economic package
-
వరద బాధితులకు ప్యాకేజీ
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన అన్ని కుటుంబాలకు రూ.25 వేలు, మిగతా ఫ్లోర్లు మునిగిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లుమునిగిన వారికి రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. ఆయా ఇళ్లలో అద్దెకు ఎవరైనా ఉంటుంటే పరిహౠరం వారికే చెల్లిస్తామన్నారు. కిరాణా షాపులు, చిన్న వ్యాపారులకు రూ.25 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికే ఆర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులు చేయిస్తున్నామన్నారు.వ్యవసాయ రంగానికి పరిహారం ఇలావరి పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున, మొక్కజొన్న, సజ్జలు, మినుము, పెసలు, కందులు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, నువ్వులు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆముదం, జూట్ పంటలకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. తమలపాకు పంటకు హెక్టారుకు రూ.75 వేలు, అరటి, మిరప, పసుపు కంద, జామ, నిమ్మ, మామిడి, జీడిమామిడి, దానిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు కాఫీ, యాపిల్ బేర్ తోటలకు హెక్టారుకు రూ.35 వేలు, కూరగాయలు, బొప్పాయి, టమాటా, పూలు, ఉల్లి, మెలన్స్, నర్సరీ, కొత్తిమీర పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.1,500, మల్బరీ తోటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని వివరించారు. చనిపోయిన ఆవులు, గేదెలకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7,500, కోడిపిల్లకు రూ.100, పశువుల షెడ్లకు రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టాలను ఆయా క్షేత్రాల్లో రైతులు సాగు చేస్తున్నారా లేదా కౌలు రైతులకు సాగు చేస్తున్నారా గుర్తించి వారికే అందజేస్తామన్నారు. వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న నాన్ మోటరైజ్డ్ బోట్లకు రూ.20 వేలు, మోటరైజ్డ్ బోట్లకు రూ.25 వేలు, ఫిష్ ఫామ్స్ (డిసిల్టింగ్, రిస్టోరేషన్, మరమ్మతులు)కు హెక్టారుకు రూ.18 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు.మరమ్మతులకు రుణాలువిజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల పరిధిలో దెబ్బతిన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.50 వేలు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లకు రూ.25 వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఎంఎస్ఎంఈల రుణాలను 24 నెలలపాటు రీషెడ్యూల్ చేయాలని కోరామని, బ్యాంకులు 12 నెలలపాటు రీషెడ్యూల్ చేయడానికి ముందుకొచ్చాయన్నారు. వ్యవసాయ రుణాలను ఐదేళ్లపాటు రీషెడ్యూల్ చేయిస్తామని, 12 నెలలపాటు మారటోరియం విధించాలని ఆదేశించామన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కొత్తగా పంట రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పారు.ఆ భూతాన్ని పూడ్చిపెట్టాలిగత ప్రభుత్వం విపత్తుల నిధులను ఖర్చుచేసి అకౌంట్స్‌లో చూపలేదని, దీంతో ఈ పార్థిక ఏడాది విపత్తుల నిధి నుంచి తొలి విడత రావాల్సిన నిధులు రూ.515 కోట్లు కేంద్రం నుంచి రాలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేసిందని, గత ప్రభుత్వ భూతాన్ని మళ్లీ లేవకుండా శాశ్వతంగా పూడ్చిపెట్టాలని అన్నారు.పంచాయతీరాజ్ నిధులతో పాటు పోలవరం నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు. రూ.10.50 లక్షల కోట్లు అప్పులున్నాయని, రూ.లక్ష కోట్ల బిల్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్రం త్వరగా ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వరద సాయంపై ఇప్పుడే చెప్పలేనన్నారు.అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారంఅమరావతి మునిగిపోతుందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరూ ఇలా మాట్లాడరన్నారు. అలాంటి నాలుకలకు తాళం వేయాలన్నారు. కింద నీళ్లు వస్తాయని, రాజధానిని ఆకాశంలో కట్టుకుంటామా అని ప్రశ్నిచారు. ఏ సిటీ మునగకుండా ఉంటుందో చెప్పాలన్నారు. కర్నూలు, రాజమండ్రి మునిగిపోలేదా.. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మునిగిపోలేదా అని ప్రశ్నించారు. ఆ సిటీలు మునిగిపోయాయని రాజధానులను మార్చేశారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కొంతమంది రెచ్చగొడుతున్నారన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్‌ను తానే కాపాడితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు లాభాలు వస్తుంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు నష్టం వస్తోందో యాజమాన్యంతో పాటు పనిచేసే సిబ్బంది ఆలోచించుకోవాల్సి ఉందన్నారు.త్వరలోనే ‘ఆపరేషన్ బుడమేరు’గత ప్రభుత్వ తప్పుడు పనులు, ఆక్రమణల వల్లే ఇంత వరద వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్నారు. మెడికల్ కాలేజీలపై వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తోందని, వాటిపై జీవో ఏమిచ్చారో ఆ జీవో మెడకు కట్టి ఊరంతా తిప్పుతానన్నారు.ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇలా కేటగిరీ ఇచ్చే పరిహారం» విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే రూ.25 వేలు» ఫస్ట్ ఫ్లోర్, ఆపై అంతస్తులు మునిగితే రూ.10 వేలు»రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే రూ.10 వేలు» విజయవాడలో చిన్న దుకాణాలకు రూ.25 వేలు»రిజిస్టర్డ్ వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు (రూ.40 లక్షల లోపు టర్నోవర్) రూ.50 వేలు»రిజిస్టర్డ్ వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు (రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్) రూ.1 లక్ష»రూ.1.50 కోట్లకు పైగా టర్నోవర్ రూ.1.50 లక్షలు»ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు» దెబ్బతిన్న ఆటోలు వంటి 3 చక్రాల వాహనాలు రూ.10 వేలు» విజయవాడలో తోపుడు బళ్లు మునిగితే.. కొత్త తోపుడు బళ్లు అందజేత» ముంపునకు గురైన చేనేత, చేతివృత్తుల వారికి రూ.25 వేలు -
పర్యాటక రంగం పరుగు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్‌లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఒక జాతీయ చానెల్‌కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్‌లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అవుట్‌లుక్ ను ఫిచ్ గతవారమే స్టేబుల్ (స్థిర) నుంచి నెగటివ్ (ప్రతికూల) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. ‘భారత్ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి. మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్‌పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంచనాల కన్నా తక్కువే వృద్ధి.. స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్మాకర్ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు. -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
జీడీపీ వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది
ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. 5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు’
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ సమాఖ్య స్ఫూర్తిని మరిచి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. 22 ప్రతిపక్షపార్టీలు పాల్గొన్న సమావేశంలో సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ లాక్డౌన్ ఎత్తివేతపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. వలసకార్మికుల పట్ల ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించిందన్నారు. అట్టడుగున ఉన్న 13 కోట్లమంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ఉపశమనం లభించలేదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 12న ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ హాస్యాస్పదంగా మారిందన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు రైళ్లు, బస్సులు నడపడంతో పాటు పేదల ఖాతాల్లో డబ్బు జమచేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. -
కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. అలాగే నైపుణ్యతలేని కార్మికుల పట్ల ఎలా అనుసరించాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్దిష్ట మార్గాన్ని పరిశీలించాలనీ ఆమె సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి అనుసరించే విధానాలు అందరికీ ఆమోదనీయం కావాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఆ సంస్థ సభ్యులతో మాట్లాడారు. ఈ మేరకు సీఐఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... పరిశ్రమలపట్ల ప్రభుత్వానికి పూర్తిస్థాయి విశ్వాసం ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్–19కు ముందుసైతం గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు చేయూతను అందించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. రుణ లభ్యతకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయం, మౌలిక రంగం వృద్ధికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. -
ప్యాకేజీ 3.0 అంచనాలతో లాభాలు
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, హెచ్డీఎఫ్సీ జోడీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల దన్నుతో మన స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. ఆర్థిక ప్యాకేజీ 3.0పై ఆశలు చిగురించడం సానుకూల ప్రభావం చూపించింది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేసినప్పటికీ, కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనమైనా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెన్సెక్స్ 622 పాయింట్లు లాభంతో 30,819 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 187 పాయింట్లు ఎగసి 9,067 పాయింట్ల వద్ద ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల హోరు.... సెన్సెక్స్ నష్టాల్లో మొదలైనా, ఆ తర్వాత వెంటనే లాభాల్లోకి వచ్చింది. చివరి గంటన్నర వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైంది. ఆ తర్వాత లాభాలు జోరుగా పెరిగాయి. చివర్లో వాహన, బ్యాంక్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆరంభంలో 38 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత 682 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 720 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు 1% లాభాల్లో ముగిశాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 6 శాతం లాభంతో రూ.406 వద్ద ముగిసింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. భారతీ ఎయిర్టెల్, అరబిందో ఫార్మా, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నా యి. ‘రిలయన్స్ ఆర్ఈ’ తొలిరోజే 40% అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్–రైట్స్ ఎన్టైటిల్మెంట్(ఆర్ఐఎల్–ఆర్ఈ) డీమెటీరియలైజ్డ్ ట్రేడింగ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. రిల3యన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూ బుధవారం మొదలైంది. రైట్స్ ఇష్యూకు అర్హులైన వాటాదారులకు రైట్స్ ఎన్టైటిల్మెంట్లను(ఆర్ఈ) రిలయన్స్ కంపెనీ డీమెటీరియల్ రూపంలో జారీ చేసింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ఈ ఆర్ఐఎల్–ఆర్‌ఈల ట్రేడింగ్ బుధవారమే ఆరంభమైంది. ఇలా ఆర్‌ఈలను డీమ్యాట్ రూపంలో జారీ చేయడం, అవి స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడ్ కావడం తొలిసారి. రూ.158 నుంచి రూ.212కు... రిలయన్స్ ఈ నెల 19న రూ.1,409 వద్ద ముగిసింది. రైట్స్ ఇష్యూ ధర రూ.1,257 ఈ రెండిటి మధ్య వ్యత్యాసం... రైట్స్ ఎన్టైటిల్మెంట్ ధరగా (రూ.152) నిర్ణయమైంది. ఎన్ఎస్ఈలో బుధవారం ఆర్ఐఎల్–ఆర్‌ఈల ట్రేడింగ్ రూ.158 వద్ద మొదలైంది. నిర్ణయ ధరతో పోల్చితే ఆర్ఐఎల్–ఆర్ఈ 40% లాభంతో రూ.212 వద్ద ముగిసింది.ఆర్ఈ ట్రేడింగ్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ ఉండదు. -
మనది 20.. అమెరికా 200!!
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది 10 శాతం. ఈ 20 లక్షల కోట్లలో నిజానికి రూ.9.94 లక్షల కోట్ల ఉద్దీపనను ఇప్పటికే రకరకాలుగా అందజేసినట్లు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిప్పుడు రూ.1.7 లక్షల కోట్లు జత చేశామన్నారు. ఇదికాక మార్చి 27 నుంచి ఆర్బీఐ రూ.8.02 లక్షల కోట్ల విలువైన వివిధ ద్రవ్య చర్యలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.12.95 లక్షల కోట్లు ఆహార భద్రతకు, కూలీల నగదు పంపిణీకి (మనిషికి రూ.500 చొప్పున), గ్రామీణ ఉపాధి పథకానికి, సూక్ష్మ, మధ్యస్థ కంపెనీలకు రుణాలివ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారామె. ఈ ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మిగతా దేశాలు ఏం చేశాయో ఒక్కసారి చూద్దాం... చైనా... రూ.100 లక్షల కోట్లు ► ఉద్దీపన చర్యల నిమిత్తం జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీన్లో రూ.12 లక్షల కోట్లమేర చర్యలను ఇప్పటికే అమలు చేసింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్ బాండ్లను కొనుగోలు చేసింది. ► రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. ఇంకా రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ–డిస్కౌంట్ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది. ► పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. (డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు) జపాన్... రూ.80 లక్షల కోట్లు ► జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80లక్షల కోట్లు. కాకపోతే దీన్లో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగిస్తోంది. ► చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువసార్లు జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంది. జర్మనీ.. రూ.30 లక్షల కోట్లు ► కరోనా మహమ్మారిపై పోరాడటానికి జర్మనీ తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. మన కరెన్సీలో ఇది రూ.30 లక్షల కోట్లు. దీన్లో సగం మొత్తాన్ని స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగిస్తోంది. ► వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా (మన కరెన్సీలో 86.25 లక్షల కోట్లు) ప్రభుత్వ గ్యారంటీలను వినియోగిస్తోంది. ► ఇక అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు దీనికి అదనం. రుణాల చెల్లింపులకు కూడా జూన్ 30 వరకూ మూడు నెలల మారటోరియం ఇచ్చింది. అమెరికా.. రూ.207 లక్షల కోట్లు పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.37.5 లక్షల కోట్లు. పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే... కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి అవి తమ ఉద్యోగులకిచ్చే జీతాల్లో 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ 30 మధ్య ఏ సమయంలోనైనా ఈ 8 వారాల జీతం కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా వైరస్ ప్రభావం నుంచి ఉపశమనం పొందటానికి, జనానికి సాయం చేయడానికి. ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో 150 లక్షల కోట్లు) ప్యాకేజీని ఆమోదించింది. ► ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది. ► ఇదికాక ఫెడరల్ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5%తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే. -
వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం
మన వలస కార్మికుల దుస్థితి యావత్ ప్రపంచానికీ తెలిసిపోయింది. ఇది అంతర్జాతీయంగా మన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బా వాయించుకుంటూ, తాను సాధిం చని విజయాల గురించి డప్పుకొట్టుకుంటూ ఉండటం మాత్రం ఆపలేదు. ఇటీవలే ప్రధాని ప్రకటించి, కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం ఒక వట్టి భ్రమగా మిగలడమే కాకుండా పేదల గాయాలపై మరింతగా పుండు రాసేలా ఉంది. ఇది తప్పుడు ప్యాకేజీ మాత్రమే కాదు.. వంచనాత్మకమైన పథకం కూడా. కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత దయారాహిత్యంతో కనిపిం చారంటే ఉద్దీపనపై తొలి ప్రెస్ సమావేశంలో వలస కార్మికుల పేరెత్తడానికి కూడా ఆమెకు మనసొప్పలేదు. ఇక రెండో సమావేశంలో వారికి కాస్త బిచ్చం విసిరేశారు కానీ, రోడ్డు ప్రమాదాల్లో, రైలు పట్టాలపై వారి విషాద మరణాలకు కనీస సంతాపం ప్రకటించలేదు. తమకు అందుబాటులో ఉన్న ప్రతి రవాణా సాధనాన్ని పట్టుకుని ప్రయాణిస్తూ, అదీ సాధ్యం కానప్పుడు కాలినడకనే వందల మైళ్ల దూరం రహదారులపై నడుస్తూ వలస కార్మికులు పడుతున్న పాట్లను దేశవిభజన తర్వాత ఇంతవరకు దేశం ఎన్నడూ చూసి ఉండలేదు. వారి బాధలు చూస్తే హృదయాలు బద్దలవుతున్నాయి. వారి కడగండ్లు ఎంతమాత్రం జాతికి ఆమోదనీయం కాదు. వలస కార్మికుల పట్ల జరుగుతూన్న ఈ గందరగోళానికి భారత ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. కనీస ప్లాన్ కూడా లేకుండానే మార్చి 24న ఉన్నట్లుండి లాక్డౌన్ ప్రకటించడం కేంద్రం చేసిన మొదటి తప్పు. వైరస్ వ్యాప్తి చెందకుండా, వలస కార్మికులు ఎక్కడివారక్కడే బస చేసేలా కేంద్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉండె. సంవత్సరానికి ఒకసారి సీజన్లో స్వస్థలాలకు వెళ్లే కూలీలకు మాత్రమే మినహాయింపునిచ్చి మిగిలిన అందరినీ ఉన్నచోటే ఉంచి సౌకర్యాలు అందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఉన్నఫళాన లాక్డౌన్ ప్రకటించినప్పుడు వలస కార్మికులకు అంతవరకు పనిపాటలు కల్పించిన ఆరుకోట్ల సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడతాయన్న ఎరుక కూడా కేంద్రానికి లేకుండా పోయింది. ఇవి కార్మికులకు, కూలీలకు పూర్తి వేతనం ఇవ్వలేవని గ్రహించకుండా హుకుం జారీ చేసినంత మాత్రాన పని జరగదని కేంద్రం గుర్తించాల్సి ఉండె. చివరకు తన నిర్ణయంలో తప్పును గ్రహించాక ప్రభుత్వం ఇక తప్పదని పూర్తివేతనంపై తన హుకుంను వెనక్కి తీసుకోవలసి వచ్చింది. వలస కార్మికులందరూ ఉన్నట్లుండి తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోలేదు. ఇన్నాళ్లూ తాము దాచుకుని ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిన తర్వాత, ఇక అధికారుల నుంచి తమకు ఎలాంటి సహాయం లభించదని, ఆకలితో చావడం తప్ప తమకు ఏ మార్గమూ లేదని గ్రహించిన తర్వాతే వారు సొంత ఊరి బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు శక్తిమేరకు సహాయం చేశాయి కానీ అది ఏమాత్రం సరిపోలేదు. వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రాలకు నిధులు, ఆహారధాన్యాలు పంపించడం కేంద్ర ప్రభుత్వ తొలి నిర్ణయంగా ఉండాలి. మార్చి నెలలో తదుపరి మాసాల్లో వలసకూలీల వేతనం పూర్తిగా వారికి అందేలా కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉండె. వారికి అవసరమైన రేషన్ సరుకులు, వైద్య సహాయం కూడా కేంద్రం కల్పించాల్సి ఉండె. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క అంశం పట్ల బాధ్యత పడలేదు. వలస కార్మికులను గాలికి వదిలేసింది. దీంతో వేలాది కార్మికులకు కాలినడకన ఊళ్ల బాట పట్టడం తప్ప మరోదారి లేకుండాపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు ఫక్తు రాజకీయ వ్యూహం పన్నుతూ మొత్తం తప్పును రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేయడానికి చూస్తున్నాయి. ఉద్దీపన ప్యాకేజీని మొదట్లో రూ. 20 లక్షలకోట్లుగా ప్రకటించి తర్వాత రూ. 21 లక్షల కోట్లకు పెంచి చూపారు. కానీ ఇంత భారీ ప్యాకేజీలో వలస కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించే అంశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వలసకూలీల సమస్య పరిష్కార మార్గాలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తలచి భావసారూప్యత కలిగిన కొద్దిమంది మిత్రులతో చర్చించాను. భారత ప్రభుత్వం ఇప్పుడైనా పారామిలటరీ బలగాలను రప్పించి వలస కార్మికుల తరలింపు బాధ్యతను అప్పగించి ఉంటే బాగుండేదని మేమంతా నిర్ధారణకు వచ్చాం. సైన్యాన్ని దింపి ఉంటే తక్షణం కొన్ని ప్రయోజనాలు నెరవేరేవి. అవేమిటంటే. సాయుధ బలగాలపై మన ప్రజలకు అపార విశ్వాసం ఉంది కనుక కూలీల తరలింపు క్రమశిక్షణతో జరిగేది. పైగా తనకున్న వనరులు, పౌర ప్రభుత్వాల వనరుల సహాయంతో సైన్యం.. రైళ్లతో సహా అన్ని రకాల రవాణా సాధనాలను కూలీల తరలింపునకు ఉపయోగిం చేది. కార్మికులకు తగిన ఆహారం, నీరు, వైద్య సహాయాన్ని సైన్యం క్రమబద్ధీకరించేది. వలస కూలీలను వీలైంత తక్కువ సమయంలో ఊళ్లకు చేర్చేది. నా ఉద్దేశంలో మన సైనిక బలగాలు ఈ మొత్తం కార్యక్రమాన్ని 48 గంటల్లోపే విజయవంతంగా పూర్తి చేసేవి. కోవిడ్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బంది, తదితరుల గౌరవార్థం పూలు చల్లడానికి సైనిక బలగాలను ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన సరైందే. కానీ వలస కూలీల సంక్షోభం విషయంలో కూడా సాయపడాల్సిందిగా కేంద్రం సైన్యాన్ని కోరి ఉండాల్సింది. కానీ నేనిక్కడ విచారంతోనే ఒక విషయాన్ని చెబుతున్నాను. గతంలో సంభవించిన అనేక సంక్షోభాలను భారత పాలనా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుత సంక్షోభంలో అది విఫలమైందంటే, రాజకీయ మార్గదర్శకత్వ లేమి మాత్రమే దీనికి కారణం. అందుకే వలసకూలీల తరలింపులో సైన్యం సహాయం తీసుకోవలసిందిగా అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాను. కొంతమంది మిత్రులతో, రాజకీయ పార్టీల సహచరులతో కలిసి మే 18న ఉదయం 11 గంటల నుంచి రాత్రివరకు రాజ్ ఘాట్ వద్ద ధర్నాలు చేశాము. కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొన్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేకపోగా 11 గంటల తర్వాత మమ్మల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయి తర్వాత వదిలేశారు. ధర్నా అలా ముగిసింది కానీ సమస్య అలాగే ఉండిపోయింది. నా భయం ఏమిటంటే ఓపిక నశించిన జనం ఆగ్రహావేశాలతో ఎలా స్పందిస్తారన్నదే. కార్మికుల్లో అశాంతిని ఇప్పటికే మనం చూశాం. ఇప్పటికైనా మన సమాజం మేలుకొని వలస కూలీల సమస్యను తక్షణం పరిష్కరించడానికి సైన్యం సహాయం తీసుకోవలసిందిగా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోతే, పరిస్థితి చేయిదాటిపోతుంది. అదే జరిగితే మనలో ఓ ఒక్కరం కూడా ఇళ్లలో సురక్షితంగా ఉండలేం. అందుకే ఇప్పటికైనా బయటకొచ్చి ఈ అంశంపై గళమెత్తాల్సిందిగా ప్రాధేయపడుతున్నాను. వ్యాసకర్త: యశ్వంత్ సిన్హా, బీజేపీ మాజీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక, రక్షణ మంత్రి -
ఉద్దీపనల్లో ఊకదంపుడే అధికం
పేదవాళ్లు పేదవాళ్లుగా ఉండటం వల్లే గొప్పవాళ్లు గొప్పవాళ్లుగా ఉన్నారు, అవును ప్రభూ! ఎప్పుడు నీవు సుఖంగా ఉండటం చూశాం గనక! – మత్తయి సువార్త ‘‘కరోనా వల్ల మేం చావొచ్చు, చావకపోవచ్చు నేమో కానీ తాళలేని ఆకలితో చావడం మాత్రం ఖాయం’’ – కమలేష్ కుమార్, లూథియానా మంచో, చెడో.. ఒక్కో పరిణామం ఒక్కో సదవకాశం కల్పిస్తుంది. అలాంటిదే కరోనా వైరస్. దాని నిర్మూలన సంగతేమో కానీ, దాని చాటున అంతకుముందు దేశ ఆర్థిక రంగంలో కొందరు పాలకులు బాహాటంగా చేయలేని నిర్ణయాలను ప్రకృతి వైరస్ రూపంలో కల్పిం చిన అవకాశం చాటున జయప్రదంగా అమలు చేయడానికి సాహసి స్తారు. అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహరచన చేశారు. ఆ వ్యూహం దేశ ఆర్థికరంగంపై ఎక్కుపెట్టిన పెద్ద పాశుపతాస్త్రం! దాని ముద్దుపేరు ఆర్థికరంగ పునరుద్ధరణ కోసం తలపెట్టిన మహా ‘ఉద్దీపన’ పథకం. వాస్తవానికి ఇలాంటి నర్మగర్భ ఉద్దీపనకు అమెరికా ఉద్దీపనలతో ఉపదేశాలతో నడుస్తున్న ప్రపంచ బ్యాంకు సంస్కరణ లను ఎలాంటి షరతులు లేకుండానే ఆమోదించి పాతికేళ్లనాడే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు పాలకులుగా ఆమోదం తెలిపారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ నాయకులూ తలలూపినవాళ్లే. బీజేపీ వాజ్‌పేయి ప్రధా నిగా అధికారం చేపట్టినా వరల్డ్ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణలు అమలు జరపడంలో వెనుకంజ వేయనేలేదు. ఆ తరువాతి కాలంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ (ఆరెస్సెస్) నరేంద్రమోదీ ప్రభుత్వమూ ఆ ప్రజా వ్యతిరేక ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను తిర స్కరించి దేశవాళీ స్వతంత్ర ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి గజ్జె కట్టిందీలేదు. ‘దేశవాళీ’ అంటే ‘కంగాళీ’ కాదు. కరోనా కల్పించిన అవకాశాన్ని చాటు చేసుకునైనా ఆర్థికరంగ ఉద్దీపన కోసం లేదా ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాల దృష్ట్యానైనా భారీ ఎత్తున స్థిరపడి ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను, వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. కానీ, ఆ రంగాన్ని కాస్తా కరోనా ముసుగులో చాపచుట్టి ఆదినుంచీ బీజేపీ ఏ లక్ష్యాన్ని నెరవేర్చజూస్తోందో.. ఆ ప్రైవేట్ రంగ గుత్తేదారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసి, దేశంలో స్థిర పరిచేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగా స్వావలంబన లేదా స్వయంప్రకాశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పేరిట, కరోనా దాడికి గురైన దేశ ప్రజాబాహుళ్యాన్ని ఆ దాడినుంచి బయటపడేయడానికి రూ. 20 లక్షల కోట్లతో బాధిత భారతదేశానికి ఒక ఉద్దీపన పథకం ప్రవేశపెట్టారు. ఇది దేశ జాతీయో త్పత్తుల విలువలో పది శాతం అని చెప్పారు. కానీ ఆచరణలో దీని విలువ, అంటే కరోనా దెబ్బవల్ల చితికిపోయిన రంగాలకు కేంద్రం అందించే ఉద్దీపన బంగీ పథకం విలువ దేశం మొత్తం జాతీయో త్పత్తుల విలువలో కేవలం ఒక్క శాతం (1%)పైన మాత్రమేనని ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులూ ప్రకటించారని మరిచిపోరాదు. అలాగే స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే తమ ధ్యేయమని చెబుతూనే మోదీ చాపకింద నీరులా ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో, ఇంతవరకు ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా (లోపాలమధ్యనే) ఉన్న ప్రభుత్వ రంగాన్ని తొలగింపజేసి దేశ విదేశీ గుత్తపెట్టుబడిదారుల దోపిడీకి ఆహ్వానం పలికే ఉద్దీపన కార్యక్రమం ఇది. అలా కాకుంటే కరోనాకు ముందు తన అమెరికా యూరప్ దేశాల పర్యటనల్లో ‘విదేశీ పెట్టుబడి వర్గాలు వాస్కోడిగామాలై ఇండియాకు తరలిరండి’ అని మోదీ ప్రకటించి ఉండేవారు కాదు. దేశీయంగా చూస్తే స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇంతకాలం ప్రధానంగా వెన్నెముకగా నిలబడుతూ వచ్చిన (అనేక ఆటంకాల మధ్యనే) ప్రభుత్వరంగ వ్యవస్థకు ఎసరు పెడుతున్నారు. దేశంలోని అన్ని కీలక రంగాలను, వ్యవసాయం, విమానయానం, ఎయిర్‌క్రాఫ్ట్ మరమ్మతుల పరిశ్రమ, రక్షణ శాఖ విమానాలు, అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో, సామాజికంగా అవసరమైన కీలక మౌలిక వనరులూ, ప్రైవేట్ రంగంలోని కంపెనీలకు నిధుల పెంపు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విమానాశ్రయాలు వేలంవేసి ప్రైవేట్ రంగానికి అప్పగించడం, రక్షణశాఖ ఉత్పత్తులు, అంతరిక్ష కార్యక్ర మాల్లో స్వేచ్ఛగా పాల్గొని ప్రయోగాలు చేసే ప్రైవేట్ సంస్థలకు ఈ ‘ఉద్దీపన’ అంతర్భాగం. నిన్నటి ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇండి యాకు వచ్చి సరుకుల ఉత్పత్తికి తోడ్పడమని విదేశీ గుత్త వర్గాలను ఆహ్వానించిన మోదీ– ఇప్పుడు స్వదేశీ, విదేశీ గుత్తేదార్లు ఇద్దరి దోపిడీకి ఉపయోగించే ‘ఉద్దీపన’ కార్యక్రమానికి తెరలేపారు. బహుశా స్వాతంత్య్ర సమరయోధులు, ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు గాంధీజీ, బటుకేశ్వరదత్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్‌లు, లోక మాన్య తిలక్ ఆశించిన స్వావలంబన, పాలనా విధానాలు, పద్ధతులూ అందుకు పూర్తిగా విరుద్ధం. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా స్వదేశీ, విదేశీ పెట్టుబడి వర్గాలు ప్రజలను పీడించే అవకాశం ఉంది’ అన్నాడు భగత్‌సింగ్. కాగా, దేశీ సరుకులు విరివిగా ప్రచారంలోకి వచ్చి వ్యాపారాలు, అమ్మ కాలు, కొనుగోళ్లూ పెరగాలనీ సరుకులకు గిరాకీ, గొలుసుకట్టుగా నిరంతరం అందించాల్సిన సరకుల ఉత్పత్తి రంగాలు పెరగాలని, సరుకుల కోసం ప్రజలనుంచి డిమాండ్ పెరగాలనీ మోదీ కోరుకు న్నారు. కానీ, ప్రజలలో సరుకుల కోసం డిమాండ్ పెరగడానికి వారి చేతిలో పైసలు ఆడాలిగదా? పేద ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరి గితే గదా సరుకు అమ్ముడుపోయేది? ఆ శక్తి పెరగాలంటే ఆ శక్తిని అడ్డుకునే దోపిడీ వ్యవస్థ తొలగాలి గదా. ఎందుకంటే కోరికలు పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాలందరికీ ఉంటాయి. కానీ, వాటిని నెరవేర్చుకునే శక్తి కేవలం సరుకుల ఉత్పత్తి లేదా వాటి అధికోత్పత్తి పెరిగితేనే చాలదు. ఇది నిజం కాకపోతే– కరోనా బారినపడిన ప్రజల్లో నేడు అత్యధికులు భారీ సంఖ్యలో ఉపాధి కోల్పోయినవారే. పరాయి పంచల్లో కూలి కోసం, కూటి కోసం అంగలారుస్తూ సొంత ఊళ్లకు కూడా తిరిగి వెళ్లలేక భార్యాపిల్లలతో వందలు, వేల కిలో మీటర్ల లెక్కన పశువులకు వాడాల్సిన కాడీ, మేడిని తాము మోస్తూ, గర్భవతులైన భార్యలను, నడవలేని చిన్నారులను ఎక్కించుకుని దూర తీరాలకు చేరుకునే తహతహలో ఆరాటపడుతున్న వలస కార్మికులు, శ్రమజీవుల సంఖ్య వందలు, వేలూ కాదు అక్షరాలా 14 కోట్లు అని మరచిపోరాదు. వలస శ్రామికుల దుర్భర జీవితాన్ని కళ్లారా చూస్తూ కూడా కొందరు పాలకులు కొన్ని రాష్ట్రాల్లో చిన్న, మధ్యరకం పరి శ్రమల్లో దినసరి పనిగంటలను 8 నుంచి 12 గంటల దాకా 4 గంటలు అదనంగా పెంచేశారు. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి ఎన్ని కిస్తీలలో ‘కిందెట్టి, మీదెట్టి’ ఉద్దీపన పద్దుల్ని తిరగేసి, మరగేసి చూపినా ఆ రూ. 20 లక్షల ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు దక్కాల్సిన రూ. 5 లక్షల కోట్లు కూడా దక్కకపోవడం మరీ విడ్డూరం. చివరికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కూడా వారి యాదికి రాలేదు. ఎందుకు రాలేదో అర్థం చేసుకోవాలంటే మనం తెలుగువారి పేద బతుకుల గురించి రాసిన సుప్రసిద్ధ ఆత్మీయ కథకుడు, రైతు నేస్తం రామారావు ప్రతీకాత్మక చిత్రణ ‘ముత్యాల బేరం’ కథను ఆశ్రయిం చాల్సిందే. పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని పెట్టుబడి వర్గాలు లాభనష్టాల తక్కెడలో పెట్టి, ఆ పూర్వ రంగంలో పేద, మధ్యతరగతి వర్గాలను, శ్రామికుల్ని, కష్టజీవుల జీవితాల్ని ఎలా తెలివిగా శాసిస్తారో అందులో చెప్పులుకుట్టే వెంకడి పాత్ర ద్వారా తేటతెల్లం చేశాడు: ‘చెప్పులు కుడుతున్న వెంకడి దగ్గరికి ఒక ముత్యాల వర్తకుడు మధ్యలో తగిలి తన ముత్యాల కోవలు చూపి కొనుక్కోమ న్నాడు. ముద్దకే కరువైన వెంకడు ముత్యాలు ఏం చేసుకుంటాడు? వాటిపైన వెంకడు ఆసక్తి చూపకపోయేసరికి ముత్యాల వ్యాపారి ‘భలేవాడివయ్యా, ఈ ముత్యాలు సముద్రంలోంచి తీసినవయ్యా’ అని వెంకడిని ఉడికించడానికి ప్రయత్నిస్తాడు. అయినా వెంకడు ‘సము ద్రపు ముత్యాలే కావొచ్చు గాక, నాకు వాటి అవసరం లేదు’ అంటాడు. అప్పటికీ సరిపెట్టుకోని వ్యాపారి ‘ముత్యాల కోసం వెతకాలంటే ప్రాణాలు కూడా పోతాయి తెలుసా’ అంటాడు. అందుకు వెంకడు ‘ప్రాణం పోతే మరి నీ పెళ్లాం, పిల్లల గతేంటి’ అని ప్రశ్నిస్తాడు. అందుకు వ్యాపారి ‘ఆ ఏముందిలెద్దూ, కాసిని కన్నీళ్లు కారుస్తారు లెద్దూ’ అంటూ ముత్యాల సంచి భుజాన పెట్టుకుని బయలుదేర బోతాడు. నీకు పెళ్లాం బిడ్డలమీద శ్రద్ధ లేనప్పుడు ఆ ముత్యాలు నాకిచ్చిపోరాదూ’ అంటాడు వెంకడు. ఇంతలో వ్యాపారి ‘ ఏం కథ, నీ మనసు ఇంతలోనే ముత్యాలపై మళ్లిందేమిటి?’ అంటాడు. అప్పుడు వెంకడు అంటించాడు చురకత్తి లాంటి చురక. ‘నీవు తెచ్చినవి ముత్యాల కోవలన్నావే కానీ కన్నీటి కోవలు అనలేదు గదా’ అని. ఆ వ్యాపారి ఓ నవ్వు నవ్వి ‘ఓరి వెర్రివాడా’ అనుకుంటూ వెళ్లిపోయాడు. ఇంతకూ ఈ కథలో నీతి ఏమిటి అంటే.. వ్యాపారికి ముత్యాలు ఒక సరుకు, చెప్పులు కుట్టుకుని బతికే వెంకడికి ముత్యాలు జీవితా వసరం కాదు, తన బతుక్కి అది పరాయి సరుకు. పేదవాడికి కోరిక లుంటాయి. కానీ అవి సరుకుకి పెట్టుబడి నిర్ణయించే ధరనుబట్టి నెరవేరవు. ఈ ‘ట్రిక్కుల’ ద్వారానే పెట్టుబడి పెట్టే ఉత్పత్తిదారు సరుకు సరఫరాకి, ఆ సరుకుపైన లేనివాడికున్న నెరవేరని కోరికకూ (డిమాండ్‌కూ) ముడిపెట్టి పేదవాడి కోరికను అణగదొక్కడమే పెట్టుబడిదారీ సమాజపు లక్షణం. ఈ పరమ వైరుధ్యానికి పక్కా నిదర్శనమే– తాజా మోదీ, నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర భారత్ ఉద్దీపన సారాంశం! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అక్కరకు రాని ప్యాకేజీలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఏమేం వుంటాయో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా అయిదు రోజులపాటు అందరికీ తేటతెల్లం చేశారు. భారీ మొత్తం అని ప్రధాని చెప్పారుగనుక... జీడీపీలో పది శాతం అన్నారు గనుక ఈ ఉద్దీపనల పరంపరపై ఆశలు కూడా అదే స్థాయిలో భారీగా వున్నాయి. చివరాఖరికి ఇవి ఎవరినీ సంతృప్తిపరచకపోగా... ఈ వంకన ప్రైవేటీకరణకు, ఇతరత్రా సంస్కరణ లకు కేంద్రం పావులు కదుపుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. దీర్ఘకాల ప్రయోజనా లను దృష్టిలో వుంచుకుని ఈ ఉద్దీపనలను రూపొందించామని మంత్రి చెబుతున్నారు. కానీ లాక్డౌన్ పర్యవసానంగా పూట గడవడం కూడా కష్టమైన జనాభాకు తక్షణం చేసేదేమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. కనీసం అంతంతమాత్రంగా వున్న జీడీపీని మందకొడిగా కదిలించడానికైనా ఈ ఉద్దీపనల పరంపర దోహదపడుతుందా అన్నది అనుమానమే. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌ను మోదీ ప్రకటించిన నాటికే కేంద్రం, ఆర్బీఐ రూ. 9 లక్షల 94 వేల 403 కోట్ల విలువైన ఉద్దీపనలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన అయిదు ఉద్దీపనల విలువ రూ. 11 లక్షల 2 వేల 650 కోట్లు. ఈ రెండింటి విలువా లెక్కేస్తే అది రూ. 20 లక్షల 97 వేల 53 కోట్లు. సారాంశంలో ప్రధాని ముందుగా చెప్పిన రూ. 20 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు లక్ష కోట్లు అదనం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో తాను చాలా ఉదారంగా వున్నానన్న అభిప్రాయం కేంద్రంలో దండిగా వున్నట్టే కనబడుతోంది. ఆ అభి ప్రాయం సామాన్యుల్లో కలగజేయడానికి కూడా ప్రయత్నించివుంటే బాగుండేది. ప్రకటించినదాన్లో వాస్తవంగా నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ అందేది ఎంతన్నదే కీలకం. ఈ ఉద్దీపనల పర్యవసానంగా బడ్జెట్‌పై ఎంత శాతం భారం పడుతుందన్న ప్రశ్నకు మంత్రి జవాబివ్వ లేదు. ఆ మాట చెప్తే కరోనా వల్ల కేంద్రం అదనంగా మోస్తున్న భారమెంతో తెలిసేది. అది రూ. 2.02 లక్షల కోట్లని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటే... లక్షన్నర కోట్లు దాటదని మరికొందరి నిపు ణుల అభిప్రాయం. మొత్తానికి జీడీపీలో ఒక శాతం దాటదని వారు లెక్కలు కడుతున్నారు. మరి కేంద్రం చేసిందేమిటి? మొదటిరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సంబంధించింది. వాటికి బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పడంతోపాటు అందుకు ఎలాంటి హామీ చూపనవసరం లేదన్నారు. కానీ కేంద్రంలో ఆ పరిశ్రమలకు సంబంధించిన శాఖను చూస్తున్న నితిన్ గడ్కారీ చెబు తున్న లెక్క ప్రకారం ఆ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విలువే రూ. 