stimulus
-
‘బ్యాంకింగ్’కు బూస్ట్ ఇస్తారా?
దేశ బ్యాంకింగ్ రంగం.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణాల్లో వృద్ధి బలహీనపడింది. డిపాజిట్లకు కస్టమర్లు మొహం చాటేస్తున్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగ్గడంతో, అధిక రేట్లపై డిపాజిట్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. ఫలితంగా బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. వీటికి పరిష్కార చర్యలు బడ్జెట్లో ఉంటాయన్న ఆశలు బ్యాంకింగ్ వర్గాల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా లిక్విడిటీ పెంపు, రుణాల వృద్ధికి ఉద్దీపన చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో (2024–25) పడిపోవడం తెలిసిందే. ఈ ప్రభావం బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అన్ సెక్యూర్డ్ రుణాల్లో స్థూల, నికర నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వీటికి గణనీయమైన కేటాయింపులతో బ్యాంకుల లాభాలు తరిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో రానున్న బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిపాజిట్లకు ప్రోత్సాహకాలు → ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లిపోతుండడంతో, తిరిగి సంప్రదాయ బ్యాంక్ డిపాజిట్ల వైపు వారిని ఆకర్షించేందుకు చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గృహ ఆర్థిక ఆస్తుల్లో బ్యాంకుల డిపాజిట్లు 2019–20 నాటికి 56.4 శాతంగా ఉంటే, 2024 మార్చి నాటికి 45.2 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ డిపాజిట్లపై తక్కువ పన్ను రేటును ప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది. పన్ను ఆదా ఎఫ్డీపై ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌ను తగ్గించినట్టయితే ఆకర్షణీయంగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు. → ఆదాయపన్ను ఉపశమనంతో ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుంది. ఇది డిపాజిట్లు, రుణాలకు డిమాండ్‌ను పెంచుతుందున్న అంచనాలున్నాయి.→ హోల్‌సేల్ రుణాలు, బ్యాంకింగ్ రంగం నుంచి నిరర్థక రుణ ఆస్తులను సొంతం చేసుకోవడంపైనా పన్ను రాయితీలు కల్పించాలని నిపుణులు కోరుతున్నారు.→ సూక్ష్మ రుణాల విభాగంలో రుణ ఎగవేతలు ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుణ, నిర్వహణ వ్యయాల భారం ఎగసింది. ఈ పరిస్థితుల్లో అందు బాటు రేట్లపై ప్రత్యేక నిధుల విండోను ప్రకటించొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అనలిస్టులు భావిస్తున్నారు. → అంతేకాదు మౌలికరంగ వసతుల కల్పన ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, రైల్వేలు, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం చేసే మూలధన వ్యయాలతో.. అన్ని రంగాల్లోనూ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని, ఇది బ్యాంకుల రుణ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. రానున్న బడ్జెట్లో 14 శాతం అధికంగా 11.3 లక్షల కోట్లను మూలధన వ్యయాల కింద కేటాయించొచ్చని ఎలారా క్యాపిటల్ పేర్కొంది.రిటైల్ కస్టమర్ల నుంచి డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రోత్సాహకాలు కల్పించినట్టయితే బ్యాంక్‌లు తమ రుణ అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యయాలపై నిధులు సమీకరించగలుగుతాయి. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజీ రేషియోలో ప్రతిపాదిత మార్పుల నేపథ్యంలో ఇది ఎంతో అవసరం.– సచిన్ సచ్దేవ, ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రుణానికి డిమాండ్ లేదని చెప్పలేం..
ముంబై: రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణ వృద్ధి రేటు దాదాపు 6 శాతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. 2019 నుంచీ రూ.4.94 లక్షల కోట్ల రుణాలు బ్యాంకింగ్ చేపట్టిన ప్రత్యేక చర్యల ద్వారా 2019 నుంచి మార్చి 2021 వరకూ రూ.4.94 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈ ఏడాది అక్టోబర్ నుంచీ రుణ వృద్ధి పెరుగుదలకు బ్యాంకింగ్ జిల్లాలవారీ మేళాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ)ల ద్వారా రుణ గ్రహీతలకు రూ.1.5 లక్షల కోట్ల వరకూ రుణాన్ని అందించాలన్నది కేంద్రం లక్ష్యమని తెలిపారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రుణ వృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలాగే ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా, ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత అందుబాటులో ఉంచడానికి రాష్ట్రాలవారీ ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. బ్యాంకర్లతో కీలక చర్యలు అంతకుముందు ఆర్థికమంత్రి 12 ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎండీ, సీఈఓలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘‘ఒక జిల్లా, ఒక ఎగుమతుల కేంద్రం’’ సందేశంలో భాగంగా ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత కల్పించడానికి జిల్లాలవారీగా ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకులను కోరినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ టెక్నాలజీ డిమాండ్లను నెరవేర్చడంలో తగిన మద్దతు నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2021–22కి సంబంధించి ‘ఈఏఎస్‌ఈ 4.0 ఇండెక్స్’ లక్ష్యాలను ఆవిష్కరించా రు. స్మార్ట్ అండ్ క్లీన్ బ్యాంకింగ్ దిశలో అడుగులు, లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడి సంస్కరణల ఎజెండాగా 2018 జనవరిలో ‘ఈజ్’ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. ఆర్థికమంత్రి ఇంకేమన్నారంటే... ► సరఫరాల చైన్‌ను మెరుగుపరచడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తోంది. కరోనా కారణంగా సరఫరాల వ్యవస్థ దెబ్బతినడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దాటింది. ద్రవ్యోల్బణం కదలికలను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. అదుపునకు రాష్టాలతో కలిసి పనిచేస్తుంది. ► గత యూపీఏ ప్రభుత్వ ఆయిల్ బాండ్ల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ► పెట్రోలు ధరల అదుపునకు రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం అవుతుంది. మోనిటైజేషన్ అంటే... రాహుల్ అర్థం చేసుకున్నారా? రెండు రోజుల క్రితం తాను ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్‌పై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై ఆర్థికమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు ఆయన (రాహుల్ గాంధీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. 70 ఏళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. -
16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో భారత్‌నెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్–19 ప్రభావిత రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని పలు పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఆర్.కె.సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఉద్యోగ కల్పనకు వీలుగా కొత్త నియామకాలకు యజమాని, ఉద్యోగుల చందాను కేంద్రం భరిస్తూ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు చెల్లించడానికి వీలుగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను మార్చి 2022 వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ కోసం రూ .19,041 కోట్ల సాధ్యత గ్యాప్ నిధులు భారత్ నెట్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో రూ. 19,041 కోట్ల మేర వయబులిటీ గ్యాప్ ఫండ్‌తో 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలను కవర్ చేయడానికి మొత్తం రూ . 29,430 కోట్లు ఖర్చవుతుంది. దేశంలోని 6 లక్షల గ్రామాలను 1,000 రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేస్తామని 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత ప్రైవేట్ భాగస్వాములను చేర్చుకునే నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఈ రోజు వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో 1.56 లక్షల పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానితమయ్యాయని ఆయన చెప్పారు. విద్యుత్తు డిస్కమ్‌ల బలోపేతానికి రూ. 3.03 లక్షల కోట్ల వ్యయం విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంస్కరణల ఆధారంగా, ఫలితాల ప్రాతిపదికన డిస్కమ్‌లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రూ. 3.03 లక్షల కోట్ల విలువైన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంబంధిత వివరాలు వెల్లడిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా రూ. 3.03 లక్షల కోట్ల విలువైన కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో రూ. 97,631 కోట్ల మేర కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. సంస్కరణ ఆధారిత, ఫలితాల ప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు, ప్రక్రియ మెరుగుదల కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో రాష్ట్ర పరిస్థితిని బట్టి వేర్వేరుగా రూపొందించిన కార్యచరణకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందుతుంది. 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చడం, వ్యవసాయానికి పగటి పూట కూడా విద్యుత్తు అందేలా రూ. 20 వేల కోట్లతో సౌర విద్యుత్తు పంపిణీకి వీలుగా 10 వేల ఫీడర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. లోన్ గ్యారంటీ స్కీమ్‌కు ఆమోదం కోవిడ్ –19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రూ .1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర, పర్యాటక సంస్థలకు, గైడ్లకు, ఇతర కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 60 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లోన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బుల్ జోరుకు బ్రేక్..
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల నమోదు తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం బుల్ జోరుకు బ్రేక్ పడింది. సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52,736 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయి 15,814 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడేళ్లు గరిష్టానికి చేరుకోవడం కూడా మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం ప్రకటించిన రూ.1.1 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఐటీ, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు ఒక శాతం క్షీణించి సూచీల ఆరంభ లాభాల్ని హరించి వేశాయి. అయితే ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. ప్రైవేటీకరణ వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు మరోసారి డిమాండ్ నెలకొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1659 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1277 కోట్ల షేర్లను కొన్నారు. రికార్డు లాభాలు మాయం... దేశీయ మార్కెట్ ఉదయం సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 53,127 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,916 వద్ద మొదలయ్యాయి. ఈ ప్రారంభ స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. ఆసియాలో పలు దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో కదలాడటం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సూచీలు ఆల్‌టైం హైని తాకిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. మిడ్ సెషన్ తర్వాత యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారం భం, ఆర్థిక మంత్రి ఉద్దీపన చర్యలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఉధృతి మరింత పెరిగింది. చదవండి: పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. -
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్లు, టూరిస్ట్ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది. ► 11 వేల మంది టూరిస్ట్ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు.. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు. ► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది. ► హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (ఎన్సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది. ► ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది. ► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. ► మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు. ► డీఏపీపై అదనపు సబ్సిడీ... డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది. నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ► ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ► ఇతరత్రా 8 సహాయక చర్యలు ♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు.. ♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ ♦ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి. ♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు. ♦ పంచాయతీలకు నెట్ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు. ♦ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) 2025–26 వరకు పొడిగింపు. ♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది. ♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్ ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘ – నరేంద్ర మోదీ, ప్రధాని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘ – ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వృద్ధికి ఊతం.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది. -
Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే మూడు కోట్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహదారు కేవీ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటిస్తున్న ప్యాకేజీలకు అదనంగా ఈ మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ఉండాలన్నారు. మౌలిక రంగంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సంభాషణలో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వ్యాఖ్యలు కేవీ సుబ్రమణియన్ చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా విడుదల చేసే నిధుల్లో అధిక భాగం మౌలిక రంగంలో ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతను దేశం నష్టపోయిందంటూ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. చదవండి : 2021లో ఇండియాలో టాప్ కంపెనీలు ఇవేనంట -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
ఆత్మనిర్భర్ 2.0
న్యూఢిల్లీ : దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మూడు రంగాలపై ఫోకస్ ఈసారి లాక్డౌన్ కారణంగా ఏవియేషన్, టూరిజం, ఆతిధ్యరంగాలు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను ఆత్మనిర్భర్ 2 ద్వారా ఆదుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఇప్పుడే కాదు గతేడాది లాక్డౌన్, అన్‌లాక్ ప్రక్రియలను పూర్తిగా కేంద్రమే చేపట్టింది. ఈసారి లాక్డౌన్ విధింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో లాక్డౌన్ విధించింది. కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత... జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఆత్మనిర్భర్ 2 ప్యాకేజీని ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. -
మార్కెట్‌కు ‘ఆర్బీఐ’ ఉత్సాహం
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లో మూడురోజుల వరుస అమ్మకాలకు బుధవారం బ్రేక్ పడింది. ఒక్క రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 424 పాయింట్లు పెరిగి 48,678 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద నిలిచింది. కరోనా వ్యాప్తి వేళ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా వైద్య రంగ బలోపేతానికి రూ.50 వేల కోట్ల ఫండ్‌ను ప్రకటించారు. భారీ ఎత్తున నిధుల కేటాయింపు ప్రకటనతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 489 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ., చిత్రంగా విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలు జరిపారు. ఎఫ్ఐఐలు రూ.1,111 కోట్ల కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.241 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత ఏర్పడకుండా మే 20 నుంచి రూ.35వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు ప్రక్రియను చేపడతామని ఆర్బీఐ ప్రకటన ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఇచ్చింది. దేశీయ ఇండెక్స్‌కు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) రీ–బ్యాలెన్సింగ్(సవరణ)తో కొన్ని ఎంపిక చేసుకున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏప్రిల్ సేవల రంగ గణాంకాలు నెల ప్రాతిపదికన నిరుత్సాహపరిచినప్పటికీ.., క్వార్టర్ టు క్వార్టర్ ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది.’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ షేర్లకు ఆర్బీఐ బూస్టింగ్... కరోనా రెండో దశను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభపడ్డాయి. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మొండిబకాయిల అంశంలో వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకులకు అనుమతులిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. ఆర్థికపరమైన ఈ విధాన చర్యలతో బ్యాంకింగ్ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగానికి చెందిన కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండున్నర శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 2–1% ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. -
మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇటు వినియోగదారులు, అటు ఇన్వెస్టర్ల సెంటిమెంటుపరంగా ’మరింత అనిశ్చితి’ నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు తీసుకోగలదని కుమార్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో పరిస్థితి గతంలో కన్నా మరింత కష్టతరంగా మారిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎకానమీ 11 శాతం మేర వృద్ధి సాధించగలదని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19ని భారత్ దాదాపు తుదముట్టించే దశలో ఉండగా బ్రిటన్, ఇతర దేశాల నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్స్ కారణంగా పరిస్థితి దిగజారిందని ఆయన పేర్కొ న్నారు. ‘సర్వీసులు వంటి కొన్ని రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలపైనా సెకండ్ వేవ్ పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరగ వచ్చు. ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అన్నారు. -
అమెరికన్ల జీవితాలు మారుతాయ్!
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో అతాలాకుతలమవుతున్న అమెరికా పౌరుల్ని ఆదుకోవడానికి 1.9 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 220–211 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్‌ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. నాలుగు రోజుల క్రితం సెనేట్ ఆమోదం పొందిన బిల్లుని అక్కడ కూడా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కోవిడ్–19 సంక్షోభం తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించడం ఎందుకనేది వారి వాదనగా ఉంది. అయితే కాంగ్రెస్ దీనిని ఆమోదించగానే ‘‘సాయం ఇక్కడే ఉంది’’అని అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. తాను ఆ బిల్లుపై శుక్రవారం సంతకం చేస్తానని చెప్పారు. బిల్లు చట్టరూపం దాల్చగానే అమెరికాలో తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు ఈ ఏడాది 1400 డాలర్ల ఆర్థిక సాయం చేస్తారు. నిరుద్యోగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, కోవిడ్‌పై పరిశోధనలకు నిధుల్ని భారీగా ఖర్చు పెడతారు. కోవిడ్–19తో కుదేలైన విమానయానం నుంచి ఫంక్షన్ హాల్స్ వరకు అందరికీ ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల్లో బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత అవసరం. అందుకే చట్టసభల్లో బైడెన్ సాధించిన తొలి విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల జీవితాలను మార్చే నిర్ణయం ఇదేనని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాలో ప్రస్తుతం పేదల సంఖ్య 4.4 కోట్ల నుంచి 2.8 కోట్లకు తగ్గిపోతుందని అంచనాలున్నాయి. -
మార్కెట్‌కు జీడీపీ జోష్
ముంబై: మెరుగైన ఆర్థిక గణాంకాల అండగా స్టాక్ మార్కెట్ సోమవారం మెండుగా లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ కొంత దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి అడ్డంకులు తొలగడం కూడా ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్ 750 పాయింట్లు లాభపడి 49,850 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 14,762 వద్ద ముగిసింది. ఒక్క ప్రభుత్వ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. కొనేవారే తప్ప అమ్మేవారు లేకపోవడంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 958 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇరు సూచీల్లో ఒక్క ఎయిర్టెల్(4 శాతం) మాత్రమే నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.125 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల పెట్టుబడులను విక్రయించారు. మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.204 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘చివరి రెండు క్వార్టర్లతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకున్నట్లు గత శుక్రవారం విడుదలైన జీడీపీ గణాంకాలతో వెల్లడైంది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా రూ.లక్ష కోట్ల మార్కును సాధిస్తూ ఈ ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు ఫిబ్రవరిలో రెండింతల వృద్ధిని సాధించాయి. దేశంలో తయారీ సంస్థలు భారీ స్థాయిలో కొత్త ఆర్డర్లు అందుకోవడంతో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ ఆశించిన స్థాయిలోనే 57.5గా నమోదైంది. ఈ సానుకూల ఆర్థికాంశాలకు తోడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాల బాటపట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అద్భుతమైన రికవరీని సాధించగలిగింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. నాలుగు శాతం నష్టపోయిన ఎయిర్టెల్ సూచీలు సోమవారం భారీ లాభాలన్ని ఆర్జించినప్పటికీ.., భారతీ ఎయిర్టెల్ షేరు మాత్రం నాలుగు శాతం నష్టపోయింది. ఆసియాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ పీటీఈ ఈ కంపెనీ చెందిన 3.7 కోట్ల షేర్లను విక్రయించింది. అలాగే టెలికాం రంగంలోని తన ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో ఆదివారం జియోఫోన్ 2021ను ఆవిష్కరించింది. ఈ రెండు అంశాలతో ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6%కి పైగా నష్టపోయి రూ.521 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి నాలుగు శాతం నష్టంతో రూ.532 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో నష్టాన్ని చవిచూసిన ఏకైక షేరు ఇదే కావడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈఎంఓ సమర్పణకు ప్రభుత్వం తేదీని పొడిగించడంతో బీఈఎంఎల్ షేరు 8% లాభపడి రూ.1160 వద్ద ముగిసింది. ► ప్రైవేటీకరణ ఆశలతో కొంతకాలం ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఈ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఎన్ఎస్ఈలోని పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అరశాతం నష్టపోయింది. ► వీఐఎక్స్ ఇండెక్స్ 9% దిగివచ్చింది. ► సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేయడంతో గత శుక్రవారం లిస్టయిన రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 17 శాతం లాభపడి రూ.142 వద్ద స్థిర పడింది. -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు సోమవారం ఊపందు కున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభంనుంచి బైటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని అమెరికా పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తరువాత ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారీ ప్యాకేజీ మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న అంచనాలతో డాలర్ క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేసింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.68 శాతం లేదా 310 రూపాయలు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ .46,046 వద్ద ఉంది.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం లేదా 778 రూపాయలు పెరిగి కిలో 69,562 రూపాయలకుచేరింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 46,970 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు ధర 1,748 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పెరిగి 26.71 డాలర్లకు చేరింది. అమెరికా ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు. కాగా శుక్రవారం స్పాట్ మార్కెట్లో, బంగారం ధరలు 10 గ్రాములకు 342 రూపాయలు తగ్గి 45,599 రూపాయల వద్ద ఎనిమిది నెలల కనిష్టానికి చేరాయి. అలాగే 2 వేల రూపాయలకు పైగా క్షీణించిన వెండి కిలోకు రూ .67,419 కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ
వాషింగ్టన్: కరోనా మహమ్మారి పంజా విసరడంతో అగ్రరాజ్యం అమెరికాలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వాణిజ్యం పడకేసింది. నిరుద్యోగం బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరుగులు పెట్టించాలని నూతన అధ్యక్షుడు జో బైడెన్ సంకల్పించారు. ఏకంగా 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. సంబంధిత కోవిడ్–19 ఎయిడ్ బిల్లుకు అమెరికా సెనేట్ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమోదం తెలిపింది. అంతకముందు రాత్రంతా ఈ ప్యాకేజీపై విస్తృత చర్చ జరిగింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే బిల్లు గట్టెక్కడం విశేషం. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ టై–బ్రేకింగ్ ఓటు వేశారు. సెనేట్‌లో ఆమె ఓటు వేయడం ఇదే తొలిసారి. దీంతో 51–50 మెజారిటీతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందినట్లు కమలా హ్యారిస్ ప్రకటించారు. దీంతో అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే సంబంధిత బిల్లులో పలు సవరణలకు అనుకూలంగా సెనేటర్లు ఓటు వేశారు. బిల్లు పరిధులను స్పష్టంగా నిర్వచించే సవరణ కూడా ఇందులో ఉంది. సవరణలు చేసి, ఆమోదించిన కోవిడ్–19 ఎయిడ్ బిల్లును పార్లమెంట్‌కు పంపించారు. అక్కడ సులభంగానే ఆమోదం పొందనుంది. పార్లమెంట్లో ఆమోదం పొందితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే ప్రక్రియలో కీలకమైన ముందడుగు వేశామని సెనేట్ మెజారిటీ లీడర్ చుక్ షూమర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్ యెల్లన్ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి. ఫలితంగా సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్ షేరు 18% లాభపడగా, ఎంఆర్ఎఫ్ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. ► భారత్‌లో తయారయ్యే తన ఎస్యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్ ఉత్పత్తితో పాటు ఎగుమతులను ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది. ► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్బీఐ కార్డ్స్ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. -
భారీ ప్యాకేజీ ఆశలు : పెరిగిన పసిడి ధర
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నేపథ్యంలో భారతీయ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడైన్ ప్రమాణ స్వీకారం, భారీ ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లలో బంగారం రేట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే యుఎస్ డాలర్ బలహీనంగా ఉండటం కూడా పుత్తడి ధరలకు కలిసి వచ్చింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.28శాతం పెరిగి రూ. 49,119 కు చేరుకోగా, వెండి కిలోకు 0.39 శాతం పెరిగి 66,295 కు వద్ద ఉంది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 198 రూపాయల లాభంతో 48480 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 10గ్రాములకు 45,800 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 పలుకుతోంది. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు ఔన్సుకు 0.5 శాతం లాభపడి పెరిగి 1,848 డాలర్లకు చేరుకుంది. ఇటీవల నాలుగువారాల గరిష్టాన్ని తాకిన డాలర్ కరెక్షన్ కారణంగా మరింత బలహీనపడింది. ఈ దిద్దుబాటు బంగారానికి మద్దతిస్తోందని, అలాగే అదనపు ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ నామినీ జానెట్ యెల్లెన్ వ్యాఖ్యలు డాలర్‌పై ఒత్తిడి పెంచాయని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ రవిందర్‌రావు తెలిపారు. -
కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే లక్ష్యంగా తెచ్చిన 2.3 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. ఇందులోనే 90వేల కోట్ల డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీ కూడా ఉంది. ట్రంప్ సంతంకంతో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఈ బిల్లుపై సంతకం చేసేది లేదంటూ ట్రంప్ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కానీ చివరకు ఆయన ఎందుకు మనసు మార్చుకొని సంతకం చేశారో వివరాలు తెలియలేదు. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న న్యూస్‌పేపర్ పరిశ్రమను ఆదుకునేందుకు .. చాన్నాళ్లుగా కోరుతున్న ఉద్దీపన ప్యాకేజీని సత్వరం ప్రకటించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో అనేక సంస్థలు మూతబడి, లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా దెబ్బతో అటు అడ్వర్టైజింగ్, ఇటు సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావంతో ఆదాయాలు పడిపోయి న్యూస్‌పేపర్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఎల్ ఆదిమూలం పేర్కొన్నారు. దీనితో ఇప్పటికే పలు వార్తా సంస్థలు మూతబడటమో లేదా ఎడిషన్లను నిరవధికంగా మూసివేయడమో జరిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు కూడా మూతబడే ప్రమాదముందన్నారు. గత 8 నెలలుగా పరిశ్రమ రూ. 12,500 కోట్ల మేర నష్టపోయిందని.. ఏడాది మొత్తం మీద నష్టం దాదాపు రూ. 16,000 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. లక్షల మంది ఉపాధికి ముప్పు..: ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం వంటి పత్రికా రంగం దెబ్బతింటే జర్నలిస్టులు, ప్రింటర్లు మొదలుకుని డెలివరీ బాయ్స్ దాకా దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 30 లక్షల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజికంగా, రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమకు.. ప్రభుత్వం కూడా తోడ్పాటు కల్పించాలని ఆదిమూలం కోరారు. న్యూస్‌ప్రింట్, జీఎన్‌పీ, ఎల్‌డబ్ల్యూసీ పేపర్‌పై ఇంకా విధిస్తున్న 5% కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, 2 ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, ప్రభుత్వ ప్రకటనల రేట్లను 50% పెంచాలని, ప్రింట్ మీడియాపై ప్రభు త్వ వ్యయాలను 200% పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకటనలకు సంబంధించిన బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
వ్యాక్సిన్ల వార్తలే కీలకం..!
ముంబై: కోవిడ్ –19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, రెండో దశ కరోనా కేసుల నమోదు పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్‌ను మెప్పించడంతో మార్కెట్ వరుసగా ఐదోవారమూ లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యాక్సి న్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండడంతో మార్కెట్లో మరింత ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఓకు సిద్ధమైన ఐఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగానికి చెందిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రాథమిక మార్కెట్లో నిధుల సమీకరణకు సిద్ధమైంది. భారత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) కంపెనీ రూ.4600 కోట్ల ఐపీఓ ఇష్యూ డిసెంబర్ మూడోవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ఆఫర్ ద్వారా ఐఆర్ఎఫ్సీ 178.21 కోట్ల ఈక్విటీ షేర్లను, అలాగే 118.80 కోట్ల తాజా ఈక్విటీలను ఆఫర్ చేయనుంది. మార్కెట్ పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ డిసెంబర్ మూడో వారంలో ఇష్యూ ప్రక్రియను చేపడతామని లేదంటే జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఐపీఓ ఉండొచ్చని కంపెనీ చైర్మన్ అమితాబ్ బెనర్జీ తెలిపారు. రిటైల్, పారిశ్రామిక గణాంకాలు కీలకమే ఈ శుక్రవారం(11న) నవంబర్ నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజున డిసెంబర్ 4తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ విడుదల చేయనుంది. ద్రవ్యపాలసీ విధాన ప్రకటన సందర్భంగా జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెల్లువలా విదేశీ పెట్టుబడులు ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా రు. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎఫ్ఐఐలు రూ.17 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొన్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఏడాది(2021) జనవరి వరకు ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో డీఐఐ(దేశీ ఫండ్స్) లాభాల స్వీకరణతో నికర అమ్మకందారులుగా మారారు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా ఉందని విశ్లేషకులంటున్నారు. 9 నెలల గరిష్టానికి క్రూడాయిల్ ధర భారత్ లాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల క్రూడాయిల్ కదలికలూ ఈ వారం కీలకంగా మారాయి. కోవిడ్ మృతుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ఆర్థిక పురోగతి ఆశలతో గత శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర 9 నెలల గరిష్ట స్థాయి 49.25 డాలర్లను అందుకుంది. క్రూడాయిల్ కదలికలు కేవలం స్టాక్ మార్కెట్‌పై మాత్రమే కాకుండా రూపాయి ట్రేడింగ్‌పైనా ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ పరిణామాలు సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మంగళవారం (డిసెంబర్ 4న) యూరోజోన్‌తో పాటు జపాన్ దేశపు క్యూ3 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. చైనా బుధవారం(డిసెంబర్ 5న) నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. గురువారం(డిసెంబర్ 6న) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్లపై తన విధానాన్ని ఇదేరోజున అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడి చేయనుంది. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
మార్కెట్‌ను మెప్పించని ప్యాకేజీ
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు వంటి ప్రతికూల పరిస్థితులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 43,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లను కోల్పోయి 12,691 వద్ద నిలిచింది. సూచీలు నష్టాల ముగింపుతో ఎనిమిది రోజుల వరుస, మూడురోజుల రికార్డు ర్యాలీలకు ముగింపు పడినట్లైంది. ఫైజర్ వ్యాక్సిన్ తయారీ పరీక్షలు విజయవంతమైనా.., భారత్‌లో వ్యాక్సిన్ నిలువ, సరఫరా సమస్యలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. మార్కెట్ ఎనిమిదిరోజుల సుదీర్ఘ ర్యాలీతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడం సూచీలపై ఒత్తిడిని పెంచాయి. అయితే కేంద్రం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా ప్రయోజనాలను పొందే ఎఫ్ఎంసీజీ, రియల్టీ, మీడియా, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల గరిష్టాన్ని.., 43,128 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 12,741– 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు క్షీణించి 74.64 వద్ద స్థిరపడింది. ఉద్దీపన ప్యాకేజీలో రియల్టీ రంగానికి ఊతమిచ్చే అంశాలు ఉండడంతో ఈ షేర్లు రాణించాయి. డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల ఆదాయపన్నులో ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐబీరియల్ ఎస్టేట్, ఒబెరాయ్ రియల్టీ గోద్రేజ్ ప్రాపర్టీ షేర్లు 13 శాతం నుంచి 3 శాతం లాభపడ్డాయి. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
40 వేల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు. ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద... స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 4 శాతం లాభపడ్డ ఎయిర్టెల్ షేరు కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి. టాటా మోటార్స్ 6 శాతం జంప్... రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం. -
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి. పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్.. నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి. ‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్.. మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది. -
సోషల్ మీడియా జోరు- యూఎస్ వీక్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదిస్తున్న 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. డోజోన్స్ 98 పాయింట్లు(0.35 శాతం) నీరసించి 28,211 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.2 శాతం) బలహీనపడి 3,436 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 32 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 11,485 వద్ద స్థిరపడింది. నెట్‌ఫ్లిక్స్ పతనం ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 7 శాతం పతనమైంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరిగిన పోటీ, క్రీడా ప్రసారాలు ప్రారంభంకావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ మార్కెట్లు ముగిశాక క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. దీంతో ఫ్యూచర్స్‌లో టెస్లా ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది. హైజంప్.. కోవిడ్-19 లాక్డవున్లలో వినియోగదారుల సంఖ్య పెరగడం, పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం వంటి అంశాలు స్నాప్‌చాట్ కౌంటర్‌కు డిమాండ్ పెంచాయి. దీంతో స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ ఇంక్ షేరు 28 శాతం దూసుకెళ్లింది. ఈ ప్రభావంతో ఇతర సోషల్ మీడియా కౌంటర్లు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ట్విటర్ 8 శాతం జంప్‌చేయగా.. ఫేస్బుక్ 4 శాతం ఎగసింది. ఇదేవిధంగా పింట్రెస్ట్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది! మోడార్నా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4.2 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ 1.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 2 శాతం నష్టపోయింది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్ అయినా లాభాలే
