
న్యూఢిల్లీ: ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించిన ఐదో ప్యాకేజీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు కచ్చితంగా పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపనతో దేశంలో ఆరోగ్య, విద్యా రంగాల్లో సానుకూల మార్పు వస్తుందని తెలిపారు.
ఆ పాట స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఆత్మ–నిర్భర్ భారత్’ పిలుపును అందిపుచ్చుకుని 211 గాయకులు కలిసి ఆలపించిన కొత్త పాట దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ పాట విషయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చేసిన ట్వీట్‌పై మోదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ పాటను తాను విన్నానని, అందరిలోనూ స్ఫూర్తిని రగిలించేలా ఉందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment