేనే. జాతీయస్థాయి కుబేరులంతా జుంటాకు సన్నిహితులు, ‘సంస్కరణవాదులు.’ వెనుకబడిన ప్రాం తాలకే పరిమితమైన స్థానిక వ్యాపారవేత్తలంతా బర్మీయు లే. అయినా విదేశీ కంపెనీల, ఆశ్రీత పెట్టుబడిదారులతో పోటీలో దివాలా తప్పదని భయపడుతున్నారు. జాతీయ స్థాయి బర్మీ కుబేరులంతా ‘వెనుకబడిన ప్రాంతాల’పై పడుతున్నారు. మధ్య, ఈశాన్య మయన్మార్‌లోని కచిన్ ప్రాంతాల్లో బంగారం, రాగి, ఇనుము, జింకు, వెండి కోసం వేట త్రీవంగా సాగుతోంది. ఆధునిక వ్యవసాయ క్షేత్రాల కోసం మైనారిటీ జాతుల రిజర్వు భూములను ఆశ్రీత కుబేరులకు కట్టబెడుతున్నారు. ఫలితంగా 2011లో తీవ్రమైన కచెన్ గెరిల్లాల పోరాటంపై సైన్యం పాశవిక అణచివేత సాగించింది. 30 వేలకు పైగా కచిన్ శరణార్థులు చైనాలో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి కచిన్, కాయెన్, షాన్ రాష్ట్రాల్లో జాతి ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నా యి. వాటితోపాటే స్థానిక వ్యాపారవర్గాలకూ, జాతీయ స్థాయి కుబేరులకు, విదేశీ కంపెనీలకు మధ్య సంఘర్షణ పదునెక్కుతోంది. కరెన్ వ్యాపారుల దాడులతో మయ న్మార్ బడా కుబేరులంతా సొంత సేనలతో మైనారిటీ జాతుల ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆశీస్సులతో మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ మాఫియా రాజ్ అవతరణగా వికసిస్తోంది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘మృత్యువు’ ముంగిట మంగోలియా
విశ్లేషణ: ప్రపంచ ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. మంగోలియా ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? ‘నేను మరణిస్తే నా దేహాన్ని మరణించనివ్వండి. నా దేశాన్ని మాత్రం మరణించనివ్వకండి’. ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన చెంగీజ్ఖాన్ మాతృభూమి మం గోలియా ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా మెల్లమెల్లగా మరణిస్తోంది. అది ‘వాతావరణ మార్పుల వినాశకర పరిణామాలకు అతివేగంగా గురవుతున్న దేశం’. సంపన్న దేశాల దురాశాపూరిత ‘ఆర్థికాభివృద్ధి’ సృష్టించిన వాతావరణ ఉత్పాతం శ్వేతమృత్యువై మంగోలియన్ల పశుపాలక జీవిత విధానాన్ని కడతేరుస్తోంది. అసాధారణమైన మంచు తుఫానులకు, అతిశీతల ఉష్ణోగ్రతలకు ‘జాతీయ సంపద’ (పశుసంపద)ఎక్కడికక్కడ మందలుగా గడ్డకట్టిపోతోంది. జనాభాలో 40 శాతంగా ఉన్న పశుపాలకులకు సంప్రదాయక శీతాకాలపు గుడారాల (‘గెర్’) జీవితం ప్రాణాం తకంగా మారుతోంది. రాతి, కాంక్రీటు గృహాలు సైతం చలికి గజగజలాడి గడ్డకట్టిపోతున్నాయి. ఎండా కాలపు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, గోబీ ఏడారి వేగంగా విస్తరిస్తూ, సువిశాలమైన పచ్చిక మైదానాలను కబళించేస్తోంది, దేశమే ఎడారిగా మారిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. అయితేనేం అది ప్రపంచశక్తుల వనరుల పోరుకు వేదిక. రష్యా, చైనాల మధ్య ‘భౌగోళిక బందీ’గా ఉన్న ఆ దేశంతో ‘వ్యూహాత్మక భాగస్వామ్యానికి’ అమెరికా ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచంలో నేడు నెలకొన్న ఉద్రిక్తతలు చాలవన్నట్టు మధ్య ఆసియాలో మరో సరికొత్త ఉద్రిక్తతల కేంద్రం రూపుదిద్దుకుంటోంది. అటు వాతావరణ మార్పులు, ఇటు వనరుల కోసం పోరు కలిసి మం గోలు జాతి గొంతుకు బిగుస్తున్న అడకత్తెరగా మారాయి. నిరుపేద ‘కోటీశ్వరులు’! ఖనిజసంపదను బట్టి చూస్తే మంగోలియా ప్రపంచంలోని అతి సంపన్న దేశం. రాగి, బొగ్గు, మాలిబ్డినమ్, తగరం, టంగ్స్టిన్, బంగారం వంటి ఖనిజాలు భారీగా ఉన్న దేశం. ఒక్క ‘తావాన్ తోల్గోయ్’ రాగి, బంగారు గనుల రాబడితో స్థూల జాతీయోత్పత్తి 2010 నుంచి 2011కు 6.4 నుంచి 17.3 శాతానికి చేరింది. వృద్ధి కొలమానాలతో చూస్తే అది వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ముందున్నట్టు లెక్క! ఆ గనుల ఖనిజంతోనే 27.5 లక్షల మంగోలియన్లంతా కోటీశ్వరులై పోవాలి. ఆ దేశ అపార ఖనిజ సంపద ఎన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేస్తుందో తెలియదు. కానీ మంగోలులు ఖనిజ సంపద కాలనాగై కరిచే శాపగ్రస్త ప్రజలు. అందుకే వారు నిరుపేదలు. ‘తావాన్ తోల్గోయ్’ ప్రపంచ గనుల పరిశ్రమ దిగ్గజం ‘రియో టింటో’ సంస్థది. అది అమెరికా, బ్రిటన్ గుత్తాధిపతులది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు మంగోలియా దానికి ఉపగ్రహ దేశంగా ఉండేది. ఆ తదుపరి అది పాశ్చాత్య ప్రపంచానికి, స్వేచ్ఛా విపణికి తలుపులు తెరచింది. దీంతో అమెరికా, కెనడా, యూరప్ దేశాలేగాక జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, భారత్ తదితర దేశాల వ్యాపార సంస్థలు మంగోలియాపై ఎనలేని ‘ఆసక్తిని’ కనబరుస్తున్నాయి. ఇక దక్షిణాన ఉన్న చైనా మంగోలియాతో ఉన్న భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకొని, ఆర్థికవ్యవస్థపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మంగోలియా ఎగుమతులలో 95 శాతం బొగ్గు, రాగి తదితర ఖనిజాలే. వాటిలో 90 శాతం చైనాయే దిగుమతి చేసుకుంటుంది. తన ‘పెరట్లోనే’ ఉన్నదనుకున్న ఖనిజ సంపదను ఇతరులు దోచుకుపోవడం రష్యాకు కంటగింపుగా ఉంది. చైనా, రష్యాలు రెండూ మంగోలియాపై ‘చారిత్రక హక్కు లు’ ఉన్న దేశాలే. ‘స్వేచ్ఛ’ విధించిన శాపం! సోవియట్ యూనియన్ పతనంతో రష్యా భల్లూకపు పట్టు నుంచి బయటపడ్డ మంగోలులు తమ పశుపాలక జీవిత విధానాన్ని పెంపొందింపజేసుకున్నారు. పశుపాలకులకు తెలిసిన ఏకైక సంపద, జీవన భద్రత ఒక్కటే... పశవుల మందలే. మందల పరిమాణానికి సోవియట్ హయాంలో పరిమితులు ఉండేవి. బదులుగా రష్యా మాంసాన్ని వారికి అతి చౌకకు అందించేవారు. స్వేచ్ఛా విపణి ఆ ఆంక్షలను తొలగించింది. 1990-2010 మధ్య కాలంలో పశు సంపద జనాభా కోటి నుంచి నాలుగు కోట్లకు చేరింది. దీంతో పచ్చిక మైదానాలు త్వరత్వరగా అంతరించిపోసాగాయి. మరోవంక వాతావరణ మార్పుల కారణంగా మంచు తుఫానులు పెరిగి శీతాకాలానికి పశవుల మేత నిల్వ చేయాల్సిన అవసరం పెరిగింది. 2019-10 ఏడాది ఎన్నడూ ఎరుగని మంచు తుఫానులు విరుచుకు పడ్డాయి. దీంతో పశవులకు గడ్డిపరకలు, నీరు కరువయ్యాయి. వం దలు, వేల సంఖ్యలో మందలు ఆకలికి, చలికి కడతేరిపోయాయి. ఆ శీతాకాలం గడచే సరికి 14 శాతం కుటుం బాలు పశుపాలనకు స్వస్తిపలికి ఉలాన్ బేటర్ లాంటి పట్టణాల మురికివాడలకు చేరాల్సి వచ్చింది. ‘కోటీశ్వరుల’ దేశంలో జనాభాలోని ప్రతి ముగ్గురు అర్ధాకలితో, పోషకాహర లోపంతో బాధపడుతున్నవారేనని ఐరాస అంచనా. శిశు మరణాల సంఖ్య గత నాలుగేళ్లలో 35 నుంచి 45 శాతం మేరకు పెరిగింది. 1990 నాటికే మంగోలియా వాతావరణం సున్నితంగా మారింది. ఆ తదుపరి ఈగల్లా ముసిరిన అంతర్జాతీయ గుత్త కార్పొరేషన్లు చేపట్టిన విచ్చలవిడి గనుల తవ్వకాలు, పరిశ్రమలు సృష్టించిన ఉష్ణోగ్రతలు, కాలుష్యం కలిసి పరిస్థితిని పూర్తిగా విషమింపజేశాయి. మంగోలియాలోని నేటి వాతావరణ ఉత్పాతానికి గనుల సంస్థల, పరిశ్రమల దురాశే ప్రధాన కారణంగా మారింది. రాజధాని ఉలాన్ బేటర్ 13 లక్షల జనాభా ఉన్న చిన్న నగరమే. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వాయు కాలుష్య నగరం అదే. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఆ నగరంలో మరణాల రేటు 24 నుంచి 45 శాతం ఎక్కువ. నాలుగేళ్ల ప్రాయానికే గుర్రపుస్వారీ మొదలెట్టి, మందలు తోలుకుంటూ స్వేచ్ఛావిహారం చేసే మంగోలులు గనుల్లో మగ్గుతూ మొగ్గలుగానే రాలిపోవాల్సి వస్తోంది. గనుల పరిశ్రమసహా అన్ని చోట్లా మంచి ఉద్యోగాలన్నిటికీ చైనీయుల నుండి పోటీ ఎదురవుతోంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా జనాభాలో 60 శాతంగా మారిన చైనీయులు మంగోలియా పట్టణాలకు వలస వస్తున్నారు. నైపుణ్యం, శక్తిసామర్ధ్యాలతో వారితో పోటీ పడలేని మంగోలులు అల్ప వేతనాల పనులకు పరిమితం కావాల్సి వస్తోంది. కొద్దిపాటి మంచి ఉద్యోగాలను చైనీ యులు, కొరియన్లు ఎగరేసుకుపోతున్నారు. దీంతో చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. చైనా మాత్రం మంగోలియా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికి నానా తం టాలు పడుతోంది. చైనాతో కయ్యానికి దిగిన ఫలితంగా అరుదైన లోహాల కోసం ఆల్లాడుతున్న జపాన్ సైతం మంగోలియాను ఆశ్రయిస్తోంది. అన్నిటికి మించి అమెరికా మంగోలియాను ఎలాగైనా తన వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇరాక్, అప్ఘాన్ యుద్ధాలకు మంగోలియా కొద్ది సంఖ్యలోనే అయినా సైన్యాన్ని పంపింది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. రష్యా గత ఐదేళ్లకాలంలో సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించి మంగోలియాను మచ్చిక చేసుకోగలిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌తో ప్రారంభించి ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. అవినీతిమయమైన ప్రభుత్వంతో కలిసి ఎవరికి వారే ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? - {పపంచవ్యాప్త వార్షిక సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే మూడురెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. - గోబీ ఎడారి ఏడాదికి 10,000 చ.కి.మీ. మేర విస్తరిస్తోంది. త్వరలోనే దేశంలో 90 శాతం ఎడారిగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. - 2009-10 ఏడాది మంచు తుఫానుల్లో 65 లక్షల పశువులు చనిపోయాయి. - పది పెద్ద గనుల నుంచి వెలికి తీస్తున్న ఖనిజ సంపద విలువ ఏడాదికి 1.3 నుంచి 2.75 లక్షల కోట్ల డాలర్లు -
సమన్యాయమా... సమైక్యమా!
విశ్లేషణ: సీమ సహజ సంపదను- వ్యవసాయ వనరులు, ఖనిజసంపద సమగ్రంగా అంచనా వేసి సమగ్రాభివృద్ధికి ప్యాకేజీ రూపొందించాలి. అందుకు నిపుణుల కమిటీ వేయాలి. సమన్యాయం జరగకపోతే, యథాస్థితి కొనసాగడం కంటే గత్యంతరం లేదు. సమన్యాయం చేయలేకపోతే, యథాస్థితి కొనసాగాలన్నదే సీమాంధ్రుల వైఖరి. అది న్యా యమైనది, సమంజసమైనది. సీమాంధ్రుల మనోగతం విచా రించకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన విభజన నిర్ణయం వారికి పిడుగుపాటుగా తాకింది. అందుకే ఆబాలగోపాలం విజృంభణ. సీమాంధ్రుల నుంచి పెల్లుబికిన ప్రతిస్పం దనను బట్టి తమ నిర్ణయాన్ని పునరాలోచించకుండా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గపుచర్య. 2014 పార్లమెంటు ఎన్నికలో తిరిగి గద్దెనెక్కే ఉద్దేశం తోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు కాంగ్రెస్ అధిష్టానం తెర లేపింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే తలంపే ఈ తొందరపాటు చర్యకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పురికొల్పింది. ఈ విషయం సీమాంధ్ర లోని పండితులకే కాదు పామరులకు కూడా అర్థమై పోయింది. అందుకే వారంతా ఏకమై సోనియా మీద నిప్పులు చెరు గుతున్నారు. సోనియా రేటింగ్ అమాంతం పడిపోయిందంటే అందుకు కారణం అదే. కాంగ్రెస్ నాయ కులంతా సోనియా కింద గులాములుగా మారినందు వల్లనే దేశానికి ఈ దుర్గతి పట్టింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడమే మేలని ఒకటికి పదిసార్లు ఉద్ఘాటించినా సోనియా పెడచెవిన పెట్టింది. రాష్ట్రాన్ని విభజించి సమస్యలను తలకెత్తుకోవడమంటే ప్రజాకవి వేమన చెప్పినట్లు నేల మీది రాయి నెత్తికెత్తినట్లుగా ఉంటుంది. రాజధాని అందరిదీ... ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 57 ఏళ్లలోనే ముఖ్యంగా సీమాం ధ్రులు తమ సర్వస్వాన్ని ధారపోయడం వల్లనే హైదరా బాద్ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెంది, దేశంలోనే అగ్ర శ్రేణి నగరంగా గుర్తింపునకు వచ్చింది. నైజాం కాలంలో తెలుగు భాషకు గౌరవం ఉండేది కాదు. తెలుగు మాట్లాడే వారిని ఎగతాళి చేసేవారు. తెలుగుభాషా వికాసం, విశా లాంధ్ర నిర్మాణం, తెలంగాణ సాయుధ పోరాట లక్ష్యా లుగా కూడా సాగింది ఎలా విస్మరిస్తాం? సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించిన తర్వాత వేలాది మంది సినీ ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బంది వల్ల తెలుగు భాష, సంస్కృతి పరిఢవిల్లాయి. సీమాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి తమ సొంత నగ రంగా ఇక్కడ జీవనాధారం ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్క ప్రభుత్వోద్యోగాల్లో తప్ప తక్కిన అన్ని రంగాల్లో ఎటువంటి వివక్ష ఉండరాదు. అందుకు కేంద్రం చట్టబద్ధ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సీమాంధ్ర ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వారి భార్యలు, పిల్లలు ఇక్కడ చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి తృప్తికరమైన రీతిలో పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ నేతల నుండి కొన్ని అపశ్రుతులు వినబడు తున్నాయి. వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేసున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయంలో దాదాపు సగభాగం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తున్నట్లు గణాం కాలు తెలుపుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో సీమాంధ్రులు నెలకొల్పిన పరిశ్రమలు, 23 జిల్లాలకు రాజధానిగా ఉన్నందువల్ల కేంద్రం నుంచి వచ్చిన పరిశ్ర మలు ఈ ప్రాంతంలోనే వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 1956కు ముందు ఆదాయమెంత, ఇప్పుడు ఆదా యం ఎంత అన్నది తెలుసుకోవడం కష్టంకాదు. కాబట్టి, సీమాంధ్రలో ఆదాయం పెరిగేంతవరకు గ్రేటర్ హైదరా బాద్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదిక మీద పంపకం కోరడం న్యాయమైనదే. అందుకు కేంద్రం నిపుణుల కమిటీ వేసి పరిశీలించి నిర్ణయించాలి. విభజన అనివార్యమైతే ఇక మీదట కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రైవేట్ పారిశ్రామికాధిపతులు గానీ నెలకొల్పే పరి శ్రమలను, వాణిజ్య సంస్థలను సీమాంధ్రలోనే నెలకొల్పే టట్లు హామీ లభించాలి. మంచినీరు, విద్యుత్, రవాణా, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక వసతులు ఏర్పాటు కావాలి. సమన్యాయానికి నిర్దిష్ట రూపంలో హామీ లభించి, సీమాంధ్ర ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ వర్గాలకు, ప్రజాసంఘాలకు తృప్తికలిగిన తర్వాతనే విభ జన ప్రక్రియకు మలి అడుగులు వేయాలి తప్ప, అంత వరకు దానిని కోల్డ్ స్టోరేజీలో పెట్టాలి. నీటి లభ్యతకు హామీ నదీ జలాల లభ్యత దుర్భిక్ష ప్రాంతాలకు జీవన్మరణ సమ స్యగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజె క్టులన్నీ కృష్ణ మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నవే. రెండు, మూడు రాష్ట్రాలైతే నదీ జలాల వివాదాలు రావణ కాష్టంగా మారకతప్పదు. ఒకే రాష్ట్రం అయితే సమన్వ యంతో సర్దుబాట్లు జరుగుతాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని మాత్రమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెప్పి తతిమ్మా నీటి సమస్యలను మభ్యపెట్టింది. వైఎస్ మరణానంతరం పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పడకవేశాయి. వైఎస్ హయాంలో తవ్వించిన పోలవరం కాల్వలు పూడిపోతున్నాయి. గండికోట రిజర్వా యర్ పూర్తయినా దానికి నీళ్లు వచ్చే మార్గం పూర్తిగాక నిలిచిపోయింది. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయి ల్పాండ్ పథకం దుర్భిక్ష ప్రాంతాలకు కీలకమైన పథకం. విభజన జరిగితే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలి యదు. ఈ ఏడాది గోదావరి జలాలు సుమారు 3,000 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇందులో పది లేదా పదిహేను శాతం ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ డ్యాం ఎడమ వైపు ఆయకట్టుకు ఉపయోగిస్తే, దానివల్ల మిగిలే కృష్ణా జలాలు దుర్భిక్ష ప్రాంతాలకు ఉపయోగ పెట్టుకోవచ్చు. వైఎస్ ఈ దృష్టితోనే ఉభయతారకంగా జలయజ్ఞాన్ని రూపొందిం చాడు. సీమ భయాలు తొలగించాలి! 1937లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణానదీ జలాలను వినియోగించడంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే షరతు కీలకమైనది. ఈ ఒప్పందం ప్రకారమే 1952లో కృష్ణా- పెన్నారు ప్రాజెక్టు, 1953లో కర్నూలులో ముఖ్య పట్టణం రూపుదిద్దుకున్నాయి. కృష్ణ-పెన్నారులోని సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులు రాయలసీమకు కీలకమైనవి. కృష్ణ- పెన్నారులో భాగమైన సోమశిల ద్వారా మద్రాసు రాష్ట్రా నికి కృష్ణ నీరు తరలించే కుట్ర అందులో ఇమిడి ఉన్నందు వల్ల, అన్ని ప్రాంతాల వారి ఆందోళన మూలంగా కృష్ణ- పెన్నారు రద్దయి, దాని స్థానంలో నాగార్జునసాగర్ వచ్చిం ది. కృష్ణ-పెన్నారుతోపాటు సిద్ధేశ్వరం, గండికోట కూడా రద్దయ్యాయి. ఇది సీమవాసులకు శాపంగా పరిణమిం చింది. కానీ, నాగార్జునసాగర్ వల్ల కోస్తా, తెలంగాణ లాభ పడ్డాయి. బచావత్ కేటాయింపుల్లో కూడా సీమ నష్టప డింది. నాగార్జునసాగర్వల్ల లాభపడిన కోస్తా, తెలం గాణవారు సీమ ప్రాజెక్టులకు కృష్ణ నికర జలాలు అందిం చడానికి ముందుకు రావాలి. ఇది వారి నైతిక బాధ్యత. బచావత్ తీర్పు ద్వారా మరోవిధంగా కూడా సీమ నష్టపోయింది. తుంగభద్ర ప్రాజెక్టు కట్టకముందు తుంగ భద్ర నీరు కేసీ కెనాల్‌కు పుష్కలంగా యథేచ్ఛగా పారేవి. ఈ కాలువ కింద కర్నూలు-కడప జిల్లాలలో ఉన్న 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు అందాలి. రాష్ట్రాల పునర్విభజన వల్ల రాయలసీమలో ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ కర్ణాటకలోకి వెళ్లిపోయింది. దీని వల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలనుద్దేశించిన తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల కింద ఆయకట్టు తరచు నీటి ఎద్దడికి గురవుతోంది. ఆ కాల్వలు కొంత దూరం కర్ణా టక ద్వారా రావలసి ఉన్నందువల్ల సీమకు ఉద్దేశించిన నీరు మార్గమధ్యంలో మళ్లింపునకు గురవుతున్నది. కేసీ కెనాల్‌కు అవసరమైన 40 టీఎంసీల నీటికి తుంగభద్ర రిజ ర్వాయర్లలో కేటాయింపు లేనందువల్ల, తుంగభద్ర దిగు వన పడే వర్షపు నీటిని మాత్రమే బచావత్ కేటాయించినం దువల్ల నిశ్చిత జలాధారంగా ఉన్న కేసీ కెనాల్ బచావత్ పుణ్యమా అని అనిశ్చిత జలాధారంగా మారింది. చంద్రబాబు హయాంలో కేసీ కెనాల్ ఎండిపోయిం ది. వైఎస్ వచ్చిన తర్వాత కేసీ కెనాల్‌కు నీటి ఎద్దడి ఎదురైనప్పుడు శ్రీశైలం నుంచి కృష్ణ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వదిలే ఏర్పాటు చేశాడు. శ్రీశైలం రిజర్వాయర్ హైడెల్ ప్రాజెక్టుకు ఉద్దేశించి కట్టినా, కాల క్రమంగా సాగునీటి అవసరం ఒత్తిడివల్ల అది బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపుదిద్దుకొంది. ప్రస్తుతం దాని ఆధారంగా తెలంగాణ, సీమాంధ్ర వైపు అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. విద్యుత్తును థర్మల్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చుగానీ, సాగునీరు లేకపోతే ఆ ప్రాంత మంతా ఎడారిగా మారుతుంది. విభజన గురించి ఆలో చించే వారు సాగునీటి సమస్య ఎంత ప్రాముఖ్యమైనదో ఒక క్షణం కూడా ఆలోచించిన పాపాన పోలేదు. సీమ ప్రాజెక్టులకు నికర జలాల లభ్యతకు హామీ ఇవ్వకుండా విభజన నిర్ణయం ముందుకు సాగరాదు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు రాజధాని, సాగునీరు తర్వాత సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలు అవసరమే. తెలంగాణ కంటే కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా ఉందని శ్రీకృష్ణ కమిటీ తెగేసి చెప్పింది. ఉత్తరాంధ్ర కూడా ఇంచుమించు సీమతో పాటు వెనుకబడిన ప్రాంతమే. వైఎస్ సంకల్పించిన ఉత్తరాంధ్ర సుజలస్రవంతికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి పూర్తి చేయడం ఆ ప్యాకేజీలోని ముఖ్య భాగంగా ఉండాలి. జలయజ్ఞం పూర్తయిన తర్వాత కూడా సీమలోని అత్యధిక భాగం దుర్భిక్షప్రాంతంగానే ఉంటుంది. అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. వైఎస్ ఇది గుర్తించే సీమలోని ప్రతి జిల్లాలోనూ ఉపాధికి అవకాశం కల్పిస్తూ ఒక భారీ పరిశ్రమకు పథకం వేశారు. సత్వర సమగ్ర పారిశ్రామికీకరణ ఒక్కటే వెనుక బాటుకు పరిష్కారం. వైఎస్ కడప-బెంగళూరు రైలు మార్గానికి బీజం వేశాడు. అది కూడా అటకెక్కినట్లుంది. సీమ సహజ సంపదను- వ్యవసాయ వనరులు, ఖనిజసం పద - సమగ్రంగా అంచనా వేసి సమగ్రాభివృద్ధికి ప్యాకేజీ రూపొందించాలి. అందుకు నిపుణుల కమిటీ వేయాలి. సమన్యాయం జరగకపోతే, యథాస్థితి కొనసాగడం కంటే గత్యంతరం లేదు.