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు సూచీలను లాభాల బాట పట్టించాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 40,707 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లను ఆర్జించి 11,938 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 4వ రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 826 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 242 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. ఆరంభం ఆదిరింది... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతను అందుకున్న మార్కెట్ భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 40,767 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,958 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ రావచ్చనే అంచనాలతో ఉదయం సెషన్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,976 వద్ద, నిఫ్టీ 12,000 మార్కును అందుకొని 12,019 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మిడ్‌సెషన్‌లో అమ్మకాల సునామీ... మిడ్‌సెషన్ వరకు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో టీసీఎస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో సెనెక్స్ గరిష్టస్థాయి 40,976 నుంచి ఏకంగా 826 పాయింట్లను కోల్పోయి 40,150 కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టస్థాయి 12,018 నుంచి 242 పాయింట్లు నష్టపోయి 11,776 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. -
ఊరట : మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఐదు నెలల కిందట ఆత్మనిర్భర్ పేరుతో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్‌ను ప్రేరేపించేందుకు ప్రభుత్వం మరో ప్యాకేజ్‌ను ప్రకటించాలని ఆయా రంగాల నుంచి ఎదురైన విజ్ఞాపనలతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు సాగిస్తోంది. ఉద్దీపన చర్యల కోసం ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వ శాఖలు, రంగాల నుంచి పలు సూచనలు, ప్రతిపాదనలు అందాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. మరో ఉద్దీపన ప్యాకేజ్ వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యాక్రమంలో సంకేతాలు పంపారు. జీడీపీ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని మదింపు చేస్తోందని, మరో ఉద్దీపన ప్యాకేజ్‌కు అవకాశాలు మిగిలే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 10.3 శాతం పతనమవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక వృద్ధికి ఊతమిస్తూ, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చదవండి : రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్ -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ పుష్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై చర్చలు పురోగతి సాధించడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 113 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 28,309 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 16 పాయింట్ల(0.5 శాతం) బలపడి 3,443 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 38 పాయింట్లు(0.35 శాతం) లాభపడి 11,516 వద్ద స్థిరపడింది. వారాంతంలోగా ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి మరోసారి వైట్‌హౌస్ నుంచి భారీ ప్యాకేజీకి ఆమోదముద్ర పడవచ్చని అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ పతనం ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్స్క్యయిబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 1 శాతం డీలాపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడటంతో ఫ్యూచర్స్‌లో 4 శాతం నష్టపోయింది. కాగా.. మార్కెట్లో గల ఆధిపత్యంతో ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తున్నట్లు గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్పై కేసులు దాఖలయ్యాయి. అయినప్పటికీ అల్ఫాబెట్ షేరు 1.4 శాతం పుంజుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, ఇంజినీరింగ్ తదితర పలు విభాగాలలో ఇప్పటికే గూగుల్ బిలియన్లకొద్దీ డాలర్లను వెచ్చించినట్లు టీఎంటీ రీసెర్చ్ పేర్కొంది. దశాబ్ద కాలంలో కంపెనీ సాధించిన వృద్ధిని కాదనలేమని ఈ సందర్భంగా టీఎంటీ రీసెర్చ్ హెడ్ నీల్ క్యాంప్లింగ్ పేర్కొన్నారు. ఇతర టెక్ కౌంటర్లలో ఫేస్బుక్ 2.4 శాతం లాభపడగా.. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ 1.3-0.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2 శాతం క్షీణించింది. పీఅండ్‌జీ ప్లస్ క్యూ3(జులై-సెప్టెంబర్)లో అంచనాలు మించిన ఫలితాలతో బీమా రంగ సంస్థ ట్రావెలర్స్ కంపెనీస్ షేరు 5.6 శాతం జంప్‌చేసింది. పూర్తి ఏడాది(2020)కి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం పీఅండ్‌జీ 0.4 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 0.5 శాతం లాభపడగా.. ఫైజర్ 0.8 శాతం, ఆస్ట్రాజెనెకా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ
కోవిడ్-19 ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 411 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 28,195 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 57 పాయింట్ల(1.6 శాతం) నష్టంతో 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 193 పాయింట్లు(1.7 శాతం) కోల్పోయి 11,665 వద్ద స్థిరపడింది. ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలపై మంగళవారంలోగా స్పష్టత వచ్చే వీలున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలలోగా ప్యాకేజీ అమలుకు వీలు కలగనున్నట్లు తెలియజేశారు. దీంతో నేడు మార్కెట్లు కోలుకునే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధ్యక్ష ఎన్నికలలో భాగంగా గురువారం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్ మధ్య చివరి దశ డిబేట్ జరగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 4 లక్షలు గత వారం కోవిడ్-19 కేసులు 13 శాతం పెరిగి 3.93 లక్షలుగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.అయితే మార్చి తదుపరి ఈ ఆదివారం తొలిసారి 10 లక్షల మందికిపైగా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసినట్లు భద్రతాధికారులు వెల్లడించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో రవాణా సంబంధ కౌంటర్లు డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ బోర్లా కొద్ది నెలలుగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో సోమవారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో యాపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ 2.6-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా 1.2 శాతం, ఫైజర్ ఇంక్ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కొనాకోఫిలిప్స్ 3.2 శాతం, షెవ్రాన్ కార్పొరేషన్ 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. -
మరో ఉద్దీపనకు చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు. వ్యయాలపై సీపీఎస్ఈలకు నిర్మలాసీతారామన్ సూచన ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి. తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు. -
రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో డిమాండ్, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ప్రకటించిన రెండవదఫా ఉద్దీపన ఈ దిశలో స్వల్ప ప్రయోజనాలనే అందిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. అక్టోబర్ 12న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎట్‌టీసీ) క్యాష్ వోచర్ స్కీమ్, ప్రత్యేక పండుగల అడ్వాన్స్, రాష్ట్రాలకు వడ్డీరహిత రూ.12,000కోట్ల రుణం, రూ.25,000 కోట్ల అదనపు మూలధన ప్రయోజనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రూ.46,700 కోట్ల విలువైన ఈ ఉద్దీపన 2020–21 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం ఉంటుందని అంచనా. రెండు విడతల ఉద్దీపనలనూ కలుపుకుని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యక్ష వ్యయాలను పరిశీలిస్తే, ఈ మొత్తం జీడీపీలో 1.2 శాతం ఉంటుందని మూడీస్ అంచనావేసింది. బీఏఏ రేటింగ్ ఉన్న ఇతర దేశాల్లో కరోనా సంబంధ ఉద్దీపన జీడీపీలో సగటును 2.5 శాతం ఉందని మూడీస్ తెలిపింది. వ్యయాలకు కఠిన పరిమితులు... వ్యయాల విషయంలో భారత్ కఠిన పరిమితులను ఎదుర్కొంటోందని మూడీస్ పేర్కొంది. జీడీపీలో ప్రభుత్వ రుణ భారం గత ఏడాది 72% ఉంటే, 2020లో దాదాపు 90 శాతానికి పెరగనుందని విశ్లేషించింది. అలాగే ఆదాయాలు తగ్గడం వల్ల ద్రవ్యలోటు జీడీపీలో 12 శాతానికి పెరిగిపోయే పరిస్థితి కనబడుతోందనీ అంచనా వేసింది. -
మార్కెట్ ముందుకే
స్టాక్ మార్కెట్ ర్యాలీ స్వల్ప కాలం మేర కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా (భారత్‌లో కూడా) ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు, కంపెనీల క్యూ2 ఫలితాలు బాగా ఉంటా యనే అంచనాలు దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. ఇక ఈ వారంలో వెలువడనున్న ఐటీ కంపెనీల ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికో త్పత్తి గణాంకాలు, మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టు తీర్పు.. మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. 70 కంపెనీల క్యూ2 ఫలితాలు.... ఈ వారంలోనే విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్ ట్రీ వంటి ఐటీ కంపెనీల ఫలితాలు వెలువడతాయి. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్, ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్... మొత్తం 70 కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు (సోమవారం) మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. ఇదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం (ఈ నెల 14న ) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. వరుసగా ఏడు రోజుల పాటు మార్కెట్ పెరిగినందున పై స్థాయిల్లో స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలలో 1,000 కోట్ల విదేశీ నిధులు.... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో ఈ నెలలో రూ.1,086 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, జీఎస్టీ వసూళ్లు మెరుగుపడటం, ఆర్థిక పరిస్థితులు పుంజుకున్నాయని గణాంకాలు వెల్లడించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దీనికి కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో రూ.5,245 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,159 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా రూ.3,419 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
అయిదో రోజూ మార్కెట్ ముందుకే..
ముంబై: అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 39,879 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 11,739 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,906 పాయింట్లు, నిఫ్టీ 516 పాయింట్లను ఆర్జించాయి. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, ప్రైవేట్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968– 39,451 పాయింట్ల మధ్య కదలాడగా, నిఫ్టీ 11,763– 11,629 రేంజ్లో ఊగిసలాడింది. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1093 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1129 కోట్ల షేర్లను విక్రయించారు. ఎన్నికలకు ముందు అమెరికాకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ఉండదనే ట్రంప్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా మన మార్కెట్ స్వల్ప నష్టంతో మొదలైంది. ఆదుకున్న హెవీ వెయిటేజీ షేర్ల ర్యాలీ నష్టాలతో మొదలై ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్న సూచీలను అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ ఆదుకుంది. రిలయన్స్ రిటైల్‌లో తాజాగా అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు రిలయన్స్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు 3 శాతం లాభపడింది. క్యూ2 ఫలితాలకు ముందు టీసీఎస్ షేరు ఒక శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికంలో తమ వ్యాపారం సాధారణ స్థాయికి చేరుకుందని టైటాన్ తెలపడంతో ఈ షేరు 4.5 శాతం పెరిగింది. వీటికి తోడు మిడ్‌సెషన్ నుంచి ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వరుసగా 5 రోజూ లాభంతో ముగిశాయి. మెరుగైన దేశీయ ఆర్థిక గణాంకాల వెల్లడితో పాటు కంపెనీల క్యూ2 గణాంకాల పట్ల ఆశావహ అంచనాల నుంచి మార్కెట్ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకుందని ఈక్విటీ రీసెర్చ్ అధిపతి పారిస్ బోత్రా తెలిపారు. వ్యాపారాలు తిరిగి గాడిలో పడటంతో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీల షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చిందన్నారు. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు. మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్ సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. -
యూఎస్ మార్కెట్లకు ట్రంప్ షాక్
అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్ తాజాగా స్పష్టం చేయడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. డోజోన్స్ 376 పాయింట్లు(1.3%) క్షీణించి 27,773 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 48 పాయింట్లు(1.4%) బలహీనపడి 3,361 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 178 పాయింట్లు(1.6%) పతనమై 11,155 వద్ద స్థిరపడింది. కోవిడ్19 నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో సోమవారం మార్కెట్లు జంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఏం జరిగిందంటే? హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కొన్ని రాష్ట్రాల కోసం ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ కోవిడ్-19కు వినియోగం కోసంకాదని ట్రంప్ విమర్శించారు. అయినాగానీ తాము ఎంతో ఉదారంగా 1.6 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించామని పేర్కొన్నారు. ఇందుకు డెమక్రాట్లు అంగీకరించకపోవడంతో ఎన్నికలు ముగిసేవరకూ చర్చలు నిలిపివేయాల్సిందిగా తమ ప్రతినిధులను ఆదేశించినట్లు ట్రంప్ తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచాక కష్టపడి పనిచేస్తున్న అమెరికన్లతోపాటు.. చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా బెయిలవుట్ బిల్లును పాస్ చేస్తామని పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక రికవరీకి మరో భారీ ప్యాకేజీ అవసరమున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక దన్ను లభించకుంటే.. జీడీపీ రికవరీ నెమ్మదించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ మంగళవారం ట్రేడింగ్ లో బ్లూచిప్ స్టాక్ బోయింగ్ 7 శాతం పతనంకాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3 శాతం క్షీణించింది. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజాలు మోడర్నా ఇంక్, ఫైజర్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
ట్రంప్ ఓకే- యూఎస్ మార్కెట్లు అప్
అధ్యక్షుడు ట్రంప్ సైతం కోవిడ్-19 బారిన పడటంతో వారాంతాన నమోదైన నష్టాలకు చెక్ పెడుతూ సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 466 పాయింట్లు(1.7%) ఎగసి 28,149 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) బలపడి 3,409 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 257 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 11,332 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో తిరిగి ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ పట్టుబడుతున్న ప్యాకేజీపై ఒప్పందం కుదిరేవీలున్నట్లు వైట్‌హౌస్ చీఫ్ మార్క్ మెడోస్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. బ్రిస్టల్ మైయర్స్ అప్ యాంటీబాడీలు వృద్ధిచెందేలా అభివృద్ధి చేస్తున్న ఔషధంపై అంచనాలతో హెల్త్‌కేర్ దిగ్గజం రీజనరాన్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. యూరోపియన్ దేశాలలో పనిచేస్తున్న సిబ్బందిలో 11 శాతంవరకూ కోత పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇంధన రంగ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ తొలుత 3 శాతం క్షీణించింది. చివరికి 2.3 శాతం లాభంతో ముగిసింది. కాగా.. హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో ప్రత్యేకత కలిగిన మోకార్డియాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం బ్రిస్టల్ మైయర్స్ 1 శాతం బలపడింది. అయితే మోకార్డియా ఏకంగా 58 శాతం దూసుకెళ్లింది. మోడర్నా జోరు కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధిలో దూకుడు చూపుతున్న మోడర్నా ఇంక్ 4.6 శాతం జంప్‌చేయగా.. ఫైజర్ 1 శాతం, ఆస్ట్రాజెనెకా 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్ 3 శాతం, మైక్రోసాఫ్ట్, గూగుల్ 2 శాతం చొప్పున ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2.6 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో షెవ్రాన్, బోయింగ్ 2 శాతం చొప్పున బలపడ్డాయి. -
గణాంకాల కిక్.. అమెరికా ఉద్దీపన ఊరట
అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై సానుకూల అంచనాలకు తోడు ఆర్థిక గణాంకాలు ఆశావహంగా ఉండటంతో గురువారం స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. సెన్సెక్స్ 38,500 పాయింట్లపైకి, నిఫ్టీ 11,400 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరడం, అన్‌లాక్ 5 మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు ఎగసి 38,697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 11,417 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్1.65 శాతం, నిఫ్టీ 1.51 శాతం చొప్పున పెరిగాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. ఆరంభం నుంచి అంతే... ఆసియా మార్కెట్ల జోష్‌తో ఆరంభంలోనే మన మార్కెట్ భారీ లాభాలను సాధించింది. రోజంతా లాభాలు కొనసాగాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,308 పాయింట్లు, నిఫ్టీ 367 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. శాతం పరంగా, సెన్సెక్స్ 3.49 శాతం, నిఫ్టీ 3.31 శాతం చొప్పున పెరిగాయి. సెలవుల కారణంగా షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు పనిచేయలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జపాన్ మార్కెట్లో ట్రేడింగ్ జరగలేదు. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 12.4 శాతం లాభంతో రూ.593 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఓఎన్జీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. లాభాలు ఎందుకంటే... ► సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 95,480 కోట్లకు చేరాయి. ఆగస్టులో వసూలయిన జీఎస్టీ వసూళ్లకన్నా సెప్టెంబర్ వసూళ్లు 10% అధికంకావడం విశేషం. ► దేశీయ తయారీ రంగం సెప్టెంబర్‌లో ఎనిమిదిన్నరేళ్ల గరిష్టస్థాయికి ఎగసింది. ► సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు జోరుగా పెరిగాయి. మారుతీ, బజాజ్ ఆటో తదితర కంపెనీల అమ్మకాలు 10–30 శాతం రేంజ్లో పెరగడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేసింది. ► కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం మరో భారీ ఉద్దీపన ప్యాకేజీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనున్నదన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కంటైన్మెంట్ జోన్లలో మినహా సినిమాహాళ్లు, మాల్స్‌ను తెరవడానికి అన్‌లాక్ 5.0 మార్గదర్శకాల ద్వారా కేంద్రం అనుమతిచ్చింది. ► డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరింది. రూ.1.7 లక్షల కోట్లు ఎగసిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.68 లక్షల కోట్లు ఎగసి 156.9 లక్షల కోట్లకు చేరింది నేడు మార్కెట్‌కు సెలవు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2–శుక్రవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఫారెక్స్, బులియన్ మార్కెట్లు కూడా పనిచేయవు. ట్రేడింగ్ మళ్లీ మూడు రోజుల తర్వాత సోమవారం(ఈ నెల 5న) జరుగుతుంది. -
త్వరలో భారీ ప్యాకేజీ!
కేంద్రం గత ప్యాకేజీకి మించి, భారీ ఉద్దీపన ప్యాకేజీని రూపొందిస్తోందన్న వార్తల జోష్‌తో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 73.79కు చేరినా, కరోనా కేసులు పెరుగుతున్నా మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల పెట్టుబడులు అందనున్నాయన్న వార్తలు, ప్రపంచ మార్కెట్లు లాభపడటం..... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 37,982 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు ఎగసి 11,228 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. రూ. 3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.81 లక్షల కోట్లు పెరిగి రూ. 155.10లక్షల కోట్లకు ఎగసింది. చివర్లో మరింత జోరు... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్టు లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో కొనుగోళ్ళు మరింత జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38 వేల పాయింట్లపైకి ఎగబాకింది. ఆర్థిక, వాహన, ఫార్మా రంగ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–హిందుస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియాలు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 8% లాభంతో రూ.40.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► షేర్ బైబ్యాక్ ఆఫర్ ముగియడంతో సన్ ఫార్మా షేర్ 5 శాతం లాభంతో రూ. 20.75 వద్ద ముగిసింది. ► ఒక్కో షేర్ ఐదు షేర్లుగా నేడు(మంగళవారం)విభజన చెందనుండటంతో లారస్ ల్యాబ్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది. ► పశ్చిమ బెంగాల్లో వచ్చే నెల 1 నుంచి సినిమా హాళ్లు ప్రారంభం కానుండటంతో పీవీఆర్, ఐనాక్స్ విండ్ షేర్లు 6–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలకు ఎగిశాయి. ఇండి యామార్ట్ ఇంటర్మెష్, అపోలో హాస్పిటల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. డిష్ టీవీ, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► నేటి నుంచి మూడు ఐపీఓలు–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్ఫ్రా ప్రారంభం కానున్నాయి. చైనా పరిశ్రమల లాభాలు ఆగస్టులో పెరిగాయి. ఈ లాభాలు వరుసగా నాలుగో నెలలోనూ పెరగడం ఇన్వెస్టర్లలో జోష్ని నింపింది. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నేడు (మంగళవారం)తొలి డిబేట్ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. షాంఘై మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు 1–2 % రేంజ్లో లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 2–3% లాభాల్లో ముగిశాయి. -
మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్..!
గురువారం నాటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది. త్వరలో అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది. ప్రపంచ మార్కెట్లు గురువారం నాటి నష్టాల నుంచి కోలుకోవడం, గత ఆరు రోజుల పతనం కారణంగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం(వేల్యూ బయింగ్), కేంద్ర ప్రభుత్వం కూడా పండగ ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలు.....సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 37,388 పాయింట్ల వద్ద, నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 11,050 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2.2 శాతం మేర లాభపడ్డాయి. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్ సూచీలు భారీగానే నష్టపోయాయి. సెన్సెక్స్1,457 పాయింట్లు,నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి.సెన్సెక్స్ 3.8 శాతం, నిఫ్టీ 4 శాతం మేర క్షీణించాయి. ఆరంభం నుంచి లాభాలే.... ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 917 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. హాంకాంగ్, షాంఘైలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు మ్రిÔ¶ మంగా ముగిశాయి. ► సెన్సెక్స్‌లోని అన్ని (30) షేర్లూ లాభపడ్డాయి. ► రూ.20,000 కోట్ల రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్‌కు సంబంధించిన ఆర్బిట్రేషన్ కేసును గెలవడంతో వొడాఫోన్ ఐడియా షేర్ 14 శాతం లాభంతో రూ.10.36 వద్ద ముగిసింది. ► యాక్సెంచర్ కంపెనీ 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కంపెనీ వ్యాఖ్యలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► రుణ భారం తగ్గంచుకోవడానికి కాకినాడ సెజ్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను విక్రయించనుండటంతో జీఎంఆర్ ఇన్ఫ్రా షేర్ 11 శాతం లాభంతో రూ.23.55 వద్ద ముగిసింది. ► 350 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అపోలో హస్పిటల్స్, గ్రాన్యూల్స్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. లాభాలు ఎందుకంటే... ► ప్యాకేజీలపై ఆశలు కరోనాతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి వచ్చే వారం ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనున్నదని వార్తలు వచ్చాయి. మరోవైపు పండగ జోష్‌ను పెంచడానికి మన ప్రభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వొచ్చన్న వార్తలు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచాయి. ► స్టేబుల్ రేటింగ్... భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నిలకడగా(స్టేబుల్)గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, స్టాండర్డ్ అండ్ పూర్స్ పేర్కొంది. 2021 నుంచి వృద్ధి పుంజుకోగలదనే అంచనాలను వెలువరించింది. ► వేల్యూ బయింగ్.... గత ఆరు రోజుల నష్టాల కారణంగా పలు షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో వేల్యూ బయింగ్ చోటు చేసుకుంది. ► పుంజుకున్న రూపాయి.... డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది. 3.52 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.52 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.52 లక్షల కోట్లుపెరిగి రూ.152.28 లక్షల కోట్లకు చేరింది. -
ఊరట : త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించేందుకు కసరత్తు చేపడుతోంది. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతితో పాటు చిన్న వ్యాపారులను ఆదుకోవడంపై ఈసారి ప్రభుత్వం దృష్టిసారించింది. రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలోనే ఆశించవచ్చని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణియన్ ఇటీవల పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సంకేతాలను ఆయన ప్రకటన స్పష్టం చేసింది. లాక్డౌన్ ముగియడంతో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు, సేవలు అందుబాటులోకి రావడంతో తాజా ప్యాకేజ్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అత్యున్నత భేటీలను నిర్వహించడం కూడా రాబోయే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు పెంచుతోంది. మరోవైపు ఇటీవల వెల్లడైన జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజాన్ని వెల్లడించడంతో తదుపరి ప్యాకేజ్‌ను ప్రకటించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ 23.9 శాతం తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కోవిడ్-19తో అత్యధిక ప్రభావానికి గురైన దేశంగా భారత్ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన క్వార్టర్లలోనూ ఇవే సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. చదవండి : చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం పండుగల సీజన్ రాబోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిమాండ్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి చర్యలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వ అధికారులు తరచూ కార్పొరేట్ నేతలతో సమావేశమవుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నారు. డిమాండ్ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి విస్పష్టంగా సూచిస్తున్నాయి. చిరు వ్యాపారులు, మధ్యతరగతికి ఊరట తాజా ప్యాకేజ్‌లో చిన్న వ్యాపారాలను కాపాడటం, మధ్యతరగతికి మేలు చేసే చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్యాకేజ్ పరిమాణం, ఏ సమయంలో ప్రకటించాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. మధ్యతరగతి వర్గంతో పాటు చిన్నవ్యాపారాలకు ఊతమివ్వాలని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. రాబోయే ఉద్దీపన ప్యాకేజ్ ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని రీతిలో సమస్యలను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యక్షంగా ఆర్థిక ఊతమిచ్చే చర్యలు తక్షణం చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు కోరుతున్నారు. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్లో ముగిశాయి. దీంతో గత మూడు రోజుల నష్టాలకు సోమవారం బ్రేక్ పడింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ జాప్యం అవుతుండటంతో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మన మార్కెట్ మాత్రం పెరిగింది. సెన్సెక్స్ మళ్లీ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,200 పాయింట్లపైకి ఎగబాకాయి. చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 38,051 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,247 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లు నష్టపోయినా,విద్యుత్తు, వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 74.88 వద్దకు చేరింది. ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైనా వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ లాభాల్లోకి వచ్చింది. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడైంది. సెన్సెక్స్ ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 143 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 242 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 385 పాయింట్ల రేంజ్లో కదలాడింది. జపాన్ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, త్వరలో పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను ఆరంభించనున్నదన్న వార్తలతో ఎన్టీపీసీ షేర్ 8 శాతం లాభంతో రూ.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మైండ్ ట్రీ, వాబ్కో ఇండియా, థైరోకేర్ టెక్నాలజీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ కొనొచ్చు అనే రేటింగ్‌ను ఇవ్వడంతో సన్ టీవీ షేర్ 6% లాభంతో రూ.426 వద్ద ముగిసింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు–ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ మాత్రమే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభపడ్డాయి. ► హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ షేర్లు కొనుగోలు చేశారన్న వార్తలతో పీటీసీ ఇండస్ట్రీస్ 20% లాభంతో రూ.699 కు చేరింది. ► దాదాపు 400 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీటీసీ ఇండస్ట్రీస్, ఆప్టో సర్క్యూట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
కరోనా కేసులు, ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: వచ్చేవారంలో స్టాక్ మార్కెట్ గమనానికి కరోనా కేసుల పెరుగుదల, కంపెనీల జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయని స్టాక్‌మార్కెట్ నిపుణులంటున్నారు. గతవారంలో దేశీయంగా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి 6.93శాతంగా నమోదైంది. ఎగుమతులు మాత్రం 10.21శాతం క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాటిని విశ్లేషిస్తే ఆర్థిక మందగమనం కొంత రికవరి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధిక ద్రవ్బోల్బణం నెలకొంది. దీంతో సెంటిమెంట్ కొంత బలహీన మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం రెండో దఫా చర్యలకు శ్రీకారం చుట్టవచ్చని అంచనాలు దలాల్ స్ట్రీట్ వర్గాల్లో నెలకొన్నాయి. అలాగే ఈ వారంలో 12కి పైగా ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్ మార్కెట్‌కు కీలకం కానుంది. మరో విడత ప్యాకేజీపై ఆశలు... ‘ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఇది మార్కెట్ వర్గాలను కచ్చితంగా ఉత్సాహపరిచే అంశమే. కంపెనీల క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించగలవు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్యూ1 ఫలితాల విడుదల అంతిమ దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు తిరిగి కోవిడ్–19 కేసులు నమోదు, లాక్డౌన్ సడలింపులు తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరి అంశాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్‌పర్సన్ సంజీవ్ జర్బాదే తెలిపారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలతో వచ్చే వారంలో మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా కరోనా కేసుల పెరుగుదల అంశం దలాల్ స్ట్రీట్‌ను గమానికి కీలకం కానుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలు... కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అక్కడి ఆర్థికవేత్తలు అభిప్రాయపడున్నారు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. అలాగే క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్‌కు కీలకం కానున్నాయి. విదేశీ పెట్టుబడుల జోరు! దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా లిక్విడిటీ పెరగడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన దేశీయ కార్పోరేట్ కంపెనీల క్వార్టర్ ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడంతో మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌పీఐలు ఆసక్తిచూపుతున్నారు. ఈ ఆగస్ట్ ప్రథమార్ధంలో డెట్, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.28,203 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 5నెలల అనంతరం డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా మారడం విశేషం. ఎఫ్‌పీఐలు జూన్, జూలైలో వరుసగా రూ.3,301 కోట్లు, రూ.24,053 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూల కారకాల మేళవింపు ఫలితంగా భారత మార్కెట్లోకి అధిక మొత్తంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్‌స్టార్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ హిమాంశ్ శ్రీవాస్తవ తెలిపారు. కరోనా ఎఫెక్ట్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు పలుదేశాల సెంట్రల్ బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడమూ దీనికి నేపథ్యం. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అవుట్‌లుక్ ను ఫిచ్ గతవారమే స్టేబుల్ (స్థిర) నుంచి నెగటివ్ (ప్రతికూల) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. ‘భారత్ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి. మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్‌పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంచనాల కన్నా తక్కువే వృద్ధి.. స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్మాకర్ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు. -
తుది ప్యాకేజీ ప్రకటించవచ్చు : ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్బీఐ డైరెక్టర్ గురుమూర్తి అంచనా వేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబరులో తుది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న (మంగళవారం) భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబ్‌నార్‌లో గురుమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మధ్యంతర చర్యగా మాత్రమే భావించ వచ్చని గురుమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 అనంతర ఎరాలో చివరి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని చెప్పారు. అమెరికా, యూరోపియన్ దేశాలు నగదును ముద్రించుకుంటూ వస్తున్నాయి, కానీ భారతదేశంలో ఈ అవకాశం చాలా తక్కువే అన్నారు. అలాగే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గురుమూర్తి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15 వరకు ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో 16 వేల కోట్ల రూపాయలను జమ చేయగా, ఆశ్చర్యకరంగా చాలా స్వల్పంగా కొద్దిమంది మాత్రమే ఈ నగదును ఉపసంహరించు కున్నారని గురుమూర్తి పేర్కొన్నారు. సంక్షోభం తీవ్ర స్థాయిలో లేదనడానికి ఇదే సంకేతమన్నారు. ప్రస్తుతం దేశం భిన్న సమస్యలను ఎదుర్కొంటోందని గురుమూర్తి వెల్లడించారు. కరోనా అనంతరం ప్రపంచం బహుళ ఒప్పందాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా కోలుకుంటుందని ఆయన తెలిపారు. -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
సెన్సెక్స్ 32,845పైన అప్‌ట్రెండ్
పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా, వివిధ కేంద్ర బ్యాంకుల ఉద్దీపనల ఫలితంగా గతవారం హాంకాంగ్ మినహా అన్ని దేశాల సూచీలు ర్యాలీ జరిపాయి. ప్రధానంగా అమెరికా ఎస్ అండ్ పీ–500 సూచి....మార్చినెల ప్రధమార్థంనాటి గరిష్టస్థాయిని తాకగా, జపాన్ నికాయ్ ఇండెక్స్ 10 వారాల గరిష్టస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇక్కడి నిఫ్టీ మే 13 నాటి గరిష్టస్థాయిని (ప్రధాని రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన అనంతరం సాధించిన గరిష్టస్థాయి) అధిగమించగలిగింది. ఆ ఫీట్‌కు సెన్సెక్స్ మరోశాతం దూరంలో వున్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా ట్రేడ్‌చేసే నిఫ్టీని సెన్సెక్స్ కూడా ఈ వారంలో అనుసరించవచ్చు. ఇక భారత్ స్టాక్ సూచీలు తిరిగి బుల్కక్ష్యలోకి ప్రవేశించాలంటే ఏప్రిల్ 30 నాటి గరిష్టస్థాయిల్ని అధిగమించాల్సివుంటుంది. ఇన్వెస్టర్లు క్రమేపీ బ్యాంకింగ్ షేర్ల నుంచి క్రమేపీ ఫార్మా, టెక్నాలజీ, టెలికాం రంగాలకు వారి పెట్టుబడుల్ని మళ్లిస్తున్నందున, బ్యాంకింగేతర రంగాలకు చెందిన హెవీవెయిట్లు సూచీల్లో వెయిటేజీని మరింతగా పెంచుకోవడం, లేదా నాటకీయంగా బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపేవరకూ భారత్ ప్రధాన స్టాక్ సూచీలు....అమెరికా, జపాన్ల తరహాల్లో మార్చి తొలిరోజులనాటి గరి ష్టాలను అందుకునే అవకాశం ఇప్పట్లో వుండకపోవొచ్చు. ఇక స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా.. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మే 29తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో చివరిరోజైన శుక్రవారం 32,480 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,751 పాయింట్ల భారీ లాభంతో 32,424పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే మే 13 నాటి గరిష్టస్థాయి అయిన 32,845 పాయింట్ల వద్ద అవరోధం కలుగుతున్నది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 33,030 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ ఏప్రిల్ 30 నాటి గరిష్టస్థాయి అయిన 33,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 31,800 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున మద్దతు స్థాయిలు 31,630 పాయింట్లు, 31,250 పాయింట్లు. నిఫ్టీ 9,585 పైన అప్‌ట్రెండ్ కొనసాగింపు... మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్, జూన్ సిరీస్ తొలిరోజున జరిగిన లాంగ్బిల్డప్ల కారణంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,598 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకుఅంతక్రితంవారంతో పోలిస్తే 541 పాయింట్ల లాభంతో 9,580 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 9,585 పాయింట్లపైన స్థిరపడితే 9,655 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన 9,750 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 9,890 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ వారం 9,585 పాయింట్లపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 9,375 పాయింట్ల వద్ద తొలి మద్దతును పొందవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 9,330 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 9,160 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. – పి. సత్యప్రసాద్ -
9,500 పైకి నిఫ్టీ
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్ జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నప్పటికీ, బ్యాంక్, ఆర్థిక రంగ, ఎఫ్ఎమ్సీజీ రంగ షేర్ల జోరుతో స్టాక్ సూచీలు లాభపడ్డాయి. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు గురువారం రూ.2,354 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకొని 75.62కు చేరడం, ఉద్దీపన ప్యాకేజీ 3.0పై కసరత్తు జరుగుతోందన్న వార్తలు, లాక్డౌన్ పొడిగింపు ఉండకపోవచ్చన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 32,424 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 9,580 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్. నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. రంజాన్ సెలవు కారణంగా నాలుగు రోజులే జరిగిన ఈ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్1.752 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్ నష్టాల్లో ముగిశాయి.ట లుపిన్ లాభం రూ.390 కోట్లు ఔషధ కంపెనీ లుపిన్ 2019–20 క్యూ4లో రూ.390 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2018–19 ఇదే క్వార్టర్లో లాభం(రూ.290 కోట్లు)తో పోల్చితే 35% వృద్ధి సాధించింది. ఆదాయం 3,807 కోట్ల నుంచి 3,791 కోట్లకు తగ్గింది. పన్ను వ్యయాలు రూ.294 కోట్ల నుంచి రూ.105 కోట్లకు తగ్గాయి. రూ.2 ముఖ విలువగల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది. జుబిలంట్ లైఫ్ సైన్సెస్ లాభం 260 కోట్లు న్యూఢిల్లీ: జుబిలంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.260 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. 2018–19 ఇదే క్వార్టర్లో రూ.101 కోట్ల నికర లాభం వచ్చింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,386 కోట్ల నుంచి రూ.2,391 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. -
మనది 20.. అమెరికా 200!!
