సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్ గురువారం మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ , లాక్‌డౌన్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియాకు వివరించ నున్నారు. నిర్మలా సీతారామన్ గురువారం తన రెండవ మీడియా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అలాగే సప్లయ్ చెయిన్, అంతరాయాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలను ఆర్థిమంత్రి సూచించనున్నారని భావిస్తున్నారు. (భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్)
బుధవారం నాటి ప్రెస్‌మీట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ అనేక ఉపశమన చర్యల్ని ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ లాంటి ఫైనాన్సింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?)
Finance Minister Smt.@nsitharaman to address a press conference today, 14th May, at 4PM in New Delhi.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 14, 2020
Watch LIVE here👇
➡️YouTube - https://t.co/b78LXIfEht
Follow for LIVE updates 👇
➡️Twitter - https://t.co/XaIRg3fn5f
➡️Facebook - https://t.co/06oEmkxGpI pic.twitter.com/BLpAJZGexx
Comments
Please login to add a commentAdd a comment