5 లక్షల కోట్లు! కనుకనే ‘మాపై అంత ఔదార్యం చూపాల్సిన అవసరం లేదు... మాకు రావాల్సిన బకాయిలేవో తీర్చండి చాల’ని ఎంఎస్ఎంఈలు మొత్తుకుంటు న్నాయి. లాక్‌డౌన్‌కు ముందే అవి నానా అగచాట్లూ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ అయిదు ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణ లకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజారోగ్యానికి ఈ ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటా యించదల్చుకున్నదో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకూ దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదల్చు కున్నది లేదు. వలసజీవులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని, గ్రామీణ ఉపాధికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం బాగానేవుంది. కానీ వలసజీవుల్లో అత్యధికులు ఇప్పుడు నడిరోడ్లపై, రైలుపట్టాలపై వున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరాల్లో వున్న స్వస్థలాలకు రాత్రనక, పగలనక నడిచిపోతున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తు న్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితరచోట్ల మమ్మల్ని పోనీయమంటూ బయటికొచ్చిన వారిని చావగొడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపనల్లోని చర్యలు ఏమేరకు దోహదపడతాయో కేంద్రం ఆలోచించిందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలసకూలీల కష్టాలను చూసి చలించి ఆదరించి అన్నం పెడుతోంది. వారికి చెప్పుల జతతో సహా అన్నీ అందించి, రైళ్లు, బస్సుల్లో ఉచి తంగా వారి వారి స్వస్థలాలకు పంపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చొరవ చూపాల్సిన అవసరం వుందని గుర్తించి, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టాలు మొదలైనప్పటినుంచీ దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆదాయం పడిపోయి, ఖర్చు అమాంతంగా పెరిగి అప్పు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. తెచ్చుకునే రుణాలు జీడీపీలో 3 శాతం మించి వుండకూడదన్న నిబంధన మార్చాలంటున్నాయి. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించింది. కానీ అందుకు విధించిన షరతులు విస్తుగొలుపుతాయి. మొదటి 0.5శాతం వరకూ పేచీలేదు. ఆ తర్వాత పెంచ దల్చుకున్నవాటికి సంస్కరణలతో ముడిపెట్టింది. ఆ సంస్కరణల సారాంశం జనంపై ఆర్థిక భారం మోపడం. విద్యుత్‌చార్జీలు, మున్సిపల్ పన్నులు వగైరాలు పెంచితే ప్రభుత్వాలు అప్పులు తెచ్చు కోవచ్చని చెప్పడం అన్యాయం, అమానుషం. దేశ జనాభాలో అత్యధిక శాతంమంది ఇప్పుడు విప త్కర పరిస్థితుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిని రక్షించడమెలాగన్న అంశంపై దృష్టి పెట్టడం ఇప్పటి అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సంగతి గ్రహించాలి. -
మార్కెట్లు మళ్లీ మునక!
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం, లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం...ప్రతికూల ప్రభావమే చూపించాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా, మన మార్కెట్లో మాత్రం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 30,029 వద్ద, నిఫ్టీ 314 పాయిం ట్లు నష్టపోయి 8,823 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. 1,280 పాయింట్ల రేంజ్లో... ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రికవరీ కనిపించినా, చివరి అరగంటలో అమ్మకాలు మరింతగా వెల్లువెత్తాయి. ఒక దశలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 1,130 పాయింట్లకు పడిపోయింది. మొత్తం మీద రోజంతా 1,280 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పాటు పొడిగించడంతో పొజిషన్లు తీసుకునే విషయమై ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆర్థిక, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 10 శాతం నష్టంతో రూ.377 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► బకాయిల చెల్లింపుల్లో విఫలమైనప్పటికీ, రుణగ్రస్తులపై ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్, ఆర్థిక రంగ, ఎన్బీఎఫ్సీ. హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 140కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ లీజర్, షాపర్స్ స్టాప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలెంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్... ఈ రెండు షేర్లు మాత్రమే ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. స్పైస్‌జెట్, ఎన్బీసీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోందన్న వార్తలతో జెన్ టెక్నాలజీస్ షేర్ 10% లాభంతో రూ.37 వద్ద ముగిసింది. ► బొగ్గు మైనింగ్‌లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పటివరకూ ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న కోల్ ఇండియా షేర్ 6 శాతం మేర నష్టంతో రూ. వద్ద ముగిసింది. ► రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడంతో రక్షణ రంగ కంపెనీలు లాభపడ్డాయి. రూ.3.65 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ. 3,65,470 కోట్ల మేర హరించుకుపోయి రూ.119 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే... ప్యాకేజీ.. పైన పటారం.. లోన లొటారం! ఆర్థిక ప్యాకేజీ 2.0... పైన పటారం... లోన లొటారం చందంగా ఉందని నిపుణులంటున్నారు. భారీగా నిధుల వరద పారేలా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలన్నీ తప్పాయని వారంటున్నారు. తక్షణం డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచేలా ఉద్దీపన చర్యలు లేకపోవడంతో సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. పేరుకే ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, వాస్తవంగా ప్రభుత్వానికి ఖర్చయ్యేది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని వారంటున్నారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీని... రూ.20 లక్షల కోట్ల మేర అందిస్తామని ప్రధాని ప్రకటించినా, వాస్తవిక ప్యాకేజీ ప్రకటించిన ప్యాకేజీలో 10 శాతం మేర ఉండటమే గమనించాల్సిన విషయం. లాక్డౌన్ పొడిగింపు... లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించడం ప్రతికూల ప్రభావమే చూపించింది. లాక్‌డౌన్‌ను పొడిగించడం ఇది మూడోసారి. లాక్డౌన్ 4.0లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మరింత జాప్యం కాగలదన్న భయాలతో అమ్మకాలు జోరుగా సాగాయి. కరోనా ఉగ్రరూపం భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 96వేలకు, మరణాలు 3,000కు పైగా పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు పైగా, మరణాలు 3.15 లక్షలకు చేరాయి. రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 75.61కు పడిపోయింది. 60 శాతం తగ్గిన ఎగుమతులు... గత నెలలో ఎగుమతులు 60% పతనమయ్యాయి. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ అభయం ఇచ్చారు. ఈ రెండు అంశాల కారణంగా సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 4–6% లాభాల్లో ముగియ గా, రాత్రి 11.30 సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 2–3% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
అంతా బోగస్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల. వంద శాతం బోగస్. ఇది నేను చెప్తలేను. ఇం దులో కేంద్రం పెట్టేది రూ.లక్ష కోట్లు కూడా లేదు. అంతా గాలి అని సింగపూర్ నుంచి వచ్చే ‘ఏసియన్ ఇన్సైట్’అనే మేగజీన్ రాసింది. అంకెల గారడీనా? లేక నిజంగా జీడీపీ పునరుత్థానమా? అని కేంద్ర ఆర్థిక మంత్రిని జపాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ జర్నల్ బెర్నిస్ట్ ప్రశ్నించింది. మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయమేమిటంటే ఘోర విపత్తు సంభవించి, కరోనా వంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి దేశాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతికి నగదు రావాలని కోరినం. అది వస్తే అనేక రూపాల్లో ప్రజల్లో పంపిణీకి పోతుంది. మేము ఇది కోరితే రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా కేంద్రం భావించింది’అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కరోనా దెబ్బతో కుదేలైన దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేం దుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ బోగస్ అని మండిపడ్డారు. సోమవారం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. షరతులు వింటే నవ్వుతారు.. ‘ఇదేనా దేశంలో సంస్కరణలు అమలు చేసే పద్ధతి? రాష్ట్రాల ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచిన్రు. అంటే తెలంగాణకు రూ.20వేల కోట్ల అప్పులు అదనంగా వస్తాయి. అందులో పెట్టిన షరతులు వింటే ఎవరైనా నవ్వుతరు? ఇందులో కేంద్రం రూపాయి నోటు లేదు. కేవలం రుణ పరిమితి పెంచడమే. అది మళ్లీ రాష్ట్రమే కట్టుకోవాలి. కేంద్రం చిల్లి గవ్వకూడా ఇవ్వదు. రూ.5వేల కోట్లు ఇస్తరట. తెలంగాణ రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి 3.5% ఆల్రెడీ ఉంది. ఆ రూ.5వేల కోట్లు కొత్తగా ఏమీ రావు. కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. మిగిలిన ప్రతి రూ.2,500 కోట్లకు ఒక సంస్కరణను ఆంక్షగా పెట్టారు. విద్యుత్ సంస్కరణలను తెచ్చి ప్రజల మెడ మీద కత్తి పెడితే రూ.2,500 కోట్లు ఇస్తరట. ఇది ప్యాకేజీనా? దీనిని ప్యాకేజీ అనరు. ఇది సమాఖ్య వ్యవస్థలో అనుసరించాల్సిన విధానం కాదు. ఈ విపత్కర పరిస్థితులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఇలా వ్యవహరించవచ్చునా? ఎంత దుర్మార్గమండి? మార్కెట్ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు తెస్తే ఇంకా రూ.2,500 కోట్లు ఇస్తరట. ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మునిసి పాలిటీల్లో పన్నులు పెంచి ప్రజలపై భారం వేసి ఆదాయం పెంచే సంస్కరణలు తెస్తే ఇంకో రూ.2,500 కోట్లు ఇస్తరట. దీన్ని ప్యాకేజీ అంటరా? దీన్ని ఏం అనాలి? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో లింక్ పెట్టారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అని పెట్రిన్రు.. ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ సంస్కరణలు అన్నరు. వీటిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. ఈ నాలుగు సంస్కరణల్లో మూడింటిని అమలు చేస్తే ఇంకో రూ.5వేల కోట్లు ఇస్తరట. ఇదేం బేరమండి? ఇది పచ్చి మోసం. దగా. అంకెల గారడీ. అంతా గ్యాస్. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంది. నిజం ప్యాకేజీ ఎలా ఉంటది.. బోగస్ ఎలా ఉంటదో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నేను చాలా బాధపడుతున్న’అని కేసీఆర్ పేర్కొన్నారు. సమాఖ్య విధానం ఎక్కడ? రాష్ట్రాలపై కేంద్రం ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం సమాఖ్య విధానానికే విఘాతమని కేసీఆర్ విమర్శించారు. ‘కోపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి అన్నరు. అది వట్టి బోగస్ అని ఈ రోజు తేలిపోయింది. సమాఖ్య విధానం ఎక్కడుంది? ఈ విపత్కర సమయంలో మీరిది చేస్తే పైసలిస్తం అంటున్నరు. ఇదేమైనా పిల్లల కొట్లాటనా? ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు. మెడ మీద కత్తి పెట్టి కరెంట్ సంస్కరణలు చేయి రూ.2,500 కోట్ల బిచ్చం వేస్తం. మునిసిపల్ ట్యాక్సులు పెంచు..రూ.2500 కోట్ల బిచ్చం ఇస్తాం అనడం ప్యాకేజీగా పరిగణిస్తరా? తెలంగాణ పురోగతమిస్తున్న రాష్ట్రం. వారు పెట్టిన షరతుల్లో ఇప్పటికే మూడింటిని సాటిస్ఫై చేసింది. కేంద్రం ప్యాకేజీ పెట్టిన విధానం బాగాలేదు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయం. అవసరమైతే ఆ ముష్టి రెండున్నర వేల కోట్లు తీసుకోం. మిగిలిన సంస్కరణలు ఇంకా దారుణంగా ఉన్నయి. అవి చేస్తే పూర్తిగా అన్ని ప్రైవేటీకరించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలుగా కూడా రాజ్యంగబద్ధమైనవి. అవి సబార్డినేట్స్ కాదు. కేంద్రం కన్నా రాష్ట్రాల మీద అధిక బాధ్యతలు, విధులు ఉంటాయి’అని సీఎం పేర్కొన్నారు. కేంద్రం వైఖరిపై ఇతర రాష్ట్రాలను కలుపుకొని పోరాడతారా అని ప్రశ్నించగా.. ‘శిశుపాలుడిని వంద తప్పులు మన్నించిన్రు కదా? పాపం పండాలి కదా’అని బదులిచ్చారు. -
ప్యాకేజీ... పావుకేజీ!!
రూ. 20,00,000 కోట్లు.. అక్షరాలా ఇరవై లక్షల కోట్లు. కరోనా వైరస్ దెబ్బతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ ఇది. మన దేశ బడ్జెట్‌తో పోలిస్తే (సుమారు రూ. 30.42 లక్షల కోట్లు) దాదాపు 66 శాతం. ఇక జీడీపీలోనైతే దాదాపు 10 శాతం!!. అంకెలైతే అదిరిపోయాయి. ఇంకేముంది... ఆర్థిక వ్యవస్థ రయ్యిమని దూసుకెళ్ళిపోతుందన్నారు. మన సర్కారుకెవ్వరూ సరిలేరంటూ వీరతాళ్లు వేసేశారు. కానీ ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్లూ దేనికోసమో చెప్పటానికి ఆర్థిక మంత్రి ఓ డైలీ సీరియల్‌ను ఆరంభించారు. ఐదు రోజులు కొనసాగించారు. చిత్రమేంటంటే జనానికి న్యాయబద్ధంగా రావాల్సిన పన్ను రీఫండ్లు... బ్యాంకులిచ్చే రుణాలు... దేశంలోకి వస్తాయని ఆశపడే పెట్టుబడులు... ఇలాంటివన్నీ కూడా ప్యాకేజీలోకొచ్చేశాయి. అసలు ప్యాకేజీ అంటే ఇప్పటికిప్పుడు రాష్ట్రాలను, జనాన్ని ఆదుకోవటానికి సర్కారు చేసే సాయం కదా? ఇలాంటివన్నీ ప్యాకేజీ ఎందుకవుతాయి? వీరతాళ్లు వేసినవారికి కూడా ఇలాంటి అనుమానాలొచ్చాయి? మీ అనుమానాలన్నీ నిజమేనంటూ స్టాక్‌మార్కెట్ ధబాలున కుప్పకూలి చూపించింది. అంతేకాదు!! అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ప్యాకేజీని ఆడేసుకున్నాయి. ఆర్థిక మంత్రి మాటలన్నీ ఆ 20లక్షల కోట్లను చూపించటానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్యాకేజీ డొల్లేనంటూ విమర్శించాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే పచ్చి మోసం... దగా అంటూ దుయ్యబట్టారు. పడిపోయిన డిమాండ్‌కు ఊతమిచ్చే ప్రత్యక్ష ఉద్దీపన చర్యలేమీ లేకుండా... చిన్న సంస్థలకు రుణాలంటూ హడావిడి చేస్తే లాభమేంటని పరిశ్రమ తప్పుబట్టింది. ఇది రుణ మేళా తప్ప ప్యాకేజీ కాదని విపక్షాలు తూర్పారబట్టాయి. కుదేలైన ఆతిథ్య, ఆటోమొబైల్ వంటి రంగాలు తమ ఊసే లేదంటూ మొత్తుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జోకులు వైరల్ అవుతున్నాయి. నిజానికి లాక్డౌన్ ఆరంభం నుంచి ప్రధాని మోదీని కీర్తించిన వారూ... ఈ ప్యాకేజీ చూశాక పెదవి విరవక తప్పటం లేదు. ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాల ప్రకారం... నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ప్యాకేజీ కోసం ఖర్చు చేసేది రూ.3 లక్షల కోట్లు కూడా ఉండదు. ఇక బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేది రూ, లక్ష కోట్లను మించదు. పాత స్కీముల రీసైక్లింగ్.. ► రూ. 1 లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు ప్రతిపాదన. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మోదీ ప్రభుత్వం దాదాపు ప్రతీ బడ్జెట్లోనూ దీన్ని ప్రతిపాదిస్తూనే వచ్చింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రా (ఏఎంఐ) 2018లో సబ్ స్కీముగా ప్రవేశపెట్టింది. నాబార్డు దీనికి నిధులు సమకూరుస్తోంది. పాత స్కీముకే కొనసాగింపే ఈ కొత్త ఫండు. ► చిన్న, సన్నకారు రైతాంగానికి నాబార్డ్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్!. సహకార, ప్రాంతీయ బ్యాంకుల ద్వారా నాబార్డ్ రూ.30,000 కోట్లు సమకూర్చనుంది. ఇది రుణాలిచ్చే మరో పథకమే తప్ప ప్రభుత్వం నేరుగా నిధులిచ్చేదేమీ లేదు. ► లఘు ఆహార సంస్థలను సంఘటిత రంగంలోకి తెచ్చేందుకు రూ.10,000 కోట్ల స్కీము. నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఇప్పటికే రూ. 2,000 కోట్ల ఫండ్ ఉంది. దీని పరిమితి పెరగవచ్చు. ►రూ. 20,000 కోట్లతో మత్స్యకారులకు ప్యాకేజీ. వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఇప్పటికే మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా నీలి విప్లవం పేరిట ప్రభుత్వం ప్రత్యేక స్కీము నిర్వహిస్తోంది. 2019–20లో రూ.560 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 570 కోట్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి తాజా ప్యాకేజీలో ప్రస్తావించిన అంశాలన్నీ బ్లూ రెవల్యూషన్ వెబ్సైటులో ఉన్నవే!!. ► ముద్రా రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న వారికి 12 నెలల పాటు 2 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్యాకేజీలో ప్రకటించారు. సాధారణంగా బలహీన వర్గాలే ఎక్కువగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. వడ్డీ తగ్గింపు కాకుండా ఏ మారటోరియమో ఇచ్చి ఉంటే ఆర్థిక ప్యాకేజీ అయి ఉండేది. ► తోపుడు బళ్ల వర్తకుల్లాంటి స్ట్రీట్ వెండార్లకు రూ.5,000 కోట్ల రుణ సదుపాయం. దీని కింద రూ.10,000 దాకా రుణాలిస్తారు. నిజానికి ఈ రుణాలిచ్చేది బ్యాంకులే. మరి ఇది ప్రభుత్వ ప్యాకేజీ ఎలా..? ► ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణ ఆధారిత సబ్సిడీ స్కీము పొడిగింపు ద్వారా హౌసింగ్ రంగానికి రూ.70,000 కోట్ల ఊతం. ఇది కూడా ఇప్పటికే ఉన్న పథకానికి కొనసాగింపే. 2017–2020 మధ్య కాలంలో 3.3 లక్షల ఇళ్లు బుక్ కాగా.. ఈ పథకం వల్ల కొనుగోలుదారులు రూ.75,000 కోట్లు లబ్ధి పొందారు. మరి మిగతా 10 నెలల్లో దాదాపు 2.5 లక్షల ఇళ్లు బుక్ అయితేనే కొనుగోలుదార్లకు రూ. 70,000 కోట్ల లబ్ధి కలుగుతుంది. ఉద్యోగాలే ఊడుతున్న ఈ తరుణంలో ఇది సాధ్యమేనా? ► ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు. ఇది కొత్తదేమీ కాదు. కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. దీని డెడ్‌లైన్‌ను మార్చి 2021కి పొడిగించారు. ► బొగ్గు తవ్వకాల్లోకి ప్రైవేటు. గత అనుభవం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది. ► ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.4,000 కోట్లు. నిజానికి 2008–09 నుంచే నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇలాంటి పథకాన్ని అమలు చేస్తోంది. -
సెన్సెక్స్ కీలక మద్దతు 30,750
కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్యాకేజీ వివరాలు మార్కెట్ వర్గాలను సంతృప్తిపర్చకపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో తిరిగి అమ్మకాలు తలెత్తడంతో మన స్టాక్ సూచీల్లో ప్యాకేజీ పాజిటివ్ ఎఫెక్ట్ లేకుండా పోయింది. పైగా సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్ షేర్లు ఏ రోజుకారోజు క్షీణిస్తూపోవడం ఆందోళనకారకం. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువమక్కువ చూపే బ్యాంకింగ్ షేర్లలో భారీ రికవరీ వచ్చేంతవరకూ మన మార్కెట్ దిగువ స్థాయిలోనే కదలవచ్చు. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మే 15తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 32,845 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత 30,770 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 545 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ నెలలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయిగా గత వారం కాలమ్‌లో ప్రస్తావించిన 30,750 పాయింట్ల సమీపంలోనే గత శుక్రవారం సెన్సెక్స్ మద్దతు పొందగలిగినందున, ఈ వారం అదేస్థాయి వద్ద లభించబోయే మద్దతు కీలకం. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 30,350 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 29,900–29,500 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ సోమవారం 30,750 పాయింట్ల మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, లేక 31,300 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 31,630 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన 32,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే తిరిగి 32,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ కీలక మద్దతు 8,980... గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,584 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత 9,050 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పో లిస్తే 115 పాయింట్ల నష్టంతో 9,137 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 8,980 పాయింట్ల స్థా యి కీలకమైనది. ఏప్రిల్‌లో జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,920 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 8,815 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం 8,980 పాయింట్ల మద్దతును పరిరక్షించుకున్నా, 9,185 పాయింట్లపైన గ్యాప్‌అప్‌తో మొదలైనా 9,280 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 9,350 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే తిరిగి 9,580 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ప్యాకేజీ నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రమేనని, అది జీడీపీలో 1.6% మాత్రమేనని పేర్కొంది. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పడం మాని తామేం చేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ప్యాకేజీపై చర్చకు సిద్ధమా? అని ఆర్థికమంత్రికి ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం వైఫల్యం వల్లనే లక్షలాది వలస కూలీలు కాలి నడకన వందలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లే విషాద పరిస్థితి నెలకొంది’అని ఆరోపించారు. నంబర్లాట: లెఫ్ట్: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నంబర్లతో ఆడుతున్న మోసపూరిత ఆటలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. రుణ పరిమితిలో రాష్ట్రాలు 14% మాత్రమే వాడుకున్నాయంటూ రాష్ట్రాలను ఆర్థికమంత్రి నిర్మల అవహేళన చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను అమ్మేసి స్వయం సమృద్ధి సాధించాలనుకుంటున్నారా? అని సీపీఐ నేత రాజా ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
న్యూఢిల్లీ: ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించిన ఐదో ప్యాకేజీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు కచ్చితంగా పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపనతో దేశంలో ఆరోగ్య, విద్యా రంగాల్లో సానుకూల మార్పు వస్తుందని తెలిపారు. ఆ పాట స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఆత్మ–నిర్భర్ భారత్’ పిలుపును అందిపుచ్చుకుని 211 గాయకులు కలిసి ఆలపించిన కొత్త పాట దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ పాట విషయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చేసిన ట్వీట్‌పై మోదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ పాటను తాను విన్నానని, అందరిలోనూ స్ఫూర్తిని రగిలించేలా ఉందని ప్రశంసించారు. -
ఉపాధికి మరో 40 వేల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చిట్టచివరి వివరాలను ఐదోరోజు ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉపాధి హామీ, వైద్యారోగ్యం, విద్య తదితర రంగాలపై ఈ రోజు దృష్టి పెట్టినట్లు వివరించారు. సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్లను అదనంగా కేటాయించామన్నారు. ‘బడ్జెట్లో ప్రకటించిన రూ. 61 వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తంతో 300 కోట్ల పని దినాలను సృష్టించవచ్చు’అని నిర్మల చెప్పారు. ఐదు విడతలుగా తాము ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20.97 లక్షల కోట్లని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రూ. 8.01 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇందులో భాగమేనన్నారు. అయితే, ఇందులో ప్రభుత్వం నికరంగా చేసే ఖర్చు ఎంతో వివరించేందుకు ఆమె నిరాకరించారు. కానీ, ఉపాధి హామీ పథకంలో పెంపుదల, ఉచిత ఆహార ధాన్యాలు, కొన్ని వర్గాలకు పన్ను రాయితీలు, కరోనాపై పోరు కోసం వైద్యారోగ్య రంగానికి కేటాయించిన రూ. 15 వేల కోట్లు మొదలైన వాటితో కలిపి నికర ప్రభుత్వ ఖర్చు సుమారు రూ. 2.1 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఐదు విడతలుగా తెలిపిన ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ, వీధి వ్యాపారులు, రైతులు, వలస కూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వారు.. తదితరాలకు పలు ఉపశమన చర్యలను ప్రకటించారు. అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు ► పీఎం కిసాన్ పథకం కింద ఈ లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున 16,394 కోట్ల రూపాయలను అందించాం. మహిళల జన్‌ధన్ ఖాతాల్లో రూ.10,025 కోట్లను జమ చేశాం. ► ప్రజారోగ్య రంగానికి నిధుల వాటా పెంచాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి వైద్య కేంద్రాల్లో పెట్టుబడులను పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాలను, తాలూకా స్థాయి వరకు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లోనూ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం. ► కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రకటించిన రూ. 15 వేల కోట్లలో రూ. 4,113 కోట్లను ఆరోగ్య శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ‘పీఎం ఈ– విద్య’ ► డిజిటల్, ఆన్లైన్ విద్యకు సంబంధించి ‘పీఎం ఈ– విద్య’పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని అతిత్వరలో ప్రారంభిస్తాం. ఇందులో భాగంగా, అలాగే, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రతీ తరగతికి ఒక ప్రత్యేక చానెల్ ఉంటుంది. మే 30 నుంచి ఆన్లైన్ కోర్సులను ప్రారంభించుకునేందుకు 100 అత్యున్నత విద్యాసంస్థలకు అనుమతిస్తున్నాము. పాఠశాల విద్యలో ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష)’ను విస్తృతంగా ఉపయోగిస్తాం. విద్యార్థులు, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు ఉపయోగపడేలా త్వరలో జాతీయ స్థాయిలో కొత్త కరిక్యులమ్ విధానాన్ని ప్రారంభిస్తాం. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తాం. లాక్డౌన్ కారణంగా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతున్న మానసిక సమస్యల పరిష్కారానికి ‘మనోదర్పణ్’ కార్యక్రమాన్ని రూపొందించాము. 5 శాతానికి రాష్ట్రాల రుణ పరిమితి.. షరతులు వర్తిస్తాయి రాష్ట్రాల రుణ పరిమితి ఆ రాష్ట్ర జీడీపీలో 3% వరకు ఉండగా, దాన్ని 2020–21 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, ఇందుకు రాష్ట్రాలు ‘ఒక దేశం– ఒక రేషన్ కార్డ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘విద్యుత్ సరఫరా’, ‘పట్టణ స్థానిక సంస్థల ఆదాయం’ మొదలైన 4 అంశాల్లో సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న 3% పరిమితి ప్రకారం రాష్ట్రాలకు రూ. 6.41 లక్షల కోట్ల వరకు నికర రుణ పరిమితి ఉంది. ఈ పరిమితిని పెంచాలంటూ ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల తెలిపారు. ‘3% నుంచి 3.5% వరకు షరతులు ఉండవు. 3.5% నుంచి 4.5% వరకు పరిమితి పెంపు 4 విడతలుగా 0.25% చొప్పున, సంస్కరణల అమలుకు సంబంధించిన షరతుల అమలుపై ఆధారపడి ఉంటుంది. కనీసం మూడు సంస్కరణల అమలును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మిగతా 0.5% పెంపు ఉంటుంది’అని ఆమె వివరించారు. ‘3%లో 75% రుణంగా పొందేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతివ్వగా రాష్ట్రాలు అందులో 14% మాత్రమే అప్పుగా పొందాయి. మిగతా 86% నిధులు నిరుపయోగంగానే ఉన్నాయి’అని మంత్రి నిర్మల తెలిపారు. -
అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ
న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం చేయనుంది. మిగతావాటన్నింటినీ విలీనం చేయడమో లేదా విక్రయించడమో చేయనుంది. వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలన్నింటినీ ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కొత్తగా పీఎస్‌యూ విధానాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తుది విడత చర్యల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీఎస్‌యూలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక రంగాల వివరాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ రంగాల్లోనూ ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటికీ కనీసం ఒక్క పీఎస్‌యూనైనా కొనసాగిస్తారు. ఇక వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలను సాధ్యాసాధ్యాలను బట్టి తగు సమయంలో ప్రైవేటీకరిస్తామని మంత్రి చెప్పారు. ‘స్వయం సమృద్ధిని సాధించే క్రమంలో దేశానికి సమగ్రమైన విధానం అవసరం. ఇది దృష్టిలో ఉంచుకునే కొత్త పీఎస్‌యూ విధానంలో అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎస్‌యూలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వ్యూహాత్మక రంగాల్లో వాటిని కొనసాగిస్తూనే.. అనవసర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా సంఖ్యను మాత్రం కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగింటికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా వాటన్నింటినీ హోల్డింగ్ కంపెనీల్లోకి చేర్చడం, విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం జరుగుతుంది’ అని ఆమె వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2020–21లో రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని సాధించేందుకూ ఇది తోడ్పడనుంది. చిన్న సంస్థలకు ఊరట.. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని, రుణాలు కట్టలేకపోయిన చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరట దక్కనుంది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కనీస బాకీల పరిమాణాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేకంగా దివాలా పరిష్కార మార్గదర్శకాలను కూడా దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 240ఎ కింద త్వరలో నోటిఫై చేయనున్నట్లు వివరించారు. ఇక, మహమ్మారి వ్యాప్తి పరిస్థితులను బట్టి కొత్త దివాలా పిటిషన్ల దాఖలును ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనాపరమైన రుణాల ఎగవేతలను దివాలా కోడ్‌లో (ఐబీసీ) డిఫాల్ట్ పరిధి నుంచి తప్పిస్తూ తగు సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కంపెనీల చట్టం ప్రకారం సాంకేతికంగాను, ప్రక్రియపరంగాను తప్పనిసరైన నిబంధనల పాటింపు విషయంలో స్వల్ప ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసు కుంది. కార్పొరేట్ సామాజిక కార్యకలాపాల (సీఎస్ఆర్) వివరాల వెల్లడి లోపాలు, బోర్డు నివేదికల్లో లోటుపాట్లు, ఏజీఎంల నిర్వహణలో జాప్యం వంటి స్వల్ప ఉల్లంఘనలను డిక్రిమినలైజ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాల్లో నేరుగా లిస్టింగ్.. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు తమ షేర్లను నేరుగా నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్ చేసుకునేందుకు అనుమతించనున్నట్లు చెప్పారు. దేశీ కంపెనీలకు ఇది భారీ ముందడుగని ఆర్థిక మంత్రి అన్నారు. -
అనుబంధ వ్యవ‘సాయా’నికి!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. వ్యవసాయ, సాగు అనుబంధ రంగాలకు సంబంధించి రూ. 1.63 లక్షల కోట్లతో పలు కార్యక్రమాలను ఆమె ప్రకటించారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తామన్నారు. జాతీయ విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహాయిస్తే.. వాటి ధరలు, నిల్వలపై నియంత్రణ ఉండబోదన్నారు. అలాగే, ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో ఉన్నవారికి, సరఫరా వ్యవస్థలో ఉన్నవారికి, ఎగుమతిదారులకు, కొన్ని నిబంధనలకు లోబడి, ఎలాంటి నిల్వ పరిమితి ఉండబోదన్నారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయకుండా, ధరలను కృత్రిమంగా పెంచకుండా నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) 1955లో అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అనేక ఆహార ఉత్పత్తులు అవసరానికి మించి దిగుబడి అవుతున్న నేపథ్యంలో.. ఆ చట్టంలోని నిల్వ, ధరలకు సంబంధించిన నిబంధనల ఔచిత్యాన్ని కొంతకాలంగా అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీయే సర్కారు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలను కూడా ఆ చట్టం పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. అలాగే, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా.. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తూ ఒక చట్టాన్ని రూపొందిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లోనూ అమ్మేలా ఈ– ట్రేడింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్)’ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పంట చేతికి వచ్చిన తరువాత ఆ వ్యవసాయ ఉత్పత్తులను సమర్థంగా వినియోగించేందుకు ఉద్దేశించిన ఫామ్ గేట్, అగ్రిగేషన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ రంగంలోని ప్రాజెక్టులకు ఆ నిధి ద్వారా రుణాలందజేస్తామన్నారు. నికరంగా అయ్యే ఖర్చు ఇంతే.. తొలి రెండు రోజుల్లో సుమారు రూ.9.1 లక్షల కోట్ల ప్యాకేజ్‌ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, అందులో నికరంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 16,500 కోట్లు మాత్రమేనని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వలస కూలీలకు చవక అద్దె ఇళ్లు, పలు పన్ను మినహాయింపులు, కంపెనీలు, ఉద్యోగులకిచ్చిన కొన్ని రాయితీలను కలుపుకుంటే అంతే అవుతుందని వివరించారు. అలాగే, శుక్రవారం ప్రకటించిన వాటిలోనూ ప్రభుత్వం అందించే నికర మొత్తం రూ. 1000 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు.. ► ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లలో లైసెన్స్ ఉన్నవారికే రైతులు తమ ఉత్పత్తులను అమ్మాల్సి ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులకు ఇలాంటి నిబంధనేదీ లేదు. ఈ నిబంధన వల్ల రైతులకు సరైన ధర లభించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయనున్నాం. ఈ చట్టం ద్వారా.. తమ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మే విషయంలో రైతులకు పలు అవకాశాలు లభించేలా చూస్తాం. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తాం. ఈ – ట్రేడింగ్‌ను బలోపేతం చేస్తాం. ► వ్యవసాయ మౌలిక వసతులు, నిల్వ సౌకర్యాలు, సామర్థ్య పెంపుదలలను బలోపేతం చేయడం ఈ రూ. 1.63 లక్షల కోట్ల ప్రత్యేక వ్యవసాయ ప్యాకేజ్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు సూక్ష్మ వ్యవసాయాధారిత పరిశ్రమలు(మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్–ఎంఎఫ్ఈ), పశువులకు టీకాలు, పాల ఉత్పత్తి రంగం, ఔషధ మొక్కల పెంపకం, తేనెటీగల పెంపకం, పళ్లు, కూరగాయల సాగు.. తదితర రంగాలకు కూడా ఈ ప్యాకేజీలో సాయం అందించే ప్రతిపాదనలున్నాయి. ► ఔషధ, సేంద్రియ, బలవర్ధక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సుమారు రెండు లక్షల ఎంఎఫ్ఈలకు ఆర్థికంగా సాయమందించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ► రూ. 20 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ను ప్రారంభిస్తున్నాం. సముద్ర, నదీ మత్స్య సంపద అభివృద్ధికి, ఆ రంగంలో సుమారు 55 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది. ► పశు సంపద సంరక్షణకు రూ. 13,343 కోట్లను కేటాయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నివారణకు 100% టీకా కార్యక్రమం చేపడతాం. ► రూ. 15 వేల కోట్లతో ఎనిమల్ హస్బండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా డైరీ ప్రాసెసింగ్, పశుదాణా నిర్వహణల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాం. ► 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కలను సాగును ప్రోత్సహించేందుకు రూ. 4 వేల కోట్లను, తేనెటీగల పెంపకం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. ► టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకే కాకుండా అన్ని పళ్లు, కూరగాయలకు ‘ఆపరేషన్ గ్రీన్స్’ను విస్తరించాం. ఇందుకు రూ. 500 కోట్లను అదనంగా కేటాయించాం. ఈ మొత్తాన్ని దిగుబడి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆయా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులో రాయితీ కల్పించేందుకు, అలాగే, కోల్డ్ స్టోరేజ్‌లు సహా ఇతర స్టోరేజ్‌ల్లో నిల్వ ఖర్చులో రాయితీకి ఉపయోగించవచ్చు. రైతు ఆదాయం పెరుగుతుంది: మోదీ ఆర్థికమంత్రి ప్రకటించిన పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, రైతుల ఆదాయ పెంపునకు ఉపకరిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన అంశాలను నేను స్వాగతిస్తున్నా. ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మన రైతులకు, మత్స్యకారులకు, పాడి, పశు సంవర్థక రంగానికి సహాయకారిగా నిలుస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఉపకరించే సంస్కరణలను స్వాగతిస్తున్నానన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన అంశాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ ప్రశంసించింది. నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేయాలన్న ప్రతిపాదన సహా వ్యవసాయ సంస్కరణలన్నీ భవిష్యత్తులో గొప్ప ప్రభావం చూపుతాయని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం పేర్కొన్నారు. సరైన ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే హక్కు లభించిన ఈ రోజు రైతులకు విమోచన దినోత్సవమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. రైతులను వంచిస్తున్నారు: కాంగ్రెస్ రైతుల పట్ల కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కోవిడ్–19 ఆర్థిక ప్యాకేజ్‌లో వారిని నిర్లక్ష్యం చేసినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల రైతులకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కేంద్రం అర్థంలేని ఆర్థిక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఈ రబీలో రైతులు రూ. 50 వేల కోట్లు నష్టపోయారని, ప్యాకేజీతో రైతులు, రైతు కూలీల జేబుల్లోకి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఈ ప్యాకేజీలో 13 జీరోలు మాత్రం ఉన్నాయని స్పష్టమైందని ఎద్దేవా చేశారు. -
రైతులకు 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి. స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. రైతుల కోసం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు. , జూన్‌లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్ అవసరాల కోసం నాబార్డ్ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకితెస్తారు. గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను ఆమె ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాదిపెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్’లను ఏర్పాటు చేస్తామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ వీలు కల్పిస్తుందన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్ కార్డ్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. వలస కార్మికుల పరిస్థితిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్న నిర్మల.. ఇప్పటికీ తలపై తమ వస్తువులు మోసుకుంటూ, చిన్న పిల్లలతో పాటు హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కానీ, రాష్ట్రాల రేషన్ కార్డు ద్వారా కానీ లబ్ధి పొందనటువంటి వారికి.. ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యం, ఒక్కో కుటుంబానికి కేజీ శనగపప్పు చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తాం’ అని నిర్మల వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యం, కుటుంబానికి కేజీ పప్పుధాన్యం ఉచితంగా ఇస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. స్వస్థలాలకు నడిచి వెళ్తున్న వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాయన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు సబ్సిడీ ధరలకు కేంద్రం నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇందుకు రుణసదుపాయం కూడా ఉందన్నారు. వలస కార్మికులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతృత్వ సంస్థలు కేజీకి రూ. 24 చొప్పున గోధుమలు, కేజీకి రూ. 22 చొప్పున బియ్యాన్ని సబ్సిడీ ధరకు కేంద్రం నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బుధవారం రూ. 5.94 లక్షల కోట్ల ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులకు.. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2% వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు. కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు. రైతులు, కార్మికులకు ప్రయోజనకరం: ప్రధాని మోదీ కేంద్రం రెండో విడత ప్రకటించిన ప్రోత్సాహకాలు రైతులు, వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. సహాయక చర్యలు ముఖ్యంగా మన రైతులు, వలస కార్మికులకు తోడ్పడతాయి. అందరికీ ఆహార భద్రతతోపాటు, చిరు వ్యాపారులు, రైతులకు రుణాలు అందుతాయి. జుమ్లా ప్యాకేజీ: కాంగ్రెస్.. సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంతా వట్టిదే. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీడీపీలో 10 శాతం, రూ.40 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ప్రధాని ఘనంగా చేసిన ప్రకటనకు ఈ ప్యాకేజీకి సంబంధం లేదు. రోడ్ల వెంట సొంతూళ్లకు నడిచి వస్తున్న వలస కార్మికుల కోసం సాయం ప్రకటిస్తారని ఎదురుచూశాం. నిరాశే మిగిలింది. పేదల పట్ల పరిహాసం ఈ ప్యాకేజీ: సీపీఎం ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ రాజకీయ ఎత్తుగడ. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ ఒక్క సమస్యకూ దీనితో పరిష్కారం లభించదు. వలస కార్మికులను కనీసం సొంతూళ్లకు కూడా చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన పేదలకు రూ.7,500 కోట్లు సాయం అందించాలి. ఆ గణాంకాలతో ఏమీ ఒరగదు: సీపీఐ ప్రోత్సాహకాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్న గణాంకాలు అర్థం లేనివి. తికమక లెక్కలు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమీలేదు. వేలాది మైళ్లు రోడ్ల వెంట నడిచి వెళ్తున్న వలస కార్మికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. పట్టణ నిరుద్యోగం అంశాన్ని ఆమె పట్టించుకోలేదు. -
ఇకపై కార్డు లేని వారికీ ఫ్రీ రేషన్
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైన వలస కార్మికుల ఘోసలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనిలేక పస్తులుంటున్న వారి ఆకలు తీర్చేందుకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఉచితంగా రేషన్ సరుకులు అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రెండో భాగం వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డు లేని వలస కార్మికులకు సైతం వచ్చే రెండు నెలల పాటు ఉచితంగా ఆహారధాన్యాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. (రైతులకు భారీగా రుణాలు) అందులో భాగంగా ఐదు కిలోల బియ్యం లేదా గోధుమతోపాటు ఒక కిలో పప్పు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల సుమారు ఎనిమిది కోట్ల మంది వలస కూలీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టనుందని పేర్కొన్నారు. వలస కూలీలను ప్రభుత్వం విస్మరించలేదన్న విషయాన్ని నొక్కి చెప్పారు. అలాగే రేషన్ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనివల్ల వలస కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు నాటికి "ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు" విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. (ఆర్థిక ప్యాకేజీ ఫస్ట్ పార్ట్.. సవివరంగా) -
కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన
సాక్షి, ముంబై : వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, లాక్డౌన్ కరోనావైరస్ సంక్షోభంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థికప్యాకేజీ పై స్పందించారు. తన రుణాలను 100 శాతం చెల్లిస్తాను అని చెప్పేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునే మాల్యా ఈసారీ అదే చేశారు. కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన మాల్యా తన దైన శైలిలో ట్వీట్ చేశారు. ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు. కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడం న్యాయమా అని వాపోయారు. వరుసగా తన అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. దయచేసి ఆ నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని మాల్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (వలస కార్మికుల కేటాయింపులపై చిదబరం వ్యాఖ్యలు) కాగా ఎస్బీఐ నేతృతంలోని బ్యాంకుల సముదాయానికి వేలకోట్ల రుణాలు ఎగవేసిన విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మనీలాండరింగ్ ఆరోపణల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మాల్యాపై కేసులు నమోదు , ఆస్తుల స్వాధీనం లాంటి చర్యల్ని చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఈడీ చార్జిషీట్లను దాఖలు చేశాయి. అలాగే మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించిన కేంద్రం అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో లండన్ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న మాల్యా తన రుణాలను మొత్తం చెల్లిస్తానని, తన అభ్యర్థనను మన్నించాలని పలుసార్లు వేడుకుంటున్న సంగతి తెలిసిందే. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close. — Vijay Mallya (@TheVijayMallya) May 14, 2020 -
ఏ దేశం ఎలా ఖర్చు చేసింది?
ఇదొక సంక్షోభ సమయం. కంటికి కనిపించని శత్రువుతో పోరాడే సందర్భం. ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన విషాదం. వందల కోట్ల మంది పనులు మానేసి ఇంటి పట్టున కూర్చుంటే ఏ దేశం కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అన్ని దేశాలు సహాయ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. భారత్ స్వావలంబనే ప్రధానంగా కోవిడ్ సహాయ ప్యాకేజీని ప్రకటిస్తే ఒక్కో దేశానిది ఒక్కో దారి. కోవిడ్–19తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికంగా ఖర్చు పెట్టిన జీ–20 దేశాల్లో అయిదో స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా సాయంలో చూసుకుంటే హాంకాంగ్‌తో కలిసి భారత్ 19వ స్థానాన్ని పంచుకుంది. 2008 ఆర్థిక మాంద్యం కంటే అధికంగా ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమైపోవడంతో సహాయ ప్యాకేజీలే భవిష్యత్‌కి బాటలు వేసేలా రూపొందించాయి. హాంకాంగ్, కోస్తారికా, కెనడా వంటి దేశాలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు రూపంలో సాయం చేశాయి. నెదర్లాండ్స్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తుల 90 శాతం వరకు వేతనాలను ప్రభుత్వమే పరిస్థితి చక్కబడే వరకు చెల్లించేలా ప్యాకేజీ రూపొందిస్తే, ఫ్రాన్స్ ఉద్యోగుల గ్రాస్ వేతనంలో 84% చెల్లిస్తోంది. అమెరికా కరోనాతో దెబ్బతిన్న అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. రెండున్నర లక్షల కోట్లకుపైగా డాలర్లతో ఆర్థిక వ్యవస్థకి ఊపిరిలూదడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ఖర్చు పెట్టిన అమెరికా నాలుగో దశ విడుదలపై కసరత్తు చేస్తోంది. కరోనా ఎయిర్ రిలీఫ్ అండ్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజీ (కేర్స్) పేరుతో దీనికి అమెరికా సెనేట్ అంగీకరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోవిడ్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థుల ఉన్నత విద్యా రుణాలు మాఫీ, ఫుడ్ బ్యాంకులు, కోవిడ్‌పై పరిశోధనలు, వ్యాక్సిన్ అభివృద్ధి వంటి వాటిపై అమెరికా భారీగా నిధుల్ని భారీగా వెచ్చించింది. యూకే బ్రిటన్ స్వయం ఉపాధికే తన రిలీఫ్ ప్యాకేజీలో పెద్ద పీట వేసింది. సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకుంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పించే పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు చేసే వారికి రుణాలు మంజూరు చేసింది. కోవిడ్ మళ్లీ విజృంభించే సంకేతాలు ఉండడంతో భవిష్య నిధికి కొంత కేటాయింపులు జరిపింది. ఇటలీ ఇటలీ తన ప్యాకేజీలో ఆరోగ్య రంగ ఉత్తేజంపైనే దృష్టి పెట్టింది. కంపెనీల్లో శుభ్రత, శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు వంటివి కల్పించడం కోసం 50శాతం పన్నుల్లో మినహాయింపునిచ్చింది. చిన్నారుల సంక్షేమం, ప్రజలు కట్టాల్సిన పన్నుల మినహాయింపు వంటి చర్యలు తీసుకుంది. కెనడా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెనడా సహాయ ప్యాకేజీ కేటాయింపుల్లో ప్రశంసలందుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి 75% అద్దె తగ్గింపు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులు, సేవా రంగంలో ఉండేవారిని ఎక్కువగా ఆదుకుంది. అంతే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ దేశం నెలకి 2 వేల కెనడా డాలర్ల చొప్పున నాలుగు నెలలు నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది. -
స్టాక్ మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్..!
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి భారీ ప్యాకేజీని ఇవ్వనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అభయమివ్వడంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ఆరంభ లాభాలను కొనసాగించలేకపోయినప్పటికీ, సెన్సెక్స్ 32,000 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 9,400 పాయింట్లకు చేరువ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, ముడి చమురు ధరలు 1 శాతం మేర తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,476 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 637 పాయింట్లు పెరిగి 32,009 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 9,384 పాయింట్ల వద్దకు చేరింది. అరగంటలోనే సగం లాభాలు ఆవిరి.. భారీ ఆర్థిక ప్యాకేజీ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, సెన్సెక్స్ 1,471 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల(నిఫ్టీకి ఇదే ఇంట్రాడే గరిష్ట లాభం) లాభాలతో మొదలయ్యాయి. వెంటనే సెన్సెక్స్ 1,474 పాయింట్లతో ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ లాభాల సంబరం అరగంటే కొనసాగింది. ఆ తర్వాత సూచీలు దాదాపు సగానికి పైగా లాభాలను కోల్పోయాయి. బ్యాంక్, లోహ, వాహన షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. కరోనా 2.0 కేసులు మరింతగా పెరుగుతుండటంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ► యాక్సిస్ బ్యాంక్ 7 శాతం లాభంతో రూ.414 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–నెస్లే ఇండియా,సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్‌లు మాత్రమే నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► ఉద్దీపన చర్యలపై ఆశలతో రియల్టీ షేర్లు రివ్వున ఎగిశాయి. ►ఐఆర్సీటీసీ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ. 1,436కు చేరింది. ఇన్వెస్టర్ల సంపద 2 లక్షల కోట్ల ప్లస్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్ల మేర ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.98 లక్షల కోట్లు ఎగసి రూ.124.68 లక్షల కోట్లకు పెరిగింది. -
చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్‌లైన్ పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్‌డౌన్‌ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్డౌన్ దెబ్బతో ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు వరాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు తీరనున్న నిధుల కష్టాలు.. తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్ భారం తగ్గింది.. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక, బేసిక్ వేతనంలో తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి.. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు. రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్ మెజూర్ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం.. మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు. పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్‌మెంట్స్‌ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31, నవంబర్ 30 దాకాను, ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 దాకా పొడిగించారు. ‘వివాద్ సే విశ్వాస్‘ స్కీమును డిసెంబర్ దాకా పొడిగించారు. వివద్ సే విశ్వాస్ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది. రిఫండ్స్ సత్వరమే దాతృత్వ సంస్థలు, ఎల్ఎల్పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మేలు... ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. – ప్రధాని నరేంద్రమోదీ వృద్ధికి ఊతమిస్తుంది... స్వయం సమృద్ధమైన భారత్‌ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్‌ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి డెవలపర్లకు బూస్ట్... రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ చిన్న సంస్థలకు తక్షణ శక్తి... ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలకు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ కరోనాను ఎదుర్కొనే వ్యూహం... నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్‌ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ దీర్ఘకాల ప్రభావం ఉంటుంది... చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇది మారలేదు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్ జనరల్ -
అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. మేక్ ఇన్ ఇండియా లోగోకు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఉండే ఓ ఫోటోని షేర్ చేస్తూ.. 'అదే పాత సింహాలను మరీ ఇప్పుడు కొత్త పేరుతో విక్రయిస్తున్నారు. వారు కలల్ని, కోరికల్ని మళ్లీ అమ్మారు. నాటి మేక్ ఇన్ ఇండియానే నేడు ఆత్మనిర్భర్ భారత్‌గా మారింది. అందులో ఏదైనా కొత్తగా ఉందా..?' అంటూ శశిథరూర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! -
ఆర్థిక ప్యాకేజీ.. సాయంత్రం 4గంటలకు వివరాలు
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీలో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు దక్కాయో తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్యాకేజీ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ప్యాకేజీలో ఇప్పటికే ఉన్న కొన్ని భూమి, కార్మిక చట్టాలలో సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను జంప్‌స్టార్ట్ చేయడానికి అవసరమైన అదనపు లిక్విడిటీ మద్దతు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: రెండు నెలల తర్వాత బయటకు) -
మెగా ప్యాకేజీ : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ సంక్షోభం, లాక్డౌన్ నేపథ్యంలో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ను ఆరంభించాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం 933 పాయిట్లు ఎగిసి 32305 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 9472 వద్ద కొనసాగుతోంది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను దాటేసాయి. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మధ్యాహ్నం మీడియా నుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా వుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, మెటల్ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. నెస్లే, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, సన్ ఫార్మ, హెచ్‌సీఎల్ టెక్ స్పల్పంగా నష్టపోతున్నాయి. (స్వావలంబనే శరణ్యం ) చదవండి: కరోనాను జయించిన స్పెయిన్ బామ్మ కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం -
ప్రధాని భారీ ప్యాకేజీ: కమల్ ఏమన్నారంటే?
చెన్నై: కరోనా కల్లోల సమయంలో కుదేలైన భారతదేశ ఆర్థికవ్యవస్థకు ఊతమివ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని లాక్డౌన్ పొడగింపు, ఆర్థిక వ్యవస్థ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి లాక్డౌన్ పొడగింపు తద్యమని, అయితే మునపటిలా కాకుండా పలు కొత్త నిబంధనలతో లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. ఇక ప్రధాని ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రధాని భారీ ప్యాకేజీపై స్పందించారు. ‘ప్రధాని పేర్కొన్న అంశాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత కరోనా సంక్షభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వాలంబనే శరణ్యమని, స్వయం సమృద్ద భారత్ ఆవశ్యకమని పేర్కోన్న ప్రధాని వ్యాఖ్యలతో మేము అంగీకరిస్తున్నాం. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. అయితే ఈ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి మరిన్న వివరాలు తెలుపుతారని పేర్కొనాన్నరు. అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్ధిపొందుతారో వేచి చూడాలి’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. చదవండి: లాక్డౌన్ 4.0: భారీ ఆర్థిక ప్యాకేజీ దశల వారీగా లాక్డౌన్ ముగింపుపై బ్లూప్రింట్ We all agree on 2 things with you Mr. Prime Minister. @PMOIndia .The poor are suffering the most in this crisis and being self reliant is the future.While we welcome the economic package, I will watch out for the details to see how the poorest of my country get their due atlast. — Kamal Haasan (@ikamalhaasan) May 12, 2020 -
ఉద్దీపన ఆశలతో.. బ్యాంకు, ఐటీ స్టాక్స్ ర్యాలీ
ముంబై: కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మరో ఆర్థ్ధిక ఉద్దీపనల ప్యాకేజీ వస్తుందన్న అంచనాలు బలపడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా ర్యాలీ కొనసాగించాయి. ఐటీ, టాప్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలను పరుగెత్తించాయి. రూపాయి బలంగా రికవరీ కావడం ఐటీ స్టాక్స్‌కు కలిసొచ్చింది. నిఫ్టీ కీలకమైన 9,300 మార్క్ పైకి చేరుకుంది. 127 పాయింట్లు లాభపడి (1.38 శాతం) 9,314 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు పెరిగి (1.54 శాతం) 31,863 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్‌లో కోటక్ బ్యాంకు అత్యధికంగా 8.59 శాతం లాభపడి ముందు నిలిచింది. ఆ తర్వాత టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 6 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 5 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4 శాతం, ఓఎన్జీసీ 3 శాతం పెరిగాయి. ► టైటాన్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోయాయి. ఐటీ, టెక్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, మెటల్, ఆటో, ఎనర్జీ రంగాలు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.35 శాతం వరకు లాభపడ్డాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 0.8 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ తాజా అంచనాలను వెల్లడించింది. ► మార్కెట్ల నుంచి నిధుల సమీకరణలో సెబీ వెసులుబాటు కల్పించింది. రెండు విడతల నిధుల సమీకరణ మధ్య అం తరం ప్రస్తుతం ఏడాది కాగా, దాన్ని 6 నెలలకు తగ్గించింది. ► ఉద్దీపనలపై యూరోజోన్ కీలకమైన భేటీ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. ► ఆసియాలో హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభపడగా, షాంఘై నష్టాల్లో క్లోజయింది. ప్రభుత్వ చర్యల ఆధారంగానే తదుపరి ర్యాలీ.. ‘‘బెంచ్‌మార్క్ సూచీలు మరో ఉద్దీపనల ప్యాకేజీపై వస్తుందన్న ఆశాభావంతో సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళనకరం. త్వరలోనే కేసులు గరిష్టానికి చేరుకుంటాయని మార్కెట్లు అంచనాతో ఉన్నాయి. ఆర్ధిక రంగ ఉత్తేజానికి, పరిశ్రమలకు మద్దతుగా ప్రభుత్వం ప్రకటించే చర్యలపైనే మార్కెట్ల తదుపరి ర్యాలీ ఆధారపడి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 2 వారాల గరిష్టానికి రూపాయి ముంబై: ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో క్రితం ముగింపుతో పోలిస్తే 62 పైసలు పటిష్టమై 76.06 వద్ద క్లోజయింది. రూపాయికి ఇది రెండు వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దీపనల చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు రూపాయి బలపడేలా చేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా అదనంగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేపట్టనున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటన సెంటిమెంట్ బలపడేలా చేసినట్టు ట్రేడర్లు తెలిపారు. -
‘కరోనా’ ప్యాకేజీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని మోదీ ప్రకటించిన 36 గంటల్లోనే ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. లాక్‌డౌన్‌తో పేదలు, కూలిపని వారు ఇబ్బంది పడకుండా ప్రకటించిన ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో ఎవరూ బాధపడరాదనేదే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం లక్షిత వర్గాలకు అందేలా శ్రద్ధ వహిస్తామన్నారు. అవసరమైతే ఇలాంటి మరిన్ని చర్యలను మున్ముందు ప్రకటిస్తామని కూడా ఆమె చెప్పారు. దేశంలోని లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ ఆర్థిక ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. మంత్రి ప్రకటించిన సహాయ చర్యలివే... ► దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల నిరుపేద రేషన్ కార్డు దారులకు 5 కిలోల చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పుధాన్యాలు. వీటిని లబ్ధిదారులు రెండు విడతల్లో తీసుకోవచ్చు. ► దేశవ్యాప్తంగా నిరుపేద మహిళల 20.4 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు అందుతాయి. నిరుపేద మహిళల కోసం 2016 నుంచి అమలు చేస్తున్న ఉచిత వంటగ్యాస్ పథకంలో భాగంగా వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఎల్పీజీ. అదేవిధంగా, పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000 పంపిణీ. ► 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రైతులకు ఏడాదికిచ్చే రూ.6 వేలను విడతలు వారీగా ముందుగానే అందజేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 వేలను ఏప్రిల్ మొదటి వారంలోనే రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయనుంది. దీనివల్ల 8.69 కోట్ల రైతు కుటుంబాలకు ఊరట లభించనుంది. ► నెలకు రూ.15 వేల కంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులు 90 శాతం (100 మంది లోపు) ఉండే చిన్న సంస్థలకు వచ్చే మూడు నెలలపాటు వారి పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనివల్ల 4.8 కోట్ల పీఎఫ్ అకౌంట్లు నిరాటంకంగా కొనసాగుతాయి. ► దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఉపాధి హామీ సిబ్బంది రోజువారీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంపు ► దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ► చిన్న సంస్థల ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేదా మూడు నెలల వేతనం (ఏది తక్కువుంటే అది)లో 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే వీలు కల్పించింది. ఆరోగ్య సిబ్బందికి అరకోటి బీమా: ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటంలో ముందుండే వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య, పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆరోగ్య బీమా. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది. ప్రభుత్వంపై పడే భారం: ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 8.7 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున అందజేయడానికి ప్రభుత్వం రూ.16వేల కోట్లు.. ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీకి రూ.45 వేల కోట్లు.. జన్‌ధన్ అకౌంట్లలో డబ్బు జమ చేయడానికి రూ.31 వేల కోట్లు. ఉచిత వంటగ్యాస్ కోసం మరో రూ.13 వేల కోట్లు వెచ్చించనుంది. లాక్‌డౌన్‌ను సమర్థించిన సోనియా గాంధీ కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సమర్థించారు. వ్యాధి బాధితులకు చికిత్స అందించే వైద్యులకు రక్షణ కల్పించాలని, రుణ వసూళ్ల వాయిదా తదితర చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని ప్రకటించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్‌ను స్వాగతిస్తున్నాను. ఈ మహమ్మారిపై పోరాటంలో దేశంయావత్తూ ఒక్కటై నిలవాలి. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా.. ఈ వ్యాధిపై కేంద్రం తీసుకునే ప్రతి చర్యను సమర్థిస్తూ మద్దతు తెలుపుతున్నాను. ఈ ఆపత్కాలంలో విభేదాలను మరిచి అందరం ఒక్కటిగా నిలవడం మన బాధ్యత’ అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సోనియా చేసిన సూచనలు కొన్ని.. జన్‌ధన్, ప్రధాన్‌మంత్రి కిసాన్ యోజన అకౌంట్లు కలిగిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఉపాధి కూలీలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలి.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు దారులందరికీ 10 కిలోల బియ్యం లేదా గోధుమలు అందజేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో అన్ని రకాలైన కోతలను ఆరు నెలలపాటు వాయిదావేయాలి. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి ఎన్–95 వంటి మాస్కులు, హజ్మత్ సూట్ల వంటి రక్షణ పరికరాలను అందజేయాలి. వీరికి ఆరు నెలలపాటు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. కరోనా వ్యాప్తికి అవకాశాలున్న చోట్ల ఐసీయూలు, వెంటిలేటర్లతో తాత్కాలిక వైద్య కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలి. -
కరోనాపై సమరం : ప్యాకేజ్‌ను స్వాగతించిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్రం ప్రకటించిన రూ 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో వేసిన తొలి అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్డౌన్ విధించిన క్రమంలో మన రైతన్నలు, దినసరి కార్మికులు, మహిళలు, వృద్ధులకు అండగా నిలవాల్సిన సమయం ఇదని, ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వైరస్ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతినే వర్గాలు, వ్యక్తులకు ఊరటగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. పేదలకు బియ్యం, గోధుమల పంపిణీతో పాటు ఉచితంగా మూడు నెలల పాటు గ్యాస్ సిలిండర్ల సరఫరా, సంఘటిత రంగంలో రూ 15,000లోపు వేతనం కలిగిన ఉద్యోగుల పీఎఫ్ వాటాను ప్రభుత్వమే చెల్లించడం వంటి చర్యలను ప్యాకేజ్‌లో పొందుపరిచారు. జన్‌థన్ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ 500 అందచేయడం, డ్వాక్రా గ్రూపులకు రూ 20 లక్షల రుణ సాయం వంటి పలు ఉపశమన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చదవండి : ‘కరోనా వైరస్ ఓ సునామీ’ -
కరోనా ఎఫెక్ట్ : ప్యాకేజ్ ప్రకటించనున్న కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దెబ్బతినే రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలసిందే. టాస్క్‌ఫోర్స్ సూచనలకు అనుగుణంగా ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రభుత్వం వెల్లడించనుంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు వచ్చే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిగణిస్తామని నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించాలని పార్లమెంట్లో విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. దేశంలోని 80 జిల్లాలు పూర్తిగా లాక్డౌన్లో ఉండగా ఆయా ప్రాంతాల్లో కేవలం నిత్యావసర సేవలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. పంజాబ్, హరియాణ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. చదవండి : కరోనా ఎఫెక్ట్ : లోక్‌సభ నిరవధిక వాయిదా -
'బిహార్‌కు ప్రధాని ఇచ్చిన హామీని నెరవేరుస్తాం'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌కు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని తెలిపారు. పట్నాలో కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం బిహార్‌ను అభివృద్ధి, శాంతిపథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన మేరకు బిహార్‌కు ఆర్థిక ప్యాకేజీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేస్తామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.