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది 10 శాతం. ఈ 20 లక్షల కోట్లలో నిజానికి రూ.9.94 లక్షల కోట్ల ఉద్దీపనను ఇప్పటికే రకరకాలుగా అందజేసినట్లు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిప్పుడు రూ.1.7 లక్షల కోట్లు జత చేశామన్నారు. ఇదికాక మార్చి 27 నుంచి ఆర్బీఐ రూ.8.02 లక్షల కోట్ల విలువైన వివిధ ద్రవ్య చర్యలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.12.95 లక్షల కోట్లు ఆహార భద్రతకు, కూలీల నగదు పంపిణీకి (మనిషికి రూ.500 చొప్పున), గ్రామీణ ఉపాధి పథకానికి, సూక్ష్మ, మధ్యస్థ కంపెనీలకు రుణాలివ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారామె. ఈ ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మిగతా దేశాలు ఏం చేశాయో ఒక్కసారి చూద్దాం... చైనా... రూ.100 లక్షల కోట్లు ► ఉద్దీపన చర్యల నిమిత్తం జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీన్లో రూ.12 లక్షల కోట్లమేర చర్యలను ఇప్పటికే అమలు చేసింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్ బాండ్లను కొనుగోలు చేసింది. ► రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. ఇంకా రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ–డిస్కౌంట్ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది. ► పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. (డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు) జపాన్... రూ.80 లక్షల కోట్లు ► జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80లక్షల కోట్లు. కాకపోతే దీన్లో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగిస్తోంది. ► చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువసార్లు జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంది. జర్మనీ.. రూ.30 లక్షల కోట్లు ► కరోనా మహమ్మారిపై పోరాడటానికి జర్మనీ తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. మన కరెన్సీలో ఇది రూ.30 లక్షల కోట్లు. దీన్లో సగం మొత్తాన్ని స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగిస్తోంది. ► వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా (మన కరెన్సీలో 86.25 లక్షల కోట్లు) ప్రభుత్వ గ్యారంటీలను వినియోగిస్తోంది. ► ఇక అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు దీనికి అదనం. రుణాల చెల్లింపులకు కూడా జూన్ 30 వరకూ మూడు నెలల మారటోరియం ఇచ్చింది. అమెరికా.. రూ.207 లక్షల కోట్లు పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.37.5 లక్షల కోట్లు. పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే... కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి అవి తమ ఉద్యోగులకిచ్చే జీతాల్లో 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ 30 మధ్య ఏ సమయంలోనైనా ఈ 8 వారాల జీతం కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా వైరస్ ప్రభావం నుంచి ఉపశమనం పొందటానికి, జనానికి సాయం చేయడానికి. ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో 150 లక్షల కోట్లు) ప్యాకేజీని ఆమోదించింది. ► ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది. ► ఇదికాక ఫెడరల్ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5%తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే. -
మరో ప్యాకేజీ ఆశలు : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన కీలక సూచీలు బుధవారం ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన పటిష్టంగా ముగిసాయి. ఫార్మా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ రానుందనే అంచనాలతో సెన్సెక్స్ నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకోవడంతో మిడ్ సెషన్ తరువాత లాభాల జోరందుకున్న సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసి 30818 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 9066 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 30500 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 9050కి ఎగువన ముగిసాయి. అరవిందో, గ్లెన్‌మార్క్, ఎస్కార్ట్స్ లాంటి ఫార్మ షేర్లు ప్రదానంగా లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ, డా. రెడ్డీస్ 6 శాతం ఎగిసి టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇంకా కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, బజాన్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జోరుగా ట్రేడ్ అయింది. మరోవైపు అదానీ పవర్, మైండ్ ట్రీ స్వల్పంగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి నష్టాలతో ముగిసింది. డాలరు బలం, ఆసియన్ కరెన్సీల బలహీనత నేపథ్యంలో 75.86 స్థాయిని టచ్ చేసింది. అయితే ఈక్విటీ మార్కెట్లో లాభాలతో చివర్లో తేరుకుని 75.79 వద్ద ముగిసింది. చదవండి : కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన -
2008 ప్యాకేజీ నుంచి పాఠాలు!
కరోనా సంక్షోభిత ఎకానమీని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని 2008-13 సంక్షోభ పాఠాలను గుర్తుంచుకొని రూపొందించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకే విచ్చలవిడి వ్యయాన్ని ప్రోత్సహించకుండా జాగ్రత్తపడ్డామన్నారు. తాము ప్రకటించిన చర్యలతో నేరుగా ప్రజలవద్దకు సొమ్ము చేరి డిమాండ్ పెంచుతుందన్నారు. వలసకార్మికులను ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని, కానీ వీరికి సంబంధించిన గణాంకాలు సరిగ్గాలేవని తెలిపారు. ప్యాకేజీ ప్రకటనకు ముందు అన్ని రకాల సలహాలు, సూచనలు స్వీకరించి అంతిమరూపునిచ్చామని వివరించారు. భవిష్యత్ పరిస్థితులను బట్టి మరిన్న చర్యలుంటాయని చెప్పారు. ఈ ప్యాకేజీ జీడీపీపై చూపే ప్రభావం చాలా స్వల్పమని నిపుణులు పెదవివిరుస్తున్న సంగతి తెలిసిందే! అయితే గతంలో వచ్చిన ఆర్థిక సంక్షోభ సమయంలో ఇచ్చిన ప్యాకేజీ లోటుపాట్లను గుర్తుంచుకొని తాజా ప్యాకేజీ రూపొందించామని నిర్మల చెప్పారు. ఆర్బీఐ ద్వారా భారీ నగదు ఉద్దీపనలు అందించాలని ప్యాకేజీకి ముందు ఇండియా ఇంక్ కోరింది, కానీ ఈ కోరికను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. 2008 అనంతరం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలతో 2013నాటికి ఎకానమీ పరిస్థితి బాగా దిగజారింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరడం, చెల్లింపుల శేషం క్షీణించడం, క్యాపిటల్ వలస, రూపీ క్షీణత లాంటివి ఆ సమయంలో పెరిగాయి. తాజా ప్యాకేజీతో ఇవన్నీ మళ్లీ తలెత్తకుండా జాగ్రత్త పడేందుకే ఈ ప్యాకేజీని జాగ్రత్తగా రూపొందించామని ఆర్థికమంత్రి చెప్పారు. అనేక దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు విశ్లేషించామన్నారు. బ్యాంకులకు ఇచ్చిన సాయం అంతిమంగా రుణాల రూపంలో పరిశ్రమలకు చేరుతుందని తెలిపారు. ఇదిక్రమంగా డిమాండ్ పెంచుతుందన్నారు. తమ ప్యాకేజీ సమాజంలో ప్రతి రంగాన్ని ఉద్దేశించినదని, ఇది అన్ని రంగాలకు చేయూతనిస్తుందని వివరించారు. -
మార్కెట్లు మళ్లీ మునక!
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం, లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం...ప్రతికూల ప్రభావమే చూపించాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా, మన మార్కెట్లో మాత్రం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 30,029 వద్ద, నిఫ్టీ 314 పాయిం ట్లు నష్టపోయి 8,823 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. 1,280 పాయింట్ల రేంజ్లో... ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రికవరీ కనిపించినా, చివరి అరగంటలో అమ్మకాలు మరింతగా వెల్లువెత్తాయి. ఒక దశలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 1,130 పాయింట్లకు పడిపోయింది. మొత్తం మీద రోజంతా 1,280 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పాటు పొడిగించడంతో పొజిషన్లు తీసుకునే విషయమై ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆర్థిక, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 10 శాతం నష్టంతో రూ.377 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► బకాయిల చెల్లింపుల్లో విఫలమైనప్పటికీ, రుణగ్రస్తులపై ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్, ఆర్థిక రంగ, ఎన్బీఎఫ్సీ. హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 140కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ లీజర్, షాపర్స్ స్టాప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలెంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్... ఈ రెండు షేర్లు మాత్రమే ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. స్పైస్‌జెట్, ఎన్బీసీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోందన్న వార్తలతో జెన్ టెక్నాలజీస్ షేర్ 10% లాభంతో రూ.37 వద్ద ముగిసింది. ► బొగ్గు మైనింగ్‌లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పటివరకూ ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న కోల్ ఇండియా షేర్ 6 శాతం మేర నష్టంతో రూ. వద్ద ముగిసింది. ► రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడంతో రక్షణ రంగ కంపెనీలు లాభపడ్డాయి. రూ.3.65 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ. 3,65,470 కోట్ల మేర హరించుకుపోయి రూ.119 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే... ప్యాకేజీ.. పైన పటారం.. లోన లొటారం! ఆర్థిక ప్యాకేజీ 2.0... పైన పటారం... లోన లొటారం చందంగా ఉందని నిపుణులంటున్నారు. భారీగా నిధుల వరద పారేలా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలన్నీ తప్పాయని వారంటున్నారు. తక్షణం డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచేలా ఉద్దీపన చర్యలు లేకపోవడంతో సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. పేరుకే ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, వాస్తవంగా ప్రభుత్వానికి ఖర్చయ్యేది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని వారంటున్నారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీని... రూ.20 లక్షల కోట్ల మేర అందిస్తామని ప్రధాని ప్రకటించినా, వాస్తవిక ప్యాకేజీ ప్రకటించిన ప్యాకేజీలో 10 శాతం మేర ఉండటమే గమనించాల్సిన విషయం. లాక్డౌన్ పొడిగింపు... లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించడం ప్రతికూల ప్రభావమే చూపించింది. లాక్‌డౌన్‌ను పొడిగించడం ఇది మూడోసారి. లాక్డౌన్ 4.0లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మరింత జాప్యం కాగలదన్న భయాలతో అమ్మకాలు జోరుగా సాగాయి. కరోనా ఉగ్రరూపం భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 96వేలకు, మరణాలు 3,000కు పైగా పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు పైగా, మరణాలు 3.15 లక్షలకు చేరాయి. రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 75.61కు పడిపోయింది. 60 శాతం తగ్గిన ఎగుమతులు... గత నెలలో ఎగుమతులు 60% పతనమయ్యాయి. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ అభయం ఇచ్చారు. ఈ రెండు అంశాల కారణంగా సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 4–6% లాభాల్లో ముగియ గా, రాత్రి 11.30 సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 2–3% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
సెన్సెక్స్ కీలక మద్దతు 30,750
కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్యాకేజీ వివరాలు మార్కెట్ వర్గాలను సంతృప్తిపర్చకపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో తిరిగి అమ్మకాలు తలెత్తడంతో మన స్టాక్ సూచీల్లో ప్యాకేజీ పాజిటివ్ ఎఫెక్ట్ లేకుండా పోయింది. పైగా సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్ షేర్లు ఏ రోజుకారోజు క్షీణిస్తూపోవడం ఆందోళనకారకం. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువమక్కువ చూపే బ్యాంకింగ్ షేర్లలో భారీ రికవరీ వచ్చేంతవరకూ మన మార్కెట్ దిగువ స్థాయిలోనే కదలవచ్చు. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మే 15తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 32,845 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత 30,770 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 545 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ నెలలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయిగా గత వారం కాలమ్‌లో ప్రస్తావించిన 30,750 పాయింట్ల సమీపంలోనే గత శుక్రవారం సెన్సెక్స్ మద్దతు పొందగలిగినందున, ఈ వారం అదేస్థాయి వద్ద లభించబోయే మద్దతు కీలకం. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 30,350 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 29,900–29,500 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ సోమవారం 30,750 పాయింట్ల మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, లేక 31,300 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 31,630 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన 32,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే తిరిగి 32,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ కీలక మద్దతు 8,980... గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,584 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత 9,050 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పో లిస్తే 115 పాయింట్ల నష్టంతో 9,137 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 8,980 పాయింట్ల స్థా యి కీలకమైనది. ఏప్రిల్‌లో జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,920 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 8,815 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం 8,980 పాయింట్ల మద్దతును పరిరక్షించుకున్నా, 9,185 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 9,280 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 9,350 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే తిరిగి 9,580 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
న్యూఢిల్లీ: ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించిన ఐదో ప్యాకేజీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు కచ్చితంగా పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపనతో దేశంలో ఆరోగ్య, విద్యా రంగాల్లో సానుకూల మార్పు వస్తుందని తెలిపారు. ఆ పాట స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఆత్మ–నిర్భర్ భారత్’ పిలుపును అందిపుచ్చుకుని 211 గాయకులు కలిసి ఆలపించిన కొత్త పాట దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ పాట విషయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చేసిన ట్వీట్‌పై మోదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ పాటను తాను విన్నానని, అందరిలోనూ స్ఫూర్తిని రగిలించేలా ఉందని ప్రశంసించారు. -
నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ : నేడు వ్యవ‘సాయం’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ , లాక్డౌన్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియాకు వివరించ నున్నారు. నిర్మలా సీతారామన్ గురువారం తన రెండవ మీడియా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అలాగే సప్లయ్ చెయిన్, అంతరాయాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలను ఆర్థిమంత్రి సూచించనున్నారని భావిస్తున్నారు. (భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్) బుధవారం నాటి ప్రెస్మీట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ అనేక ఉపశమన చర్యల్ని ప్రకటించారు. ఎంఎస్ఎంఈ, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీ, ఎంఎఫ్ఐ లాంటి ఫైనాన్సింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?) Finance Minister Smt.@nsitharaman to address a press conference today, 14th May, at 4PM in New Delhi. Watch LIVE here👇 ➡️YouTube - https://t.co/b78LXIfEht Follow for LIVE updates 👇 ➡️Twitter - https://t.co/XaIRg3fn5f ➡️Facebook - https://t.co/06oEmkxGpI pic.twitter.com/BLpAJZGexx — Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 14, 2020 -
తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలి
న్యూఢిల్లీ: పరిశ్రమలకు తక్షణమే రూ.15 లక్షల కోట్లు లేదా జీడీపీలో 7.5 శాతానికి సమాన స్థాయిలో ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావానికి కారణమైనట్టు పేర్కొంది. వైరస్ ప్రభావం మరో 12–18 నెలల (చికిత్స లేదా వ్యాక్సిన్ వచ్చే వరకు) వరకు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ పేపర్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల మేర సర్దుబాటు చేసుకోవచ్చని సూచించింది. ‘‘50 రోజులకు పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గణనీయంగా ఉండనుంది. దీన్ని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం. అప్పుడే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చు’’ అని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్‌ధన్ ఖాతాదారులకు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగంగా ఉండాలని సిఐఐ సూచించింది. కార్మిక చట్టాలను రద్దు చేయండి: కార్మిక చట్టాలను దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడేళ్ల కాలానికి రద్దు చేయాలంటూ పారిశ్రామిక సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి పరిశ్రమలు గట్టెక్కగలవని అభిప్రాయపడ్డాయి. కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ శుక్రవారం సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ ప్రతినిధులతో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం, పరిస్థితుల మెరుగుపై వెబినార్ నిర్వహించారు. చట్ట పరిధిలో సవరణలు ఇవ్వాలని, కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని కోరాయి. అలాగే, కనీస వేతనం, బోనస్ మినహా కార్మిక చట్టంలోని మిగిలిన సెక్షన్లను సస్పెండ్ చేయాలని కోరాయి. -
రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల నష్టపోతున్న కీలక రంగాలకు అందజేయాల్సిన రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక రంగం స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంట గ్యాస్ పంపిణీ, పేద మహిళలకు, వృద్ధులకు నగదు పంపిణీ వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. రెండో విడత ప్యాకేజీపై కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కొద్దిరోజులుగా వరుసగా సమావేశమవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలనే దానిపై వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలపై చర్చలు లాక్డౌన్ వల్ల వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రైతులకు సంస్థాగత రుణ పరపతి, నిబంధనల సడలింపు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. భారత్స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశ జనాభాలో సగానికిపైగా ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తిని పెంచడంపై ప్రధాని సంప్రదింపులు జరిపారు. మన రైతులు అంతర్జాతీయ పోటీలో ముందంజలో నిలవాలంటే సాగులో సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నరేంద్ర మోదీ చెప్పారు. -
ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్ ప్యాకేజీ సిద్ధపడుతోందా? వరుస సమావేశాలతో, సమీక్షలతో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికమంత్రి, హోం మంత్రులతో తాజా భేటీ ఈ అంచనాలకు బలాన్నిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి నెలవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకాల విడుదలను ఆర్థికమంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ స్థితి, స్టిములస్ ప్యాకేజీ అంశాలపై ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ను కూడా ప్రధాని ఇవ్వనున్నారని సమాచారం. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) ఆర్థిక ప్రతిష్టంభనకు ప్రభావితమైన రంగాలకు ఊతమిచ్చేందుకు రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతోపాటు ఇతర ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులతో కూడా ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) వంటి కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. (లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట) మరోవైపు ఇప్పటికే పౌర విమానయాన, కార్మిక, విద్యుత్తు సహా వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రధాని శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశంలో చిన్న వ్యాపారాల పునరుజ్జీవనంపై దృష్టి సారించి ప్రధాని మోదీ వాణిజ్య , ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖలతో గురువారం వివరణాత్మక చర్చలు నిర్వహించారు. ఈ సమావేశాలలకు హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇద్దరూ హాజరు కావడం గమనార్హం. కాగా ప్రభుత్వం మార్చి చివరిలో 1.7 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. కొన్ని మినహాయింపులు, సడలింపులతో దేశవ్యాప్తంగా మే 4వ తేదీనుంచి మే 17 వరకు మూడవ దశ లాక్డౌన్ అమలు కానున్న సంగతి తెలిసిందే. (హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట) (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) -
ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆదాయం పడిపోయి వార్తాపత్రికల సంస్థలు కుదేలవుతున్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్ తగ్గిపోవడంతో న్యూస్‌పేపర్ పరిశ్రమ ఇప్పటికే రూ. 4,000–4,500 కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీలాంటిదేదైనా ఇవ్వకపోతే వచ్చే ఆరు.. ఏడు నెలల్లో దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నష్టపోయే ముప్పు ఉందని తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ అంశాలు పేర్కొన్నారు. వార్తాపత్రిక పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పైచిలుకు జర్నలిస్టులు, ప్రింటర్లు, డెలివరీ వెండార్లు వంటి వారు పనిచేస్తున్నారని, నష్టాల కారణంగా వీరందరిమీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌పై అయిదు శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, రెండేళ్ల పాటు న్యూస్‌పేపర్ సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, ప్రింట్ మీడియా బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. పెండింగ్ అడ్వర్టైజింగ్ బిల్లులను తక్షణం సెటిల్ చేయాలని కోరింది. తక్షణమే ప్యాకేజీ ప్రకటించాలి: కార్పొరేట్ ఇండియా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు పరిశ్రమలకు వెంటనే ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ పరిశ్రమలు (కార్పొరేట్ ఇండియా) కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లాక్డౌన్ తీవ్రమైన ఆర్థిక విఘాతానికి దారితీసినట్టు కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు కొనసాగిస్తూ, అదే సమయంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎన్నో వెసులుబాట్లు ఇవ్వడాన్ని స్వాగతించింది. నియంత్రణలతో కూడిన ఆర్థిక కార్యకపాల నేపథ్యంలో సత్వరమే, ప్రభావవంతమైన సహాయక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. -
ఉద్దీపన ఆశలతో.. బ్యాంకు, ఐటీ స్టాక్స్ ర్యాలీ
ముంబై: కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మరో ఆర్థ్ధిక ఉద్దీపనల ప్యాకేజీ వస్తుందన్న అంచనాలు బలపడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా ర్యాలీ కొనసాగించాయి. ఐటీ, టాప్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలను పరుగెత్తించాయి. రూపాయి బలంగా రికవరీ కావడం ఐటీ స్టాక్స్‌కు కలిసొచ్చింది. నిఫ్టీ కీలకమైన 9,300 మార్క్ పైకి చేరుకుంది. 127 పాయింట్లు లాభపడి (1.38 శాతం) 9,314 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు పెరిగి (1.54 శాతం) 31,863 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్‌లో కోటక్ బ్యాంకు అత్యధికంగా 8.59 శాతం లాభపడి ముందు నిలిచింది. ఆ తర్వాత టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 6 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 5 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4 శాతం, ఓఎన్జీసీ 3 శాతం పెరిగాయి. ► టైటాన్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోయాయి. ఐటీ, టెక్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, మెటల్, ఆటో, ఎనర్జీ రంగాలు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.35 శాతం వరకు లాభపడ్డాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 0.8 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ తాజా అంచనాలను వెల్లడించింది. ► మార్కెట్ల నుంచి నిధుల సమీకరణలో సెబీ వెసులుబాటు కల్పించింది. రెండు విడతల నిధుల సమీకరణ మధ్య అం తరం ప్రస్తుతం ఏడాది కాగా, దాన్ని 6 నెలలకు తగ్గించింది. ► ఉద్దీపనలపై యూరోజోన్ కీలకమైన భేటీ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. ► ఆసియాలో హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభపడగా, షాంఘై నష్టాల్లో క్లోజయింది. ప్రభుత్వ చర్యల ఆధారంగానే తదుపరి ర్యాలీ.. ‘‘బెంచ్‌మార్క్ సూచీలు మరో ఉద్దీపనల ప్యాకేజీపై వస్తుందన్న ఆశాభావంతో సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళనకరం. త్వరలోనే కేసులు గరిష్టానికి చేరుకుంటాయని మార్కెట్లు అంచనాతో ఉన్నాయి. ఆర్ధిక రంగ ఉత్తేజానికి, పరిశ్రమలకు మద్దతుగా ప్రభుత్వం ప్రకటించే చర్యలపైనే మార్కెట్ల తదుపరి ర్యాలీ ఆధారపడి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 2 వారాల గరిష్టానికి రూపాయి ముంబై: ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో క్రితం ముగింపుతో పోలిస్తే 62 పైసలు పటిష్టమై 76.06 వద్ద క్లోజయింది. రూపాయికి ఇది రెండు వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దీపనల చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు రూపాయి బలపడేలా చేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా అదనంగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేపట్టనున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటన సెంటిమెంట్ బలపడేలా చేసినట్టు ట్రేడర్లు తెలిపారు. -
లాభనష్టాల సయ్యాట
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం ఇన్వెస్టర్లను ఆందోళన పరిచినా, హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్లు లాభపడటం, ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు కలసివచ్చాయి. లాక్డౌన్ కారణంగా డిమాండ్ బాగా పడిపోవడంతో ముడి చమురు ధరలు 21 ఏళ్ల కనిష్టానికి పతనం కావడం, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రోజంతా 566 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 59 పాయింట్ల లాభంతో 31,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 124 పాయింట్ల మేర పెరిగినప్పటికీ, ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,262 పాయింట్ల వద్ద ముగిసింది. 566 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మూడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో 468 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 98 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 566 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 124 పాయింట్లు ఎగసినా, మరో దశలో 36 పాయింట్లు పతనమైంది. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప లాభాల్లోటముగిశాయి. ► గత క్యూ4లో నికర లాభం 15 శాతం మేర పెరగడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 4 శాతం లాభంతో రూ.941వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రైవేట్ బ్యాంక్‌ల రేటింగ్‌ను ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ స్థిరత్వం నుంచి ప్రతికూలం నకు తగ్గించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 5–4 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► మరోవైపు యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జే అండ్ కే బ్యాంక్ చెరో 20 శాతం చొప్పున ఎగిశాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10–18 శాతం రేంజ్లో పెరిగాయి. -
కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా కేసులు, కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే కీలకాంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న ఆశలు ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి లాక్డౌన్ దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా ఆరంభమవుతాయనే అంచనాలు మార్కెట్లో సెంటిమెంట్‌కు జోష్‌నివ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గమనం, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, ఏసీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, అలెంబిక్ ఫార్మా, మైండ్‌ట్రీ తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా, కరోనా వైరస్ ప్రభావం తమ వ్యాపారాలపై ఎలా ఉండనున్నదనే విషయమై కంపెనీలు వెల్లడించే అంచనాలపైననే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, ఆదిత్య బిర్లా మనీ, లిండే ఇండియా 2 గంటల్లో సెటిల్ చేయండి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో రెండు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఆదేశించింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా సంస్ధలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆథరైజేషన్ రిక్వెస్ట్ అందిన రెండు గంటలలోపు సంబంధిత(నెట్వర్క్) హాస్పిటల్‌కు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు ఆమోదం తెలుపుతూ సమాచారమివ్వాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. -
మరో ఉద్దీపనపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థి క వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లఘు సంస్థలు, వ్యవసాయం, ఆతిథ్యం, పౌర విమానయానం తదితర అన్ని రంగాలన్నీ .. కరోనా వైరస్ మహమ్మారిపరంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా దెబ్బతో భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా స్థాయికి కూడా పడిపోయే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు నివేదికలు ఇస్తున్నాయి. దీంతో లాక్డౌన్ ముగిశాక ఎకానమీని సాధ్యమైనంత త్వరగా పట్టాలమీదికి ఎక్కించేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అతనూ చక్రవర్తితో అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. వివిధ రంగాలకు ఉద్దీపనలతో పాటు బడుగు వర్గాల సంక్షేమానికి చర్యల గురించి కూడా ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘ప్యాకేజీ’ పరుగు!
కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందన్న ఆశలతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. సెన్సెక్స్ 31,150 పాయింట్లపైకి, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,100 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇతర దేశాల్లో కరోనా కేసులు చివరి దశకు చేరాయని, ఆయా దేశాలు ప్యాకేజీని ఇవ్వగలవన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. దీంతో మన మార్కెట్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు అయినప్పటికీ, స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో నష్టపోయినప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. ఏడు వారాల నష్టాలకు బ్రేక్... గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,266 పాయింట్లు ఎగసి 31,160 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 363 పాయింట్లు పెరిగి 9,112 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4.23 శాతం, నిఫ్టీ 4.15 శాతం చొప్పున ఎగిశాయి. రెండు రోజుల సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజుల పాటే జరిగినా, సెన్సెక్స్,నిఫ్టీలు భారీగానే లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,569 పాయింట్లు, నిఫ్టీ 1,028 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఈ రెండు సూచీలు చెరో 13 శాతం మేర లాభపడ్డాయి. ఏడు వారాల వరుస నష్టాలకు ఈ వారం బ్రేక్ పడింది. త్వరలోనే రెండో ప్యాకేజీ కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయటానికి ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా రూ. లక్ష కోట్ల రెండో ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోందన్న వార్తలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు ఊరటనిచ్చేలా వడ్డీ రాయితీ పథకాలు, రియల్టీ రంగానికి తాయిలాలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూల ధన నిధుల కేటాయింపులు ఈ రెండో ప్యాకేజీలో ఉంటాయని అంచనా. కాగా జపాన్ నికాయ్ సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు 1% మేర లాభపడగా, యూరప్ మార్కెట్లు 2–3 శాతం మేర పెరిగాయి. మరిన్ని విశేషాలు.... ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 17% లాభంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు– నెస్లే ఇండియా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► దాదాపు 30కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వీటిల్లో ఫార్మా షేర్లే అధికంగా ఉండటం విశేషం. అజంతా ఫార్మా, అబాట్ ఇండియా, క్యాడిలా హెల్త్‌కేర్, అల్కెమ్ ల్యాబొరేటరీస్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టొరంటొ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రేమండ్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, శోభ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో మరో ప్యాకేజీ! వ్యాపార సంస్థలు, రియల్టీ, పీఎస్‌బీలపై దృష్టి ముంబై: కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించొచ్చని, గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపనల తరహాలోనే ఇది కూడా ఉంటుందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సంస్థ పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలపై వడ్డీ రాయితీలు, సమస్యలను ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం అందించడంపై నూతన ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సూచించింది. పేద, బలహీన వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో కేంద్రం గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీలో దృష్టి పెట్టిన విషయం విదితమే. కేంద్ర ఆర్థిక శాఖ జీడీపీలో కనీసం 0.3 శాతం మేర ఆర్థిక ఉద్దీపనలు ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సెక్యూరిటీస్ ఆర్థికవేత్తలు తమ నివేదికలో తెలిపారు. జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లూ!! తొందర వద్దు... ఇటీవలి స్టాక్ మార్కెట్ ఉత్థానాలు బేర్ మార్కెట్ ర్యాలీలని కొందరు విశ్లేషకులంటున్నారు. రికవరీ మొదలయిందనే అంచనాలతో కొనుగోళ్లకు తొందర పడవద్దని వారు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలిక బేర్ మార్కెట్ ర్యాలీ అని, ఇది కొనసాగే అవకాశాలు లేవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నా, 21 రోజుల లాక్డౌన్ మంచి ఫలితాలనే ఇవ్వగలదన్న విషయం రానున్న రోజుల్లో వెల్లడి కానున్నదని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సంజీవ్ జర్భాడే వ్యాఖ్యానించారు. ఎఫ్ఎమ్సీజీ రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల వేల్యూయేషన్లు ఇప్పుడు సమంజసంగానే ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాలె న్స్ షీట్ పటిష్టంగా, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండి, మార్కెట్ లీడర్లుగా ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయవచ్చని ఆయన సూచించారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఈ షేర్లు మంచి రాబడులనిస్తాయని పేర్కొన్నారు. మార్కెట్లు పడుతున్నా.. చెదరని విశ్వాసం ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం మార్చి మాసంలో రూ.11,485 కోట్ల రాక సిప్ రూపంలో రూ.8,641 కోట్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో ఈక్విటీ మార్కెట్లు గత నెలలో భారీ పతనాలను చవిచూశాయి. స్టాక్స్ 30–90 శాతం మధ్య వాటి గరిష్టాల నుంచి పడిపోయాయి. కానీ, ఇవేవీ మన దేశీయ ఇన్వెస్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నారు. ఫలితమే మార్చి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా 11,485 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది కాలంలో ఒక నెలలో ఈక్విటీల్లోకి అధిక పెట్టుబడులు రావడం మళ్లీ ఇదే. మార్చి నెలలో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.2.13 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా మనీ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్ నుంచి అధిక స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తెలిపింది. సిప్ ఆపేది లేదు..! ► ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మార్చి నెలలో రూ.11,723 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ పథకాల నుంచి రూ.238 కోట్ల ఉపసంహరణ జరిగింది. దీంతో నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.11,485 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం నెల ఫిబ్రవరిలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.10,760 కోట్లతో పోల్చి చూస్తే పెరిగాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,268 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,060 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.1,551 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,223 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పట్ల ఇన్వెస్టర్ల నిబద్ధతను తెలియజేస్తూ ఈ మార్గంలో వచ్చిన పెట్టుబడులు మార్చి నెలలో రూ.8,641 కోట్లకు చేరాయి. ఇలా సిప్ రూపంలో రూ.8,000 కోట్లకు పైగా ప్రతీ నెలా రావడం గత 16 నెలలుగా కొనసాగుతూ వస్తోంది. ఇన్వెస్టర్ల సంపద 4 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.120.82 లక్షల కోట్లకు చేరింది. నేడు గుడ్‌ఫ్రైడే సెలవు గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు సెలవు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
మహిళలు, చిరుద్యోగులకు ఊరట
-
మహిళలు, చిరుద్యోగులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్డౌన్ విధించిన క్రమంలో పలు రంగాలపై మహమ్మారి ప్రభావాన్నినిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. చిరుద్యోగులకు ఊరట ఇచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలు వెల్లడించారు. రూ 15,000లోపు వేతనాలు అందుకునే చిరుద్యోగులకు ఊతం ఇచ్చేందుకు పీఎఫ్‌లో ఉద్యోగుల వాటాను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు మూడు నెలల పాటు ఉద్యోగుల, సంస్థల వాటా ఈపీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 90 శాతం మంది రూ 15,000లోపు వేతనాలు కలిగిన కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌లో 75 శాతం లేదా మూడు నెలల జీతంలో ఏది తక్కువైతే అంత మొత్తం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక జన్‌థన్ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ 500 ప్రభుత్వం జమచేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల జన్‌థన్ ఖాతాల సంఖ్య దాదాపు 20 కోట్లు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా డ్వాక్రా మహిళా గ్రూపులకు రూ 20 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పించనున్నారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధుల ఖాతాల్లో రెండు విడతలుగా రూ 1000 జమచేస్తారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 8.3 కోట్ల మంది కుటుంబాలకు ఈ నిర్ణయంతో లబ్ది చేకూరుతుందని తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 36 గంటల వ్యవధిలోనే పేదలు, వితంతువులు, వికలాంగులు, మహిళలు, రైతులు తదితరుల సహాయార్ధం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. కాగా దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న పరిణామాల అనంతరం తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఒక ఎకనామిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం తాజాగా తక్షణ సహాయ చర్యల్ని ప్రకటించింది. మరోవైపు వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలకు క్రెడిట్ ఇవ్వడం అవసరమని, ముఖ్యంగా ఈ కష్ట సమయంలో పేదలు మనుగడ సాగించడానికి తాత్కాలిక ఆదాయ బదిలీ పథకాన్ని అమలు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్ సైతం సూచించారు. చదవండి : కరోనా పంజా: భారీ ప్యాకేజీ -
4 రోజుల నష్టాలకు బ్రేక్
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి వివిధ కేంద్ర బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా శుక్రవారం లాభపడింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్దీపన చర్యలు ఉంటాయనే అంచనాలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి. గురువారం 75 మార్క్‌ను చేరిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకోవడం కలసి వచ్చింది. మరోవైపు ఇది పూర్తిగా టెక్నికల్ ర్యాలీయేనని, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగాయని కొంతమంది నిపుణులంటున్నారు. అయితే ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఒక దశలో 355 పాయింట్లు పతనమై, 2,130 పాయింట్లకు ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,628 పాయింట్లు పెరిగి 29,916 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 5.75 శాతం, నిఫ్టీ 5.83 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆరు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ సూచీలు ఇన్ని పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4,188 పాయింట్లు, నిఫ్టీ 1,210 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు చెరో 12 శాతం మేర నష్టపోయాయి. సూచీలు వరుసగా ఐదో వారమూ నష్టపోయాయి. ఇక ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ సూచీలు 7% మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 5% లాభాల్లో ఆరంభమయ్యాయి. లాభాల్లో కోవిడ్ ఔషధ షేర్లు కోవిడ్–19 చికిత్సలో హైడ్రోక్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తోందన్న వార్తల కారణంగా ఈ ఔషధాన్ని తయారు చేసే కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాడిలా హెల్త్‌కేర్ 16 శాతం లాభఃతో రూ.285కు, ఇప్కా ల్యాబ్స్ 9 శాతం లాభంతో రూ.1,372కు, టొరెంట్ ఫార్మా 4 శాతం లాభంతో రూ.1,846కు పెరిగాయి. ► ఓఎన్జీసీ 19 శాతం లాభంతో రూ.72 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. అల్ట్రాటెక్ సిమెంట్, 13 శాతం, హిందుస్తాన్ యూనిలీవర్ 12 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, టాటా స్టీల్ 10 శాతం, ఏషియన్ పెయింట్స్ 9 శాతం చొప్పున లాభపడ్డాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు– హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► నిఫ్టీలోని 50 షేర్లలో నాలుగు షేర్లు–హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్,, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 46 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► భారతీ ఇన్ఫ్రాటెల్ 23 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 11 శాతం లాభంతో రూ.1,020 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.65,358 కోట్లు పెరిగి రూ.6,46,732 కోట్లకు పెరిగింది. రూ. 6.32 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6.32 లక్షల కోట్లు ఎగసి రూ.116.1 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నికల్ ర్యాలీ.. జాగ్రత్త! కోవిడ్ కల్లోలం తగ్గకపోయినా స్టాక్ మార్కెట్ ర్యాలీ జరపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ర్యాలీ కొనసాగింపుపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్న నిపుణులు అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. ఫండమెంటల్స్ పరంగా ఎలాంటి మార్పుల్లేకపోయినా, కేవలం టెక్నికల్స్ కారణంగానే ఈ ర్యాలీ చోటు చేసుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. మార్కెట్ రికవరీ మొదలైందని భావించి, ఇప్పుడే కొనుగోళ్లకు దిగవద్దనేది నిపుణుల సూచన. రూపాయి.. కొత్త కనిష్టం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజు శుక్రవారం మరో ‘చరిత్రాత్మక’ కనిష్టానికి పడిపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడి 75.20కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి గురువారం తరహాలో నే 75.30ని తాకింది. రూపాయి క్రితం ముగింపు 75.12. ఆరు నెలల కనిష్టానికి విదేశీ మారకపు నిల్వలు... భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో ముగిసిన వారంలో 6 నెలల కనిష్ట స్థాయి 481.89 డాలర్లకు పడిపోయాయి. వారంవారీగా 5.35 బిలియన్ డాలర్లు తగ్గాయి. మార్చి 6తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 487.23 బిలియన్ డాలర్లకు చేరాయి. షార్ట్ సెల్లింగ్... ఒకింత కఠినం! న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులను నివారించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నడుం బిగించింది. మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జరిపే షార్ట్ సెల్లింగ్‌పై పరిమితులను విధించడం ద్వారా ఒడిదుడుకులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. డెరివేటివ్స్ సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్ వైడ్ పొజిషన్ల పరిమితిని సవరించింది. డైనమిక్ ప్రైస్బాండ్లలో సరళీకరణతో సహా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసింది. సోమవారం (ఈ నెల 23) నుంచి నెల రోజుల పాటు ఈ మార్పులు, చేర్పులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సెబీ తాజా నిర్ణయాల కారణంగా ఇంట్రాడేలో షార్టింగ్ చేసే వారిపై ప్రభావం పడుతుం దని నిపుణులంటున్నారు. ఒడిదుడుకులు ఒకింత తగ్గుతాయని వారంటున్నారు. వివరాలు.... ► డెరివేటివ్స్ సెగ్మెంట్లో లేని షేర్లకు క్యాష్ మార్కెట్లో మార్జిన్‌ను 40 శాతం వరకూ పెంచింది. ► ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్(ఎమ్‌డబ్ల్యూపీఎల్) ప్రస్తుతమున్న స్థాయి నుంచి 50 శాతం మేర తగ్గించింది. ► ఏదైనా ఒక షేర్ ఎమ్‌డబ్ల్యూపీఎల్ యుటిలైజేషన్ 95 శాతం మేర మించితే, ఈ షేర్‌పై నిషేధం విధిస్తారు. ► డెరివేటివ్స్ సెగ్మెంట్లోని షేర్లలో డైనమిక్ ప్రైస్ బాండ్లలో మార్పులు, చేర్పులు చేసింది. ► మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ మెంబర్స్(ప్రోప్రయిటరీ), క్లయింట్లు షార్ట్ పొజిషన్లపై పరిమితులు విధించింది. ► ఇండెక్స్ డెరివేటివ్స్ల్లో ఈ సంస్థల షార్ట్ పొజిషన్లు, వాటి నోషనల్ వేల్యూలో మించకుండా ఉండాలి. ► నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ఇలాంటి సాధనాల్లో ఈ సంస్థల హోల్డింగ్స్‌ను మించి ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఈ సంస్థల లాంగ్ పొజిషన్లు ఉండకూడదు. షార్ట్ సెల్లింగ్ అంటే.... షార్ట్ సెల్లరు–భవిష్యత్తులో ధర తగ్గుతుందనే అంచనాలతో తమ వద్ద షేర్లు లేకపోయినా, వాటిని ఇతరులకు విక్రయిస్తారు. దీని కోసం కొంత మార్జిన్‌ను స్టాక్ ఎక్సే్చంజ్‌ల వద్ద ఉంచుతారు. వారి అంచనాలకునుగుణంగానే ధర తగ్గగానే ఆ షేర్లను కొనుగోలు దారులకు డెలివరీ చేస్తారు. ధరల తేడా కారణంగా షార్ట్ సెల్లర్లు లాభపడతారు. దీంట్లో రిస్క్ అధికంగా, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వారి అంచనాలకనుగుణంగానే ధర తగ్గకుండా, పెరిగిపోతే, ఆ మేరకు వారికి భారీగా నష్టాలు వస్తాయి. -
కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!
ప్రపంచమంతా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. ముందు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఉద్దీపన చర్యల గురించి ఆందోళన చెందకుండా ఈ భయంకరమైన అంటువ్యాధిని అరికట్టేందుకు పోరాడటమే ప్రభుత్వాలు చేయగలిగే గొప్ప పని అని ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ అన్నారు. కరోనావైరస్ షాక్‌కు ఉత్తమమైన ఆర్థిక టానిక్ అదే అని ఆయన అభప్రాయడ్డారు. పరిస్థితి అదుపులోనే వుందన్న విశ్వాసాన్ని కంపెనీలకు కలిగించేందుకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు కంటే, ఆయా ప్రభుత్వాలే ఎక్కువ స్పందించి, చర్యలు చేపట్టాలని రాజన్ వెల్లడించారు. ప్రజల ఈ వైరస్‌ను నిరోధించే చర్యల్ని కోరుకుంటున్నారని, ఈ మహమ్మారికి ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వారున్నారని పేర్కొన్నారు. వైరస్‌పై ప్రజల భయాలు, ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక దశాబ్దం క్రితం ఆర్థిక సంక్షోభం వైపు నెట్టివేస్తోందన్నారు. గ్లోబలైజేషన్ ఉత్పత్తి చాలా ఘోరంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే ఒక్క వారంలో ఈక్వీటీ మార్కెట్లు ఉత్థాన పతనాలను నమోదు చేసిందంటూ గుర్తు చేశారు. మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 2.8 శాతంగా వుండనుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఇది 2009 నాటి కంటే బలహీనమైనని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తలు గురువారం హెచ్చరించారు. -
బ్రెగ్జిట్ డీల్.. జోష్!
గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారం కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటామని, మన దేశంలో మదుపు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగిశాయి. స్వల్పంగానైనా, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 71.19కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 39,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 11,586 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ సూచీల్లో ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ‘రికవరీ’ ఆశలు...: ఉద్దీపన చర్యలు, పండుగల డిమాండ్, మంచి వర్షాలు కురియడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం... ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలను పెంచుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఫలితంగా నష్ట భయం భరించైనా సరే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశం పెరిగిందని, కొనుగోళ్లు జోరుగా సాగాయని వివరించారు. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15% లాభంతో రూ.47.4 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, సునీల్ ముంజాల్‌లు ఈ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు ఈ లాభాలకు కారణం. ► బ్రెగ్జిట్ డీల్‌పై అనిశ్చితి తొలగిపోవడంతో టాటా మోటార్స్ షేర్ జోరుగా పెరిగింది. టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ఇంగ్లాండ్‌లోనే ఉండటంతో తాజా బ్రెగ్జిట్ డీల్ ఈ కంపెనీకి ప్రయోజనకరమన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. టాటా మోటార్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. లాభాలు ఎందుకంటే.... ► బ్రెగ్జిట్ డీల్ బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారమైంది. దీంతో యూరోపియన్ యూనియన్‌తో ఉన్న 46 ఏళ్ల అనుబంధానికి బ్రిటన్ వీడ్కోలు పలకనున్నది. సూత్రప్రాయంగా కుదిరిన ఈ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ►సుంకాల పోరుకు స్వస్తి ! సుంకాల పోరుకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దీనికనుగుణంగా సంప్రదింపులు వేగవంతం చేయాలని అమెరికాను చైనా కోరడం సానుకూల ప్రభావం చూపించింది. ►మరిన్ని ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థలో జోష్‌ను పెంచడానికి మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. ► వాహన స్క్రాప్ పాలసీ ముసాయిదా భారత్‌లో వాహన స్క్రాప్ పరిశ్రమను చట్టబద్ధం చే యడంలో భాగంగా రవాణా మంత్రిత్వ శాఖ వాహ న స్క్రాప్ పాలసీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ►జోరుగా విదేశీ కొనుగోళ్లు ఈ నెల తొలి 2 వారాల్లో నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గత 4 ట్రేడింగ్ సెషన్లలో రూ.2,000 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. రూ.1.59 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.59 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.59 లక్షల కోట్లు పెరిగి రూ.147.90 లక్షల కోట్లకు చేరింది. -
మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!
దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది. ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది. ఈ నిర్ణయాలకు స్టాక్ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రధాన నిర్ణయాలు ► కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది. ► 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది. ► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి. ► బేస్ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది. ► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్ ఉండదు. ► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది. ► కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు. ► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే. ► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. -
సెన్సెక్స్ 337 పాయింట్లు అప్
వాహన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఒప్పందం కుదరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్యాకేజీలను ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 71.68 వద్ద ముగియడం... రూపాయి వరుసగా మూడో రోజూ బలపడటం కలసివచ్చింది. ...బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 10,946 పాయింట్ల వద్ద ముగిశాయి. గణేశ్ చవితి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు చొప్పున తగ్గాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ గురువారం అభయం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహన షేర్ల లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మారుతీ సుజుకీ 3.6 శాతం, బజాజ్ ఆటో 2.9 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.1 శాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.09 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,28,104కు పెరిగింది. ► ప్రభాత్ డైరీ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నుంచి ఈ షేర్‌ను డీలిస్ట్ చేయడం కోసం ప్రమోటర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు దీనికి కారణం. 70కి పైగా ఏడాది కనిష్టం... స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినా, దాదాపు 70కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాక్స్ అండ్ కింగ్స్, అలోక్ ఇండస్ట్రీస్, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్, ఆర్‌కామ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు అబాట్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ వంటి పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. -
ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు రూపొందించిన తీరు ప్రశంసనీయం. ఈ ప్రకటనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిక్సర్ కొట్టారు’ అని కిర్లోస్కర్ తెలిపారు. కొద్ది నెలల్లో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది. -
ప్యాకేజీ ఆశలు ఆవిరి
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో విధించిన పన్నును తగ్గించవచ్చని... మందగమన ప్రభావంతో కునారిల్లిన రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తారనే ఆశలతో కొద్దిరోజులుగా పెరుగుతున్న మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా వెల్లడించడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం దీనికి తోడయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 36,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ప్రధానంగా బ్యాంక్, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,473 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే కనిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పతనానికి ప్రధాన కారణాలు.... ప్యాకేజీ ఆశలు హుళక్కి డిమాండ్ తగ్గి కుదేలైన రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగలదన్న ఆశలతో ఇటీవల స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతూ వచ్చాయి. కానీ ప్యాకేజీ ఇవ్వడం అనైతికం అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించడంతో ప్యాకేజీ ఆశలు అడుగంటాయి. దీంతో బ్లూచిప్‌లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. జోష్‌నివ్వని సెబీ నిర్ణయాలు... ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెబీ సరళతరం చేసింది. అయితే సూపర్ రిచ్ సర్ చార్జీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశపరిచింది. బడ్జెట్లో ఈ సర్‌చార్జీ ప్రతిపాదన వెలువడినప్పటినుంచి కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు సెబీ నిర్ణయం ఎలాంటి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఎఫ్‌పీఐలు జూలైలో రూ.17,000 కోట్లు, ఈ నెలలో రూ.10,000 కోట్ల మేర నిధులను వెనక్కి తీసుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు రేట్ల కోత విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆ సంస్థ తాజా మినట్స్ వెల్లడించాయి. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ, జపాన్ నికాయ్ సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కె ట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. రూపాయి... దిగువ పయనం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, స్టాక్ మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు తగ్గి 71.96ను తాకింది. ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. మరోవైపు ముడి చమురు ధరలు 0.65 శాతం మేర పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. సాంకేతిక కారణాలు కీలక మద్దతు స్థాయిలు... 10,906, 10,800, 10,750 పాయింట్లను నిఫ్టీ సూచీ కోల్పోయింది. దీంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ తదుపరి మద్దతు 10,580–19,455 పాయింట్ల వద్ద ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 11,120 పాయింట్లపైన స్థిరపడగలిగితేనే నిఫ్టీ బలం పుంజుకుంటుందని వారంటున్నారు. మరోవైపు నిఫ్టీ 10,782 పాయింట్ల దిగువకు దిగి వచ్చిందని, ఇలియట్ వేవ్ థియరీలో ఐదో లెగ్ పతనాన్ని ఇది నిర్ధారిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. 14 శాతం నష్టంతో రూ.56.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆర్థిక అవకతవకలు జరిగిన సీజీ కన్సూమర్ కంపెనీలో ఈ బ్యాంక్‌కు కూడా వాటా ఉండటంతో ఈ షేర్ పతనమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 27 శాతం నష్టపోయింది. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌సీఎల్ టెక్– ఈ నాలుగు షేర్లు మాత్రమే పెరిగాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇక నిఫ్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 –2 శాతం మేర లాభపడగా, మిగిలిన 44 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ► డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలు తమ రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 13 శాతం నష్టంతో రూ.39.70 వద్ద ముగిసింది. ► రుణ భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోటర్లు్ల చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుండటంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం లాభం తో రూ.76.40 వద్ద ముగిసింది. గత నాలు గు రోజుల్లో ఈ షేర్ 21 శాతం ఎగసింది. ► మార్కెట్ భారీగా పతనమైనా, హిందుస్తాన్ యూని లివర్ (హెచ్‌యూఎల్) ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,879ను తాకింది. నెల కాలంలో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► టాటా మోటార్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా కాఫీ, సెయిల్ వంటి దిగ్గజ షేర్లు ఐదేళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించాయి. వీటితో పాటు మరో 140 షేర్లు ఈ స్థాయికి చేరాయి. డీఎల్ఎఫ్, టాటా స్టీల్, ఐటీసీ, రేమండ్ వంటి 270 షేర్లు రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. మరో 400 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, అవంతి ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐషర్ మోటార్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు డెన్ నెట్వర్క్స్, నెస్లే ఇండియాలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ప్యాకేజీ ఇవ్వడం అనైతికం.. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి పన్ను చెల్లింపుదార్ల సొమ్ములను ఉపయోగించడం అనైతికమని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య ఆర్థిక వ్యవస్థకు శాపం లాంటిదన్నారు. మరోవైపు తక్కువ వడ్డీరేట్లు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత... ఈ రెండూ ప్యాకేజీ కంటే ఉత్తమమైనవని విద్యుత్తు శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలూ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వవచ్చన్న ఆశలను అడియాసలు చేశాయి. మరోవైపు ఈ క్యూ1లో జీడీపీ వృద్ధి మరింతగా తగ్గగలదని (5.5 శాతానికి )గత నెల వరకూ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ పేర్కొనడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. 697 రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ప్యాకేజీ ఆశలు ఆడియాసలు కావడం, రూపాయి క్షీణించడం తదితర కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 669 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 697 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 201 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయింది. దెబ్బతిన్న సెంటిమెంట్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఏడాది కనిష్టానికి పడిపోవడం... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడానికి ఒక కారణమని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జణి పేర్కొన్నారు. డిమాండ్ లేక కుదేలైన రంగాలను ఆదుకునే విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్యాకేజీ ప్రకటనలు రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందని తెలియజేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు ప్యాకేజీ అవసరం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి
న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా పేర్కొన్నారు. ‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. స్టీల్, ఎన్బీఎఫ్సీ, వాహన రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పిన ఆయన వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు... పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్ పిరమల్ వెల్లడించారు. ఎన్బీఎఫ్సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్‌లోన్, ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్ పిరమల్ వెల్లడించారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో మాంద్యం స్టీల్ రంగంపైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు. -
ఆదుకోండి మహాప్రభో!!
న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్ఏడీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు.. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. రుణ లభ్యత పెరిగేలా చూడాలి.. ‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు. పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. -
నష్టాల నుంచి రికవరీ
విదేశీ మార్కెట్ల అండతో రెండు రోజుల భారీ నష్టాలకు బుధవారం చెక్ పడింది. వెరసి మూడు వారాల కనిష్ట స్థాయి నుంచి మార్కెట్లు కోలుకున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, పవర్ రంగాలు 1%పైగా పుంజుకోవడంతో సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడింది. 26,631 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 43 పాయింట్లు పెరిగి 7,975 వద్ద నిలిచింది. చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ వార్తలతో ఆసియా మార్కెట్లు బలపడగా, యూరప్ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. అయితే ఫెడరల్ రిజర్వ్ సమీక్షపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషణ అమెరికా వడ్డీ పెంపు ఆందోళనలతో గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 568 పాయింట్లు కోల్పోయింది. రెండు రోజుల ఫెడ్ సమీక్ష ఫలితాలు దేశీ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి వెలువడనున్నాయి. కాగా, ప్యాకేజీలో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 500 బిలియన్ యువాన్లను ఆ దేశ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు ఐదింటికి అందించనున్నట్లు వార్తలు వెలువడటంతో జపాన్ మినహా ఆసియా మార్కెట్టు 0.5-1% లాభాలతో ముగిశాయి. ఒకటి మినహా...: బీఎస్ఈలో వినియోగ వస్తు రంగం మినహా అన్ని సూచీలూ లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న హీరో మోటో దాదాపు 2% లాభపడింది. దక్షిణాఫ్రికా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ వార్తలతో అపోలో టైర్స్ షేరు 3% పుంజుకోగా, మణప్పురం, జేకే టైర్, నాల్కో, కోల్టేపాటిల్, ఏబీబీ, ఎన్సీసీ, చోళమండలం ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్, అరవింద్ 11-4.5% మధ్య ఎగశాయి. ఎఫ్‌డీఐలకు ఈక్విటీల జారీ నిబంధనలు సరళతరం ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించింది. తద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకుగాను దేశీ కంపెనీలు ఆటోమాటిక్ మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని పరిమితులకు లోబడి సంస్థకు లభించే ఏ విధమైన విదేశీ పెట్టుబడులైనప్పటికీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల జారీకి కంపెనీలను అనుమతించింది. ఇందుకు ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదు. అయితే ఎఫ్‌డీఐ నిబంధనలకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను రంగాలవారీగా పరిమితులు, ధరల మార్గదర్శకాలు, పన్ను చట్టాలు తదితరాలకు లోబడి జారీ చేయాల్సి ఉంటుంది. -
వాహన రంగానికి ప్యాకేజీ ఇవ్వండి
న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోతుండటంతో కుదేలైన వాహన రంగాన్ని ఆదుకోవడానికి ప్యాకేజీ అవసరమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ మంగళవారం పునరుద్ఘాటించారు. వాహన అమ్మకాలు అంతకంతకూ పడిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా అమ్మకాలు తగ్గుతున్నాయని, దీంతో ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఉద్యోగాలివ్వాల్సిన ఈ తరుణంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామని, వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయని వివరించారు. భారీగా పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) పట్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏ రూపంలోనైనా ఎంతో కొంత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తయారీరంగ జీడీపీలో వాహన రంగం వాటా 25 శాతమని, భారీగా ఉద్యోగాలు కల్పిస్తోన్న రంగాల్లో ఇదొకటని పటేల్ చెప్పారు. భారత్‌లో ఆహార భద్రత ఎంత అవసరమో, వాహన రంగ వృద్ధి కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. జూలైలో 7.4 శాతం క్షీణత ఆర్థిక మందగమనం, కన్సూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల గత నెలలో కార్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గాయి. అన్ని కేటగిరిల వాహనాల అమ్మకాలు 14,45,112 నుంచి 2.08 శాతం క్షీణించి 14,15,102కు తగ్గాయి. ఆటో రంగాన్ని ఆదుకోవడానికి ప్యాకేజీ కావాలంటూ ఇంతకు ముందే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కోరింది. 2008 నాటి సంక్షోభ సమయంలో ఇచ్చిన తరహా ప్యాకేజీని ఇవ్వాలని సియాం సూచిస్తోంది. అప్పుడు చిన్న కార్లు, టూవీలర్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది.