![Markets surges after PM Modi AnnouncesEconomicPackage - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/13/sensex%20Jump.jpg.webp?itok=cN3e2mlY)
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ సంక్షోభం, లాక్‌డౌన్ నేపథ్యంలో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ను ఆరంభించాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం 933 పాయిట్లు ఎగిసి 32305 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 9472 వద్ద కొనసాగుతోంది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను దాటేసాయి. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మధ్యాహ్నం మీడియా నుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా వుంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, మెటల్ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. నెస్లే, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, సన్ ఫార్మ, హెచ్‌సీఎల్ టెక్ స్పల్పంగా నష్టపోతున్నాయి. (స్వావలంబనే శరణ్యం )
చదవండి: కరోనాను జయించిన స్పెయిన్ బామ్మ
కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment