
'బిహార్‌కు ప్రధాని ఇచ్చిన హామీని నెరవేరుస్తాం'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌కు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని తెలిపారు.
పట్నాలో కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం బిహార్‌ను అభివృద్ధి, శాంతిపథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన మేరకు బిహార్‌కు ఆర్థిక ప్యాకేజీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేస్తామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.